మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం చింతన్ శివిర్ కార్యక్రమం జరిగింది.
సదస్సుకు తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపై సీతక్క ప్రసంగించారు. తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలను నడుపుతున్నట్లు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వయం సహాయక బృందాల మహిళలతో.. అంగన్‌వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్‌లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. మహిళ, శిశు సంక్షేమం విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని సీతక్క కోరారు.
Comments
Please login to add a commentAdd a comment