సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
ఆదిలాబాద్: పార్టీ నాయకులు విభేదాలను పక్కనపెట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జి ల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజలకు ఏం చేయలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించారన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం వెలికితీసి ప్రతీ పేదవాని ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ ప్రజలను మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు.
నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి పార్టీ అభ్యర్థి సుగుణను భారీ మెజార్టీతో గెలి పించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సత్తు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, దామోదర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ లు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, శ్యాంనా యక్, కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్టీ ప్రచార రథలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
‘ఇఫ్తార్’కు హాజరైన మంత్రి
రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కల్‌గూడలోని షాదీఖానాలో నిర్వహించిన ఇఫ్తార్‌కు మంత్రి సీతక్క హాజరయ్యా రు. మైనార్టీ నాయకులతో పాటు విందుకు హా జరైన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇఫ్తార్‌లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి సుగుణ తదితరులు
ఆదివాసీ అడబిడ్డను పార్లమెంట్‌కు పంపండి
అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఆదివాసీ ఆడబిడ్డను పార్లమెంట్‌కు పంపాల ని మంత్రి సీతక్క కోరారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ సమస్యను ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, బోథ్ ఇన్‌చార్జి గజేందర్, నాయకులు అరుణ్, బోథ్ మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, తలమడుగు, బజార్‌హత్నూర్ జెడ్పీటీసీలు గణేశ్‌రెడ్డి, నరసయ్య పాల్గొన్నారు.
మాజీ మంత్రి భూమన్నను కలిసిన ఎంపీ అభ్యర్థి సుగుణ
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మాజీ మంత్రి పడాల భూమన్నను మర్యాదపూర్వకంగా కలి శారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీని వాసరెడ్డితో కలిసి పట్టణంలోని ద్వారకానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె అప్యాయంగా పలుకరించి శాలువాతో సత్కరించా రు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీయడంతో పా టు కాసేపు జిల్లా రాజకీయాలపై చర్చించారు. మాజీ మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ తదితరులున్నారు.
ఇవి చదవండి: మోదీ అభివృద్ధి ఎజెండాతోనే ఓట్లు అడుగుతాం: కిషన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment