కామారెడ్డి, న్యూస్‌లైన్: కడుపులో పిండం చనిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన సుగుణ వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించగా, పిండం చనిపోవడంతో గర్భసంచి పగిలినట్టు గుర్తించారు. గర్భసంచి పగలడం మూలంగా తీవ్ర రక్తస్రావమైందని, వెంటనే రక్తం అవసరమని రోగి బంధువులకు తెలిపారు. ఆమెకు కావలసిన రక్తం గు రించి రోగి భర్త గణేశ్‌తో పాటు బంధువులు స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి వె ళ్లారు.
అక్కడ రక్తం స్టాక్ లేదన్న సమాధానం వచ్చింది. నిజామాబాద్‌కు వెళ్లినా ఇదే సమాధానం రావడంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎలాగోలా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తం సంపాదించి ఆస్పత్రిలో సుగుణను బతికించుకున్నారు. ఇది ఒక్క సుగుణకు సంబంధించిన సమస్యే కాదు. నిత్యం అలాంటి రోగులెందరో రక్తం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు అ త్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించేందుకు గాను బ్లడ్ బ్యాంకుల్లో ఆయా గ్రూపులకు సంబంధించిన రక్తం నిల్వలు అందుబాటులో ఉంచాలి. అయితే కొంత కాలంగా జిల్లాలో రక ్త సేకరణ విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది.
పరిస్థితులు ఇవీ
కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో కొంతకాలంగా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజు రక్తం కోసం ప ది మంది వరకు వచ్చిపోతున్నారు. అత్యవసర పరిస్థితులలో రక్తం లభించకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. రోగుల బంధువులు రక్తం కోసం నిజామాబాద్,హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వె ళుతున్నారు. తీరా అక్కడికి వెళ్లినా రక్తం స్టాక్ లేదనే సమాధానంతో విస్తుపోతున్నారు. కామారెడ్డిలో బ్ల డ్ బ్యాంక్ బాధ్యతలు మోసిన డాక్టర్ దినేశ్‌రెడ్డి విధుల నుంచి తప్పుకున్నారు. బ్లడ్‌బ్యాంక్ నిర్వహణకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆయన విధులకు దూ రమయ్యారు. అప్పటి నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహణను పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధీనంలో బ్లడ్‌బ్యాంక్ కొనసాగుతోంది.
శిబిరాల నిర్వహణ లేకనే
రక్తదాన శిబిరాలు జరగకపోవడంతో కొరత ఏర్పడిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు రావడం, వెనువెంటనే వరుసగా వచ్చిన ఎన్నికలతో శిబి రాల నిర్వహణ సాధ్యం కాలేదంటున్నారు. రక్తదాన ఆవశ్యకత గురించి ఎంత ప్రచారం నిర్వహించినా, రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం, నిర్వహణ సరిగ్గా లేక పోవడం మూలంగా రక్తానికి కొరత ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జాతీయరహ దారితో పాటు అంతర్రాష్ర్ట రహదారులు ఉన్న కామారెడ్డిలో నిత్యం ప్రమాదాలతో ఎందరినో ఆస్పత్రులకు తీసుకు వస్తుంటారు. వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాల్సి ఉంటే అందుబాటులో రక్తం లేకపోవడం మూలంగా ప్రా ణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రక్త నిల్వల గురించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రక్తం లేదట!
Published Fri, May 23 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement