suguna
-
కత్తిదూసిన ఉన్మాదం
చెన్నారావుపేట: ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారుచింతల్తండా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. తండాకు చెందిన భానోతు శ్రీనివాస్(40), సుగుణ(35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. దీపిక డిగ్రీ సెకండియర్, కుమారుడు మదన్‌లాల్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు(బన్ని)తో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్‌లో నాగరాజు, దీపిక వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడమే కాకుండా.. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యా దులు చేసుకున్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి పదహారుచింతల్తండాకు చేరుకున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులు భానోతు శ్రీనివాస్, సుగుణపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ అలజడికి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటికి రాగా అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు! నిందితుడు నాగరాజు గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో తెల్లవారు వరకు ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అతడితోపాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నర్సంపేటలో పోలీస్‌స్టేషన్ వద్ద, వరంగల్ రోడ్డ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఘటనస్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫోన్లో కలెక్టర్ సత్యశారదాదేవితో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, గురువారం రాత్రి నాగరాజును అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రవీందర్ తెలిపారు. కాగా గురువారం పొద్దుపోయాక మృతులిద్దరి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తి చేశారు. కూతురు దీపిక తల్లిదండ్రుల మృతదేహాలకు తలకొరివి పెట్టారు.పక్కా వ్యూహంతోనే హత్యలకు ప్లాన్ ఇద్దరూ విడిపోయాక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన నాగరాజు నెల రోజుల క్రితం మళ్లీ గుండెంగ గ్రామంలో అమ్మమ్మ ఇంటికి చేరుకుని ఆటోను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపికకు వివాహ సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న నాగరాజు ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని పక్కా వ్యూహంతోనే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క హన్మకొండ: జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కలి్పస్తామని వివరించారు. బతిమిలాడినా వినలేదు.. నాగరాజును చంపేయాలి: దీపిక నాకు తల్లిదండ్రులను లేకుండా చేసిన నాగరాజును చంపేయాలి.. మాకు వాటర్‌ప్లాంట్ నుంచి వాటర్ పోసేందుకు తండాకు వచ్చేవాడు. అలా పరిచయం అయిన తర్వాత నెక్కొండకు వెళ్లే క్రమంలో వెంటపడేవాడు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఏడు నెలలైనా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఉంటున్నా. బుధవారం రాత్రి అమ్మా, నేను, నాన్న బయట పడుకున్నాం. నాపై ఉన్న దుప్పటి తొలగించగా అరవడంతో అమ్మ లేచింది. బతిమిలాడుతున్నా కత్తితో దాడికి పాల్పడ్డాడు. నేను భయంతో నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ స్పృహ తప్పి కిందపడిపోయా. ఆ తర్వాత లేచి సమీపంలో ఉన్న వదిన వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడికి సైతం వచ్చి పిలిచాడు. వాళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. అందరు లేచి అరవడంతో పరారయ్యాడు. -
బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: పార్టీ నాయకులు విభేదాలను పక్కనపెట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జి ల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలకు ఏం చేయలేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను ఇంటికి పంపించారన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం వెలికితీసి ప్రతీ పేదవాని ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ ప్రజలను మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి పార్టీ అభ్యర్థి సుగుణను భారీ మెజార్టీతో గెలి పించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సత్తు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, దామోదర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ లు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, శ్యాంనా యక్, కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్టీ ప్రచార రథలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ‘ఇఫ్తార్’కు హాజరైన మంత్రి రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడలోని షాదీఖానాలో నిర్వహించిన ఇఫ్తార్‌కు మంత్రి సీతక్క హాజరయ్యా రు. మైనార్టీ నాయకులతో పాటు విందుకు హా జరైన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్‌లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి సుగుణ తదితరులు ఆదివాసీ అడబిడ్డను పార్లమెంట్‌కు పంపండి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఆదివాసీ ఆడబిడ్డను పార్లమెంట్‌కు పంపాల ని మంత్రి సీతక్క కోరారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ సమస్యను ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, బోథ్ ఇన్చార్జి గజేందర్, నాయకులు అరుణ్, బోథ్ మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, తలమడుగు, బజార్హత్నూర్ జెడ్పీటీసీలు గణేశ్‌రెడ్డి, నరసయ్య పాల్గొన్నారు. మాజీ మంత్రి భూమన్నను కలిసిన ఎంపీ అభ్యర్థి సుగుణ కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మాజీ మంత్రి పడాల భూమన్నను మర్యాదపూర్వకంగా కలి శారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీని వాసరెడ్డితో కలిసి పట్టణంలోని ద్వారకానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె అప్యాయంగా పలుకరించి శాలువాతో సత్కరించా రు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీయడంతో పా టు కాసేపు జిల్లా రాజకీయాలపై చర్చించారు. మాజీ మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ తదితరులున్నారు. ఇవి చదవండి: మోదీ అభివృద్ధి ఎజెండాతోనే ఓట్లు అడుగుతాం: కిషన్‌రెడ్డి -
5 వేలతో ప్రారంభమై అందరిని ఆశ్చర్యపరిచిన వ్యాపారం, ఇది!
మనిషి అనుకుంటే కొండలను సైతం పిండి చేయగలడు, అయితే జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణతో కూడా కృషి, పట్టుదల ఎంతో అవసరం. నిరంతరం శ్రమిస్తూ ఈ రోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యాపారవేత్తల్లో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బి సుందరరాజన్, జిబి సుందరరాజన్ కూడా ఉన్నారు. కేవలం రూ. 5,000తో చిన్న వ్యాపారం ప్రారంభించి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు. ఇంతకీ వీరి విజయగాథ వెనుక ఉన్న కష్టాలు ఏంటి? సక్సెస్ సాధించడానికి వారు ఎంచుకున్న మార్గాలేమిటనేది ఈ కథనంలో చూసేద్దాం.. చికెన్ తినే అందరికి సుగుణ చికెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ సంస్థ ఎలా పుట్టుకొచ్చిందనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయింది. (ఇదీ చదవండి: అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?) చిన్నతనంలో చదువులో ముందుకు సాగని అన్నదమ్ములిద్దరూ పాఠశాల విద్యతోనే బడికి బై.. బై చెప్పేసారు. అయితే తండ్రి ఆజ్ఞ ప్రకారం వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు, వారికున్న 20 ఎకరాల భూమిలో ఇతర వ్యవసాయదారులకు భిన్నంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. కొంతకాలం ఇలాగే ముందుకు సాగి వ్యవసాయానికి వీడ్కోలు పలికేసారు. వ్యవసాయం వదిలేసిన తరువాత బంధువుల వ్యవసాయ మోటార్ తయారీ కంపెనీలో పని చేయడం ప్రారభించారు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ కలిసి ఏదైనా చేయాలని ఆలోచిస్తూ రూ. 5,000 పెట్టుబడితో సుగుణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలుపెట్టారు. 1990లో మూడు ఫామ్‌లతో మొదలైన కోళ్ల పెంపకం ఇప్పుడు పదికంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించింది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..) సుగుణ ఫుడ్స్ ప్రారంభమైన మొదట్లో ఎంతోమంది ఇది సక్సెస్ కాదని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు ఈ సంస్థ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ ప్రారంభించిన ఏడు సంవత్సరాల్లోనే 7 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ సుమారు రూ. 12 వేల కోట్ల కంటే ఎక్కువ సమాచారం. -
కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డిలు అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్.సుగుణ రచించిన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబు, దొరల పాలనకు వ్యతిరేకంగా పేద, కార్మిక, కర్షక, కళాకారులు ఏకమై మహత్తరమైన పోరాటం చేశారన్నారు. ఆనా టి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లో ఈ సాయుధ పోరాటం జరిగిందన్నారు. అయి తే అప్పటి పోరాటంతో ఎలాంటి సంబంధంలేని బీజేపీ, దానిని కేవలం హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణలో వేల ఎకరాల భూమిని దొరల నుంచి లాక్కుని పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప రస్పరం సహకరించుకుంటూ.. పేదలపై భారం మోపే లా పాలన కొనసాగస్తున్నాయన్నారు. కేం ద్రం.. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతుంటే.. టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు. సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్య కారణంగా సభకు హాజరు కానందున ఆయన సందేశాన్ని యూ ట్యూబ్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాçష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, రఘుపాల్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుగ్న మెటల్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న సుగ్న మెటల్స్ ఏడాదిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌కు దగ్గరలోని పరిగి వద్ద రూ.30 కోట్లతో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో టీఎంటీ బార్స్ తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుం దని సంస్థ ఎండీ భరత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. టర్బో ఎఫ్ఈ 550 పేరుతో నూతన రకం స్టీల్ బార్స్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పరిగి వద్ద ఇప్పటికే కంపెనీకి నెలకు 15,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల థెర్మో మెకానికల్లీ ట్రీటెడ్ (టీఎంటీ) బార్స్ తయారీ యూనిట్‌తోపాటు 18,000 టన్నుల బిల్లెట్ల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇప్పటి దాకా రూ.100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. సంస్థలో 600 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్త యూనిట్‌తో ఈ సంఖ్య 700లకు చేరనుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.460 కోట్ల టర్నోవర్ నమోదయ్యిందని డైరెక్టర్ ముదిత్ సొంథాలియా తెలిపారు. -
మహిళా ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం
టీ.నగర్: నాగపట్నం ఎస్పీ కార్యాలయంలో మహిళా ఇన్స్పెక్టర్ శనివారం రాత్రి ఆత్మహత్యాకు యత్నించింది. నాగపట్నం మైలాడుదురై ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్గా సుగుణ (36) పనిచేస్తూ వచ్చారు. ఆమెకు ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువ కావడంతో ఈమెను ఎస్పీ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్ సాయుధ దళానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి విధుల్లో చేరింది. అక్కడ కూడా అధికారులు టార్చర్ చేసినట్లు సమాచారం. దీంతో విరక్తి చెందిన సుగుణ శనివారం రాత్రి ఎస్పీ కార్యాలయం పోర్టికోలో నిలుచుని అధిక మొత్తంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నిం చింది. అక్కడున్న పోలీసులకు తాను నిద్రమాత్రలు మింగినట్లు తెలపడంతో వారు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ సుగుణ భర్త పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో పనిభారం, అధికారుల వేధింపులు అధికం కావడంతో ఈ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. -
కొడుకులు గెంటేశారు.. ‘సహృదయం’ చేరదీసింది!
హసన్‌పర్తి(వర్ధన్నపేట): వృద్ధాప్యంలో పోషిస్తారని కలలుకన్న ఆ తల్లిని కుమారులు ఇంట్లోనుంచి గెంటేశారు. దీంతో 30 కిలోమీటర్లు నడిచి వరంగల్ మహానగరం దాటాక కారు ఢీకొనడంతో ఓ చెట్టు కింద అచేతన స్థితిలో పడిపోయింది. ఓ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయంతో సహృదయ అనాథాశ్రమ నిర్వాహ కులు ఆమెను ఆశ్రమానికి తరలించారు. వరంగల్ వెంక ట్రామ థియేటర్ ప్రాంతానికి చెందిన కూనమళ్ల సుగుణ, పరశురాములు దంపతులకు కుమారులు రమేశ్, సురేశ్ ఉన్నారు. పరశురాములు అగ్రికల్చర్ విభాగంలో పనిచేసేవాడు. ఐదేళ్ల ముందే ఉద్యోగం నుంచి తప్పుకొని పెద్ద కుమారుడు రమేశ్‌కు ఉద్యోగం ఇప్పించాడు. పరశురాములు మృతిచెందాక సుగుణకు ఇబ్బందులు మొదలయ్యాయి. కొడుకులు ఆమె బాగోగులు పట్టించు కోవడం మానేశారు. వారం క్రితం కొడుకులు, కోడళ్లు కలసి తనను ఇంటినుంచి వెళ్లగొట్టారని ఆ వృద్ధురాలు సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రేమికుల కథ అడ్డం తిరిగింది!
– నిప్పంటించుకున్న ప్రియురాలు – మంటల్లో చిక్కుకొని ఆర్తనాదాలు – కాపాడబోయిన ప్రియుడికీ గాయాలు కదిరి టౌన్ : చిన్న సమస్య కారణంగా ప్రియురాలు ఒంటిపై నిప్పంటిచుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టింది. అక్కడే ఉన్న ప్రియుడు మంటలను ఆర్పి ఆమెను కాపాడాడు. అయితే ప్రియురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, ప్రియుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. కదిరి కోనేరు సర్కిల్లో సెల్ షాపు నిర్వహిస్తున్న మోహన్‌కు మూడేళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. మూడు నెలల కిందట ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అయితే సమీప ప్రాంతమైన గొల్లదాని మండపంలో నివాసముంటున్న సుగుణతో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారి మధ్య ప్రేమకు దారితీసింది. సుగుణకు బేల్దారి గంగా«ద్రితో పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇద్దరూ కలసి తలుపుల మండలం బట్రేపల్లికి బైక్‌లో వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య మనస్ఫర్థలు చోటుచేసుకున్నాయి. చిన్న గొడవ కూడా జరిగింది. దీంతో ఆవేశంతో సుగుణ తన చీరకు నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మంటలను తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ పరుగులు తీసింది. అక్కడే ఉన్న మోహన్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అప్పటికే సుగుణ శరీరం మంటల్లో చిక్కి ఛాతీ, ముఖం, కడుపు ప్రాంతాల్లో తీవ్ర గాయలయ్యాయి. ఆమెను కాపాడబోయిన మోహన్కూ చేయి కాలింది. స్థానికుల సాయంతో 108లో వారిద్దరినీ కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టరు ఐనుద్దీన్ వైద్యపరీక్షలు నిర్వహించి, ప్రథమ చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. న్యాయమూర్తి ఆస్పత్రికి వచ్చి సుగుణ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే బాధితురాలు సుగుణ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తోంది. తన భర్త తరచూ అనుమానించి వేధించేవాడని, దీంతో జీవితంపై విరక్తితో బట్రేపల్లి సమీపానికి రాగానే తానే చీరకు నిప్పంటించుకున్నానిని, దారెంట వెళ్లే మోహన్‌ను తనను కాపాడాడని తెలిపింది. ఈ విషయమై తలుపుల ఎస్ఐ చంద్రశేఖర్ వివరణ కోరగా... బాధితురాలు సుగుణ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఆ సమయంలో మోహన్ అనే వ్యక్తి ఆమెను కాపాడి ఆస్పత్రికి తీసుకొచ్చాడన్నారు. -
యువతి కనిపించడంలేదని ఫిర్యాదు
బత్తలపల్లి: మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకు సమీపంలో నివాసముంటున్న బయన్న కుమార్తె సుగుణ(22) ఈ నెల 11 నుంచి కనిపించకుండా పోయిందని బాధితుడు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ హారు¯ŒSబాషా తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం రూరల్ సీఐ మురళీకృష్ణ 9440796832, ఎస్ఐ హారు¯ŒSబాషా 9440796833 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలి
► భీంభరత్‌ను విడుదల చేయాలి ► టఫ్ జిల్లా కన్వీనర్ సుగుణ ఉట్నూర్ : ఆటపాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థారుులో ప్రజల వరకు తీసుకెళ్లిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని సీజ్ చేయడం సరికాదని, ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) జిల్లా కన్వీనర్ ఆత్ర సుగుణ అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆటపాటల ద్వారా విమలక్క ప్రజలను చైతన్యవంతం చేసిన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. కార్యాలయం సీజ్ చేయడాన్ని రద్దు చేస్తూ అకారణంగా అరెస్టు చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కార్యదర్శి భీంభరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ నేతవత్ రాందాస్, ఆదివాసీ జిల్లాల సాధన సమితి రాష్ట్ర కో కన్వీనర్ వినాయక్‌రావ్, నాయకులు రాజేందర్, సారుుదా, ఎమ్ఆర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష హాలులో ప్రసవం
విజయనగరం: పరీక్ష కేంద్రంలోనే ఓ డీఎస్సీ అభ్యర్థిని ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిండు గర్భిణి గొటివాడకు చెందిన సుగుణ పరీక్షకు హాజరైంది. ఆమెది కురుపాం మండలం గొటివాడ గ్రామం. మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్ష రాసేందుకు హాజరైంది. అయితే, పరీక్ష ప్రారంభమైన గంటకే నొప్పులు రావడంతో అధికారులు 108కు సమాచారం ఇచ్చారు. 108 రాకపోవడంతో పరీక్ష హాలులోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రైవేట్ అంబులెన్స్‌లో తల్లీ కొడుకులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే లోపే శిశువు ఆస్పత్రిలో కన్నుమూసింది. -
తిరుపతి ఉప ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
బరిలో 13 మంది అభ్యర్థులు నగదు, మద్యంతో ప్రలోభాలు గెలుపుపై టీడీపీ, కాంగ్రెస్‌ల ధీమా తిరుమల: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైది. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ (టీడీపీ) 2014 డిసెంబర్ 15న అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2,94,781 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,886 మంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. పోటీలో దివంగత ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ సతీమణి సుగుణ (తెలుగుదేశం), ఆర్.శ్రీదేవి (కాంగ్రెస్), ఆసాది వెంకటాద్రి (రాష్ట్రీయ క్రాంతికారి సమాజ్‌వాదీ పార్టీ), కల్లూరి బాలసుబ్రహ్మణ్యం (లోక్‌సత్తా), నాగవేటి సుబ్రహ్మణ్య ఆచారి (అఖిల భారతీయ జనసంఘ్)తో పాటు మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ప్రలోభాల పర్వం కనిపించింది. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురు నగదు, మద్యం పంపిణీపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఉప పోరులో గెలుపుపై టీడీపీ ధీమాగా ఉంది. -
తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా సుగుణ!
టీడీఎల్పీ భేటీలో ప్రస్తావించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున మన్నేరి సుగుణను బరిలోకి దించనున్నారు. ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే మన్నేరి వెంకట రమణ సేవలను గురువారం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఇద్దరు కుమార్తెలు బధిరులైనా వెంకట రమణ సతీమణి సుగుణ మనోధైర్యంతో నడుచుకుంటున్నారని చెప్పారు. సుగుణ ఉన్నత విద్యావంతురాలని (ఎంఏ ఇంగ్లీషు), వెంకట రమణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే శక్తిని భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని కోరుకుందామన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాటలను బట్టి సుగుణను తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా నిలబెడతారని భావిస్తున్నట్లు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. -
పాఠశాలలో కంప్యూటర్ల చోరీ
మోటూరులో ఘటన 11 కంప్యూటర్లు మాయం విలువ రూ.1.50 లక్షలు గుడివాడ రూరల్ : మండలంలోని మోటూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి కంప్యూటర్ల దొంగతనం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సిబ్బంది పాఠశాలలో అన్ని గదులకు తాళాలు వేశారు. రెండో శనివారం సెలవు కావడంతో ఉదయం అక్కడ ఆడుకునేందుకు పిల్లలు వచ్చారు. కంప్యూటర్ ల్యాబ్ తెరిచి ఉండటాన్ని చూసి లోనికి వెళ్లారు. అక్కడ కంప్యూటర్లు కనిపించలేదు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు సుగుణకు ఫోన్ చేశారు. ఆమెతోపాటు సిబ్బంది హుటాహుటిన వచ్చి కం ప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. అందులోని 11 మాని టర్లు, రెండు సీపీయూలు, రెండు కీప్యాడ్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుం దని అంచనా. గదిలోని బీరువా, సొరుగులు తెరిచి ఉండటాన్ని కూడా గుర్తించారు. వాటిలో ఏమీ లేకపోవడంతో కంప్యూటర్లను అపహరించుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పాఠశాల సిబ్బంది అందించిన సమాచారం మేర కు రూరల్ ఏఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ‘పాఠశాలకు రక్షణ కరువు’ శీర్షికతో గత మే నెలలో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనతో ఈ విషయం రుజువైంది. ప్రభుత్వ పాఠశాలలో అటెండరు, నైట్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విలువైన సామాగ్రికి రక్షణ లేదని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
రక్తం లేదట!
కామారెడ్డి, న్యూస్‌లైన్: కడుపులో పిండం చనిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన సుగుణ వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించగా, పిండం చనిపోవడంతో గర్భసంచి పగిలినట్టు గుర్తించారు. గర్భసంచి పగలడం మూలంగా తీవ్ర రక్తస్రావమైందని, వెంటనే రక్తం అవసరమని రోగి బంధువులకు తెలిపారు. ఆమెకు కావలసిన రక్తం గు రించి రోగి భర్త గణేశ్‌తో పాటు బంధువులు స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి వె ళ్లారు. అక్కడ రక్తం స్టాక్ లేదన్న సమాధానం వచ్చింది. నిజామాబాద్‌కు వెళ్లినా ఇదే సమాధానం రావడంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎలాగోలా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తం సంపాదించి ఆస్పత్రిలో సుగుణను బతికించుకున్నారు. ఇది ఒక్క సుగుణకు సంబంధించిన సమస్యే కాదు. నిత్యం అలాంటి రోగులెందరో రక్తం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు అ త్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించేందుకు గాను బ్లడ్ బ్యాంకుల్లో ఆయా గ్రూపులకు సంబంధించిన రక్తం నిల్వలు అందుబాటులో ఉంచాలి. అయితే కొంత కాలంగా జిల్లాలో రక ్త సేకరణ విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. పరిస్థితులు ఇవీ కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో కొంతకాలంగా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజు రక్తం కోసం ప ది మంది వరకు వచ్చిపోతున్నారు. అత్యవసర పరిస్థితులలో రక్తం లభించకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. రోగుల బంధువులు రక్తం కోసం నిజామాబాద్,హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వె ళుతున్నారు. తీరా అక్కడికి వెళ్లినా రక్తం స్టాక్ లేదనే సమాధానంతో విస్తుపోతున్నారు. కామారెడ్డిలో బ్ల డ్ బ్యాంక్ బాధ్యతలు మోసిన డాక్టర్ దినేశ్‌రెడ్డి విధుల నుంచి తప్పుకున్నారు. బ్లడ్‌బ్యాంక్ నిర్వహణకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆయన విధులకు దూ రమయ్యారు. అప్పటి నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహణను పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధీనంలో బ్లడ్‌బ్యాంక్ కొనసాగుతోంది. శిబిరాల నిర్వహణ లేకనే రక్తదాన శిబిరాలు జరగకపోవడంతో కొరత ఏర్పడిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు రావడం, వెనువెంటనే వరుసగా వచ్చిన ఎన్నికలతో శిబి రాల నిర్వహణ సాధ్యం కాలేదంటున్నారు. రక్తదాన ఆవశ్యకత గురించి ఎంత ప్రచారం నిర్వహించినా, రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం, నిర్వహణ సరిగ్గా లేక పోవడం మూలంగా రక్తానికి కొరత ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయరహ దారితో పాటు అంతర్రాష్ర్ట రహదారులు ఉన్న కామారెడ్డిలో నిత్యం ప్రమాదాలతో ఎందరినో ఆస్పత్రులకు తీసుకు వస్తుంటారు. వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాల్సి ఉంటే అందుబాటులో రక్తం లేకపోవడం మూలంగా ప్రా ణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రక్త నిల్వల గురించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.