Konidela
-
యాభైఏళ్ల రాజీనామా
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’. అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. -
Lavanya Tripathi Konidela Photos: మెగా కోడలి లేటెస్ట్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
ఆమెను కలవడం ఆనందంగా ఉంది: ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
-
మెగా డాటర్‌కు స్పెషల్ విషెస్.. లావణ్య త్రిపాఠి, ఉపాసన పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్లో కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు గడించింది. తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. -
అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
ట్విన్ సిస్టర్ను కలిసిన క్లీంకార.. ఉపాసన ట్వీట్ వైరల్
-
మీరే నాకు ఎప్పటికీ ఆదర్శం: మెగాస్టార్ కూతురు ప్రశంసలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 75వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత అందుకున్న నటుడిగా మెగాస్టార్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగా కోడలు ఉపాసన సైతం మామయ్యకు కంగ్రాంట్స్ చెబుతూ ట్వీట్ చేసింది. తాజాగా మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. నాన్న మీరు ఒక స్ఫూర్తి, గౌరవం, ఆశీర్వాదం కూడా. పద్మవిభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాదే ఈ ఏడాదిలో పద్మ అవార్డులు దక్కించుకున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేసింది. Dad, you are an Inspiration, an honour and a blessing. #PadmaVibhushan Heartiest congratulations to all the Padma awards this year. @KChiruTweets pic.twitter.com/jT17b8hdZd — Sushmita Konidela (@sushkonidela) January 28, 2024 -
వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !
ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
‘మెగా’ మనువరాళ్లు.. చిరుతో రేర్ ఫోటోలు
-
మెగా ఫామిలీ లో మరో బ్యానర్...చరణ్ కు పోటీగా!
-
అమెరికాలో ఉపాసన-చెర్రీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చెర్రీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన అమెరికాలో చెర్రీతో పాటు సందడి చేస్తున్నారు. తాజాగా ఉపాసన, రామ్ చరణ్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జంట బేబీమూన్ను ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్ బిజీ షెడ్యూల్లోనూ తన భార్య ఉపాసనతో కలిసి సరదాగా సముద్రంలో విహరించారు. షాపింగ్‌తో పాటు సముద్రంలో విహరిస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. 'ఇంత బిజీగా ఉన్నప్పటికీ మా కోసం రామ్ చరణ్‌కు సమయం దొరికింది. డాల్ఫిన్స్, షార్క్స్ చూసేందుకు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నా బకెట్ జాబితాలో ఇది టిక్ చేస్తున్నా.' అంటూ ఫోటోలు, వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఆ వార్త విని కన్నీళ్లు ఆపుకోలేకపోయా: మెగాస్టార్ ఎమోషనల్
ఆ వార్త విని తనకు కన్నీళ్లు ఆగలేదని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న శుభవార్త విన్నాక చాలా సంతోషం కలిగిందని ఆయన అన్నారు. కానీ ఆ సమయంలో తాను తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ తెలిపారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. ' ఈ సందర్భం కోసం మేం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాం. రామ్‌చరణ్, ఉపాసన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ పర్యటన ముగించుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడే ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని మాకు చెప్పారు. ఆ వార్త విని నేను, సురేఖ చాలా ఆనందంగా ఫీలయ్యాం. ఆ సందర్భంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాం.' అని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. -
తండ్రి కాబోతున్న రామ్‌చరణ్
-
తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. మెగాస్టార్ ట్వీట్
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. త్వరలోనే మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం నెలకొంది. తమ కులదైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన దంపతులు మొదటి బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2012 జూన్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తర్వాత బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా ఇంట సంబురాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ చిత్రంలో నటిస్తుండగా చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తన ట్వీట్లో ఫోటో షేర్ చేస్తూ.. ‘హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇట్లు ప్రేమతో.. సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వార్త విన్న మెగా కుటుంబసభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. pic.twitter.com/C4ps1jgcUD — Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022 -
భర్త విష్ణు ప్రసాద్‌తో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత..
-
నిర్మాతగా సుష్మిత
‘రంగస్థలం, సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మాతగా మారారు. భర్త విష్ణుప్రసాద్‌తో కలసి ఆమె ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. విష్ణు ప్రసాద్, సుష్మితాలతో కలిసి జీ5 సంస్థ ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుష్మితా కొణిదెల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఈ సిరీస్ ఉంటుంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం ఓటీటీ వేదిక ‘జీ5’తో అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. -
నాగబాబు తనయుడు 'మెగా' సక్సెస్ సాధిస్తాడా?
-
నాగబాబు తనయుడు 'మెగా' సక్సెస్ సాధిస్తాడా?
కొణిదెల వంశం నుంచి మరో హీరో వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరంగేట్రం ఖరారైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దాదాపు నాలుగేళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్లో చాలా కాలంగా వరుణ్‌తేజ్ సినీరంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది. మెగాస్టార్ - అల్లు వారి కుటుంబాల నుంచి ఇప్పటికే నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్‌చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ చిత్ర రంగంలో ఉన్నారు. చిరంజీవి మేనల్లుడు ధర్మతేజ కూడా ఓ చిత్రంలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వెలుగు వెలుతున్నారు. అత్తారింటికి దారేది? చిత్రం ద్వారా కలెక్షన్ల రికార్డు బద్దలు కొట్టారు. వాస్తవానికి ఈ ఏడాదే వరుణ్ తేజ హీరోగా సినీరంగ ప్రవేశం చేయవలసి ఉంది. వరుణ్ తేజ ఎత్తుకు ఎత్తు - రూపానికి రూపం - అందానికి అందం అన్నీ ఉన్నాయి. హీరోకు కావలసిన లక్షణాలు మెండుగా ఉన్నాయి. వీటికి తోడు నటన - భాష - ఉచ్ఛారణలో శిక్షణ పొందాడు. ఈ నాడు అగ్రతారలుగా వెలుగొందుతున్న సినీప్రముఖులు ఎందరికో నటన నేర్పిన దిట్ట సత్యానంద్. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్... వంటి వారు ఆయన వద్దే నటన, భాష నేర్చుకున్నారు. విశాఖలో ఆయన వద్దే వరుణ్ కూడా శిక్షణ పొందాడు. అయితే వివిధ కారణాల వల్ల తేజ వెండితెర పరిచయం వాయిదాపడుతూ వచ్చింది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. వరుణ్ పరిచయం చేసే దర్శకులలో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, క్రిష్, శ్రీకాంత్ అడ్డాల ... పేర్లు వినిపించాయి. విజయవంతమైన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల తేజను పరిచయం చేయడానికి ఓ మంచి కథ రూపొందించారు. ఈ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సాక్షి తెలిపింది. ఏడాదికిపైగా ఆయనతో కథా చర్చలు జరుగుతున్నాయి. చివరకు వరుణ్ తేజ్‌ని తెరకు పరిచయం చేసే బాధ్యతను శ్రీకాంతే స్వీకరించారు. ఇక నిర్మాత విషయంలో కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. తొలుత నాగబాబు తమ సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్పైనే తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారు. అయితే ఆరంజ్ చిత్రం తరువాత ఆ ప్రొడక్షన్‌పై చిత్రం నిర్మించడానికి ఆయన అంతగా ఆసక్తి చూపించడంలేదు. ప్రస్తుతానికి చిత్రాలు నిర్మించే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ వైజయంతీ మూవీస్‌పై నిర్మిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణే కొత్తగా 'పవన్ క్రియేటివ్ వర్క్స్' బేనర్ ఏర్పాటు చేసి, తేజని హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందని కూడా భావించారు. ఇవన్నీ కాకుండా అల్లు అరవింద్ గీతాఆర్ట్స్పైనే తేజని పరిచయం చేసే అవకాశం ఉందని అనుకున్నారు. చివరకు తేజని పరిచయం చేసే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలుగా ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ స్వరాలందిస్తారు. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మొదట్లో కాజల్ పేరు వినపడింది. హీరోయిన్ను ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మహానటుడు కమల్‌హాసన్ రెండవ కూమార్తె అక్షర, ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ పేర్లు వినవస్తున్నాయి. తేజ మెగా కుటుంబానికి చెందిన వాడైనందున వారు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నూతన సంవత్సరం ప్రారంభం రోజునే మొదలవుతుంది. ఇక వరుణ్ మెగాస్టార్ వారసుల విజయపరంపరను అందుకుంటాడా లేదా అనేది శ్రీకాంత్ అడ్డాల చేతిలోనే ఉంది. శ్రీకాంత్‌కు ఇది ఓ ఛాలెంజ్! s.nagarjuna@sakshi.com