blood bank
-
టాలీవుడ్ నటుడిని సన్మానించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా సమాజం కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట సేవా కార్యక్రామాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. గత 26 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా రక్తనిధులు సమకూరుస్తున్నారు. అయితే చిరంజీవి అభిమానులు ప్రతి ఏటా రక్తదానం క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు. అలా బ్లడ్ బ్యాంక్ ప్రారంభం నుంచి రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన వందసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ అభినందించారు. ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆయన సేవలను మెగాస్టార్ కొనియాడారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ రాఘవను ఆదర్శంగా తీసుకోవాలని చిరు ఆకాక్షించారు. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి రక్తం అందిస్తున్నామని తెలిపారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. MEGASTAR #Chiranjeevi garu felicitates Maharshi Raghava's milestone 100th Blood Donation at @CCTBloodBank Chiranjeevi Blood Bank Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/q6yNNGDZSz — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..(ఫొటోలు)
-
మియాపూర్ లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
-
హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్‌లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్‌లోని హీమో ల్యాబొరేటరీస్‌లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
రక్తం, ప్లాస్మా ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి.. డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు. రూ.700కు కొని రూ.3,800కు విక్రయం తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం.. దాతలుగా బంధువులు!
మన దేశంలో జరిగే పెళ్లి వేడుకల్లో కానుకలు ఇచ్చిపుచ్చుకోవడమనేది సాధారణమే. అయితే బీహార్‌లో విచిత్రమైన కానుకల డిమాండ్‌తో ఒక వివాహం జరిగింది. స్థానికంగా ఇది చర్చకు దారితీయడంతోపాటు పదిమందికీ ఆదర్శంగానూ నిలిచింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రక్తదానం చేస్తేనే.. ఊరేగింపుగా వధువు ఇంటికి వస్తానని వరుడు కండీషన్ పెట్టాడు. ఇది విన్నవెంటనే వధువు తరపువారు మొదట ఆలోచనలో పడ్డారు. తరువాత వరుని మాటను మన్నించి, ఆడపిల్ల తరపువారంతా రక్తదానం చేసి, పెళ్లి ఘనంగా జరిపించారు. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని హస్పురాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి హస్పురాకు చెందిన అనీష్, అర్రాకు చెందిన సిమ్రాన్‌కు వివాహం నిశ్చయమయ్యింది. కాగా అనీష్ ఈ ప్రాంతంలో అత్యధికంగా రక్తదానాలు చేయిస్తూ ‘రక్తవీర్’ అనే పేరు పొందాడు. తన పెళ్లి సందర్భంగా పదిమందితో రక్తదానం చేయించాలని అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని వధువు తరపు వారికి తెలియజేశారు. రక్తదానానికి సిద్ధమయితేనే ఈ పెళ్లి జరుగుతుందంటూ ఆడ పెళ్లివారికి కబురంపాడు. దీనికి ఆడపెళ్లివారంతా సమ్మతి తెలిపారు. పట్నాలోని నిరామయ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ రంజన్ వచ్చి పెళ్లివారింట రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 70 మందికి పైగా బంధువులు రక్తదానం చేశారు. తన జీవితంలో తొలిసారిగా ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని డాక్టర్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌కు చెందిన గణేష్ కుమార్ భగత్, అతని బృందం మాట్లాడుతూ రక్తం కొరతతో ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వివాహ వేడుకల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. -
రక్తదానంలో సెంచరీ..!
సాక్షి, కామారెడ్డి : వస్త్ర వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఒక సారి కాదు, రెండు సార్లు కాదు.. ఇప్పటికీ ఆయన 102 సార్లు రక్తదానం చేశాడు. ఎంతో మందికి రక్తం ఇచ్చి ప్రాణదాతగా నిలిచాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాంబే క్లాథ్ హౌజ్ షాపింగ్ మాల్ యజమాని వీటీ రాజ్‌కుమార్ నాలుగున్నర దశాబ్దాలుగా రక్తదానం చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు రక్తదానం చేయడం అలవాటుగా మారింది. రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలిచిన వీటీ రాజ్‌కుమార్‌ను రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై అవార్డుతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వీటీ రాజ్‌కుమార్ అందించిన సేవలపై ‘సాక్షి’ కథనం.. కామారెడ్డిలో లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో విపత్తులు సంభవించినా బాంబే క్లాథ్ హౌజ్ ద్వారా దుస్తులు, ఆహార పదార్థాలను పంపిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించి సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు దుస్తులు, దుప్పట్లు అందజేస్తారు. రోడ్డు మీద పండ్లు, కూర గాయలు అమ్ముకుని జీవనం సాగించే వారికి ఎండ, వానల నుంచి రక్షించుకునేందుకు గొడుగులు పంపిణీ చేయడం, వైద్య శిబిరాలతో పేదలకు మందులు ఇవ్వడం, అవసరమైన వారికి ఆపరేషన్లూ చే యిస్తారు. కామారెడ్డి ఆస్పత్రి సమీపంలో రూ. 5కు భోజనం కూడా పెడుతున్నారు. ఇలా నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. తండ్రి పేరిట బ్లడ్ బ్యాంక్.. వైద్యం కోసం కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, డెలివరీల కోసం ఇక్కడి ఆస్పత్రులకు వచ్చే వారు సమయానికి రక్తం దొరక్క ఇబ్బందులు పడడమే కాదు ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. బాంబే క్లాథ్ హౌజ్ ముందరే ప్రభుత్వ ఆస్పత్రి ఉండడం, ఆస్పత్రికి వచ్చిన వారు బ్లడ్ కోసం పడే ఇబ్బందులను చూసి చలించిపోయిన వీటీ రాజ్‌కుమార్ ఆయన సోదరుడు వీటీ లాల్ బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి ముందు కు వచ్చారు. తమ తండ్రి వీటీ ఠాకూర్ పేరుతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు క్యాంపులు నిర్వహిస్తూ రక్తం సేకరించి నిల్వ చేయడం, ఆదప లో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో వేలాది మందికి రక్తం అందించారు. కాగా రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిని గుర్తించి రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న అవార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిలో రెండో వ్యక్తిగా వీటీ రాజ్‌కుమార్‌ను గవర్నర్ తమిళిసై అవార్డుతో సన్మానించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న రాజ్‌కుమార్‌ను అభినందించారు. రక్తదానంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది.. సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నన్నెంతగానో కలచివేశాయి. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నా.అప్పటి నుంచి ఏటా రెండు, మూడు సార్లు తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నా. బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదుకున్నాం. ఎన్ని డబ్బులు సంపాదించినా మనిషికి తృప్తి ఉండకపోవచ్చు. కానీ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినపుడు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇన్ని సార్లు రక్తదానం చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మొదట్లో 20 సార్లు చేయాలనుకున్న. తరువాత టార్గెట్ 50 కి పెట్టుకున్నా. ఆ తరువాత వంద సార్లు అనుకున్నా. ఇప్పటికీ 102 సార్లు రక్తదానం చేశాను. శక్తి ఉన్నంత కాలం చేస్తూనే ఉంటా. -
చిరంజీవిపై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ వోవెన్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేస్తూ పలువురు ప్రాణాలు కాపాడుతున్న 1,500 మంది రక్తదాతలకు రూ.7 లక్షల విలువ చేసే బీమా కార్డులతో పాటు బ్లడ్ డోనర్స్ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారన్నారు. ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’–2022 అవార్డును గెలుచుకున్న చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప సంబంధాలు నెలకొల్పేందుకు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 10లక్షలయూనిట్ల రక్తదానం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను సందర్శించడం గొప్ప గౌరవమని, ఎంతోమంది రక్తదాతలకు ఇది మరింత స్ఫూర్తినిస్తుందని చిరంజీవి చెప్పారు. ఈ బ్లడ్ బ్యాంకులో ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల రక్తదానం చేశామని, నేత్ర బ్యాంక్ ద్వారా 9,060 మందికి కంటిచూపు పునరుద్ధరించామని వెల్లడించారు. 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో ఇది సహాయ పడిందన్నారు. రక్తం దొరకక తన దూరపు బంధువు ఒకరు చనిపోయినప్పుడు పడ్డ ఆవేదన నుంచే బ్లడ్ బ్యాంకు ఆలోచన వచ్చిందని వివరించారు. బ్లడ్‌బ్యాంకుకు అవసరమైన సాంకేతిక నిపుణుల కొరత ఉండటం వల్లే ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిచోట తన అభిమానులు చెప్పగానే రక్తదానం చేస్తున్నారని..అభిమానులున్న చోట బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లేనని వెల్లడించారు. ఇటీవల ఓ తల్లి తన బాబు(8)కు ప్లేట్‌లెట్స్‌ను తన అభిమానులు ఇచ్చి ప్రాణాలు కాపాడారని ఓ సందేశం పంపినప్పుడు తనకు చాలా ఆనందం కలిగిందన్నారు. కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవి పై బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు
-
యూపీలో ఘోరం.. డెంగ్యూ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్.. వీడియో వైరల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. డెంగీతో బాధపడుతున్న రోగికి ప్లాస్మా పేరుతో ఓ బ్లడ్ బ్యాంక్ బత్తాయి జ్యూస్‌ను సరాఫరా చేసిందనే వార్త కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యం అతని ప్రాణాలు తీసిందనేది ఆరోపణ. బ్లడ్ ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వేదాంక్ సింగ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రిలో స్కామ్ అని ఓ వ్యక్తి చెప్పడం వినిపిస్తోంది. ఆసుపత్రితో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు బత్తాయి జ్యూస్‌ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక బత్తాయి జ్యూస్ ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని, దీనిపై ప్రయాగ్‌రాజ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. प्रयागराज में मानवता शर्मसार हो गयी। एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया। मरीज की मौत हो गयी है। इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP — Vedank Singh (@VedankSingh) October 19, 2022 మరోవైపు స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు. చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బడితెపూజ చేసిన మహిళలు.. వీడియో వైరల్ -
స్మార్ట్‌ఫోన్ కోసం రక్తం అమ్ముకునేందుకు ప్రయత్నించిన అమ్మాయి
కోల్‌కతా: స్మార్ట్ కొనుక్కునే స్తోమత లేక 16 ఏళ్ల అమ్మాయి చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా ఆస్పత్రికి వెళ్లి ఆమె రక్తాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్ఘాట్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన సోమవారం జరిగింది. సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఈ అమ్మాయి సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లింది. అయితే ఎవరి కోసమే రక్తాన్ని తీసుకెళ్లేందుకు ఆమె వచ్చి ఉంటుందని వారు అనుకున్నారు. కానీ రక్తం అమ్ముకోవడానికి అక్కడికి వచ్చినట్లు బాలిక చెప్పగానే వారు షాక్‌కు గురయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా.. సోదరుడి చికిత్సకు డబ్బులు లేవని, అందుకే రక్తం విక్రయించాలనుకున్నట్లు బాలిక చెప్పింది. అయితే సిబ్బంది మాత్రం అందుకు నిరాకరించారు. వెంటనే చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించగా.. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. స్మార్ట్‌పోన్ కొనుక్కునేందుకు తన దగ్గర డబ్బులు లేవని, అందుకే రక్తం అమ్ముకోవాలనుకున్నట్లు ఒప్పుకుంది. కౌన్సిలింగ్ అనంతరం అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే ఈ బాలిక ఆదివారం రోజే బంధువు మొబైల్ పోన్ ద్వారా ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ పెట్టింది. దాని ఖరీదు రూ.9,000. గురువారం అది ఆమె చేతికి రానుంది. అయితే అందుకు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో రక్తం అమ్ముకోవాలనుకుంది. అంతేకాదు ఇంట్లో ట్యూషన్‌కు వెళ్లొస్తానని చెప్పి తాపన్ ప్రాంతం నుంచి బస్సులో 30కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. సైకిల్‌ను కూడా బస్టాండ్‌లోనే వదిలిపెట్టింది. కూతురు ఇంటి నుంచి వెళ్లినప్పుడు తాను ఇంట్లో లేనని తండ్రి కుమార్ దాస్ తెలిపారు. ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని వాపోయాడు. తనకు నాలుగో తరగతి చదివే కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. కుమార్ దాస్ కూరగాయల వ్యాపారి కాగా.. ఆమె భార్య గృహిణి. చదవండి: కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్.. -
గవర్నర్ చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులు
చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్ రక్తదాలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సన్మానించారు. ఆదివారం రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తమిళి సై చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులను అందజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తూ వారికి ‘చిరు భద్రతా’ కార్డుల పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రక్త దాతలను సన్మానించుకోడం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి గారు తన అభిమానులను మోటివెట్ చేసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్ అని కొనియాడారు. ప్రతి రక్త దాత ఒక స్టార్ అని తమిళి సై వ్యాఖ్యానించారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ‘1998లో ప్రమాదంలో గాయపడ్డ వారు సమయానికి రక్తం ఎంతో మంది మరణించారు. ఆ ఘటనలు నన్ను బాధించాయి. అలాంటి ఘటనలు ఇకముందు జరగకూడదనే ఉద్ధేశంతోనే 24 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించాను. అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. యాభై అరవై సార్లు రక్తం దానం చేసిన వారికి చిరు భద్రతగా లైప్ ఇన్సూరెన్స్ కార్డులు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గవర్నర్ గారి ప్రోత్సాహకం ఎంతో ఉత్సహాన్ని ఇస్తుందని, ఆమె ఎన్నో సార్లు ట్వీట్ల ద్వారా ఎంకరేజ్ చేశారు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. -
'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ఏర్పాటు చేయడానికి కారణమేంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడటంలో ముందుటారాయన. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. అసలు ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే అలోచన ఎలా వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి అన్నదానిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ రోజు పేపర్ చదువుతుంటే, రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త కనిపించింది. ఇంతమంది జనం ఉండి కూడా సరైన సమయానికి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్న నన్ను ఎంతగానో తొలచివేసింది. దీంతో ఆ మరుసటి రోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేశాను. అలా 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించాం. నా ప్రయత్నానికి ఎంతోమంది అభిమానులు సహా సామాన్యులు కదిలివచ్చారు. అలా వారందరి సహకారంతో ఎంతో సక్సెస్ ఫుల్‌గా బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాం. సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నపుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి కారణమిదే అని వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తలసీమియా బాధిత చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్.. అసలేం జరిగిందంటే..
సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్‌లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్‌లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎలాంటి పొరపాటు జరుగలేదు రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్‌లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం. బాలుడికి హెచ్ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం. – డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ -
Happy Birthday Chiranjeevi: అలా 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ఏర్పాటైంది..
కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడటంలో ముందుటారు మెగాస్టార్ చిరంజీవి. పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. అసలు ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే అలోచన ఎలా వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి అన్నదానిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ రోజు పేపర్ చదువుతుంటే, రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త కనిపించింది. (చదవండి: బర్త్‌డే స్పెషల్ : చిరు 153 మూవీ టైటిల్ వచ్చేసింది..) ఇంతమంది జనం ఉండి కూడా సరైన సమయానికి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్న నన్ను ఎంతగానో తొలచివేసింది. దీంతో ఆ మరుసటి రోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేశాను. అలా 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించాం. నా ప్రయత్నానికి ఎంతోమంది అభిమానులు సహా సామాన్యులు కదిలివచ్చారు. అలా వారందరి సహకారంతో ఎంతో సక్సెస్ ఫుల్‌గా బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాం అని చిరు పేర్కొన్నారు. కాగా బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసిన చిరంజీవి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. అలాగే కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఓ ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ సినీ కార్మిక సమాఖ్య లేఖ
కరోనా సెకండ్ వేవ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించి ఎనలేని సేవలందించారు మెగాస్టార్ చిరంజీవి. మహమ్మారి నుంచి సినీ కార్మికులను కాపాడేందుకు కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) కూడా ప్రాంభించారు. అంతేగాక ఆర్టిస్టులు సహా 24 శాఖల కార్మికుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇలా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు ఆయన. తాజాగా సినీ కార్మికుడి కుటుంబానికి చెందిన ఓ తల్లి బిడ్డలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుంది. చికిత్సకు రక్తం అందక ఆ తల్లిబిడ్డలు బాధపడుతుంటే సకాలంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడారు. సినీ కార్మికుల కోసం ఆయన చేసిన సేవలకు గాను చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీ పరిశ్రమ కార్మిక సమాఖ్య ఫెడరేషన్ చిరంజీవికి లేఖ రాసింది. ‘చిరంజీవి గారు.. మీరు మన సినీ కార్మికులకు ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మీరు చేసే ప్రతి సేవ జీవితాంతం గుర్తుంటుంది. అందులో భాగంగా.. భాస్కర్ అనే సినీ కార్మికుని భార్య డెలివరీ సమయంలో చావు బ్రతుకులలో ఉండగా తల్లి బిడ్డలకు రెండు దఫాలుగా బ్లడ్ ఇచ్చి బ్రతికించిన మీకు మా పాదాభివందనాలు’ అని లేఖలో పేర్కొన్నారు. ఇక రక్తదానం కోసం అర్ధరాత్రి వెళ్ళి సమయంలో కూడా వెంటనే స్పందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున అధ్యక్షుడు అనీల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి పీఎస్ఎన్ దొరలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
రక్తదానంతో.. చిరంజీవులు..
పూర్వ వరంగల్ జిల్లాలో తలసేమియా బాధితులు ఎక్కువ. పదిహేను రోజులకు ఓసారి రక్త మార్పిడి చేయకుంటే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ఈ జిల్లాలో ఉన్న తలసేమియా, సికెట్ రోగులకు వరంగల్‌లో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలోని రక్తనిధి ప్రధాన జీవనాధారం. ఇక్కడ ఎల్లవేళలా 300 నుంచి 400 యూనిట్ల రక్తం ఎప్పుడూ అందుబాటులో ఉండేది. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇక్కడ రక్తం నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా రోగులు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇది ఒక్క వరంగల్‌లోనే కాదు దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా బ్లడ్ సెంటర్లలో రక్తపు యూనిట్ల నిల్వలు అడుగంటి పోయాయి. కరోనా విజృంభనతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రక్త సేకరణ నెమ్మదించింది. మరోవైపు కరోనా రోగుల చికిత్సలో భాగంగా గత ఏడాది కాలంగా ప్లాస్మా దానంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఫలితంగా బ్లడ్ సెంటర్లలో రక్తనిధి తగ్గిపోతోంది. రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్లు, డయాలసిస్ వంటి సమయాల్లో మనుషుల ప్రాణాలు కాపాడటంలో బ్లడ్ సెంటర్లు కీలకం. ఎంతో మంది తమ స్వచ్ఛంధంగా రక్తాన్ని దానం చేసి ఈ బ్లడ్ సెంటర్లకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. అలాంటి ప్రాణదాతల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రతీ ఏడు జూన్ 14వ తేదిన అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతున్నారు. జూన్ 14న ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005 మేలో అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. రక్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్ , నెగటివ్ గ్రూపులను గుర్తించిన కార్ల్ లాండ్ స్టీవర్ జన్మదినమైన జూన్ 14ను వరల్డ్ బ్లడ్ డోనర్ డేకి డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసింది. రక్తదానం చేయండి ... ప్రపంచం పరిగెత్తేలా చేయండి అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్ బ్లడ్ డోనర్ డేను నిర్వహించాలని నిర్ణయించారు. వేలకట్టలేని సాయం సైన్సు ఇప్పటికే ఎన్నో విషయాలను కనిపెట్టింది. మరెన్నో కనిపెడుతోంది కూడా. శాస్త్ర, సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినా దానికి పరిమితులు ఉన్నాయి. ఇప్పటికీ కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయగల సైన్సు అభివృద్ధి చెందలేదు. రక్త దానం ఒక్కటే ఇకప్పటికీ మార్గం. రక్తదాతలు తమ దయ గుణంతో ప్రతీ రోజు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ వారు చిరంజీవులుగా ఉండేలా సహాయ పడుతున్నారు. బ్లడ్ సెంటర్లు ప్రపంచమంతటగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్లు ఉన్నాయి. రెడ్‌క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీల వంటి అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థలు రక్తసేకరణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. తెలుగు స్టేట్స్లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ సెంటర్‌ను నెలకొల్పారు. రెండు దశబ్ధాలుగా ఆయన అభిమానులు ఎంతో మంది రక్తదానం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అనేక సంస్థలకు చెందిన ఉద్యోగులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రక్తాన్ని దానం చేస్తున్నారు. రక్తదానం ఎవరు చేయోచ్చు - ఆరోగ్యంగా ఉండి 18 నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న వారు రక్తదానం చేయవచ్చు. - రక్తదానం చేయాలంటూ శరీర బరువు 50 కేజీలకు పైన ఉండాలి - ఆరోగ్యంగా ఉన్న ఓ వ్యక్తి 450 మిల్లీ లీటర్ల వరకు రక్తం దానం చేయవచ్చు. - పురుషులు ప్రతి మూడునెలలకోసారి మహిళలు ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. ప్రయోజనాలు - బాడీలోని ఐరన్‌ని బ్యాలెన్స్ చేస్తుంది - గుండెపోటు, కేన్సర్ వంటి ప్రాణాంత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది - తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. - ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి రెట్టింపు అవుతుంది. - ఊబకాయం ఉన్నవారు సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. తరచుగా రక్తదానం చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ అవుతాయి. చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి -
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండావిష్కరించిన మెగా ఫ్యామిలీ..
-
గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు, కుమారుడు రామ్ చరణ్ తేజ్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిరంజీవి, రామ్‌చరణ్ అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు చిరంజీవి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయాలనుకుని నిర్ణయించుకున్న మెగా బ్లడ్ బ్రదర్స్‌ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తన పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి, రక్తదానం చేసిన, చేస్తున్న రక్తదాక్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. రక్త దానం చేయండి, ప్రాణ దాతలుకండి అంటూ చిరంజీవి తన వాయిస్ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని అందించారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కరోనా: పేదలకు అండగా మెగాస్టార్
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. తాజాగా కరోనా బారిన పడిన నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా అందించేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. “పచ్చటి జీవితాలపై కర్మశ కరోనా పంజా విసుర్లూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. కరోనా సోకి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుషు పోసీనట్లే అని అందులో వివరించారు. తెల్లరేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా ప్లాస్మా సరఫరా చేయనున్నారు. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు కోరారు. 22 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పేదవాళ్ళకి అండగా నిలుస్తున్న చిరంజీవిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ప్లాస్మా కరోనాను ఎదుర్కోవడానికి ఒక బలమైన ఆయుధమని ఇది వరకే పిలుపునిచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడంతో అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఖరీదైన వస్తువుగా ఉన్న ప్లాస్మాను పేదలకు అందుబాటులోకి తెస్తున్న చిరంజీవికి చాలా మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చదవండి: ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా.. -
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి
‘‘కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న లాక్డౌన్ వల్ల రక్త దాతల కొరత ఏర్పడింది. ఈ కారణంగా ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తం అవసరం ఉన్న వారికి లాక్డౌన్ పెను సమస్యాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అంటూ హీరో చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి చిరంజీవి ఆదివారం స్వయంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంక్స్‌లో రక్త నిల్వలు తగడంతో ఆస్పత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, బైపాస్ సర్జరీ, హార్ట్ పేషెంట్స్, ప్రమాదాలకు గురైన వారు, ఎనీమియా వంటి సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రజలు, మెగా అభిమానులు ముందుకు రావాలి. మీకు సమీపంలోని బ్లడ్ బ్యాంక్స్‌కి వెళ్లి రక్తదానం చేయండి. లాక్డౌన్ నేపథ్యంలో రక్తదానం చేసేందుకు పోలీసుల వల్ల ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. రక్తదానం చేస్తామని సమీపంలోని బ్లడ్ బ్యాంక్ వారికి చెప్పగానే మీ ఫోన్ వాట్సాప్‌కు పాస్ వస్తుంది.. అది పోలీసులకు చూపిస్తే సరిపోతుంది’’ అన్నారు. చిరంజీవితో సహా హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, శ్రీమిత్ర చౌదరి, ఆయన వారసులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, నటులు బెనర్జీ, భూపాల్, గోవిందరావు, విజయ్, ‘సంతోషం’ పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. -
నా సేవలు కొనసాగిస్తా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు. -
లంచంగా బంగారం అడిగిన ‘లక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రానికి అనుకూలంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేసిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్(డీఐ)ను అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ డీఐ నుంచి బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ అవినితీ అధికారిని కోర్టులో హాజరు పరిచారు. లింగంపల్లి లక్ష్మీరెడ్డి 15 ఏళ్లుగా బోయిన్‌పల్లిలో జనని వాలంటరీ పేరుతో రక్తనిధి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. జంటనగరాల జోన్ కు డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఉన్న బొమ్మిశెట్టి లక్ష్మీ ఇటీవల ఆ రక్తనిధి కేంద్రంలో తనిఖీలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా రికార్డ్స్‌లో దాతల వివరాలు సరిగా లేకపోవడంతో పాటుగా రక్తం నిల్వ చేసిన గదిలో ఏసీ పని చేయడం లేదని డీఐ లక్ష్మీ గుర్తించి బ్లడ్ బ్యాంక్‌పై కేసు నమోదు చేసింది. రక్తనిధి కేంద్రాన్ని సీజ్ చేయకుండా ఉండాలంటే రూ.2 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతమొత్తం ఇచ్చుకోలేనని, నోటీసులిస్తే లోపాలను సరిదిద్దుకుంటానని లక్ష్మీరెడ్డి వేడుకుంది. తమకు కూడా టార్గెట్లు ఉన్నాయని, తాము కూడా పై అధికారులకు ముట్టజెప్పాలని, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ డీఐ హుకుం జారీ చేసింది. డీఐ వేధింపు లు భరించలేక బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డ్రగ్ ఇన్స్పెక్టర్కు లక్ష్మీరెడ్డి కబురు పంపించింది. అయితే డీఐ నగదు రూపంలో కాకుండా బంగారు ఆభరణాల రూపంలో కావాలని కోరింది. అప్పటికే ఏసీబీకి సమాచారం ఇచ్చిన రక్తనిధి నిర్వాహకురాలు లక్ష్మీరెడ్డి ఏసీబీ ప్రణాళిక ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ను గురువారం సాయంత్రం అబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణానికి రప్పించింది. రూ.1.10 వేల విలువ చేసే బంగారు గొలుసు ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. అయితే లక్ష్మీరెడ్డి ప్రస్తుతం తనవద్ద ఇంత డబ్బుల్లేవని, ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి, డ్రగ్ ఇన్స్పెక్టర్ను పంపివేసింది. పట్టుబడిన ఆభరణాలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి ఆ తర్వాత ఆ గొలుసుకు డబ్బులు చెల్లించి, షాపు నుంచి బిల్లు తీసుకుంది. డీఐకి బంగారు గొలుసును ఇచ్చేందుకు లక్ష్మీరెడ్డి శుక్రవారం రాత్రి మధురానగర్ సూర్య అపార్ట్ మెంట్‌కు వెళ్లింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మికి బంగారు గొలుసును అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమె నుంచి పలు నగలను కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ తతంగమంతా అధికారులు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తనిఖీల పేరుతో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వేంటనే 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. -
రక్తనిధి నిల్!.. గర్భిణుల అవస్థలు
సాక్షి, పాలమూరు: ప్రమాదం జరిగిన క్షతగాత్రుడికి రక్తం అవసరమైతే రక్తనిధి కేంద్రం వైపు పరుగులు తీస్తాం. రక్తహీనత ఉన్న గర్భిణి ప్రసవానికి ఆస్పత్రిలో చేరితే రక్తం ఎక్కిస్తాం. ఇక తలసేమియా, సర్జరీలు, డయాలసిస్ బాధిత రోగులకు రక్తం తప్పనిసరి. అత్యవసర సమయంలో బయట నుంచి రక్తం తెప్పించి ఎక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా జనరల్ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో సరిపడా నిల్వలు లేని ప్రమాదకర స్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ వల్ల ప్రతి ఒక్క రూ ఎన్నికల బిజీలో ఉండటంతో రక్తదాన శిబిరా లు పెట్టకపోవడంతో పాటు స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అత్యవసరంగా రక్తం కావాల్సిన అభాగ్యులకు ర క్తం అందించలేని దయనీయ స్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు ఇటీవల తిమ్మసానిపల్లికి చెందిన లక్ష్మీ ప్రసవానికి జనరల్ ఆస్పత్రికి వస్తే.. బ్లడ్ బ్యాంకులో రక్తం లేదని వైద్యులు ఆమెను ప్రసవానికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇలా నిత్యం ఒకటి, రెండు కేసులు రక్తం నిల్వలు లేకపోవ డం వల్ల రెఫర్ చే యడం బాధకరం. లెబర్ రూంలో ఉద యం 9గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటలకు రెగ్యులర్ సీనియర్ వైద్యులు ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది రావడం లేదు. కానీ మ ధ్యాహ్నం తర్వాత ప్రసవానికి వచ్చిన గర్భిణులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాత్రివేళ అసలు వై ద్యులే లేరని సాకు చూపించి జూనియర్ వైద్యులు కేసులను అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. దీనికితోడు రక్త నిల్వలు లేకపోవడం వల్ల రెఫర్ కేసులు పెరుగుతున్నాయి. బ్లడ్ బ్యాంకులో నిల్వ లేకనే.. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనిక్ విభాగంలో నిత్యం 40కి పైగా అడ్మిషన్లు అవుతుండగా, 27వరకు ప్రసవాలు అవుతున్నాయి. దీంట్లో 17నార్మల్ ఉంటే, 10వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. నిత్యం 7నుంచి 10మంది గర్భిణులు రక్తహీనత సమస్యతో ప్రసవానికి వస్తున్నారు. కొందరిని రక్తం లేదని ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారు. దీంతో పాటు పలు రకాలుగా రోడ్డు ప్రమాదాలలో గాయపడుతూ ఆస్పత్రికి వస్తున్న వారు 20నుంచి 40మంది క్షతగాత్రులు ఉంటారు. వీరిలో దాదాపు 10మంది వరకు రక్తం అవసరం పడుతుంది. కానీ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో కావాల్సిన నిల్వలు లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులే బయటి బ్లడ్ బ్యాంకుల్లో నగదు చెల్లించి రక్తం తీసుకొస్తున్నారు. శిబిరాల నిర్వహణ లేదు ఎన్నికల నేపథ్యంలో అధిక సంఖ్యలో శిబిరాల నిర్వహణ లేదు. కేవలం బ్లడ్ బ్యాంకు వారు నిర్వహించే శిబిరాలతో నడిపిస్తున్నాం. రోగుల వెంబడి వచ్చే కుటుంబ సభ్యులు రక్తం ఇస్తే బాగుంటుంది. కానీ వారు భయపడి రక్తం ఇవ్వడం లేదు. త్వరలో మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. బయటి నుంచి కూడా అధికంగా జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకుకు రక్త నిల్వలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నకిలీ బ్లడ్ బ్యాంక్ రాకెట్: ఐదుగురు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయివేటు బ్లడ్ బ్యాంక్ యజమానులు చేస్తున్న కల్తీ రక్తం విక్రయాల రాకెట్‌ను ఛేదించారు. రాష్ట్రంలోని పలు బ్లడ్ బ్యాంకులు కల్తీ చేసిన రక్తాన్ని అంటగట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో రెండు ప్రయివేటు బ్లడ్ బ్యాంకుల్లో నిఖీలు చేపట్టిన అధికారులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మారువేషంలో అనేక ఆస్పత్రులు రక్త బ్యాంకులకు వెళ్లిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ రాకెట్‌ను ఛేదించింది. పరిశీలన కోసం కొన్ని కీలక పత్రాలు, లెడ్జర్ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. రిక్షా డ్రైవర్లు, ఇతర రోజువారీ కూలీలకు వెయ్యి, రెండువేల రూపాయలు చెల్లించి రక్తం తీసుకుంటారు. దీనికి కెమికల్, నీళ్లు కలిపి కల్తీ రక్తాన్ని యధేచ్చగా తయారు చేస్తారు. ఇలా ఒక ప్యాకెట్‌కు రెండు ప్యాకెట్ల చొప్పున తయారు చేసి విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రషీద్‌అలీ, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, మహమ్మద్ నసీమ్, పంజక్ కుమార్, రజనీష్‌నిగం లను అరెస్ట్ చేశామని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. గత ఆరునెలలుగా ఈ దందా నడుస్తున్నట్టు గుర్తించామన్నారు. గత ఆరు నెలల కాలంలో దాదాపు వెయ్యి యూనిట్ల నకిలీ, కల్తీ రక్తం మార్కెట్లోకి తరలిపోయిందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ రక్తాన్ని విక్రయించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేకాదు ఇందులో కొంత మంది డాక్టర్లు, నర్సులుకు కూడా భాగస్వామం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇతర బ్లడ్‌బ్యాంకుల వ్యవహరాన్ని కూడా పరిశీలి స్తున్నట్టు చెప్పారు. -
ప్రాణం నిలిపేదెలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రక్తం కొరత వేధిస్తోంది. ఆపత్సమయంలో అవసరమైన రక్తం లభించక రోగులు, వారి బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తం నిల్వలు క్రమంగా తగ్గిపోతుండడంతో బ్లడ్ బ్యాంకులు సైతం చేతులెత్తేశాయి. ప్రధానంగా ప్రమాద బాధితులు, గర్భిణిలు సమయానికి అవసరమైన రక్తం లభించక విలవిలలాడుతున్నారు. మీ బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి రక్తమిస్తే తప్ప తామేమి చేయలేమంటూ డాక్టర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఉంది. ఏటా రాష్ట్రంలో 8 లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులో 4.80 లక్షల మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీళ్లు ప్రసవానికి వచ్చినప్పుడు రక్తం ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్రంలో ఏడాదికి 5 లక్షల యూనిట్లు అవసరమైతే 3.7 లక్షల యూనిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. వేసవిలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. మిగతా రోజుల్లో కళాశాలల విద్యార్థులు తరచూ రక్తదాన శిబిరాల్లో రక్తం ఇస్తుంటారు. అయితే సెలవులు కావడం, శిబిరాల నిర్వహణ తగ్గిపోవడంతో రక్తం నిల్వలు మరింతగా అడుగంటి పోతున్నాయి. ప్రమాద బాధితుల ఆవేదన వర్ణనాతీతం ప్రమాదాల సంఖ్యలో దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెలకు సగటున 30 వేలకు పైగా ప్రమాదాలు జరుగుతుండగా ఏడాదికి సగటున 9 వేల మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. సమయానికి రక్తం లభ్యమయితే ఇందులో కొంతమందినైనా కాపాడవచ్చు. ఇక రక్తహీనత జబ్బుతో బాధపడుతున్న గర్భిణులు ప్రసవానికి వస్తే విధిగా రక్తం ఉండాలి. ఒక్కో మహిళకు అవసరాన్ని బట్టి 2 నుంచి 3 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. హెచ్ఐవీ బాధితులు, తలసేమియా బాధితులు హెచ్ఐవీ బాధితులు ఏకంగా రక్తం కొరతతో మృతి చెందుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో రక్తం దొరకక ఇద్దరు హెచ్ఐవీ పేషెంట్లు మృతి చెందారు. సాధారణంగా హెచ్ఐవీ బాధితులు జడ్ఎల్ఎన్ (జుడోవిడిన్ లామిడివిడిన్ నెవరపిన్) మందులు వాడతారు. వీటి ప్రభావంతో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. ఎంతగా అంటే రక్తం శాతం 4కు పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో విధిగా రక్తం ఎక్కించాలి. కానీ వీరికి రక్తం దొరకడం లేదు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన తలసేమియా బాధితుల పరిస్థితి నరకంగా ఉంటోంది. ఆయా బాధితుల తల్లిదండ్రులు పల్లెల్లో రక్త దాతలను బ్రతిమలాడుకోవాల్సి వస్తోంది. రక్తం ఎవరు ఇవ్వచ్చు - రక్తం ఇవ్వడానికి 21– 60 మధ్య వయస్సు వారు ఎవరైనా ఇవ్వవచ్చు - ఆరోగ్యవంతులై ఉండాలి... హెచ్ఐవీ, బీపీ, మధుమేహ వ్యాధి గ్రస్థులై ఉండకూడదు - ఒక్కసారి 300 మిల్లీలీటర్ల (యూనిట్) రక్తాన్ని సేకరించవచ్చు - మళ్లీ మూడు నెలల తర్వాతే రక్తం ఇవ్వాలి - ఒకసారి రక్తం తీసిన తర్వాత 15 రోజుల్లోగా ఆ రక్తాన్ని వాడుకోవాలి పరీక్షించే అవకాశమూ లేదు రక్తం తీసుకోవాలంటే దాతలను పరీక్షించాల్సి ఉంటుంది. హెచ్ఐవీ ఉందని రక్త దాతలకు తెలియదు. రక్తం తీసుకుంటున్నప్పుడు చెక్ చేసినా అందులో తేలదు. దీన్నే రోగికి విండో పీరియడ్ అంటారు. అంటే 15 రోజుల నుంచి 3 నెలల లోగా ఎప్పుడైనా హెచ్ఐవీ బయటపడచ్చు. దీంతో ఆ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించడం వారికి హెచ్ఐవీ రావడం ఇటీవల పలు చోట్ల జరిగింది. దీనికి సంబంధించి సరిగ్గా పరీక్షలు నిర్వహించాలంటే మెషీన్ ఖరీదు రూ.48 లక్షలు అవుతుంది. కానీ ఈ మెషీన్లు ఎక్కడా లేవు. -
బ్లడ్ బ్యాంకుకు మహర్దశ
జనగామ: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లోని రక్తనిధి కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఖమ్మంతో పాటు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పైలట్ ప్రాజెక్టు కింద నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్)కు ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల నిర్వహణ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లి పోయింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఏబీహెచ్‌కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం జనగామ ఏరియా ఆస్పత్రిలో 1000 యూనిట్లు సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రం పనిచేస్తోంది. ఎన్‌ఏబీహెచ్‌కు పూర్తి అర్హత సాధించేందుకు ఇక్కడి రక్తనిధి కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది కృషి చేస్తున్నారు. అర్హత సాధించాలంటే.. ఆదర్శవంతమైన రక్తనిధి కేంద్రంగా ఏరియా ఆస్పత్రి గుర్తింపు పొందాలంటే కేంద్రం ప్రభుత్వం విధించిన గైడ్‌లైన్స్ తప్పనిసరి. 24 గంటలపాటు ఎయిర్ కండీషన్, యంత్రాల పనితీరు, మెడికల్ ఆఫీసర్, ఐదుగురు టెక్నీషియన్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక కౌన్సిలర్, రెండు కంప్యూటర్లు, రెండు టెలివిజన్లు, ప్రింటర్లు, ఒక అంబులెన్స్ ఉండాలి. ఇందులో ఒకస్టాఫ్ నర్సు కొరత ఉండగా, కంప్యూటర్లు, టెలివిజన్లు, అంబులెన్స్ అసలు లేవు. ఎన్‌ఏబీహెచ్‌కు పోటీ పడాలంటే రక్తనిధి కేంద్రంలో స్టాండర్డు క్వాలిటీ ఉండాలి. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో వసతి సౌకర్యాలను జిల్లా, రాష్ట్ర స్థాయి టీంలు పరిశీలిస్తాయి. అనంతరం కేంద్ర బృందం పరిశీలించిన తర్వాతనే అర్హత సర్టిఫికెట్‌ను అందజేస్తారు. రాష్ట్ర బృందం పరిశీలన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని ఇటీవల స్టేట్ క్వాలిటీ ఆఫీసర్ నిరంజన్ పరిశీలించారు. రక్తనిధి నిల్వల సామర్థ్యం, రికార్డులు, పని తీరుపై మెడికల ఆఫీసర్ రాంనర్సయ్య, పీఆర్వో రాము, రజిని, రాజేశ్వర్, వెంటస్వామిని అడిగి తెలుసుకున్నారు. -
రక్తాన్ని వదలట్లేదు
ఇది కూడా కల్తీయే ► పాలల్లో నీళ్లు కలిపినంత సులభంగా రక్తం కల్తీ... ► సెలైన్ వాటర్ కలిపి విక్రయం ► మామూళ్ల మత్తులో ఔషధ నియంత్రణ మండలి ► ఇబ్బడిముబ్బడిగా బ్లడ్ బ్యాంకుల మంజూరు ► ఒకే వ్యక్తికి ఐదారు రక్తనిధి కేంద్రాల కేటాయింపు ► రక్తదాన శిబిరాలు నిర్వహించకుండానే.. భారీ నిల్వలు ► ‘ఉచిత’ శిబిరాల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు నిఘా లేక అడ్డగోలు దందాలు గ్రేటర్లో రక్తనిధి కేంద్రాలు: 60కి పైగా ∙దందా జరుగుతున్నది: ముగ్గురి చేతుల్లో... రోజుకు సగటున అవసరమైన రక్తం: 1000 యూనిట్లు ∙ప్రస్తుతం లభిస్తున్నది: 300 యూనిట్లు కల్తీ ఇలా: 60 శాతం రక్తంలో 40 శాతం సెలైన్ వాటర్ ∙ఒక్కో బాటిల్‌పై కమీషన్: 300400 రూపాయలు నిబంధనల ప్రకారం ఒక్కో బాటిల్ ధర: రూ.1450 ∙కార్పొరేటర్ ఆస్పత్రులు చార్జి చేస్తున్నది: రూ.3000 సిటీలో ఉప్పు, పప్పు, పాలు, నీళ్లే కాదు...చివరకు రోగులకు పునర్జన్మను ప్రసాదించే రక్తం కూడా కల్తీ అవుతోంది. ధనాశతో కొందరు పాలల్లో నీళ్లు కలిపినంత సులభంగా రక్తంలో సెలైన్ వాటర్ కలిపి అమ్మేస్తున్నారు. రోగికి రెండు యూనిట్ల రక్తం ఇస్తే..అందులో ఒక యూనిట్ ఖచ్చితంగా కల్తీ (హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది) రక్తం బాటిలే ఉంటుంది. ఎప్పటికప్పుడు రక్తనిధి కేంద్రాలపై దాడులు నిర్వహించి, రక్త సేకరణ, వాటి నిల్వలు, నాణ్యతను పరీక్షించాల్సిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. రక్తనిధి కేంద్రాల్లో నిల్వలపై ఆన్లైన్ నిఘా లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిటీబ్యూరో: కల్తీ రక్తం కారణంగా..అది ఎక్కించుకున్న రోగి కోలుకోక పోగా..ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతున్నాడు. వాస్తవంగా దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభిజిస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ చేసి ఆర్డీపీ, పీఆర్పీ, ఎస్ఎస్పీ, హోల్‌బ్లడ్, రెడ్ సెల్స్‌గా విభజిస్తారు. కేన్సర్ బాధితులకు, డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికి వైట్‌సెల్స్(ఆర్డీపీ, పీఆర్పీ) ఎక్కిస్తారు. ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి ఎస్ఎస్పీ సెల్స్, ప్రసవసమయంలో తీవ్ర రక్తస్త్రావంతో బాధపడుతున్న బాలింతలు, క్షతగాత్రులు, బైపాస్ సర్జరీ బాధితులు, ఇతర సర్జరీల బాధితులకు హోల్ బ్లడ్ ఎక్కిస్తారు. రక్తహీనతతో బాధపడే వారికి రెడ్‌బ్లడ్ సెల్స్‌ను ఎక్కిస్తారు. రక్తంలో ఎలాంటి పదార్థాలు కలుప కూడదు. కానీ నగరంలో రోజుకు సగటున 1000 యూనిట్ల అవసరం కాగా, 300 యూనిట్లకు మించి లభించడం లేదు. రోగుల నిష్పత్తికి తగినంత రక్తం లేక పోవడంతో బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్యాకెట్లోని కొంత రక్తాన్ని సిరెంజ్ ద్వారా తీసి మరో ఖాళీ బ్యాగ్‌లో నింపుతున్నారు. రక్తంలో నార్మల్ సెలైన్ కలిపి పరిమాణంలో తేడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. యూనిట్ రక్తంలో 60 శాతం రక్తం ఉంటే..40 శాతం సెలైన్ కలుపుతున్నారు. కల్తీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం వల్ల అది ఎక్కించిన రోగి త్వరగా కోలుకోకపోగా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురువుతున్నారు. ఇటీవల సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలు మృతి చెందడానికి, బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఓ యువతి చేయి, కాలును కోల్పోవడానికి ఈ కల్తీ రక్తమే ప్రధాన కారణం. నిబంధనల ప్రకారం రక్తాన్ని రోగికి ఎక్కించే ముందు పరీక్షించాల్సి ఉంది. కానీ నగరంలో ఒకటి రెండు ఆస్పత్రులు మినహా ఎక్కడా పరీక్షలు జరపడం లేదు. ఒక్కొక్కరి చేతిలో ఐదారు కేంద్రాలు... ఔషధ నియంత్రణ మండలి అవినీతికి అడ్డాగా మారింది. అడిగినంత ఇస్తే చాలు ఒక్కో వ్యక్తికి ఐదారు రక్తనిధి కేంద్రాలు మంజూరు చేస్తుంది. కిలోమీటర్ పరిధి లోనే ఐదారు బ్లడ్ బ్యాంకులకు అనుమతి ఇస్తుండటమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక బ్లడ్ బ్యాంక్ నిర్వహించడమే కష్టం. కానీ నగరంలోని కొంత మంది సామాజికసేవ ముసుగులో రక్తంతో వ్యాపారం చేస్తున్నారు. దాతలు ఇచ్చిన రక్తం భారీగా లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఒక్కరే ఐదారు బ్లడ్ బ్యాంకులను చేజిక్కించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 60కిపైగా రక్తనిధి కేంద్రాలు ఉండగా, వీటిలో సింహభాగం ముగ్గురు వ్యాపారుల చేతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ట్రస్టుల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి...దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంక్‌లకు తరలిస్తున్నారు. రోగులను తమ రక్తనిధి కేంద్రాలకు పంపిన ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్హోమ్స్లోని వైద్యులకు ఒక్కో బాటిల్‌పై రూ.200 నుంచి రూ.400 వరకు కమీషన్ ఇస్తుండటం విశేషం. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల తీరు మరో విధంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్న బాధితునికి అవసరమైన గ్రూప్ రక్తం కావాలంటే...రోగి బంధువుల్లో ఎవరో ఒకరు వచ్చి తమ రక్తాన్ని ఆస్పత్రికి దానం చేయాల్సిందే. దానం చేసిన రక్తాన్ని ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం ఒక్కో యూనిట్ రక్తం ధర రూ.1450 కాగా...కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం రూ.మూడు వేలకు పైగా ఛార్జీ చేస్తుండటం కొసమెరుపు. రక్తం కల్తీతో ప్రాణాలకు ముప్పు ఒక హోల్ బ్లడ్ ప్యాకెట్ 300 ఎంల్ నుంచి 350 ఎంఎల్ (సీపీడీఏ సొల్యూషన్) వరకు ఉంటుంది. రక్తంలో 45 శాతం ఎర్రరక్త కణాలు, 55 శాతం ప్లాస్మా(నీరులాంటి ద్రవ పదార్థం) ఉండాలి. అంతేకాదు 12.5 శాతానికి పైగా హీమోగ్లోబిన్ ఉండాలి. కానీ నగరంలోని కొన్ని బ్లడ్‌బ్యాంక్‌లు యూనిట్లో 60 శాతం రక్తాన్ని..40 శాతం సెలైన్ వాటర్‌తో నింపి అమ్ముతున్నాయి. రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటంతో రెండు మూడు రోజుల్లో కోలుకోవాల్సిన వారు వారం దాటినా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. అంతే కాదు కల్తీ రక్తం ఎక్కించడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. రక్తనిధి కేంద్రంలోని కొంత మంది చేస్తున్న ఈ తప్పుడు పనుల వల్ల నిజాయితీతో పనిచేస్తున్న వైద్యులు బదనాం అవుతున్నారు. – డాక్టర్ గోవర్దన్, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి -
బ్లడ్ బ్లాంక్!
► సాయంత్రం 4 దాటితే రోగులకు కష్టాలు నెల్లూరు(అర్బన్): సాయంత్రం 4 గంటలు దాటిందా.. ఇక నెల్లూరు పెద్దాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో భూతద్దం పెట్టి వెతికినా డాక్టర్ కనిపించరు. నిబంధనల ప్రకారం ఒక డాక్టర్, ఒక టెక్నీషియన్, నర్సింగ్ సిబ్బంది తప్పనిపరిగా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. దీంతో పొరపాటున ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే దానికి బాధ్యులెవరన్నది ప్రశ్నగా మిగులుతోంది. పైగా రోగులకు రక్తం అవసరమైతే రీప్లేస్ ఇస్తేనే రక్తం ఇస్తామని డాక్టర్లు రోగి బంధువులను పీడిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. నిబంధనలు ఏమంటున్నాయంటే..: రక్తం ఇవ్వాలంటే రోగి రక్తాన్ని, దాత రక్తంతో క్రాస్ మ్యాచింగ్, హెచ్ఐవీ, మలేరియా, కామెర్లు, హెపటైటిస్ బి లాంటి పరీక్షలన్నీ టెక్నీషియన్ మాత్రమే చేయాలి. బ్లడ్‌బ్యాంక్‌కు ఇన్‌చార్జ్‌లుగా ప్రతి రెండు నెలలకు ఇద్దరు డాక్టర్లను నియమిస్తున్నారు. కొంత మంది డాక్టర్లు నిజాయితీగా పనిచేస్తే కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తూ బ్లడ్‌బ్యాంక్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నారు. గతంలో బలిపశువైన నర్సు: గతంలో దాతలిచ్చిన రక్తాన్ని బయట అమ్ముకోవడంలో నర్సును బలిపశువును చేశారు. ఇప్పుడు కూడా జరగరానిదేమైనా జరిగితే బలయ్యేది మొదట నర్సే. అసలు నిబంధనల ప్రకారం డాక్టర్, టెక్నీషియన్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. పీడిస్తున్న డాక్టర్లు: గతంలో బ్లడ్ బ్యాంకు ఇన్చార్జిగా డాక్టర్ కృష్ణమూర్తి ఉన్నప్పుడు రక్తం యూనిట్లు సమృద్ధిగా ఉండేవి. నేడు అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. క్యాంపులు సరిగా నిర్వహించడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే నిరుపేద రోగి బంధువులనే రక్తం రీప్లేస్ ఇవ్వాలని పీడిస్తున్నారు. కలెక్టర్ ఇటీవల బ్లడ్ బ్యాంక్‌ను తనిఖీ చేసి నిల్వలు అధికంగా ఉండాలని ఆదేశించడంతో రోగుల బంధువులనే పీడిస్తున్నారు. ప్రస్తుతం 74 రక్తం యూనిట్లు నిల్వ ఉన్నాయి. అయినా రోగులకు సక్రమంగా ఇవ్వడం లేదు. రెండు ఉదాహరణలు..: ఇటీవల నెల్లూరు గాంధీనగర్‌కి చెందిన నిరుపేద గిరిజనుడు సుబ్రహ్మణ్యం తనతో పాటు మరో బంధువుని తీసుకెళ్లి రెండు ప్యాకెట్లు రక్తం రీప్లేస్మెంట్ ఇస్తేగాని రక్తం ఇవ్వలేదు. ప్రస్తుతం మహిళా సర్జికల్ వార్డులో అడ్మిట్ అయిన ఆరో నంబర్ బెడ్ బంధువులు రెండు ప్యాకెట్లు రక్తం రీప్లేస్ ఇచ్చి తరువాత బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తెచ్చుకున్నారు. అయినా ఆమెకు రక్తం సరిపడా లేదనే నెపంతో పది రోజులుగా ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఏం జరుగుతోందంటే..: సాయంత్రం 4 గంటల తర్వాత బ్లడ్‌బ్యాంకులో డాక్టర్ ఉండటం లేదు. మూడు నెలల క్రితం వరకు రాత్రి పూట కూడా టెక్నీషియన్ ఉండేవారు కాదు. దీంతో చాలా రోజుల పాటు ఆందోళన గురైన నర్సులు పోరాడి ఇటీవల రాత్రి పూట పని చేసేందుకు ఒక టెక్నీషియన్‌ను నియమించుకున్నారు. ఆ వ్యక్తే ప్రతి రోజూ రాత్రి డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో నైట్ డ్యూటీ చేసే టెక్నీషియన్ సెలవులు పెట్టినా, ఆఫ్ తీసుకున్నా మళ్లీ నర్సులే టెక్నీషియన్‌గా మారుతున్నారు. నర్సులు.. డోనార్ కేర్, ఫారమ్ నింపడం, వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడం, రక్తం ఇచ్చిన దాతలకి కళ్లు, తల తిరిగినట్టు అనిపిస్తే సేవలు చేయాలి. నర్సులు తమ పనులతో పాటు టెక్నీషియన్ పనులు చేయాల్సి రావడంతో ఏదైనా జరిగితే తామెందుకు బాధ్యత వహించాలని ప్రశ్నిస్తున్నారు. -
రక్తనిధికి 30 శాతం రక్తం ఇవ్వాల్సిందే!
–ఏపీ శ్యాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి కర్నూలు(హాస్పిటల్): ప్రై వేటు రక్తనిధులు క్యాంపుల ద్వారా సేకరించే రక్తంలో 30శాతం రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ శ్యాక్స్(ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిని పరిశీలించారు. రక్తనిధిలోని రక్త ప్యాకెట్ నిల్వలను పరిశీలించారు. రక్తం సేకరించిన తేది, ఎక్స్పైరీ తేదీలను చూశారు. ఇందులో రెండు ప్యాకెట్లు కాలం తీరిపోయి ఉండటాన్ని ఆమె గమనించి సిబ్బందిని మందలించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు అవసరం మేరకే నిర్వహించాలని, అవసరం లేకుండా చేసి ఇలా రక్తాన్ని వృథా చేయవద్దని సూచించారు. రక్తదాతకు పరీక్ష చేసేటప్పుడు హెచ్ఐవీ పాజిటివ్ వస్తే ఐసీటీసీలో లింక్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రిలోని హెచ్‌వోడీలతో సమావేశమై వారి రక్తం అవసరాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకుంటే డిమాండ్ ఎంత ఉందో తెలుస్తుందన్నారు. రెడ్‌క్రాస్ రక్తనిధి నుంచి 30 శాతం రక్తం ఇవ్వడం లేదని అక్కడున్న వైద్యులు జేడీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె వెంటనే రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తాము ఇప్పటికే నెలకు 100 మందికి పైగా తలసీమియా రోగులకు రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నామని, అందుకే 30 శాతం రక్తాన్ని ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చారు. తలసీమియా రోగులకు ఇచ్చినా నిబంధనల ప్రకారం ప్రభుత్వ రక్తనిధికి 30 శాతం రక్తాన్ని ఇచ్చి తీరాల్సిందేనని ఆమె ఆదేశించారు. అన్ని ప్రైవేటు రక్తనిధులు ఈ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రూపశ్రీకి సూచించారు. అనంతరం ఆమె ఐసీటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వారానికి ఒకసారి ఏఆర్టీ సెంటర్‌కు రాని హెచ్ఐవీ బాధితుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడం లేదని గుర్తించి మందలించారు. ఆమె వెంట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డివిజనల్ అసిస్టెంట్ పీటర్ పాల్, జిల్లా మేనేజర్ అలీ హైదర్, బ్లడ్‌బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవతి, ఐసీటీసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఐదేళ్లుగా మూత.. జీతాల మోత!
రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల నిర్వాకం మూతపడినా రూ.20 లక్షల జీతాలు చెల్లింపు సాక్షి, గుంటూరు : ఐదేళ్లుగా తలుపులు తెరిచిన దాఖలాలు లేవు.. అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం నెలనెలా జీతాలు చెల్లిస్తూనే ఉన్నారు.. ఇదీ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల నిర్వాకం. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ను 2005లో గుంటూరు జిల్లాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందులో నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. 2011 వరకు బ్లడ్‌బ్యాంకును సమర్థవంతంగా నిర్వహించారు. ఎందరో నిరుపేద రోగులకు అతి తక్కువ ధరల్లో వివిధ గ్రూపుల రక్తాన్ని అందించే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్ ఐదేళ్లుగా మూతపడటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చే పేదలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పేద రోగులకు ప్రాణదానం.. రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు గతంలో రోజుకు 35 నుంచి 40 మంది రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఎందరికో ప్రాణదానం చేసింది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల కంటే సుమారు రూ.400 తక్కువ ధరకు రక్తాన్ని అందించి నిరుపేద రోగులకు ఊరట కలిగించింది. ప్రస్తుతం ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో బ్లడ్ యూనిట్ ధర రూ.1300 ఉంది. అదే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో యూనిట్ రూ.800 నుంచి రూ.1000 లోపు ధరకే అందించేవారు. బ్లడ్ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి అనేక మంది తమ రక్తాన్ని ఇక్కడే ఇచ్చేవారు. బ్లడ్‌బ్యాంకులో బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్ పెట్టి ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన కమిటీలోని కొందరు సభ్యులు అందుకు సుమారు రూ.20 లక్షల నిధులు అవసరమవుతాయని గుర్తించారు. దీనితో పాటు బ్లడ్‌బ్యాంకు ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఐదేళ్లుగా మూతబడిన ఈ బ్లడ్‌బ్యాంకును నేటికీ తెరవలేదు. ప్రైవేటు నిర్వాహకుల దోపిడీ... రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు మూతబడటంతో ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పేదలను దోపిడీ చేస్తున్నారు. విషజ్వరాల బారిన పడినవారు ప్లేట్లెట్లు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరిన సమయంలో వారిని సాధారణ స్థితికి తేవడం కోసం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ రక్తం నుంచి వేరు చేసేందుకు ప్రత్యేక వైద్య పరికరం అవసరం. ప్లేట్లెట్ల కోసం అధిక మొత్తంలో ప్రైవేట్ బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు రోగుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఐదేళ్లలో రూ.20 లక్షల జీతాల చెల్లింపు.. బ్లడ్‌బ్యాంకు మూతపడి ఐదేళ్లవుతున్నా అందులో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున, టెక్నీషియన్లు ముగ్గురికి రూ.6 వేలు చొప్పున, సబ్ స్టాఫ్‌కు రూ.15 వేలు చొప్పున జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. వీరు బయట వేరే సంస్థల్లో పనిచేస్తున్నా నెలనెలా జీతాలు అందుతూనే ఉన్నాయి. ఈ విధంగా రూ.20 లక్షల వరకు జీతాల కింద చెల్లించారు. బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్ ఏర్పాటు చేయాలంటే రూ.20 లక్షలు నిధులు భారంగా మారిందని మూసివేసిన నిర్వాహకులు.. పనిచేయకుండానే ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.20 లక్షల వరకు చెల్లించటం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది సమావేశం నిర్వహించిన కొందరు నిర్వాహకులు రెండు నెలల్లో బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపడతామంటూ తీర్మానించారు. ఈ సమావేశం జరిగి ఏడాది దాటుతున్నా ఇంతవరకు బ్లడ్‌బ్యాంక్ తెరుచుకోలేదు. ఇప్పటికైనా దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు రాగానే తెరుస్తాం.. రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మూడు నెలల క్రితం బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి తనిఖీలు చేశారు. అనంతరం నివేదికను ఢిల్లీకి పంపారు. ఢిల్లీ నుంచి అనుమతులు రాగానే బ్లడ్‌బ్యాంక్‌ను తెరుస్తాం. సిబ్బందికి జీతాల చెల్లింపు నిజమే. మళ్లీ బ్లడ్‌బ్యాంకు తెరిచినప్పుడు సిబ్బంది అవసరం కాబట్టి చెల్లిస్తున్నాం. – జీవైఎన్ బాబు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ -
రక్తంలోనూ కల్తీ!
రక్తంలో ‘సెలైన్’ కలుపుతూ నకిలీ ప్యాకెట్ల తయారీ హైదరాబాద్: నిత్యావసరాలే కాదు నిత్యం మన శరీరంలో ప్రవహిస్తూ ప్రాణాన్ని నిలబెట్టే రక్తాన్నీ కల్తీ చేస్తున్నారు.. పాలలో నీళ్లు కలిపినట్లుగా బ్లడ్ బ్యాంకుల నుంచి సేకరించిన రక్తంలో సగం గ్లూకోజ్ (సెలైన్) కలుపుతున్నారు.. ఈ కల్తీ చేసి రక్తాన్ని వేరే ప్యాకెట్లలో నింపి రోగులకు అమ్ముకుంటున్నారు.. అంతా పక్కాగా కనిపించేందుకు ఆ రక్తం ప్యాకెట్లకు బ్లడ్‌బ్యాంకుల నకిలీ స్టిక్కర్లు అతికిస్తున్నారు.. నకిలీ రసీదులూ సృష్టిస్తున్నారు.. మొత్తంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం. ఏడాది నుంచి.. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో సరూర్‌నగర్‌కు చెందిన నరేందర్ (ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వమే ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందజేస్తుంది. రక్తం అందుబాటులో లేనప్పుడు రోగుల నుంచి డబ్బులు వసూలు చేసి.. బయట ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం ప్యాకెట్లను కొనుగోలు చేస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకున్న నరేందర్... దాతల నుంచి బ్లడ్‌బ్యాంకుకు వచ్చే రక్తంలో గ్లూకోజ్ (సెలైన్) కలిపి, నకిలీ రక్తం ప్యాకెట్లను తయారు చేస్తున్నాడు. ఇతరబ్లడ్ బ్యాంకుల పేరుతో నకిలీ స్టిక్కర్లు తయారు చేయించి వాటికి అతికిస్తున్నాడు. రోగుల అవసరాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు అమ్ముకుంటున్నాడు. దాదాపు ఏడాదిగా ఈ వ్యవహారం సాగుతోంది. మరొకరికి బాధ్యతలు అప్పగించడంతో.. నరేందర్ ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవు పెట్టాడు. దీంతో అధికారులు ఆ స్థానంలో మరో ల్యాబ్ టెక్నీషియన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ రక్తనిధిలో నిల్వ చేసిన రక్తం తేడాగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలంగాణ వలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మారెడ్డి తన బృందంతో కలసి సరూర్‌నగర్‌లోని నరేందర్ ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో నరేందర్ పారిపోయాడు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారమివ్వగా... వారు గురువారం నరేందర్ ఇంటితో పాటు బ్లడ్‌బ్యాంక్‌లో తనిఖీ చేసి 29 నకిలీ రక్తం ప్యాకెట్లు, నకిలీ స్టిక్కర్లు, రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే సాధారణంగా రక్తం ప్యాకెట్లో 250 మిల్లీలీటర్ల రక్తం ఉండాలి, కానీ ఈ ప్యాకెట్లలో 150 మిల్లీలీటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నకిలీ రక్తాన్ని రోగులకు ఎక్కిస్తే.. గుండె ఫెయిలయ్యే అవకాశం ఉంటుందని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో రోగి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిలోఫర్ ఆస్పత్రి ముందు దళారులు నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం ముందు రక్తం దళారులు తిష్టవేశారు. రోగుల బంధువులెవరైనా ఆస్పత్రి లోనుంచి చీటీ తీసుకుని బయటికి రావడమే ఆలస్యం వారిని చుట్టుముడతారు. ‘రక్తం కావాలా, బ్లడ్ బ్యాంకుకు తీసుకెళతాం..’ అని వెంటపడతారు. వారిని కమీషన్లు ఇచ్చే బ్లడ్ బ్యాంకులకు తీసుకెళతారు. అక్కడ రోగుల బంధువులకు నకిలీ రక్తం ప్యాకెట్లను ఇవ్వడం, అడ్డగోలుగా డబ్బు వసూలు చేయడం చేస్తుంటారు. ఈ ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం.. ‘‘రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ రక్తం అందిస్తున్న వారిపై, ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగి నరేందర్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాం..’’ - రత్నకుమారి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
బాబోయ్.. డెంగీ!
నివారణ చర్యలు శూన్యం ఆస్పత్రికెళితే జేబుకు చిల్లే బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం విజయవాడ : మహాత్మాగాంధీ రోడ్డులోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన నారాయణమ్మకు జ్వరం వచ్చింది. తొలుత స్థానికంగా ఉన్న ఒక వైద్యునికి చూపించగా, వైరల్ జ్వరమని మందులిచ్చారు. రెండు రోజులకు పరిస్థితి విషమించగా ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నిర్ధారణ పరీక్షలు చేసి డెంగీగా గుర్తించారు. అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేక పోయారు. గత నెల మూడున మృతిచెందింది. ఇదే కాలనీలో పది మంది వరకు డెంగీ బారిన పడ్డారు. శ్రీనగర్ కాలనీకి చెందిన చావా అనిల్‌కుమార్ (23) ఈ నెల 6న డెంగీతో మృత్యువాత పడ్డాడు. అతని కుటుంబం వీధిన పడింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందటంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. మురుగు, దుర్గంధంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని బీఎస్ఎన్ఎల్ అధికారులు, నగర పాలక సంస్థ వారిని వేడుకున్నా స్పందించకపోవడంతో నగరంలోని మధురానగర్, సింగ్‌నగర్, రామవరప్పాడు ప్రాంతాల్లో నిండు ప్రాణాలు బలయ్యాయి. డెంగీ మరింత వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో వెయ్యి వరకు కేసులు జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా డెంగీ బారిన పడ్డారు. డెంగీ అనుమానిత జ్వరంతో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో 983 మంది ప్రభుత్వాస్పత్రుల్లో చేరగా, వారికి ఎలీసా టెస్ట్ నిర్వహించి 160 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వారిలో 28 మంది విజయవాడకు చెందిన వారే కావటం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రిలో ఇంతకు మూడు రెట్ల మంది చికిత్స పొందారు. ఆ లెక్కన డెంగీ బాధితుల సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని చెపుతున్నారు. జిల్లాలో నాగాయలంక, చల్లపల్లి, తోట్లవల్లూరు. పెడన ప్రాంతాల నుంచి అత్యధికంగా డెంగీ బాధితులు నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు చెపుతున్నారు. ప్రభుత్వ చర్యలు శూన్యం జిల్లాలో డెంగీ జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. సమీక్షలు జరపడం మినహా క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు లేవనే చెప్పాలి. అందుకు చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, తోట్లవల్లూరు ప్రాంతాల్లో ఇంకా జ్వరం కేసులు నమోదవడమే నిదర్శనం. కనీసం డెంగీ నిర్ధారణ కిట్లు సైతం ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి శాంపిల్స్ తీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. ప్లేట్లెట్స్ దొరకని వైనం... జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్స్‌కు అనుమతులు లేకపోవడంతో ప్లేట్లెట్స్ కోసం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. డెంగీ జ్వరం తీవ్రత ఉన్న సమయంలో ప్లేట్లెట్స్ కౌంట్ 30 వేల కన్నా తగ్గితే కృత్రిమంగా ఎక్కించాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో బ్యాగ్‌కు బ్లడ్ బ్యాంకుల్లో రూ.1200 నుంచి 1500 వరకు డబ్బు గుంజుతున్నారు. సింగిల్ డోనర్ నుంచి ప్లేట్లెట్స్ వేరు చేస్తే రూ.12 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో రోగికి ఇద్దరి నుంచి ప్లేట్లెట్స్ ఎక్కిస్తే రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. పదివేల కన్నా ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి, రక్తస్రావం అయ్యే పరిస్థితులు తలెత్తినప్పుడు త్వరగా కోలుకునేందుకు సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను ఎక్కిస్తుంటారు. అనుమతి పొందిన బ్లడ్‌బ్యాంకుల వారు మాత్రమే ఈ పద్ధతిలో ప్లేట్లెట్స్ వేరు చేయాల్సి ఉంది. ఆస్పత్రికెళితే జేబుకు చిల్లే... జ్వరం వచ్చి ఆస్పత్రిలో చేరితే వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని వ్యాధుల కంటే ఇప్పుడు జ్వరమే ప్రమాదకరంగా మారింది. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసిన వారు ఉన్నారు. డెంగీగా నిర్ధారించినవారికి వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూ సౌకర్యం లేక పోవడంతో రోగులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. -
నాన్న మార్గంలోనే నడుస్తా: రామ్ చరణ్
-
నాన్న మార్గంలోనే నడుస్తా: రామ్ చరణ్
హైదరాబాద్: సేవా కార్యక్రమాల్లో నాన్న మెగా స్టార్ చిరంజీవి చూపిన మార్గంలోనే నడుస్తానని నటుడు రామ్ చరణ్ తేజ్ అన్నారు. బ్రూస్ లీ సినిమా సందేశాత్మకంగా ఉంటుందని, సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంధ విద్యార్థులతో కలిసి చూడనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో కేఎఫ్‌సీకి చెందిన 500 మంది ఉద్యోగులు గురువారం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాంచరణ్ మాట్లాడుతూ..ఒక సంస్థకి చెందిన ఉద్యోగులు ఇలా సేవాకార్యక్రమంలో వచ్చి పాల్గొనడం మంచి పరిణామమన్నారు. మీ ప్రొడక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకి బదులిస్తూ..ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ (గబ్బర్ సింగ్ 2) సినిమాతో పవన్ బిజీగా ఉన్నారని, ఆ చిత్రం పూర్తయిన తర్వాత చూద్దామన్నారు. -
24 గంటల సేవలు వట్టిమాటే
నెల్లూరు(అర్బన్) : జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 22 లక్షల వరకు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు 27 ఉన్నాయి. ఇవి కాక పట్టణ ప్రాంతాలైన కావలి, గూడూరు, ఆత్మకూరులో ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రంలో డీఎస్సార్ జనరల్ ఆసుపత్రి(పెద్దాసుపత్రి) 24 గంటల పాటు వైద్య సేవలందిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రిలో సేవలు దారుణం నెల్లూరులోని జిల్లా ఆసుపత్రిని పరిశీలిస్తే సేవలు దారుణంగా ఉన్నాయి. రాత్రి పూట డ్యూటీలు మారేటప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ పేరుతో 8 నుంచి 9 గంటల వరకు వార్డుల్లో ఒక్క నర్సు కూడా కనిపించడం లేదు. ఖాళీ కుర్చీలే కనిపించాయి. అదే సమయంలో ఆరోగ్యం సరిగా లేని ఓ మహిళ ఎమెర్జెన్సీ విభాగానికి చేరుకుంది. డాక్టరమ్మ పక్కరూంలోనే ఉంది. అయితే కాంపౌండర్ వైద్యం చేశారు. బైక్ బోల్తా పడి ఆసుపత్రికి చేరిన ఇద్దరికి కూడా కాంపౌండరే వైద్యం చేశారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు వారం రోజులుగా మూతపడింది. పలు వార్డుల్లో లైట్లు వెలగడం లేదు. బ్లడ్‌బ్యాంకు వద్ద మెట్లు ఎక్కే దక్కర చీకటిగా ఉంది. బ్లడ్ బ్యాంకు వద్ద ఒకే నర్సు ఉంటారు. వారికి రక్షణ కరువైంది. ప్రసూతి కేంద్రంలో, జనరల్ ఆసుపత్రి ఎమెర్జెన్సీ విభాగంలో రోగిని కుర్చీలో పట్టేదానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బంధువులే వీల్ చైర్‌ను నెట్టుకుంటూ పోతున్నారు. గ్రామీణంలో వైద్యులేరీ? గ్రామీణ ప్రాంతంలో 24 గంటలు వైద్య సేవలు అందించే ఆసుపత్రులు 27 ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే కోవూరు ఆసుపత్రిలో నర్సులే వైద్యం చేస్తున్నారు. అత్యవసరమైతే డాక్టర్ ఇంటికి పోయి పిలుచుకుని వస్తారంట. విడవలూరు మండలం రామతీర్థం పీహెచ్సీలో డాక్టర్లు, సిబ్బంది లేరు. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. బుచ్చిరెడ్డిపాళెం ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. గూడూరు మండలం చెన్నూరులో రికార్డుల పరంగా 24 గంటల ఆసుపత్రి అయినా దానిని తెరవలేదు. చిల్లకూరు మండలం, సూళ్లూరుపేటలో డాక్టర్లు లేరు. స్టాఫ్ నర్సులే ఉన్నారు. నాయుడుపేటలోని ఆసుపత్రికి మేనకూరు పంచాయతీ ద్వారకాపూడి నుంచి వస్తున్న చెంచమ్మకు మార్గమధ్యంలోనే కానుపు అయింది. ఆమె తన బిడ్డతో పాటు ఆసుపత్రికి వస్తే చిన్నపిల్లల డాక్టర్ లేరని బిడ్డను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆత్మకూరు, కావలి, కొండాపురం, వింజమూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో డాక్టర్లు అందుబాటులో లేరు. ఇళ్ల వద్దనే ఉంటున్నారు. అవసరమైతేనే వస్తున్నారు. వెంటాడుతున్న సిబ్బంది కొరత జిల్లాలో 24 గంటల ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులు 56 మందికి 49 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏఎన్ఎంలు 477 మంది ఉండాల్సి ఉండగా 389 మంది పనిచేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాలతో కలుపుకుని 238 మంది డాక్టర్లకు గాను 175 మంది పనిచేస్తున్నారు. 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయూష్ (ఆయుర్వేదం, హోమియో, యునాని) వైద్యులు 40 మంది ఉండాల్సి ఉండగా ఏడుగురు ఉన్నారు. రక్తం కోసం అల్లాడా : మాఅమ్మకు గర్భసంచిలో గడ్డ ఉంది. ఆపరేషన్‌కు ముందు రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు. పెద్దాసుపత్రిలో ఒక ప్యాకెట్ రక్తం ఇచ్చారు. అంతలోనే ఫ్రిజ్ చెడిపోయింది. దీంతో రక్తం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాను. రెడ్ క్రాస్ వారు మూడు రోజులు తిప్పుకున్నారు. ఏడ్చి , ఏడ్చి యాగీ చేస్తే చివరకు రక్తం ఇచ్చారు. - పెంచలమ్మ, రాపూరు -
‘మదర్’ను నడిపించాడు.. రికార్డు సృష్టించాడు..
టీనేజీ కుర్రాడి కృషికి ‘గిన్నిస్’ గుర్తింపు లక్షల మందితో ‘రక్తనిధి’ ఏర్పాటు టీనేజర్ అంటే కొండంత ఆవేశం, కాసింత ఆలోచన, పిసరంత ఆచరణ.. అన్నట్టు మారిపోయిన సమకాలీన పరిస్థితుల్లో.. కొండంత ఆశయాన్ని తోడు చేసుకుని సాగిపోతున్నాడు ఓ కుర్రాడు. తోటి కుర్రాళ్లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసే వయసులో సమాజానికి తనవంతు సాయం చేసేందుకు యజ్ఞం చేస్తున్నాడు. ఇందులో గిన్నిస్ రికార్డును సైతం అందుకున్నాడు. ఆ కుర్రాడి పేరు సాయి ఆకాశ్. చేస్తున్న యజ్ఞం అత్యవసర పరిస్థితిలో రక్తం దొరక్క అల్లాడుతున్న వారికోసం రక్త నిధిని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిట్జీ స్కూల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నవిజయవాడకు చెందిన ఆకాశ్ (17) గిన్నిస్ రికార్డ్ గుర్తింపు వెనుక అలుపెరగని కృషి ఉంది. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి కలాం ఫ్లాగ్ ఆఫ్ నుంచి గిన్నిస్ రికార్డ్ దాకా.. మృత్యుముఖంలో ఉన్న స్నేహితుడిని బతికించుకునేందుకు రక్తం కోసం పడిన కష్టం మరో యువకుడిలో అయితే వ్యవస్థ మీద ద్వేషాన్ని పెంచేదేమో. కానీ ఆకాశ్‌ని వ్యవస్థకు ఉపకరించే పటిష్టమైన రక్తనిధిని ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ‘స్నేహితుడు శశాంక్ ప్రమాదానికి గురై చావు బతుకుల్లో ఉన్నప్పుడు రక్తం విలువ తెలిసింది. కొద్దో గొప్పో స్థాయి ఉన్నవాళ్లకి సైతం అదెంత ప్రియంగా మారిందో అర్థమైంది. అప్పుడే నా ఆచరణకు బీజం పడింది’ అంటూ గుర్తు చేసుకుంటాడు ఆకాశ్. ‘నా ఆలోచన చెప్పగానే నాన్న (ఎం.కె.గుప్తా) శభాష్ అంటూ ప్రోత్సహించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వయంగా వచ్చి నా ‘మదర్ బ్లడ్ బ్యాంక్’ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు’ అంటూ వివరించాడు ఆకాశ్. వెబ్సైట్ ప్రారంభించే నాటికి ఈ కుర్రాడి వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అంతేకాదు హైస్కూల్ రోజుల్లోనే ‘ఆసమ్ కంప్యూటెక్’ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన ఘనతను కూడా దక్కించుకున్నాడు. రెండు లక్షల మంది రక్తదాతలు.. ప్రస్తుతం ఆకాశ్ ప్రారంభించిన వెబ్సైట్ ఠీఠీఠీ.ఝ్టౌజ్ఛిటఛౌౌఛీఛ్చజు.ఛిౌఝలో దాదాపు 2 లక్షల మంది రక్తదాతల వివరాలు నమోదయ్యాయి. ‘రక్తదానంపై యువతకు అవగాహన పెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాం. తద్వారా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని చేర్పించగలిగాం’ అని చెప్పాడు ఆకాశ్. గత ఏప్రిల్ 21 నుంచి విజయవాడ మొదలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, కోయంబత్తూరు వంటి నగరాల్లో నెల రోజలు పాటు నిర్విరామంగా ఈ కుర్రాడు 102 అవగాహన శిబిరాలను నిర్వహించాడు. వీటి ద్వారా 1,02,015 మందిని రక్తనిధిలో భాగస్వాములను చేసి గిన్నిస్ రికార్డ్ సాధించి అంతకు ముందు 61,902 మందితో ఉన్న రికార్డును చెరిపేశాడు. ‘మా టెక్నికల్ టీమ్, ఫ్రెండ్స్, బంధువులు, ఇంకా ఎందరో ఈ మార్గంలో నాకు చేయూత నిచ్చారు. ఇదంతా రికార్డుల కోసం చేసింది కాదు. రియల్ నీడ్‌ని అటెంప్ట్ చేశాం. దేశంలో రక్త నిధి కొరత తీరే వరకూ మా కృషి కొనసాగుతుంది’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడీ కుర్రాడు. ‘మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు మాత్రమే నేను హెల్ప్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నన్ను ఆర్థికంగా ఎటువంటి హెల్ప్ తను అడగలేదు.. నేను ఇవ్వలేదు’ అంటూ విద్యావేత్తగా పేరున్న ఆకాశ్ తండ్రి గుప్తా గర్వంగా చెబుతున్నారు. ‘ఒక కంపెనీ సీఈఓగా ఆకాశ్‌ను చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. అంతకు మించిన ఆనందం ఈ మదర్ బ్లడ్ బ్యాంక్ క్రియేటర్‌గా తనని గుర్తించినపుడు కలిగింది’ అంటారు ఆకాశ్ తల్లి లక్ష్మి. రక్తం అవసరమైన ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్‌లోకి లాగిన్ అయి వారికి సమీపంలోని రక్తదాతల వివరాలు పొందవచ్చునని ఆకాశ్ చెప్పాడు. మోడీ యోగా యాప్.. ఒక గొప్ప ఆలోచనకు అంతకు మించిన గొప్ప ఆచరణను జతచేసి చిన్న వయసులోనే స్ఫూర్తిదాయక విజయాన్ని సొంతం చేసుకున్న ఆకాశ్.. ఇటీవలే ‘మోడీ యోగా’ పేరుతో ఒక యాప్‌ను కూడా రూపొందించాడు. ఇంట్లో సాధన చేసేందుకు అవకాశం ఉన్న 12 రకాల ఆసనాలను, అవి వేసే విధానాన్ని వివరించే ఈ యాప్‌ను గత అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు విడుదల చేశాడు. -
బ్లడ్ బ్యాంక్ ఘరానా మోసం
-
బ్లడ్‌బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడా
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రాలపై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝుళిపిం చింది. రాష్ట్రంలోని 132 బ్లడ్ బ్యాంకుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిల్లో చాలా వరకు రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయకపోగా, నిర్ధేశించిన ధర కన్నా అధిక మొత్తానికి రక్తాన్ని అమ్ముతున్నట్లు గుర్తించింది. అర్హులైన టెక్నిషియన్లు లేకపోవడం, దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వచేయడం, చివరకు బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇలా అంతా లోపభూయిష్టంగా ఉన్నట్లు వెల్లడయింది. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రితోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులు సహా 109 కేంద్రాలకు నోటీసులు జారీ చేసిం ది. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే లెసైన్స్‌లను రద్దు చేయడంతోపాటు కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. గతంలో హెచ్చరించినా మారని తీరు... తెలంగాణలో 132 బ్లడ్ బ్యాంకులు రిజిస్ట్రర్ కాగా, ఇందులో 35 స్టోరేజ్ సెంటర్లు ఉన్నా యి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధికంగా 61 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21 ఉన్నాయి. నోటీసులు అందుకున్న వాటిలో గ్రేటర్‌లోని బ్లడ్ బ్యాంకులే ఎక్కువ. ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సుల్తాన్‌బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతోపాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి రక్తనిధి కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి కనీస వసతులు లేవని నోటీసులు జారీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. నిలోఫర్‌లో 45 బాటిళ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా ఆయా బ్లడ్‌బ్యాంకులు తీరు మార్చుకోలేదు. తలసీమియా బాధితులకు విక్రయం.. డ్రగ్‌కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి రక్త కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలి. ఆరు మాసాలకోసారి కూడా అటువైపు చూడటం లేదు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తం లో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధనను పట్టించుకోకపోగా.. ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒ,ఎ, బి, నెగిటీవ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటివి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. -
రామ్‌చరణ్ తేజ జన్మదిన వేడుకలు
-
ఆఫీసు మూత.. వేతనాలు మోత
మూడేళ్ళుగా ఆ తలుపులు తెరుచుకోలేదు. రక్త నిల్వలూ లేవు. ఎవరికీ సరఫరా కావడం లేదు. ఉద్యోగులు ఎవరూ ఇక్కడ పనిచేయడం లేదు. అయినా వారికి నెలనెలా జీతాలు చెల్లించేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే నాథులు లేరు. ఇదీ గుంటూరులోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల తీరు. సాక్షి, గుంటూరు : జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు మెంబర్లుగా ఉన్నారు. చాలా ఏళ్లపాడు ఎంతో సమర్థంగా దీనిని నడిపి ఎందరో నిరుపేద రోగులకు అతి తక్కువ ధరకే వివిధ గ్రూపుల రక్తాన్ని అందించారు. కానీ గడచిన మూడేళ్లుగా ఇది మూతపడింది. ఫలితంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స నిమిత్తం వచ్చే అనేక మంది పేద రోగులు రక్తం అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గతంలో రోజుకు 35 నుంచి 40 మంది రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంకు ఎందరికో ప్రాణదానం చేసింది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల కంటే సుమారు రూ. 400లు తక్కువ ధరకు రక్తాన్ని అందించి నిరుపేద రోగులకు ఆలంబనగా నిలిచింది. ప్రస్తుతం ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో బ్లడ్ యూనిట్ ధర రూ. 1450లు ఉండగా రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో యూనిట్ రూ. 1050లకే అందించేవారు. బ్లడ్ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి అనేక మంది తమ రక్తాన్ని ఇక్కడే ఇచ్చేవారు. అయితే బ్లడ్‌బ్యాంకులో కాంపౌనెంట్ సపరేట్గా పెట్టి ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన కమిటీలోని కొందరుసభ్యులు అందుకు సుమారు రూ. 20 లక్షల నిధులు అవసరమవుతాయని గుర్తిం చారు. ఈ మొత్తాన్ని సమకూర్చేవరకు బ్లడ్‌బ్యాంకును మూసివేయాలని నిర్ణయించారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదు. పేదల అవసరాలు తీర్చలేదు. మూడేళ్ళల్లో రూ. 15 లక్షల జీతాలు చెల్లింపు బ్లడ్‌బ్యాంకు మూతపడి మూడేళ్ళు గడుస్తున్నా అందులో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 10వేలు చొప్పున, టెక్నీషియన్లు ముగ్గురికి రూ. 6వేలు చొప్పున, సబ్ స్టాఫ్‌కు రూ. 15వేలు చొప్పున జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. వీరు బ్లడ్ బ్యాంకు మూసివేయడంతో వేరే చోట హ్యాపీగా పనిచేసుకుంటూ అక్కడ, ఇక్కడా జీతాలు పుచ్చుకుంటున్నారు. ఈ విధంగా మూడేళ్ళల్లో సుమారు రూ. 15 లక్షలు వీరికి జీతాల కింద చెల్లించారు. కాంపోనెంట్ సపరేటర్‌ను ఏర్పాటు చేయాలంటే రూ. 20లక్షలు భారంగా భావించిన నిర్వాహకులకు బ్లడ్‌బ్యాంకులో పనిచేయకుండానే ఉద్యోగులకు రూ. 15లక్షల మేర జీతాలు ఎలా చెల్లించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే కొందరు నిర్వాహకులు గురువారం హడావుడిగా కమిటీ సమావేశం నిర్వహించి రెండు నెలల్లో బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపడతామంటూ తీర్మానించడం గమనార్హం. ఏదేమైనా బ్లడ్‌బ్యాంకుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ స్పందించి బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రసవ సమయంలో ఉచితంగా రక్తం పంపిణీ
సాక్షి, ముంబై: ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి తల్లికి, బిడ్డకు రక్తం అవసరమైతే ఉచితంగా సరఫరా చేస్తామని మహానగర పాలక సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ పద్మజా కేస్కర్ వెల్లడించారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో ఎక్కువ ధర చెల్లించి రక్తం కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. సాధారణంగా కొందరు మహిళలకు ప్రసవం సమయంలో తీవ్ర ర క్తస్రావం జరుగుతుంది. సిజరింగ్ అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. దీంతో తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. రక్తం కోసం ఆస్పత్రులు, బ్లడ్‌బ్యాంకుల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో బంధువుల పరిస్థితి వర్ణణాతీతం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహానగర పాలక, ఉపనగర, ప్రసూతి గృహాలలో రక్తం అందుబాటులో ఉంటుందని కేస్కర్ చెప్పారు. ఒకవేళ శిశువు తక్కువ బరువుతో జన్మించినా, ఇతర కారణాల వల్ల రక్తం అవసరమైనా శిశువుకు 30 రోజుల వరకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మహానగర పాలక ఆస్పత్రుల్లో గర్భిణీలకు ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్, సోనోగ్రఫీ తదితర సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైన బ్లడ్ గ్రూప్ లేకపోతే.. నగరంలో ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకుని అందజేస్తారు. ఈ పథకాన్ని అన్ని కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నామని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. -
రక్త నిధి.. ఏదీ?
- జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుకు రెండేళ్ల క్రితం శంకుస్థాపన - సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ జారీలో జాప్యం - సత్వర ఏర్పాటుకు చర్యలు తీసుకోని ప్రజాప్రతినిధులు - నెలకు 30 నుంచి 40 కేసులు హైదరాబాద్‌కు రెఫర్ తాండూరు: తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కోసం 2012 డిసెంబర్లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎయిర్ కండీషన్లతోపాటు బ్లడ్ బ్యాంక్ కు అవసరమైన సుమారు రూ.40లక్షల విలువైన మెటీరియల్‌ను ఎంఎస్ఐడీసీ (మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్) తాండూరుకు పంపించింది. ఈ మెటీరియల్ అప్పటి నుంచి స్టోర్‌రూంలోనే మగ్గుతోంది. దాదాపు రెండేళ్లు దాటినా రక్తనిధి కేంద్రం అందుబాటులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సందర్శించి సాధ్యమైనంత తొందరలో బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తెస్తామని మాటిచ్చారు. అయితే సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు లెసైన్స్ జారీ కావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణం వల్లే బ్లడ్ బ్యాంకు ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. అయితే లెసైన్స్ వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ప్రతినెలా 300పైగా కాన్పులు, 107 సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ఆర్థోపెడిక్ కేసులు కూడా అధికంగానే వస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే మహిళల్లో చాలామందికి రక్తహీనత సమస్య ఉంటోంది. అటువంటి వారి బంధువులు వికారాబాద్ లేదా హైదరాబాద్‌కు వెళ్లి రక్తాన్ని తీసుకువస్తున్నారు. లేదంటే దాతల నుంచి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి రావడానికి సమయం పడుతోందని, ఒక్కోసారి అక్కడ కూడా సరైన వ్యవధిలో లభ్యంకాక ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని పరిస్థితుల్లో వైద్యులు రోగులును హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. నెలకు సుమారు 30 నుంచి 40 కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. జిల్లాలోని పెద్ద ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇంకా లెసైన్స్ రాలేదు: డా.వెంకటరమణప్ప, ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు అంతా సిద్ధం చేశాం. మెటీరియల్‌తోపాటు ప్రత్యేక గది కూడా ఉంది. సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ రావాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే మెటీరియల్ వచ్చింది. -
రక్తపోటు
- జిల్లా ప్రధానాస్పత్రిలో పేరుకుపోయిన రక్తం నిల్వలు - 35 రోజులు దాటితే.. వేస్టే! - బ్లడ్‌బ్యాంక్‌లో వెయ్యి యూనిట్లు - నిరుపయోగంగా ఎస్డీపీ పరికరం - ఆర్డీపీయే గతి సాక్షి, కరీంనగర్ : జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రక్తపోటు వచ్చింది. ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల విషజ్వరాలు, డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభించి.. జిల్లాలో వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. రక్తంలో ప్లేట్లెట్లు (రక్తకణాలు) తగ్గి వందకు పైనే మంది చనిపోయారు. అందరికీ ప్లేట్లెట్లు అవసరమయ్యాయి. సింగిల్‌డోనర్ ప్లేట్లెట్(ఎస్డీపీ) మిషన్ ఉందని తెలిసి ఎంతోమంది ఈ ఆస్పత్రిలో చేరుతున్నారు. కానీ ఆస్పత్రిలో ఎస్డీపీకి బదులు.. ర్యాండమ్ బ్లడ్ డోనర్ ప్లేట్లెట్ మిషన్(ఆర్డీపీ) పద్ధతిలో ప్లేట్లెట్లు ఇవ్వడంతో నిరాశ చెందుతున్నారు. గత్యంతరం లేక రక్తదానం చేసి ప్లేట్లెట్లు తీసుకుంటున్నారు. ఆర్డీపీ పద్ధతిలో ప్లేట్లెట్లు అందించడంతో రక్తంలోని ప్లాస్మా, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాల ప్యాకెట్లు పేరుకుపోయాయి. ప్రస్తుతం వెయ్యికి పైనే యూనిట్ల రక్తం బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోం ది. రక్తం సేకరించి 35 రోజులు దాటితే ఆర్బీసీ కణాలు పనికిరావు. 350 పడకలున్న ఆస్పత్రి అంతా రోగులతో నిండిపోయింది. ఆస్పత్రిలో చేరి.. ప్లేట్లెట్లు తక్కువ గా ఉన్న రోగులకు ఆస్పత్రిలోనే రక్తం తీసుకుని ఆర్డీపీ పద్ధతిలో ప్లేట్లెట్లు ఇస్తున్నారు. ప్రతిరోజు 40 మందికి పైనే రక్తదానం చేసి ప్లేట్లెట్లు తీసుకుంటున్నారు. నిరుపయోగంగా ‘ఎస్డీపీ’ మిషన్ 2009లో జిల్లాను డెంగీ హడలెత్తిస్తున్న సమయంలో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ తన నిధుల నుంచి రూ. 24లక్షలతో జిల్లా ఆస్పత్రిలో సింగల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ యంత్రంతో రక్తదాత శరీరంలోంచి నేరుగా ప్లేట్లెట్లు మాత్రమే అవసరమున్న మేరకు తీసుకునే వీలుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎస్డీపీ కిట్ ఉంటుంది. దీని విలువ సుమారు రూ.7,500. రెండేళ్లుగా ఆపరేటర్ లేడంటూ ఈ యంత్రంతో పని లేక మూలకు పడేశారు. దీంతో నిర్వహణ కొరవడి మరమ్మతుకు వచ్చింది. జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతాయని తెలిసినా మరమ్మతు చేయించ ట్లేదు. ఆర్డీపీయే గతి.. ఎస్డీపీ పరికరం పని చేయకపోవడం.. ఆ పద్ధతి లో ప్లేట్లెట్ల సేకరణకు ఎక్కువ ఖర్చవుతుండడంతో జిల్లా ఆస్పత్రిలో ఆర్డీపీ పద్ధతినే అవలంబిస్తున్నారు. రోగినుంచి రక్తం సేకరించిన తర్వాత సెల్ సెపరేటర్ ద్వారా ప్లేట్లెట్లు, ప్లాస్మా, తెల్ల, ఎర్రరక్త కణాలు వేరు చేస్తారు. 350 ఎంఎల్ రక్తం నుంచి 50ఎంఎల్ ప్లేట్లెట్లు వేరు చేసి రోగి రక్తంలో ఎక్కిస్తారు. ప్లాస్మా, తెల్ల, ఎర్రరక్త కణాలతో కూడిన మిగతా 300ఎంఎల్ రక్తం ఆయా కాంపోనెంట్స్ అవసరమున్న రోగులకు ఎక్కిస్తారు. ఒక్క యూనిట్ (50 ఎంఎల్) ప్లేట్లెట్లు రోగి శరీరంలో ఎక్కి స్తే.. ప్లేట్లెట్ల సంఖ్య 8 వేల వరకు పెరిగే అవకాశముంటుంది. ఉన్నతాధికారులు స్పందించి ఎస్డీపీ మిషన్‌ను వినియోగంలోకి తీసుకువస్తే రక్తదాత నుంచి నేరుగా ప్లేట్లెట్లు మాత్రమే తీసుకునే అవకాశముంటుంది. రక్తం నిల్వలు ఎక్కువగా పేరుకుపోయే అవకాశముండదు. -
రక్తం సేకరణకు మార్గం సుగమం
సిద్దిపేట టౌన్: సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తం సేకరించడానికి అవసరమైన సీపీడీఏ (సిట్రైట్ పాస్పెట్ డెక్స్ట్రోజ్ అడెనైన్) బ్యాగులు విడుదలయ్యాయి. మంగళవారం ‘సాక్షి’లో ‘నిరుపయోగంగా బ్లడ్ బ్యాంక్’ శీర్షికన ప్రచురించిన వార్తకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఇవ్వడానికి దాతలు, రక్తం తీసుకోవడానికి బాధితులు వస్తున్నప్పటికీ రక్త సేకరణకు అవసరమైన సీపీడీఏ బ్యాగులు లేక పోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగిపోతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, స్పందించిన అధికారులు సీపీడీఏ బ్యాగులను విడుదల చేశారు. దీంతో వైద్యాధికారులు, సిబ్బంది రక్త సేకరణను ప్రారంభించారు. గురువారం వాసవీక్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో ఈ బ్యాగులను వినియోగించారు. -
ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు
సాక్షి, సిటీబ్యూరో: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా శుక్రవారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో అభివూనులు, రాష్ట్ర చిరంజీవి యువత కార్యకర్తలు రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు, దేవాలయూలో పూజలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో 25 వేల వుందికి పైగా రక్తదానం చేసినట్టు రాష్ట్ర చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన కార్యక్రవూన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. నగరంలో నిర్వహించిన శిబిరాలలోనే 2,365 వుంది రక్తదానం చేసినట్టు నాయుడు తెలిపారు. ఫిల్మింనగర్ శ్రీదాసాంజనేయు స్వామి గుడిలో లక్ష తవులపాకులతో చిరంజీవి పేరిట పూజా కార్యక్రవూలు నిర్వహించారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, నాగబాబు భార్య పద్మ, విశాఖ, అనంతపురం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభివూనులు పూజా కార్యక్రవూలు నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో చిరంజీవి కువూరుడు రామ్‌చరణ్, కుటుంబ సభ్యులు ధర్మతేజ్, వరుణ్‌తేజ్, అల్లు అరవింద్ పాల్గొన్నారు. 59 కేజీల కేక్‌ను రామ్‌చరణ్ కట్ చేశారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రవూన్ని సినీనటుడు నాగబాబు వుణికొండలో ప్రారంభించగా, 20న రెండు రాష్ట్రాలలో 2 లక్షల వుంది పేదలకు అన్నదాన కార్యక్రవుం నిర్వహించినట్టు నాయుుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రవూల్లో పలువురు ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, నిర్మాతలు, ప్రవుుఖులు, అభివూనులు పాల్గొన్నారని తెలిపారు. -
చదరంగం పోటీలకు విశేష స్పందన
తిరుపతి స్పోర్ట్స్: చిత్తూరు జిల్లా చదరంగం సమాఖ్య తిరుపతిలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ పోటీలను రుయా బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఆర్.రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఐదుసార్లు ప్రపంచ కప్‌ను అందించింది ఒక్క చదరంగం మాత్రమే అని గుర్తుచేశారు. అయినా చదరంగానికి ఆశించిన స్థాయిలో ఖ్యాతి రాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన 25 మందికి నగదు బహుమతులు, 90 మందికి షీల్డ్, సర్టిఫికెట్లు అందించారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ పొనగంటి భాస్కర్, జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గందరగోళంగా పోటీలు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన చదరంగం పోటీలు గందరగోళంగా జరిగాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధికంగా క్రీడాకారులు హాజరయ్యారు. దాదాపు 600 మందికి పైగా రావడంతో అందరికీ పోటీలు నిర్వహించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ గందరగోళం నడుమ పోటీలు ఎవరికి వారే నిర్వహించుకోవడం, ఓడినా తామే గెలిచామని ప్రకటించుకోవడం కనిపించింది. దీంతో గెలిచినా ఓడినట్టు నిర్వాహకులు ప్రకటించడంతో ఏడుగురు క్రీడాకారులు కన్నీటి పర్యంతమవుతూ బయటకు వచ్చారు. విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో క్రీడాకారుని నుంచి రూ.200 చొప్పున డబ్బు వసూలు చేసి, తీరా నిబంధనలకు విరుద్దంగా పోటీలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గెలిచిన క్రీడాకారులను సమయం లేదంటూ ఎందుకు పక్కన పెట్టారని నిలదీయడంతో తల్లిదండ్రులను నిర్వాహకులు బుజ్జగించడం కనిపించింది. -
రిమ్స్ తీరుపై మంత్రి గుస్సా
పనులు చేయకపోవడంపై ఆరాతీశారు. కాంట్రాక్టర్ జవాబుపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘నేనేం అమాయకుడ్ని అనుకున్నావా..? రాష్ట్రంలో ఎక్కడా నువ్వు కాంట్రాక్ట్ చేయకుండా చేయగలను..’ అంటూ హెచ్చరించారు. రిమ్స్ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ అంజయ్యతో మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్‌ను వెంటనే మార్చుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని... ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యం అందించడం ముఖ్యమని సూచించారు. అంతకుముందు నగరంలోని మాతాశిశు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మంత్రి మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లావైద్య, ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు ఒకప్పుడు ఒంగోలులోనే ఎక్కువగా కనిపించేవని.. అలాంటి వాతావరణం మార్చేందుకు వైద్యులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. రిమ్స్ ట్రామాకేర్ సిబ్బందితో పాటు 108, 104 సిబ్బందికి సకాలంలో జీతాలు అందిస్తామని.. రిమ్స్ బ్లడ్‌బ్యాంకు విస్తరణతో పాటు జిల్లాలో మిగతాచోట్ల ప్రతీ ఏరియా ఆస్పత్రిలోనూ బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా నోడల్ అధికారులను నియమించి వారితో నిరంతర వైద్యసమీక్షలు చేయించే ప్రతిపాదనలున్నట్లు తెలిపారు. ప్రధానంగా అన్ని ఆస్పత్రుల్లో గైనిక్, ఎనస్థీషియా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైద్యులు ఆస్పత్రికి అందుబాటులో నివాసాలుండాలని.. విధులకు సకాలంలో హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి త్వరలో జిల్లాల వారీగా జరగనున్న వైద్యరంగ అభివృద్ధిపై వివరించారు. ఆయనకు పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది, ఐఎంఏ సభ్యులు సన్మానం చేశారు. మంత్రి పర్యటనలో డీఎంఏ డాక్టర్ జి. శాంతారావు, కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, మెడికల్ ఆర్డీ శాలినిదేవి, జిల్లావైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రయ్య, వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య తదితరులున్నారు. ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు ఒంగోలు టౌన్: ‘పేషంట్ దేవుడి లాంటివాడు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు. వారిని ప్రేమగా పలకరించాలి. ఆప్యాయంగా చూసుకోవాలి. ఈ రెండు చేస్తే ఆ రోగి సగం జబ్బు తగ్గుతోంది. మిగిలిన జబ్బును మనం ఇచ్చే వైద్యం ద్వారా తగ్గుతోంది. పేషంట్ లేకపోతే మనం లేమన్న విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ వైద్యులకు ఉద్బోధించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ వైద్యులతో బుధవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్వం వైద్యులను దేవుడిలాగా చూసేవాళ్లని, మనం దానిని నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూటికి తొంభై శాతం పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారని, మన పద్ధతులను మార్చుకొని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లేనని, ఆరోగ్యంగా లేకుంటే మనం ఆరోగ్యంగా లేనట్లేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిరోధించేందుకు మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే లేని జబ్బులు వస్తాయని ప్రజల్లో భయం ఉందని, అందుకు కారణం అక్కడ ఉండే అపరిశుభ్రతేనన్నారు. పారిశుధ్యం మెరుగుపరిచే కాంట్రాక్టు పొందినవాళ్లు సక్రమంగా పనిచేయకుంటే ఒకసారి వార్నింగ్ ఇవ్వాలని, అప్పటికీ మారకుంటే మెమో ఇవ్వాలని, పరిస్థితిలో మార్పురాకుంటే వారుకట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వొద్దని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పేరు ఒక్కటే మిగిలి ఉందని, మిగతాదంతా కొత్తేనన్నారు. వైద్యులంతా మరింత కష్టపడి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలని మంత్రి కామినేని కోరారు. ‘సిక్’ అయితే ఎంత నష్టమో గుర్తించాలి - కొండపి ఎమ్మెల్యే ఒక వ్యక్తి సిక్ అయితే ఎంత నష్టం జరుగుతుందో వైద్యులు గుర్తించాలని కొండపి శాసనసభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కోరారు. ఇంటి యజమాని సిక్ అయితే ఆ కుటుంబమంతా ఆ రోజు ఆదాయం కోల్పోతుందని, విద్యార్థి సిక్ అయితే ఆ రోజు పాఠాలు కోల్పోతాడన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తాము తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్యం సరిగా లేకపోతే దానికి అందరూ బాధ్యులేనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యులతో ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయన్నారు. క్లస్టర్ల వ్యవస్థ వల్ల సమస్యలు ఏర్పడటం తప్పితే ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమిస్తే బాగుంటుందని సూచించారు. పీహెచ్‌సీని బ్రాందీ షాపుగా మార్చేశారు - కనిగిరి ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బ్రాందీ షాపుగా మార్చేశారని ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 15 పడకల ఆస్పత్రికి ఇన్చార్జి వైద్యుడు ఉన్నప్పటికీ నాలుగేళ్ల నుంచి బ్రాందీ షాపు నడుస్తూనే ఉందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఎక్సైజ్ సీఐతో దానిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. సీఎస్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని, ఆయన కూడా ఇన్చార్జేనని, గట్టిగా రమ్మంటే రిజైన్ చేస్తానంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే అన్నిచోట్ల ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారన్నారు. పేరుకు ఆస్పత్రులు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పామూరులోని 30 పడకల ఆస్పత్రి కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, డీఎంఈ శాంతారావు, కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ శాలినీదేవి తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి చికిత్సకు వైఎస్సార్ సీపీ చేయూత
దేవరాపల్లి : గుండెకు రంధ్రం పడి చావుబతుకుల్లో ఉన్న బాలికకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలిచారు. మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కంటిపాము నాగేశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె లోహిత (9)కు చిన్నతనం నుంచే గుండెకు రంధ్రం పడడంతో ప్రస్తుతం మృత్యు ఒడిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ స్పందించి బాలిక శస్త్రచికిత్సకు అవసరమైన ‘ఎ’ పాజిటివ్ రక్తం 9 యూనిట్లను ఎ.ఎస్.రాజా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని తండ్రి నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఆ బాలికను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడుతో మాట్లాడామని, బాలిక వైద్యసేవలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా ఈనెల 28వ తేదీన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బాలికకు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు అంగీకరించారని తెలిపారు. -
సిద్ధార్థ వైద్య కళాశాలకు మొండిచెయ్యి
సీట్లు మంజూరుపై కరుణించని ఎంసీఐ రాష్ట్రంలో అన్ని కళాశాలలకు పునరుద్ధరించినా సిద్ధార్థకు దక్కని వైనం ఈ ఏడాది వంద సీట్లకే పరిమితం లబ్బీపేట : సిద్ధార్థ వైద్య కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కరుణించ లేదు. అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరుపై చివరి నిమిషంలోనైనా ఆమోదం వస్తుందన్న యూనివర్సిటీ అధికారులు ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 350 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధరించిన ఎంసీఐ, సిద్ధార్థకు మాత్రం మొండిచెయ్యి చూపింది. వైద్య మంత్రి సొంత జిల్లాలో ఉన్న కళాశాలకు సీట్లు రప్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది సిద్ధార్థ వైద్య కళాశాల వందసీట్లకు పరిమితం కానుంది. సిద్ధార్థ కళాశాలకు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 40 శాతం, ఎస్వీయూ పరిధిలో 20 శాతం, ఉస్మానియా పరిధిలో 40 శాతం మందికి సీట్లు కేటాయిస్తారు. ఏకైక స్టేట్ వైడ్ కళాశాలగా ఉన్న సిద్ధార్థకు అదనపు సీట్లు కేటాయించక పోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులకు నష్టమేనని నిపుణులు చెపుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొంటున్నారు. బోధకులు కొరత తీవ్రంగా ఉండటాన్ని ఎంసీఐ గుర్తించినట్లు వారు అంటున్నారు. ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సీట్లు దక్కేవని చెబుతున్నారు. వంద సీట్లు ఉన్న కళాశాలకు 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో 50 మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో వాటిని భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలు చేసి సౌకర్యాలు లేని కారణంగా వాటిని రద్దు చేసేంది. గత ఏడాది వంద సీట్లనే భర్తీ చేశారు. అదనంగా సీట్లు మంజూరు చేయాలంటూ కళాశాల అధికారులు మళ్లీ ఎంసీఐకు ద రఖాస్తు చేయడంతో బృందం అకస్మికంగా తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం కళాశాలకు అదనపు సీట్లు దక్కని విషయంలో అధికారుల వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధిని ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. ఎంసీఐ బృందం తనిఖీలను వస్తున్నట్లు ముందుగానే తెలిసినా పలు విభాగాలను సిద్ధం చేయలేదు. కళాశాలలోని ఓ విభాగంలో వైజ్ఞానిక ప్రదర్శన దుమ్ముపట్టి ఉండటాన్ని ఎంసీఐ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకే తనిఖీలకు ఎంసీఐ సభ్యులు రాగా, 11 గంటల సమయంలో కూడా వైద్యులు విధులకు రావడం, ఐడీ కార్డులు, నెఫ్రాన్లు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల అదనపుసీట్లు రాక పోవడంలో పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారుల వైఫల్యం కూడా ఉంది. ఎంసీఐ అభ్యంతరాలు ఇవి టీచింగ్ క్లాసులు నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. బ్లడ్ బ్యాంక్‌కు ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యాధి నిర్ధారణ విభాగంలో సైతం అధునాతన పరికరాలు లేవని , ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం రిపేరులో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లైబ్రరీ, పెథాలజీ సెకండ్ డొమాస్టిక్ రూమ్, కమ్యునిటీ మెడిసిన్‌కు ప్రాక్టికల్ ల్యాబ్ లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్స్ లేక పోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికైనా సీట్లు దక్కే అవకాశం ఉంది. -
డబ్బిస్తేనే .. రక్తమిస్తున్నారు
సిద్దిపేట టౌన్ : ‘రక్తాన్ని సేకరించి బాధితులకు అందజేస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.’ ఈ విలువ తెలిసిన సిద్దిపేటలోని పలు స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని పట్టణంలోని ఏరియా ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో 30 శాతం వరకు నిల్వ చేస్తున్నారు. అయితే దాతలకు గాని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు రక్తం అవసరం వస్తే ఆస్పత్రి సిబ్బంది ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేటలో వాసవీక్లబ్, లయన్స్‌క్లబ్, స్ఫూర్తి లయన్స్‌క్లబ్, పతాంజలి యోగ సమితి మొదలగు సుమారు 20 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు పని చేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో వారు ర క్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన రక్తాన్ని హైదరాబాద్‌లోని మెటోడిన్, సంజీవిని, జనని మొద లగు బ్లడ్‌బ్యాంక్‌లకు అందిస్తున్నారు. సంబంధిత బ్లడ్ బ్యాంక్‌లు రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు, బహుమతులు, ప్రశంస పత్రాలు, డోనర్ కార్డులను, ప్రత్యేక బహుమతులను, బీమా పత్రాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా సుమా రు రూ.1000 విలువైన బ్లడ్ గ్రూప్ వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ అందజేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలకు, వారి బంధుమిత్రులకు ఎలాంటి గ్రూపు రక్తానైన్నా ఉచితంగా అందజేసి ఆదుకుంటున్నారు. శిబిర నిర్వాహకులు లేఖ రాస్తే ఉచితంగా బ్లడ్ అందజేస్తున్నారు. రక్తం మాకే... కాసులు మాకే...: రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తంలో 30శాతం రక్తాన్ని స్వచ్ఛంద సంస్థలు సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌కు అందజేస్తున్నారు. సిద్దిపేట ఆస్పత్రుల్లో అత్యవసరమైనప్పుడు ప్ర భుత్వ వైద్యులు స్వచ్ఛంద సంస్థలకు ఫో న్ చేసి రక్త దాతల ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలం గా వారు ఏమి ఇవ్వడం లేదు. చివరికి రక్తం అవసరమైతే కూడా సరిగా స్పం దించడం లేదు. రూ. 1050 చెల్లిస్తేనే రక్తాన్ని అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలపై గరంగరం సామాజిక సేవలో భాగంగా రక్తదానం శిబిరాలను నిర్వహించే స్వచ్ఛంద సంస్థలను కొందరు వైద్యాధికారులు బెదిరిస్తున్నారు. అనుమతి లేనిదే రక్తదాన శిబిరాలు నిర్వహించ వద్దని చెబుతున్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నోటీసులు కూడా అందజేస్తున్నారు. సేకరించిన రక్తం అంతా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్వచ్ఛంద సంస్థలు బేజారవుతున్నాయి. సేవలకు కూడా ఇలా ఆటంకం పర్చడం సరైంది కాదంటున్నారు. ఉచితంగా ఇచ్చే నిబంధనలు లేవు.. సేకరిస్తున్న రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అంద జేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు, ఆస్పత్రులకు రక్తాన్ని డబ్బులు తీసుకుని అందిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలకు, శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి ఉచితంగా రక్తం ఇవ్వాలని ఎలాంటి నిబంధనలు లేవు. - డాక్టర్ రాంమోహన్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ సేవలకు గుర్తింపు లేదు.. రక్తదాన శిబిరాల నిర్వహణకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఒర్చి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అప్పగిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మేము సిఫార్సు చేస్తున్న వ్యక్తులకు ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్ వారు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నారు. అయితే సిద్దిపేట వైద్యాధికారులు మాత్రం రక్తం లేదంటున్నారు. డబ్బు ఇస్తేనే రక్తాన్ని ఇస్తున్నారు. - శివశ్రీనివాస్, రక్తదాన శిబిర ఇన్చార్జ్ -
హలో.. బ్లడ్ కావాలండీ..!.
- బ్లడ్ ఆన్ కాల్‌కు విశేష స్పందన - ప్రజల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అవగాహన - రవాణాకు జిల్లాలో ద్విచక్రవాహనం సాక్షి, ముంబై: రాష్ట్రంలో ‘బ్లడ్ ఆన్ కాల్ (104)’కు ఇప్పుడిప్పుడే మంచి స్పందన లభిస్తోంది. ఈ సేవలను జనవరి 6వ తేదీన ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,000 కాల్స్ వచ్చాయి. వాటిలో అవసరమైన 4,750 మందికి బ్లడ్ బ్యాగులను పంపిణి చేశామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ (ఎస్‌బీటీసీ) సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజూ కనీసం 55 కాల్స్ వస్తున్నాయి. చాలావరకు అత్యవసర కేసులకు సంబంధించినని కావు.. రోగులకు చికిత్స, శస్త్రచికిత్స అందజేసేందుకుగాను నిలువ ఉంచేందుకు ఫోన్ చేస్తుంటారు..’ అని తెలిపారు. ఇందులో సిజేరియన్, ప్రసూతి ఇతర అత్యవసర చికిత్సల నిమిత్తం ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుంటాయన్నారు. అలాంటప్పుడు తమకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను సమీప బ్లడ్ బ్యాంక్‌లకు కనెక్ట్ చేస్తామని అధికారి చెప్పారు. కాగా, బ్లడ్ ఆన్ కాల్ సేవల కోసం ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తున్నారు. వీటికి బ్లడ్‌ను రవాణా చేసేందుకు ఐస్ బాక్సులను అమరుస్తారు. కాగా వీరు ఈ బ్లడ్‌ను గంట లోగానే ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుందని ఎస్‌బీటీసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ వాహనాలను నడిపేందుకు ముగ్గురు వ్యక్తులను అందుబాటులో ఉంచారు. ఇదిలా వుండగా ముంబై నగరవ్యాప్తంగా తొమ్మిది బ్లడ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. సమీపంలో ఉన్న స్టోరేజ్ యూనిట్‌తో జిల్లా బ్లడ్ బ్యాంక్ సమన్వయం కలిగి ఉంటుంది. తర్వాత రైడర్ అవసరమున్న వారికి ఈ బ్లడ్‌ను డెలివరి చేస్తారు. కాగా, తాము ఇప్పటివరకు దాదాపు 190 ఆస్పత్రులకు, నర్సింగ్ హోమ్‌లకు బ్లడ్ బ్యాగ్‌లను అందజేశామన్నారు. అయితే చాలా మంది ఈ సేవలకు సంబంధించి ఫోన్‌కాల్స్ చేసి విచారిస్తున్నారని, నగర వాసుల్లో వీటిపై అవగాహన పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంబంధం లేని కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం లేదని ఆ అధికారి తెలిపారు. రోజుకు దాదాపు 55 కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నామన్నారు. -
రక్తదానానికి విలువ కట్టలేం
రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్ కడప కల్చరల్: రక్తదానం చేయడం అవయవ దానం చేయడం లాంటిదేనని.. రక్తదానానికి విలువ కట్టలేమని రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా శనివారం కడప నగరంలోని బోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన రక్తదాతల సత్కారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శరీరంలో ఏ అవయవం దానం చేసినా కొరతగానే ఉంటుందని.. కానీ, రక్తాన్ని దానం చేస్తే కొద్ది రోజుల్లో తిరిగి తయారవుతుందని ఆయన తెలిపారు. రక్తదానంపై మన దేశంలో అవగాహన పెరగవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు బోగా పార్వతమ్మ రక్తదాన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోగా చిన్నయ్య మాట్లాడుతూ రక్తదాన దినోత్సవ సందర్బంగా రక్తదాతలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కరపత్రాలు విడుదల.. అనంతరం బోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంకు రూపొందించిన కరపత్రాలను రిమ్స్ డెరైక్టర్ సిద్దప్పగౌరవ్ విడుదల చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, బ్లడ్ బ్యాంకు ప్రతినిధి భూపతి కూడా ప్రసంగించారు. అనంతరం 20 సార్లకు పైగా రక్తదానం చేసిన వారిని, ప్రోత్సహించిన డాక్టర్ మల్లికార్జునను శాలువతో సత్కరించారు. -
‘రక్త’సంబంధం
మంచిర్యాల అర్బన్ : రక్తం.. కృత్రిమంగా తయారు చేయలేనిది. అలాగని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సమయాల్లో అందకపోతే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆపద సమయంలో ఒక్కరు రక్తం చేస్తే చాలు ప్రాణాన్ని కాపాడవచ్చు. ఓ కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. అందుకే మేమున్నామంటూ రక్తదాతలు ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు 10.. 16.. 47సార్లు రక్తదానం చేసిన వారూ ఉన్నారు. ఆపదలో ఉన్నవారితో వారికెలాంటి సంబంధం లేకున్నా ‘రక్త’సంబంధం దాతలను ముందుకు నడిపిస్తోంది. జాతీయ నాయకుల జయంతి, ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో స్వ చ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పా టు చేస్తున్నాయి. ఈ నెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రక్తదానంపై అపోహలు వద్దు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానంపై చైతన్యం చేస్తున్నా కొంతమందిలో అపోహలు ఉన్నాయి. అవగాహన రాహిత్యంతో రక్తదానానికి సాహసించడం లేదు. రక్తదానం చేస్తే మనిషి బలహీన పడుతారనేది అపోహ మాత్ర మే. రక్తదానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. మానవుని శరీరం లో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్య క్తి నుంచి 350 మి ల్లీలీటర్ల రక్తం సేకరిస్తారు. ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేసినా ఎలాంటి నష్టం ఉండదు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న వారంతా నిర్భయంగా రక్తదానం చేయొచ్చు. జిల్లాలో.. జిల్లాలో మంచిర్యాల, నిర్మల్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, చెన్నూర్‌లో రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర ప్రమాదాల సమయాల్లో అవసరమైన వారికి రక్తం అందిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. రక్తనిధి కేంద్రం లేక, రక్తం సకాలంలో అందక ఎంతోమంది రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, గర్భిణులు మరణించారు. 2008లో రక్తనిధి కేంద్రం ప్రారంభించారు. తూర్పు ప్రాంత వాసులకు అపర సంజీవనిలా మారింది. రక్తం నిల్వ ఉంచే సౌలభ్య ఉండడంతో ఏటా రక్తం నిల్వలు పెరుగుతున్నాయి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు వరం తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకోసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం మంచిర్యాల బ్లడ్‌బ్యాంకులోనే మార్పిడి చేస్తున్నారు. అవసరమైన గ్రూపు రక్తం అందుబాటులో ఉంచుతున్నారు. 2012లో 152, 2013లో 1,036, 2014లో 1,800 యూనిట్ల రక్తాన్ని అందించారు. రక్తం విడదీసే సౌకర్యం రక్తాన్ని విడదీసి ఎక్కించే సౌకర్యం జిల్లాలోని అన్ని బ్లడ్‌బ్యాంకుల్లో ఉంది. ఒక వ్యక్తి రక్తాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఏ వ్యక్తికి ఏ కణం రక్తం అవసరమో ఆ కణాలనే ఎక్కించే సౌలభ్యం ఉంది. డెంగీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ప్లేట్లేట్స్ ఎక్కిస్తే మిగితా రక్తం మరో వ్యక్తిని అవసరం ఉన్నట్లుగా వినియోగించుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది.. రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచింది. అనార్యోగానికి గురవుతామనే అపోహలు వీడాలి. ఎన్నిసార్లు రక్తదానం చేసినా ఆరోగ్యానికి ఎలాంటి చింత ఉండదు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలి. బ్లడ్‌బ్యాంకులో ఎంత రక్తమైనా నిల్వ చేసుకునే సౌలభ్య ఉంది. యువకులు రక్తదానం చేయడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలి. - డాక్టర్ విష్ణుమూర్తి, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు, మంచిర్యాల 47సార్లు రక్తదానం ఆపదలో ఉన్నవారికి 47సార్లు రక్తదానం చేశాను. ఇప్పటివరకు 1,275 యూనిట్ల రక్తం అందించాను. రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆనందంగా ఉంది. మా తండ్రి మల్యాల రాజయ్య పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహిస్తున్న. నా స్నేహితులు వంద మంది రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రక్తసం అవసరమైన వారు 9700070894, 9908927515 నంబర్లలో సంప్రదించాలి. - మల్యాల శ్రీపతి, మంచిర్యాల తాండూర్ : 1998లో రక్తదానం చేయడం ప్రారంభించి క్రమం తప్పకుండా చేస్తున్న. ఇప్పటివరకు 58సార్లు రక్తదానం చేశాను. అభినవ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎంతోమందిని సభ్యులుగా చేర్పించి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న. వారితో కూడా రక్తదానం చేయిస్తున్న. అన్ని దానాలకన్న రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేస్తేనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం ఉన్న వ్యక్తే ఎన్ని దానాలైనా చేయగలడు. ఇప్పటివరకు రెండు రాష్ట్ర స్థాయి, ఐదు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న. గ్రామస్తాయిలో కూడా రక్తదానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అందరినీ రక్తదాతలుగా మార్చాలన్నదే నా ధ్యేయం. - కె.సంతోష్‌కుమార్, అభినవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, తాండూర్ -
టోటల్ ఫ్రీ సేవలు
ఆరోగ్యశ్రీ కోసం 104 ఆరోగ్యశ్రీ పథకం గురించి 104కు పోన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద అందించే సేవల సమాచారంతో పాటు ఈ పథకం కింద ఎక్కడైనా సేవలు అందకపోయినా, సిబ్బంది స్పందించకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. హెచ్ఐవీ సమస్యలకు 1997 ఎయిడ్స్, సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకునేందుకు 1997 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. హెచ్ఐవీ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు తెలుస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలకు 108 ఎవరైనా ఆనారోగ్యం పాలైనా, ఎక్కడైనా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు 108 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసిన కొద్ది నిమిషాలకే అంబులెన్స్ కుయ్‌కుయ్ మంటూ పరుగులు పెడుతూ వస్తుంది. అంబులెన్స్ రావడం ఆలస్యమైతే ఈ నెంబరుకు మళ్లీ ఫోన్ చేయవచ్చు. బ్లడ్ బ్యాంకు కోసం 1910 ప్రమాదాలు అనుకోకుండా జరుగుతుంటాయి. ప్రాణాపాయంలో రక్తం అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి సమయాలతోపాటు అనారోగ్యంతో బాధపడుతుండే వారికి అత్యవసరంగా రక్తం కావాలన్న సందర్భంలో, సంబంధిత గ్రూపు రక్తం అందుబాటులో ఉందా, లేదా అనే విషయం తెలుసుకునేందుకు 1910 నెంబరుకు ఫోన్ చే యవచ్చు. అగ్నిప్రమాదం సంభవిస్తే 101 ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నెంబరుకు ఫోన్ చేసి ప్రమాద విషయాన్ని చెప్పవచ్చు. వారు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొస్తారు. వేసవికాలంలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వెంటనే గమనించి ఈ నెంబరుకు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. టెలికం సేవలకు 198 టెలిఫోన్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తితే 198కు ఫిర్యాదు చేయవచ్చు. శాఖాపరంగా కావాల్సిన సమాచారం తెలుసుకునేందుకు ఈ నెంబరు ఉపయోగపడుతుంది. పోలీసుల సహాయం కోసం 100 సమాజంలో కళ్లెదుటే జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేనప్పుడు పోలీసుల నుంచి తక్షణ సహాయం కోరేందుకు ఈ నెంబరు ఉపయోగపడుతుంది. సమాజంలో ఎక్కువగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు ఇతర సమస్యలపైనా 100 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. అసాంఘిక కార్యకలాపాలపైఫిర్యాదు కోసం 1090 నేర సంబంధిత సమస్యల గురించి 1090 నెంబరుకు ఫోన్ చేసి తెలపాలి. ఇది జిల్లా విభాగంలో క్రైం విభాగానికి చేరుతుంది. ఇతరులు నుంచి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలు, జూదం, వ్యభిచార నిర్వహణ తదితర వీటిపై ఈ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే సమాచారం కోసం 131 రైళ్లలో ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు రైల్వే రిజర్వేషన్లు, రైళ్ల రాకపోక వివరాలను 131 నెంబరు ద్వారా తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి నడిచే రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఓటరు నమోదుకు 1950 రాజ్యాంగం ప్రకారం మన ఓటును మనమే నమోదు చేసుకోకపోతే అది చాలా తప్పు. అలా కాకుండా ఓటరుగా నమోదు కోసం 1950 నెంబరుకు పోన్ చేయవచ్చు. నమోదుకు కావల్సిన పత్రాలు, ఇతర వివరాలతో పాటు మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఫోన్‌ను దుర్వినియోగం చేయవద్దు ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, విలువైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, సమస్యలను వివరించేందుకు, పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లను ఆయా సంస్థలు ప్రకటించాయి. ఉచితంగా సేవలు అందుతాయి కదా అని, అనవసరంగా ఫోన్ చేసి తప్పుడు సమాచారం అందిస్తే సంబంధిత యంత్రాంగాల సమయం వృథాతోపాటు మరెన్నో అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. అవసరమైన వారికి సేవలు అందించడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. గమనించండి. రైతుల కోసం 1800 425 2977 రైతులకు తమకు కావాల్సిన దాన్యం మద్దతు ధర అమలుకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు 1800425 2977 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. రైతులకు మద్దతు ధర అందనప్పుడు, మిల్లర్లు దోపిడీ చేస్తున్నప్పుడు ఈ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. రైతులకు సంబంధిత అధికారులు సహకారం అందించకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 155333 విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి 155333 నెంబరుకు ఫోన్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, సిబ్బంది పనితీరు, లో ఓల్టేజీ తదితర సమస్యలను సంబంధిత అధికారులకు ఈ నెంబరు ద్వారా తెలియజేయవచ్చు. మీసేవకు 1100 ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన మీసేవా కార్యక్రమాల అమలు తీరు తెలుసుకోవాలంటే 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న మీసేవలు సక్రమంగా పనిచేయకపోతే ఈ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టీసీ సమాచారం కోసం 1800 200 4599 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలపై అసంతృప్తి కలిగితే 18002004599 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో కలిగే అసౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తనపై ఈ నెంబరుకు ఫోన్ చేస్తే సరి. -
రక్తం లేదట!
కామారెడ్డి, న్యూస్‌లైన్: కడుపులో పిండం చనిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన సుగుణ వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించగా, పిండం చనిపోవడంతో గర్భసంచి పగిలినట్టు గుర్తించారు. గర్భసంచి పగలడం మూలంగా తీవ్ర రక్తస్రావమైందని, వెంటనే రక్తం అవసరమని రోగి బంధువులకు తెలిపారు. ఆమెకు కావలసిన రక్తం గు రించి రోగి భర్త గణేశ్‌తో పాటు బంధువులు స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి వె ళ్లారు. అక్కడ రక్తం స్టాక్ లేదన్న సమాధానం వచ్చింది. నిజామాబాద్‌కు వెళ్లినా ఇదే సమాధానం రావడంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎలాగోలా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తం సంపాదించి ఆస్పత్రిలో సుగుణను బతికించుకున్నారు. ఇది ఒక్క సుగుణకు సంబంధించిన సమస్యే కాదు. నిత్యం అలాంటి రోగులెందరో రక్తం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు అ త్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించేందుకు గాను బ్లడ్ బ్యాంకుల్లో ఆయా గ్రూపులకు సంబంధించిన రక్తం నిల్వలు అందుబాటులో ఉంచాలి. అయితే కొంత కాలంగా జిల్లాలో రక ్త సేకరణ విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. పరిస్థితులు ఇవీ కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో కొంతకాలంగా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజు రక్తం కోసం ప ది మంది వరకు వచ్చిపోతున్నారు. అత్యవసర పరిస్థితులలో రక్తం లభించకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. రోగుల బంధువులు రక్తం కోసం నిజామాబాద్,హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వె ళుతున్నారు. తీరా అక్కడికి వెళ్లినా రక్తం స్టాక్ లేదనే సమాధానంతో విస్తుపోతున్నారు. కామారెడ్డిలో బ్ల డ్ బ్యాంక్ బాధ్యతలు మోసిన డాక్టర్ దినేశ్‌రెడ్డి విధుల నుంచి తప్పుకున్నారు. బ్లడ్‌బ్యాంక్ నిర్వహణకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆయన విధులకు దూ రమయ్యారు. అప్పటి నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహణను పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధీనంలో బ్లడ్‌బ్యాంక్ కొనసాగుతోంది. శిబిరాల నిర్వహణ లేకనే రక్తదాన శిబిరాలు జరగకపోవడంతో కొరత ఏర్పడిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు రావడం, వెనువెంటనే వరుసగా వచ్చిన ఎన్నికలతో శిబి రాల నిర్వహణ సాధ్యం కాలేదంటున్నారు. రక్తదాన ఆవశ్యకత గురించి ఎంత ప్రచారం నిర్వహించినా, రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం, నిర్వహణ సరిగ్గా లేక పోవడం మూలంగా రక్తానికి కొరత ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయరహ దారితో పాటు అంతర్రాష్ర్ట రహదారులు ఉన్న కామారెడ్డిలో నిత్యం ప్రమాదాలతో ఎందరినో ఆస్పత్రులకు తీసుకు వస్తుంటారు. వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాల్సి ఉంటే అందుబాటులో రక్తం లేకపోవడం మూలంగా ప్రా ణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రక్త నిల్వల గురించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అంధకారంలో గైనిక్, చిన్న పిల్లల వార్డు
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వజనాస్పత్రిలోని గైనిక్, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 10.30 గంటలకు పునరుద్ధరించారు. ప్యానల్ బోర్డులోని కేబుల్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీన్ని మార్చడానికి రూ.50 వేలు ఖర్చవుతుందని వారు పేర్కొంటున్నారు. దీన్ని గుర్తించడానికే సిబ్బందికి చాలా సమయం పట్టిందని రోగులు వాపోతున్నారు. వార్డుల్లో పది గంటలపాటు కరెంటు లేకపోవడంతో రోగులు, సహాయకులు చీకట్లోనే రాత్రి భోజనాలు చేశారు. ఫ్యాన్లు తిరగకపోవడంతో గాలి లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. నెబులైజేషన్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో పిల్లలు ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. బ్లడ్బ్యాంక్లోని రక్తం చెడిపోతుందేమోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
ఎంజీఎంలో జేసీ హల్చల్
ఎంజీఎం, న్యూస్‌లైన్ : నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాస్పత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు హల్చల్ చేశారు. ఈనెల 19న(ఆదివారం) హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న జేసీ ముందుగా అత్యవసర వార్డు, తర్వాత ఓపీ విభాగం, బ్లడ్‌బ్యాంక్, ఏఆర్టీ సెంటర్, ఏపీఎంఎస్ఐడీసీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను పరిశీలించారు. అనంత రం రోగులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. సాయంత్రం 6.00 గంటల తర్వాత సూపరిం టెండెంట్ చాంబర్లో సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, హెచ్ఓడీ కరుణాకర్‌రెడ్డి, బలరాం, డైటీషియన్ వీరమల్లు తదితరులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం ఆస్పత్రిలో 1.10 కోట్లతో ఏపీఎంఎస్ఐడీసీ అధికారు లు చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించినప్పుడు చేపట్టిన పనుల వివరాలు తెలుపాలని కోరారు. ఓపీ విభాగంలో రోగుల సౌకర్యార్థం రక్త సేకరణ గదిలో చేపట్టిన టాయ్లెట్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిన విషయాన్ని గ్రహించిన ఆమె ఈఈ దేవేందర్‌పై మండిపడ్డారు. నాసిరకంగా పనులు నిర్వహిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణాలపై సూపరింటెండెంట్‌తో చర్చించి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడల్ డయాగ్నస్టిక్స్ నిర్వహణపై జేసీ నిప్పులు చెరిగారు. ఇన్‌పేషంట్ల రిపోర్టులు సెంటర్లోనే దర్శనమివ్వడం, ఈనెల 7న తీసిన స్కానింగ్ రిపోర్టులు వార్డుకు చేరకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రోగులకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంజీఎం ఇన్పే షంట్లకు ఇవ్వడం లేదని పలువురు రోగులతోపాటు వైద్యసిబ్బంది సైతం ఆమెకు వివరించారు. మెడల్ నిర్వహణతీరును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఎన్ని స్కానింగ్‌లు తీస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. వేయ్యి పడకల ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న డైట్(భోజనాన్ని) ఎలా ఉంటుందని జేసీ పౌసుమిబసు సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్లతోకలిసి రుచిచూశారు. డైట్లో అందుబాటులో ఉంచిన సరుకులను సైతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడీ తీరుపై అసహనం ఆస్పత్రి అసిస్టెండ్ డెరైక్టర్ విధులు నిర్వహిస్తున్న తీరుపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. అతను పలువురు సిబ్బం దికి సంబంధించిన సెలవులు, ఆయ సంతోషమ్మ వేతన చెల్లింపు విషయంలో అతడి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథ శిశువుల తరలింపు కోసం ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు ఎంజీఎంలో 9 మంది అనాథ శిశువులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు సుమారు ఆరు నెలలుగా ఎంజీఎంలోనే ఉండడంతో ఆస్పత్రి సిబ్బందికి ఇబ్బంది మారింది. ఆ చిన్నారులను శిశు గృహాలకు తరలించాలని ఏన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడంతో సంబంధిత సిబ్బంది జేసీకి వివరిం చారు. దీంతో ఆమె అనాథ పిల్లలను తరలించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రక్తనిధి.. సేకరణ ఏదీ?
వికారాబాద్, న్యూస్‌లైన్: మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతముఖ్యమో రక్తమూ అంతే. నిత్యం ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి అభాగ్యుల ప్రాణ రక్షణకు రక్తం అత్యవసరమవుతుంది. కొన్నిసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించేటప్పుడు రక్తం అవసరమవుతుంది. సరైన రక్తం ఎక్కించి ఇలాంటి సందర్భాల్లో రోగికి ప్రాణదానం చేయవచ్చు. సరైన గ్రూపు రక్తం దొరక్క ఎందరో ప్రాణాలు విడిచి ఉంటారు. రక్తం అందక పశ్చిమ రంగారెడ్డి పరిధిలో రెండేళ్ల క్రితం వరకూ 642 మంది గర్భిణులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నట్లు సమాచారం. రక్తం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారు తిరిగి వచ్చే సరికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఈలోగా క్షతగాత్రులు, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రక్తం అవసరాన్ని గుర్తించి రెండేళ్ల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య ఉద్దేశం .. దారిధ్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో గర్భిణులు ప్రసవ సమయంలో రక్తం లేకుండా చనిపోకూడదని భావించిన రాష్ర్ట ప్రభుత్వం రక్తనిధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వీటి నిర్వహణ బాధ్యతను రెడ్‌క్రాస్ సొసైటీలకు అప్పగించింది. మొక్కుబడిగా... వికారాబాద్‌లో మొదట హంగూ ఆర్భాటాలతో ప్రారంభమైన ఈ రక్తనిధి కేంద్రం నేడు మొక్కుబడిగా కొనసాగుతోంది. ఒక డాక్టర్, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు, ఒక వాచ్‌మన్, ఒక హెల్పర్, స్వీపర్, ఒక సెక్యూరిటీ ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 20 యూనిట్లు మాత్రమే.. ఐదు వేల యూనిట్ల వరకు రక్తాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం వికారాబాద్ రక్తనిధి కేంద్రానికి ఉందని, అయితేప్రస్తుతం ఇక్కడ నిల్వ ఉన్నది 20 యూనిట్లు మాత్రమేనని డాక్టర్ పవన్‌కుమార్ వెల్లడించారు. రక్తనిధి కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ1000 యూనిట్ల రక్తాన్ని మాత్రమే రక్తదాన శిబిరాల ద్వారా సేకరించారు. ఇందులో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు 400 యూనిట్ల రక్తాన్ని, హైదరాబాద్‌లోని విద్యానగర్ కేంద్రానికి 350 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేశారు. -
నిబంధనలకు నీళ్లు!
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్ (రక్తనిధి కేంద్రం) అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. రక్తనిధి కేంద్రంలో రక్తం నిల్వలు ఉన్నా... బోర్డులో లేనట్టు చూపిస్తున్నారు. దీంతో కేంద్రానికి వస్తున్న రోగుల బంధువులు నిరాశతో వెనుదిరుగుతు న్నారు. వాస్తవానికి బ్లడ్‌బ్యాంక్ బోర్డులో ప్రతిరోజూ కేంద్రంలో ఉన్న రక్త నిల్వల వివరాలు గ్రూపులతో సహా పొందుపరచాలి. అప్పుడే రక్తం నిల్వల వివరాలు తెలుసుకుని రోగుల బంధువులు వాటిని తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రు. బోర్డులో రక్త నిల్వల వివరాలు పొందుపరచడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రక్తం ఆక్రమంగా తరలిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తనిధి కేంద్రంలో పదుల సంఖ్య లో బ్లడ్ ఉన్నప్పటికీ అధికారులు వాటి వివరాలు బోర్డులో పొందుపరచకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ప్రభుత్వ బ్లడ్బ్యా ంక్ కనుక ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు మాత్రమే రక్తం అందించాలి. కానీ ఇక్కడి అధికారులు ప్రైవేటు బ్లడ్ బ్యాం క్లకు ఎక్కువగా రక్తం అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నారుు. ముఖ్యంగా పట్టణంలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఇక్కడి రక్తం ఎక్కువగా తరలిస్తున్నట్టు సమాచారం. రక్తం అవసరమైన వారందరికీ రక్తం ఇవ్వాల్సి ఉన్నా... అధికారులు పట్టించకోవడం లేదు. అడిగిన వారందరికీ రక్తం ఎలా ఇవ్వగలమని బ్లడ్ బాంక్కు చెందిన ఓ ఉద్యోగి ప్రశ్నించడం గమనార్హం. వాస్తవానికి అవసరమైన వారందరికీ రక్తం అందించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ పిడి ఐదు నెలలు క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ అవేవీ ఇక్కడ అమలు కావడం లేదు. ఈ విషయమై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖాధికారి డి. సుధాకర్ పట్నాయక్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా రక్తం వివరాలు గ్రూపుతో సహా బోర్డులో పొందుపరచాలన్నారు. కేంద్రాస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో వివరాలు పొందుపరచాలని పలుమార్లు అధికారులకు చెప్పామని తెలిపారు. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బొక్కలవాగుకు మహర్దశ
మంథని, న్యూస్‌లైన్ : మంథని ప్రజలకు ఇక బొక్కలవాగు వరద ముం పు నుంచి విముక్తి లభించనుంది. వాగు నుంచి మూడు కిలోమీటర్ల వరకు వరద కట్టల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వం రూ.34.08 కోట్ల నిధులు కేటాయిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. నియోజక వర్గాన్ని ఆనుకుని ప్రవహించే బొక్కలవాగు ఏటా ఓ మోస్తరు వర్షానికే ఉప్పొంగుతూ పరివాహక ప్రాంత ప్రజలను ముంపునకు గురి చేస్తోంది. ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చే మంత్రి శ్రీధర్‌బాబుకు బాధితులు తమ సమస్యను ఏకరువుపెడుతున్నారు. దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తామని ఆయన ప్రతిసారీ హామీ ఇస్తున్నా ఆలస్యమవుతూనే ఉంది. ఎట్టకేలకు వాగు ఫ్లడ్‌బ్యాంక్ అభివృద్ధికి భారీ నీటిపారుదల శాఖ రూ.34.08 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వాగు వంతెన నుంచి ఇరువైపులా మూడు కిలోమీటర్ల వరకు వరద కట్టల నిర్మాణం, మరమ్మతు చేయనున్నారు. మంథని పట్టణం వైపు అరకిలోమీటరు మేర కట్ట అభివృద్ధి, సైడ్‌వాల్స్ నిర్మాణం, అలాగే లైన్‌గడ్డ వైపు నూతనంగా కట్ట నిర్మాణం, మరమ్మతులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, హైదరాబాద్ ట్యాంకుబండ్ తరహాలో ఈ మూడు కిలోమీటర్ల మేర కట్టపై, నీటిలో అభివృద్ధి పనులు చేపడతారు. కాగా, పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.3.21 కోట్లతో కొత్తగా హైలెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది. ఆ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. నెల క్రితం బోయిన్‌పేటలో రూ.కోటితో ఏకో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఫ్లడ్‌బ్యాంక్ అభివృద్ధి, పార్కు పనులు పూర్తయితే బొక్కలవాగుకు మహర్దశ పట్టనుంది. ఇక్కడి ప్రజలకు ఆహ్లాదం, ఆనందం అందుబాటులోకి రానుంది. బొక్కలవాగు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రాములోరి క్షేత్రంలో నెత్తుటి వ్యాపారం
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీకి కేంద్రమైన భద్రాచలంలో రక్తపు వ్యాపారం జోరుగా సాగుతోంది. భద్రాద్రి రామయ్య క్షేత్రంలో కొందరు అనుమతుల్లేకుండా ల్యాబులు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం బ్లడ్‌బ్యాంక్ మూతపడడంతో ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది ల్యాబ్ నిర్వాహకులు రక్తంతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. రోగుల అవ సరాన్ని ఆసరా చేసుకుని బాటిల్‌కు రూ. 3 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. భద్రాచలంలో 14 ల్యాబులు ఉండగా వీటిలో రక్తసేకరణ, నిల్వకు ఏ ఒక్క ల్యాబ్‌కూ అనుమతుల్లేవు. అయినా పట్టణంలోని రెండు ల్యాబుల్లో రక్తం సేకరణ, విక్రయాలు దర్జాగా సాగుతున్నట్లు ప్రచారం ఉంది. రక్త సేకరణ తర్వాత హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌సీవీ టెస్టులు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. భద్రాచలంలోని కొన్ని ప్రైవేటు ల్యాబుల్లో హెచ్‌సీవీ పరీక్ష అసలే జరగడం లేదని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలీసాటెస్టు చేస్తారు. కానీ ప్రైవేటు ల్యాబుల్లో ర్యాపిడ్ కిట్స్‌తో పరీక్షలు చేస్తుండడంతో రోగ నిర్ధారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తసేకరణ సమయంలో వివిధ పరీక్షల నిమిత్తం రూ.700, బాటిల్ ఖరీదు రూ.150, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బాటిల్ రక్త సేకరణకు సుమారు రూ. వెయ్యి ఖర్చవుతుంది. అవసరమైన రోగులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దీన్ని రూ. 850కు కొనుగోలు చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు మూతపడడంతో అక్రమార్కుల పంట పండినట్టయ్యింది. ఏజెన్సీలోని వివిధ మండలాల నుంచి ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి గర్భిణులకు దాదాపుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రమాదబారిన పడి వచ్చే వారికీ రక్తం అవసరం. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు అందుబాటులో లేకపోవడంతో కొత్తగూడెం, ఖమ్మం తదితర పట్టణాలకు వెళ్లలేక కొంతమంది రోగులు అనధికారికంగా నిర్వహిస్తున్న ల్యాబుల్లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రాన్ని వెంటనే తెరిపించి నిరుపేద రోగులకు ఆపన్న హస్తం అందించాలని పలువురు కోరుతున్నారు. రక్త పరీక్షల్లోనూ దోపిడీ భద్రాచలంలోని కొన్ని ల్యాబుల్లో నిర్వాహకులు రోగ నిర్ధారణ పరీక్షల్లోనూ అడ్డగోలుగా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంటింగ్ యంత్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులపై కాసుల వర్షం కురుస్తోంది. ప్లేట్లెట్స్ కౌంట్ రిపోర్టులు తప్పలతడకగా ఇస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. బస్టాండ్ ఎదుట, వెనుక ఉన్న రెండు ల్యాబుల్లో ఒకే వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు వేర్వేరుగా వచ్చినట్లు అప్పట్లో దుమారం లేచింది. ప్రభుత్వాస్పత్రిలో యంత్రం లేకపోవడం వల్లే ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆస్పత్రులకు అనుబంధంగానూ సొంతంగానూ ఏర్పాటు చేసుకుంటున్న ల్యాబులపై వైద్య, ఆరోగ్యశాఖాధికారులు దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సరైన తనిఖీ లేకపోవడంతో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ల్యాబుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. రక్తాన్ని సేకరిస్తే కఠిన చర్యలు: సురేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫెక్టర్ ప్రైవేటు ల్యాబుల్లో రక్తసేకరణ, విక్రయం నేరం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ల్యాబ్ నిర్వహణలో కొన్ని అంశాలనే మేము పరిశీలిస్తుంటాం. మిగతా అనుమతులన్నీ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. -
‘రక్తనిధి’ ఏదీ!
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి (బ్లడ్‌బ్యాంకు) ఏర్పాటు చేస్తామని ఎనిమిది నెలల క్రితం సీఎం కిరణ్ చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోవడంలేదు. దీంతో రక్తనిధి హుళక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాండూరు పర్యటనలో జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. సీఎం ప్రకటన చేసి 8 నెలలు దాటినా ఇంత వరకూ రక్తనిధి అందుబాటులోకి రాలేదు. ఈ ఆలస్యానికి వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులు శ్రద్ధ కనబర్చకపోవడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణులకు, క్షతగాత్రులకు సహాయకారి.. 200 పడకలున్న జిల్లా ఆస్పత్రిలో కాన్పుల కోసం నెలకు సుమారు 200 మంది గర్భిణులు వస్తుంటారు. ఇందులో రక్తహీనతతో బాధపడే గర్భిణులు 20 మంది ఉంటారని తెలుస్తోంది. వీరికి తెలిసి వారి నుంచి రక్తం సేకరించడమో లేదా హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం జరుగుతోంది. ఒక్కోసారి కాన్పు సమయం దగ్గర పడుతున్నా రక్తం లభించక ఇబ్బందులు పడాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక సరిహద్దులోని తాండూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అధికంగానే జరుగుతుంటాయి. ఈ క్రమంలో గాయపడ్డ వారికి తీవ్ర రక్తస్రావం వల్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. రక్తం అధికంగా పోవడం వల్ల హైదరాబాద్‌కు తరలించేలోపు క్షతగాత్రుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోందనే వాదనలు ఉన్నాయి. రక్తనిధి అందుబాటులో ఉంటే గాయపడ్డవారికి అవసరమైన మేరకు రక్తం ఎక్కించి హైదరాబాద్ తరలించి చికిత్స అందించే వరకు ప్రాణాలకు ముప్పు తప్పే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు, వైద్యవిధానపరిషత్ అధికారులు మాత్రం రక్తనిధిని అందుబాటులోకి తీసుకురావడానికి చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నీ సమకూర్చారు.. కానీ.. రెండు నెలలుగా లెసైన్స్ రావాల్సి ఉందని జిల్లా ఆస్పత్రి కో-ఆర్డినేటర్ హన్మంత్‌రావు, సూపరింటెండెంట్ వెంకటరమణప్పలు చెబుతున్నారు. డ్రగ్‌కంట్రోల్ అథారిటీ నుంచి రావాల్సిన రక్తనిధి లెసైన్స్‌లో జాప్యంతో రేపుమాపు అంటూ నెలలుగా జరుపుకొస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటుకు ప్రత్యేక గది, సౌకర్యాలు కల్పించారు. రక్తం నిల్వకు సంబంధించి సామగ్రి వచ్చింది. కానీ సేవలు మాత్రమే అందుబాటు రావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యవిధాన పరిషత్ అధికారులు, జిల్లా ఆసుపత్రి బాధ్యులు చొరవ చూపి రక్తనిధి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.