
ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు
సాక్షి, సిటీబ్యూరో: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా శుక్రవారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో అభివూనులు, రాష్ట్ర చిరంజీవి యువత కార్యకర్తలు రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు, దేవాలయూలో పూజలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో 25 వేల వుందికి పైగా రక్తదానం చేసినట్టు రాష్ట్ర చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
నగరంలోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన కార్యక్రవూన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. నగరంలో నిర్వహించిన శిబిరాలలోనే 2,365 వుంది రక్తదానం చేసినట్టు నాయుడు తెలిపారు. ఫిల్మింనగర్ శ్రీదాసాంజనేయు స్వామి గుడిలో లక్ష తవులపాకులతో చిరంజీవి పేరిట పూజా కార్యక్రవూలు నిర్వహించారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, నాగబాబు భార్య పద్మ, విశాఖ, అనంతపురం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభివూనులు పూజా కార్యక్రవూలు నిర్వహించారు.
జన్మదిన వేడుకల్లో చిరంజీవి కువూరుడు రామ్‌చరణ్, కుటుంబ సభ్యులు ధర్మతేజ్, వరుణ్‌తేజ్, అల్లు అరవింద్ పాల్గొన్నారు. 59 కేజీల కేక్‌ను రామ్‌చరణ్ కట్ చేశారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రవూన్ని సినీనటుడు నాగబాబు వుణికొండలో ప్రారంభించగా, 20న రెండు రాష్ట్రాలలో 2 లక్షల వుంది పేదలకు అన్నదాన కార్యక్రవుం నిర్వహించినట్టు నాయుుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రవూల్లో పలువురు ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, నిర్మాతలు, ప్రవుుఖులు, అభివూనులు పాల్గొన్నారని తెలిపారు.