మీరే నాకు ఎప్పటికీ ఆదర్శం: మెగాస్టార్ కూతురు ప్రశంసలు | Susmitha Konidela Congratulates Her Father For Getting Padma Vibhushan | Sakshi
Sakshi News home page

Susmitha Konidela: నాన్నా.. మీరే నా ఆదర్శం:  మెగాస్టార్ కూతురు ట్వీట్‌

Published Sun, Jan 28 2024 4:16 PM | Last Updated on Sun, Jan 28 2024 6:29 PM

Susmitha Konidela Congratulates Her Father For Getting Padma Vibhushan - Sakshi

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 75వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత అందుకున్న నటుడిగా మెగాస్టార్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగా కోడలు ఉపాసన సైతం మామయ్యకు కంగ్రాంట్స్ చెబుతూ ట్వీట్ చేసింది.

తాజాగా మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. నాన్న మీరు ఒక స్ఫూర్తి, గౌరవం, ఆశీర్వాదం కూడా. పద్మవిభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాదే ఈ ఏడాదిలో పద్మ అవార్డులు దక్కించుకున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement