megastar Chiranjeevi
-
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్.. ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు. విశ్వంభరలో చిరంజీవి..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi. Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG— ANI (@ANI) January 13, 2025 -
గేమ్ ఛేంజర్ రిలీజ్.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమాకు చాలామంది ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందన్నారు. అప్పన్న, రామ్ నందన్ పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా చేశారని తనయుడిని కొనియాడారు. ఈ సందర్భంగా సక్సెస్ సాధించిన గేమ్ ఛేంజర్ చిత్రబృందానికి ఆయన అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను అందించిన దర్శకుడు శంకర్‌తో పాటు దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.Delighted to see lots of appreciation for @AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue & Ram Nandan, the determined IAS officer out to cleanse the system. Hearty Congrats to @iam_SJSuryah @advani_kiara @yoursanjali ,Producer #DilRaju @SVC_Official , above…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 10, 2025 నాలుగు పాటలకే రూ.75 కోట్లు..ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్ ఖర్చు చేయడంపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. అందువల్లే ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.గేమ్ ఛేంజర్ కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా
సాక్షి, హైదరాబాద్: ‘ఆంట్రప్రెన్యూర్షిప్’ అంటే స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. దాని గురించి పెద్దగా మాట్లాడలేను. నా గురించి చెప్తా. తిరుగులేని మనిషి అనే సినిమా ఎన్టీఆర్‌తో చేస్తే ఫ్లాప్ అయ్యింది. తర్వాత డేట్లు చెప్పిన వ్యక్తి సినిమా నుంచి నన్ను తీసేశారు. ఏమైందంటే సినిమా పోయింది కదా అన్నారు. ఆ పరిస్థితుల్లో కుంగిపోయాను. ఐరన్ లెగ్ అనే పేరొస్తుందని భయపడ్డా. ఆకాశంలో గద్ద గుర్తొచి్చంది. అది కొంతవరకే కష్టపడి ఎగరాలి. తర్వాత గాలితో పాటు సునాయాసంగా పైకి ఎగరగలుగుతుంది.నన్ను నేను అలా మార్చుకోవాలని అనుకున్నా. నన్ను వద్దు అనుకున్న వ్యక్తితోనే ఎన్టీఆర్ కంటే ఎక్కువ చిత్రాలు తీసేలా మలచుకున్నా. పరిస్థితులు ఎలా ఉన్నా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన సానుకూల దృక్పథమే మనకు బలం..’అని ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో ఆప్టా (అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాజ్‌కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం ‘విమర్శించే వారు మన గురించి ఆలోచన చేసే విధంగా మనం ఉండాలి. సినిమాల్లోకి కొత్తవారు వస్తారు. టాలెంట్ ఉంటే నడిచిపోతుందనుకుంటారు. అది సెకెండరీ. ప్రవర్తన బాగుండాలి. నైపుణ్యంతో పాటు వ్యక్తిత్వం ఉండాలి. ఎన్టీఆర్ తర్వాత నేనే టాప్‌లో నిలిచా. కానీ స్థానం కోసం ఏనాడూ ఆరాట పడలేదు. మన కుటుంబంలో 9 మంది నటులు ఉన్నారు. రాజ్‌కపూర్ కుటుంబంలా మన కుటుంబం ఉండాలని పవన్ అన్నాడు. అన్నట్టుగానే దక్షిణ భాతర దేశపు రాజ్‌కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం..’అని చిరంజీవి చెప్పారు. అంతకుముందు జరిగిన ప్యానల్ చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించడం, దాన్ని విజయవంతం చేయడానికి విశ్వాసం, దూర దృష్టి, సహనం, స్వీయ క్రమశిక్షణ, సంకల్పం ఉండాలన్నారు.పోటీతత్వం లాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు టీం, యాజమాన్య బాధ్యతలు అప్పగించడం వల్ల మరింత అంకితాభావంతో పనిచేస్తారని తెలిపారు. చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్యానలిస్టులు అభిప్రాయపడ్డారు. కేటలిస్ట్ బిజినెస్ పిచ్ పోటీలో టాప్ 5 స్టార్టప్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అందులో ముగ్గురిని విజేతలుగా ప్రకటించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆప్టా చైర్మన్ సుబ్బు కోట, బిజినెస్ ఫోరం చైర్మన్ రమేష్, కన్వినర్ సాగర్, కమిటీ సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
తండ్రికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తండ్రికి నివాళులర్పించారు. చిరంజీవి(Chiranjeevi) తన తండ్రి వెంకట రావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరు తల్లి అంజనాదేవితో పాటు నాగబాబు దంపతులు ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో షేర్ చేశారు. 'జన్మనిచ్చిన మహానీయుడిని ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ' అంటూ ఫోటోలు, వీడియోను పంచుకున్నారు.కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మెగాస్టార్‌తో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, మాధవి, విజయ దుర్గ జన్మించారు. కాగా.. చిరంజీవి తండ్రి వెంకటరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు.కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర(vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లోత్రిశూలంతో చిరంజీవి కనిపించారు. 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది.కాగా.. కోలీవుడ్ భామ త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ… 🙏🙏 pic.twitter.com/MKxIw57pBZ— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2024 -
ఆయన సినిమాలు మనదేశ సంస్కృతిలో భాగం: డైరెక్టర్ మృతి పట్ల మెగాస్టార్ సంతాపం
ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. మనదేశంలో అత్యుత్తమ డైరెక్టర్లలో ఆయన ఒకరని కొనియాడారు. ఆయన సినిమాలు, డాక్యుమెంటరీలు మనదేశం గొప్ప సంస్కృతిని తెలుపుతాయంటూ ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన శ్యామ్ బెనెగల్ సాబ్ రచనలు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మెగాస్టార్ పోస్ట్ చేశారు.డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి..సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. Deeply saddened at the departure of Shri Shyam Benegal,one of the finest film makers and great intellectuals of our country. He discovered & nurtured some of the brightest film talents of India. His films, biographies and documentaries form part of India’s greatest cultural…— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2024 -
వివాహ వేడుకలో అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఓ పెళ్లిలో సందడి చేశారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.అయితే ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కనిపించడం మరో విశేషం. వధూవరులను మెగాస్టార్ ఆశీర్విదిస్తున్న ఫోటో తెగ వైరలవుతోంది. ఓకే పెళ్లికి అల్లు, మెగా ఫ్యామిలీ సభ్యులు హాజరవడంతో టాలీవుడ్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అల్లు అరవింద్ ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి ఓకే పెళ్లిలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.మరోవైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని విధంగా ఆల్ టైమ్ రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. View this post on Instagram A post shared by साधना सिंह📿 (@sadhnasingh1) -
అఫీషియల్: మెగాస్టార్‌తో జతకట్టిన హిట్ డైరెక్టర్.. హీరో నాని కూడా!
దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.నాని తన ట్వీట్లో రాస్తూ..'ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఆయన కోసం గంటల తరబడి క్యూలైన్స్‌లో వెయిట్ చేశా. నా సైకిల్‌ను కూడా కోల్పోయా. కానీ ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదంతా ఒక చక్రం లాంటిది. దర్శతుడు శ్రీకాంత్‌తో కలిసి ఆ కల నెరవేరబోతోంది' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.మెగాస్టార్ రిప్లైశ్రీకాంత్ ఓదెల, నానితో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాతే చిరంజీవి- శ్రీకాంత్ కాంబోలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024 -
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
'క' టీమ్‌ను అభినందించిన మెగాస్టార్.. కిరణ్ అబ్బవరం పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు)తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'క' మూవీ టీమ్‌ను అభినందించారు. వారితో దాదాపు గంటకుపైగా మాట్లాడారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిరంజీవితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుందని కిరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Appreciation from the BOSS 😇Thank you so much @KChiruTweets gaaru for the 1 hour long memorable conversation ❤️Always feels blessed whenever i meet you sir 😇#KA #DiwaliKAblockbuster pic.twitter.com/9TdAp5hqwT— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 10, 2024 -
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
విశ్వంభర గ్రాఫిక్స్ పై చిరు కు బిగ్ టెన్షన్..!
-
మెగాస్టార్ సరసన కథనాయకి.. ఈ స్టార్ హీరోయిన్ తల్లిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్ఆర్పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.ఏఎన్నార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
అక్కినేనికి డై హార్డ్ ఫ్యాన్ ఆమెనే: మెగాస్టార్ చిరంజీవి
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్‌లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు. నాకు డ్యాన్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు. -
మెగాస్టార్‌కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
‘నాగబంధం’ సినిమాకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
దేవి శ్రీ ప్రసాద్ కి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో చూడండి..
-
నాగబంధం సినిమా గ్రాండ్ ఓపెనింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
-
డైరెక్టర్ వి.వి.వినాయక్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి
-
రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. మహిళా మంత్రిగా ఉండి ఆమె చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని అన్నారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు.చిరు తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డా. సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సభ్యులు టార్గెట్‌గా మారడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం సరైంది కాదు. తమ రాజకీయ మనుగడ కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదు. రాజకీయాల కోసం ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్)సమాజాన్ని మంచిగా మార్చడానికి మేము నాయకులను ఎన్నుకుంటామని మెగాస్టార్ ట్వీట్లో ప్రస్తావించారు. మీ ప్రసంగాల ద్వారా దానిని కలుషితం చేయకూడదని హితవు పలికారు. రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఉదాహరణగా ఉండాలని సూచించారు. ఇలాంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి పోస్ట్ చేశారు. I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister. It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024 -
శంకర్బాబుని పిలవండి... డ్యాన్స్ చేస్తాడనేవారు
156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల డ్యాన్స్ మూమెంట్స్... ఆ 24వేల డ్యాన్స్ మూమెంట్స్ హీరో చిరంజీవి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరేలా చేశాయి. యాక్టర్, డ్యాన్సర్ విభాగంలో ‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు చిరంజీవిని ఈ రికార్డ్‌కి ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డ్‌ని అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘నటనకు అవార్డులు వస్తాయని తెలుసు. కానీ ఇలా డ్యాన్సులకు రావడం అనేది ఊహించలేదు. నాకు నటన మీదకన్నా డ్యాన్స్ మీద ఆసక్తి ఎక్కువ. బహుశా అదే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి, మనకు సంబంధం ఏంటి? అని అనుకుంటాం కదా. అందుకని ఈ రికార్డు గురించి నాకు ఊహే లేదు. డ్యాన్స్ అనేది నాకు అదనపు అర్హత అయితే నా కొరియోగ్రాఫర్లు, నా ఈ విజయంలో నా దర్శక–నిర్మాతలు, అభిమానుల పాత్ర మరువలేనిది. నటనకన్నా ముందే డ్యాన్స్‌కి ఓనమాలు చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి వివిధభారతి, రేడియో సిలోన్లో వచ్చే పాటలకు డ్యాన్సులు చేసేవాడిని. రేడియోల్లో పాటలు రాగానే, ‘శంకర్‌బాబు (చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్) ని పిలవండి. డ్యాన్సులు వేస్తాడు’ అనేవారు. ఉత్సాహంగా స్టెప్పులు వేసేవాడిని. ఎన్సీసీలో చేరాక సాయంత్రాల్లో తిన్నాక అల్యూమినియమ్ ప్లేట్లను తిరగేసి వాయించి డ్యాన్సులు వేసేవాడిని కాలు జారి పడినా ఆపలేదు ఒకసారి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సావిత్రి, రోజా రమణి, కవిత, నరసింహరాజు... ఇలా అందరూ సాయంత్రం ఓ పంచలో కూర్చున్నారు. లైట్‌గా వర్షం పడుతోంది. నన్ను డ్యాన్స్ చేయమని అడిగారు. వర్షానికి కాలు జారి కిందపడినా ఆపలేదు. దాన్ని నాగిని డ్యాన్సులాగా మార్చేసి స్టెప్పులేశాను. అక్కడున్న కో–డైరక్టర్ చూసి దర్శకుడు క్రాంతికుమార్‌గారికి చె΄్పారు. ప్రాణం ఖరీదు’కి నన్ను తీసుకున్నప్పుడు ‘ఏలియల్లో ఏలియల్లో ఎందాక...’ అనే పాటను పెట్టారు. ఆ పాటకు స్టెప్ వేశాను. దానికన్నా ముందు ‘పునాది రాళ్లు’లోనూ డ్యాన్స్ వేస్తూ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాను. చిరంజీవి ఉంటే ఎక్కువ డబ్బు అన్నారు ఆ రోజుల్లో లింగమూర్తిగారు డిస్ట్రిబ్యూషన్‌కి చీఫ్. ఆయన ఏ నిర్మాత కథ వింటారు? ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారనే పరిస్థితి ఉండేది. ఒకసారి ఆయన ‘చిరంజీవి అని కొత్తగా వస్తున్నాడు. అతనితో సినిమాలు చేస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాను. లేదంటే లిమిటెడ్‌గా ఇస్తాను’ అన్నారు. దాంతో అందరూ చిరంజీవినే పెట్టుకుందాం అనుకునేవారు. లింగమూర్తిగారికి ప్రజానాడి తెలుసు. ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసమే సినిమాలకు వస్తున్నారు. అలాంటప్పుడు ఇతనితో సినిమాలు చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని ఆయన మా నిర్మాతలతో అనడం.. వాళ్లు కూడా నాకు అవకాశాలు ఇవ్వడం అన్నది నాకు ప్లస్ అయింది’’ అన్నారు. ఆ డ్యాన్సుల్లో మనసు కనబడుతుందిఆమిర్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు ఫోన్ చేసి, ఈవెంట్‌కి రావాలని అడిగినప్పుడు ‘అడగకూడదు... మీరు ఆర్డర్ వెయ్యాలి’ అన్నాను. చిరంజీవిగారి డ్యాన్సులు ఎందుకు బాగుంటాయంటే ఆ డ్యాన్సుల్లో ఆయన మనసు కనబడుతుంది. తనని తాను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు కాబట్టి చూడ్డానికి మనకు రెండు కళ్లూ సరిపోవు’’ అన్నారు. 537 పాటలు చూడటం నాకో మంచి అనుభూతి రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి 46 ఏళ్ల కెరీర్లో రిలీజైన కమర్షియల్ సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. 156 సినిమాలనేది అద్భుతమైన అచీవ్మెంట్. ఆ సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేసిన పాటలను తీసుకున్నాం. 537 పాటల్లో ఆయన వేసిన 24 వేల డ్యాన్స్ మూవ్స్ చూశాం. ఆ పాటలు చూడటం వ్యక్తిగతంగా నాకు మంచి అనుభూతినిచ్చింది. ఆయనకు గిన్నిస్ రికార్డ్ అందించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్‌కు చిరంజీవి ఓ పెన్నుని బహుమతిగా అందజేశారు. ఇంకా దర్శక–నిర్మాతలు కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్ర రావు, బి. గోపాల్, గుణశేఖర్, బాబీ, వశిష్ఠ, అశ్వనీదత్, కేఎస్ రామారావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, పి. కిరణ్, చిరంజీవి కుటుంబ సభ్యులు సుష్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజునే చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకోవడం ఓ విశేషం. కాగా సరిగ్గా చిరంజీవి పుట్టిన సంవత్సరం 1955లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి శ్రీకారం జరిగింది. అయితే చిరంజీవి పుట్టిన తేదీ 22 కాగా... ఈ రికార్డ్‌కి శ్రీకారం చుట్టింది 19వ తేదీన.25 రోజులుగా చికున్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని యాంకర్ పేర్కొన్నారు. ఆయన కోలుకుంటున్నారని కూడా తెలిపారు. -
సీఎంకు చెక్కులు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది: మెగాస్టార్ ట్వీట్
సిపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి సామాన్య ప్రజల గొంతుగా ఆయన చేసిన కృషి మరువలేనిదని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. సీతారాం ప్రజా సేవ, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన సీతారాం ఏచూరి మరణించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు)కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. . సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. Deeply distressed by the news of the passing of Shri Sitaram Yechury, a veteran leader with over five decades of political journey and a tall leader of the CPM. Since starting as a student activist, Shri Yechuri had always strived to be the voice of the downtrodden and common…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 13, 2024