టాలీవుడ్ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్ పేరిట తీసుకురావడం శుభపరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమన్నారు. సమాజంలో మార్పు కోసం జీవితమంతా ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడైన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమన్నారు. ఈ మేరకు గతంలో పద్మ అవార్డుల కార్యక్రమంలో తాను మాట్లాడిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.
మెగాస్టార్ ట్వీట్‌లో రాస్తూ..'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని.. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు.. ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామం. తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నా' అంటూ పోస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment