Megastar Chiranjeevi Tweet on Ram Charan becoming Father - Sakshi
Sakshi News home page

Ram Charan: తండ్రి కాబోతున్న రామ్‌చరణ్‌.. మెగాస్టార్ ట్వీట్

Published Mon, Dec 12 2022 2:58 PM | Last Updated on Mon, Dec 12 2022 4:06 PM

Megastar Tweet on Ram Charan Become a Father - Sakshi

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. త్వరలోనే మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం నెలకొంది.

తమ కులదైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన దంపతులు మొదటి బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2012 జూన్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తర్వాత బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా ఇంట సంబురాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ చిత్రంలో నటిస్తుండగా చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

మెగాస్టార్ తన ట్వీట్‌లో ఫోటో షేర్ చేస్తూ.. ‘హనుమాన్‌ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్‌ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇట్లు ప్రేమతో.. సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్‌ కామినేని’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వార్త విన్న మెగా కుటుంబసభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement