seethakka
-
మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం చింతన్ శివిర్ కార్యక్రమం జరిగింది. సదస్సుకు తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపై సీతక్క ప్రసంగించారు. తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వయం సహాయక బృందాల మహిళలతో.. అంగన్వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్‌లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. మహిళ, శిశు సంక్షేమం విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని సీతక్క కోరారు. -
‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచార చేపల విక్రయ వాహనాలను సమకూర్చుతోంది. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశా లతో ఈ వాహనాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిద్ధం చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా పలు వ్యాపారాలను ప్రారంభింపజేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేయి స్తున్నారు. ఒక్కో వాహనానికి రూ. 10 లక్షలు ప్రభుత్వం సమకూరుస్తోంది. జనవరి 3న వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించను న్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో రూ. 4 లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనాలు అందజేస్తారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని సైతం బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలుగా సెర్ప్ ఇప్పించనుంది. గచ్చిబౌలిలోని నిథమ్ ఇన్స్టిట్యూట్లో మహిళా సంఘాల సభ్యులకు సంచార చేపల విక్రయానికి సంబంధించిన శిక్షణను సెర్ప్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించనున్నారు. -
సీతక్క కిస్సిక్
-
పుష్ప-2 మూవీపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సీతక్క
-
పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. -
అది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ: సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అలాగే, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా సభలో మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ నేతలకు కౌంటరిచ్చారు. సభలో సీతక్క మాట్లాడుతూ.. కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా?. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా. అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్ అవుతారా? అని అన్నది ఎవరు?. ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి.వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయి. 5,6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు. గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు 30వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది.భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు?. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. వందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా?. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అనేది అన్ని గ్రామాల్లో స్పష్టంగా వివరాలు ఉంచాలి అని కామెంట్స్ చేశారు. -
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
టీజీ ఫుడ్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తెలంగాణ ఫుడ్స్ విభాగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న పప్పు, నూనె తదితరాల సరఫరాకు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయడంపైనా మంత్రి మండిపడ్డారు. ప్రతి అంశాన్ని టెండర్ ప్రాతిపదికనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడాన్ని తప్పుబడుతూ సంబంధిత అధికారులను మంత్రి సీతక్క మందలించారు. అదేవిధంగా టీజీఫుడ్స్ విభాగంలో కారుణ్య నియామకాలు, పదోన్నతుల విషయంలోనూ అవకతవకలు జరిగాయనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవల భువనగిరిలో బాలామృతం దారి మళ్లింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలకు సంబంధించి డిజైన్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది సభ్యులకు ఈ చీరలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, కమిషనర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు. హామీలను అమలు చేయండి.. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో వారు మంత్రి సీతక్కను కలిశారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేసినప్పటికీ ఆ మేరకు వేతనాలు చెల్లించలేదని, దాదాపు ఏడు నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచి్చనట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. -
తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు.. యెట్టి బిడ్డలు కాదు.. సభలో సీతక్క ఫైర్
-
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): చిన్న లోపాన్ని చూసుకొని మానసికంగా కుంగిపోవద్దని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.300 పెన్షన్ ఇస్తోందని అది రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ బుచి్చనేని వీరయ్య మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో 40 శాతం వైకల్యానికి ఉచితంగా సహాయ ఉపకరణాలు పంచుతున్నట్లు ప్రకటించారు. అనంతరం వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించిన దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాళ్లులేని దివ్యాంగులకు మంత్రి సీతక్క స్వయంగా కృత్రిమ కాళ్లను తొడిగారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, డైరెక్టర్ శైలజ, జీఎం.ప్రభంజన్‌రావులతో పాటు వివిధ వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీతక్క చేతుల మీదుగా "నారి" సినిమా పోస్టర్ రిలీజ్ (ఫొటోలు)
-
‘నారి’ లాంటి సినిమాలు రావాలి: మంత్రి సీతక్క
ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నారి సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ .. మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాడు అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ తో నారి సినిమా చేసిన సూర్య వంటిపల్లి గారికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. ‘మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను’ అన్నారు దర్శకుడు సూర్య వంటిపల్లి. -
ఫుడ్ పాయిజన్ అంశం.. సీతక్క సంచలన ఆరోపణలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
నిరూపించే దమ్ముందా.. కేటీఆర్, బీజేపీకి మంత్రి సీతక్క సవాల్
హైదరాబాద్: అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా ప్రజలకు కేటీఆర్ ఓమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దిలావార్పూర్, గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదు.. అయినా మా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. దొంగ నాటకాలు, రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా?. ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలైన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషం వెదజల్లుతున్నారు. తలసాని సాయి కుమార్ ఎవరో బీఆర్ఎస్ చెప్పాలి. ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నారు.ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు, ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు.. ఇంత దారుణమా?. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ దొర చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి?. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, కేసులు పెడితే తప్పా?.ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించింది. ఫౌంహౌస్ నుంచి పాలన చేసిన మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. -
రాజకీయ ప్రేరేపిత హింసే సరికొత్త సవాల్
సాక్షి, హైదరాబాద్/ఖిలా వరంగల్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయ ప్రేరేపిత హింస పోలీసులకు సరికొత్త సవాల్‌గా మారిందని డీజీపీ జితేందర్ అన్నారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాతోపాటు రాజకీయ ప్రేరేపిత హింసను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బంది సర్వదా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2024 బ్యాచ్ సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), ఐటీ అండ్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) విభాగాలకు చెందిన 8,047 మంది కానిస్టేబుల్ కేడెట్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 19 శిక్షణ కేంద్రాల్లో గురువారం పాసింగ్ అవుట్ పరేడ్లు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 1,211 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌తో కలిసి కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేడెట్లకు ట్రోఫీలు, మెమొంటోలు అందించారు. అనంతరం కానిస్టేబుళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పెరగటం శుభ పరిణామం రాష్ట్ర పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం శుభ పరిణామం అని డీజీపీ జితేందర్ అన్నారు. 2024 బ్యాచ్‌లో మొత్తం 2,338 మంది మహిళా పోలీసులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. ఉన్నత విద్యావంతులు కానిస్టేబుల్స్‌గా చేరినందున పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. వృత్తిగత జీవితంలోనూ కొత్త అంశాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువకులను ఉత్తమ అధికారులుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఉత్తమ శిక్షణ, వసతుల కల్పనకుగాను తెలంగాణ పోలీస్ అకాడమీకి ఎనర్జీ, ఫుడ్ సేఫ్టీ, హెల్త్ సహా ఐదు అంశాల్లో ఐఎస్ఓ సరి్టఫికెట్లు దక్కడంపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించిన తర్వాత అభిలాష బిస్త్ మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి కొత్త సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చామని తెలిపారు. పరేడ్ కమాండర్‌గా ఏఆర్ కానిస్టేబుల్ ఉప్పునూతల సౌమ్య వ్యవహరించారు. కండ్లకోయలోని పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఇంటలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు.నా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చా మాది హైదరాబాద్. మా నాన్న కారు డ్రైవర్. మా అమ్మానాన్నలకు ముగ్గురం కుమార్తెలమే. మేం పోలీసులం కావాలని మా తల్లిదండ్రుల ఆశయం. వారి కష్టాన్ని చూసి కష్టపడి చదువుకున్నాం. మొదటి ప్రయత్నంలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాం. – హరిణి సురేష్, రోషిణి సురేష్ రాణీ రుద్రమ స్ఫూర్తితో ముందుకు సాగండి: మంత్రి సీతక్క ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకొన్న 1,127 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గురువారం ఆమె పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా కానిస్టేబుళ్లు రాణీ రుద్రమదేవి స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో రాజధానిగా వరంగల్: మంత్రి కొండా సురేఖ
సాక్షి, వరంగల్: దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క మీడియాతో మాట్లాడారు.ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈ సభ కూడా విజయవంతం చేయాలి’’ అని కొండా సురేఖ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీకే ఆ చరిత్ర ఉంది: మంత్రి సీతక్కబీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది?. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తిడుతున్నారు..కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం’’ అని సీతక్క తెలిపారు. -
మూసీని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోం
లక్డీకాపూల్: బీఆర్ఎస్ ప్రభుత్వంలా మూసీనదిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోబోమని, దానిని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.17 మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని మలక్‌పేట్, కార్వాన్ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, కౌసర్ మొహియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డిలతో కలసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ...ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు వరదల వల్ల నష్టపోయాయని, మూసీ మురికి నీటి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ నీటిని తాగే స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజ్, మూసీ జేడీఎం గౌతమి, శ్రీనివాస్‌రెడ్డి, మూసీ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్‌రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్‌రావు సవాల్ -
సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటే: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటేనని అన్నారు మంత్రి సీతక్క. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సమానత్వ సాధన దిశలో విద్య కీలకం అంటూ సీతక్క చెప్పుకొచ్చారు.గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..‘గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు మీరంతా సమావేశమైనందుకు అభినందనలు. కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీలు జీవోలను ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన నిర్మాన్ సంస్థ ఫౌండర్ మయూర్‌కి ప్రత్యేక అభినందనలు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారు.సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే. అందుకే విద్య అనేది చాలా ముఖ్యం. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే. సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మైదాన ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలి. సమానత్వ సాధన దిశలో విద్య కీలకంహైదరాబాద్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో, మారుమూల పల్లెలో అలాంటి విద్య ఉండాలి. ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారు. అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు మీ వంతు సహకారం అందించండి. సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతులున్న సమాజంలో కనీస విద్య లేనివారు సమాజంలో ఉండటం బాధాకరం.అందుకే అంతరాలను తగ్గించేందుకు మీ వంతు చేయూత ఇవ్వండి. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే మా లక్ష్యం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే వివక్షతా భావం ప్రజల్లో పెరుగుతోంది. మీరంతా గ్రామాలకు తరలండి.. అటవీ గ్రామీణ పరిస్థితులను చూడండి. విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించండి. ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్లుగా మిమ్మల్ని ఆరాధిస్తారు. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి. అప్పుడు మీరే మార్పునకు నాంది పలికిన వారు అవుతారు. మనసుంటే మార్గం ఉంటుంది. ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక.. అందరూ అక్కడ పర్యటించండి. ఏసీ గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలి. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో, జార్ఖండ్‌కు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న మహారాష్ట్రకు, నవంబర్ 13న, 20న జార్ఖండ్‌కు ఎన్నికలు జరగనున్నాయి. -
కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళా మంత్రులను పదేపదే కించపరుస్తూ కేటీఆర్ తన దొర దురహంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడు అంటూ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట మహిళ పట్ల కేటీఆర్ చీప్ కామెంట్స్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.మంత్రి సీతక్క బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టం. మా నోళ్లను ఫినాయిల్‌తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్. పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్‌తో కడగాలి. పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయింది.రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు చేసుకోవచ్చు అన్నాడు. బతుకమ్మ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మా గురించి చాలా చులకనగా మాట్లాడారు. అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే మీకు బుద్ధి చెప్పేవారు. మహిళా మంత్రులను పదే పదే కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడు. చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడాలి.నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. దూషణలకు, బూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినట్లు ఆధారాలు చూపిస్తావా?. రాజకీయాల్లో మేము ఉండకూడదన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మాపై పదే పదే అభ్యంతరకర కామెంట్స్ చేయిస్తున్నారు. కనీసం సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్‌కు లేదు. నువ్వు ఇలానే రెచ్చిపోతే రేపు మీ కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సి వస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్ -
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్‌పై ఎంపీ రఘునందన్‌రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.‘‘ఇంచార్జీ మినిస్టర్‌గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు. -
రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. -
గవర్నర్ తో సీతక్క భేటీ