మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. రామ్ చరణ్-ఉపాసనకు తొలిసారి బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు వారి కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. జూన్ 20న ఉపాసన పాపకు జన్మనివ్వగా.. జూన్ 30న బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును వెల్లడించారు. క్లీంకార కొణిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు తెలిపారు.
(ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?)
ఖరీదైన గిఫ్ట్!
అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఎలాంటి బహుమతులు ఇచ్చారనే విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెగా ఇంట్లో ఈ వేడుకను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా బారసాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా అలకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి మెగా ఫ్యామిలీ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి తన మనవరాలి పేరును రివీల్ చేస్తూ అర్థాన్ని కూడా వివరించారు. రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
(ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?)
Comments
Please login to add a commentAdd a comment