Upasana
-
క్లీంకారతో రామ్ చరణ్.. ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగను సినీతారలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకున్నారు. ఈ పండుగ వేళ రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారతో దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. హ్యాపీ సంక్రాంతి అంటూ షేర్ చేసింది.మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సంక్రాతి సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీతో కలిసి పిల్లలు అయాన్, అర్హతో పండుగ రోజు దిగిన ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి-2025 అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.సంక్రాంతి సినిమాల సందడి..గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్..రామ్ చరణ్-శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్‌కు పాజిటివ్ రెస్పాన్స్..నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌కు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది డాకు మహారాజ్. ఈ మూవీ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం..అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన మరో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 -
క్లీంకార ఫోటో షేర్ చేసిన ఉపాసన.. బాల్యం గుర్తొస్తోందంటూ..
రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.. తమ గారాలపట్టి క్లీంకార ఫోటో షేర్ చేసింది. ముత్తాత (ఉపాసన తాతయ్య), తాతయ్య (ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరిగిన పవిత్రోత్సవాల్లో చిన్నారి పాల్గొందని తెలిపింది. ఉపాసన ఎమోషనల్తాత చంకనెక్కిన క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంది. అలాగే ఈ గుడి తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. అలాగే ఈ ఆనందకర క్షణాలను వెలకట్టలేనని పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించకూడదని కాస్త బ్లర్ చేసింది.ఇంత పెద్దగా అయిపోయిందా?ఇది చూసిన అభిమానులు.. ఈ చిట్టితల్లిని ఇంకెప్పుడు చూస్తామో అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కూతురు పుట్టింది. 2023 జూన్‌లో జన్మించిన తన ముద్దుల మనవరాలికి చిరంజీవి క్లీంకార అని నామకరణం చేశారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్ -
రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 -
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి శ్రీకృష్ణుని పూజలో పాల్గొన్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. క్లీంకారతో పాటు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా పూజల్లో పాల్గొన్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పనిచేయనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీకపూర్ నటించనుంది. Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024 -
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్ డే ఎలా?.. ఉపాసన ఆవేదన
ఇండిపెండెన్స్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ వైరలవుతోంది. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. ఇంతటి అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా? అని నిలదీసింది. మెడికల్ ప్రొఫెషన్‌లపై ఇంత దారుణం జరుగుతుంటే ఇక మనుషుల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా మనం ఇప్పటికీ అనాగరిక సమాజంలో బతుకుతున్నామంటే ఏమని స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామని ఉపాసన ప్రశ్నించింది. ఇది ఎప్పటికీ మానవత్వం అనిపించుకోదని తెలిపింది. మహిళలే దేశానికి వెన్నెముక లాంటివారని.. ఇప్పటికే దాదాపు 50శాతం మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో మహిళల కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలోకి ఎక్కువమంది మహిళలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి మహిళ భద్రత, గౌరవం కాపాడేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పారిస్ ఒలింపిక్స్ 2024: ఫ్యామిలీతో రామ్‌చరణ్ సందడి (ఫోటోలు)
-
పారిస్ వీధుల్లో మనవరాలు క్లీంకారతో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్..
-
ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్‌గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్‌గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx— భద్రం (@BhadramDr) July 20, 2024 -
రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ల వివాహానికి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి భారీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఇప్పుడా వీడియో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.టాలీవుడ్ టాప్ హీరోల వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ గ్యారేజీలో మెర్సిడేజ్, రోల్స్ రాయిస్ ఫాంథమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ దంపతులు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహానికి వెళ్లేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టార్‌ను డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. సౌత్ ఇండియాలో మొదటి కారు కావడం గమనార్హం.రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా తక్కువ మంది వద్దే ఈ కెంపెనీకి చెందిన కార్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్ వర్షన్ రోల్స్ రాయిస్ కారును కొన్నారు. జనవరి 2024లో ఈ మోడల్ లాంఛ్ అయింది. ఈ కారు అందుకున్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.Charan Babu Off to Mumbai 👍👍👍New Rolls Royce Spectre Car (Second Car in India its cost around 7.5 Cr)#RamCharan pic.twitter.com/eqkjiAJUEa— Praveen (@AlwaysPraveen7) July 11, 2024Screen presence &Royality @AlwaysRamCharan 🦁Present Generation lo #RamCharan offline styling 👌🔥Eh dress ayna easy ga set ayipodi aha body ki pic.twitter.com/m4AikXYzDj— vijay (@vijay_mbfan) July 11, 2024 -
ముంబయికి గ్లోబల్ స్టార్ దంపతులు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి సతీసమేతంగా హాజరు కానున్నారు. తాజాగా ఆయన భార్య ఉపాసన, ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గేమ్ ఛేంజర్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. #RamCharan brings his A Swag to the airport as he departs for Mumbai with #KlinKaara & @upasanakonidela for Anant Ambani & Radhika Merchant's Wedding !The Debonair @AlwaysRamCharan 🦁 pic.twitter.com/SVlrMZVbE4— Trends RamCharan ™ (@TweetRamCharan) July 11, 2024 -
Klin Kaara Photos: గ్రాండ్‌గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Klin Kaara Photos: మెగా మనవరాలు క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు
-
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫొటోతో వచ్చేసింది. రామ్ చరణ్‌తో పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది. అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లీంకాక లేటెస్ట్ ఫొటోని కూడా ఇందులో జోడించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)2012లో రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి. కానీ రానురాను మెగా ఫ్యామిలీలోనే చరణ్-ఉపాసన.. వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు. వీళ్లకు గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈ బుజ్జాయికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు.పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టట్లేదు. ఇప్పుడు కూడా తను, చరణ్.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అంటే మెగా మనవరాలు బుడిబుడి అడుగులు వేసేస్తుందని ఈ పోస్ట్‌తో ఉపాసన చెప్పకనే చెప్పేసింది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వన్యప్రాణుల సంరక్షణ నేషనల్ అంబాసిడర్‌గా ఉపాసన
కొణిదెల... కామినేని కుటుంబాల్లో ఉపాసన చాలా ప్రత్యేకం.. మెగా ఇంటికి కోడలిగా ఆమె అడుగుపెట్టిన సమయం నుంచి ఆమె పేరు మరింత పాపులర్ అయింది. గ్లోబల్‌స్టార్ హీరో రాంచరణ్ సతీమణిగా బెస్ట్ కపుల్స్ అనిపించుకున్న ఉపాసన టాలీవుడ్‌తో పాటు వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసింది.అపోలో హాస్పిటల్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోసిస్తున్న ఉపాసనకు మరో బాధ్యతను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్‌గా నియమితులైంది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి తాజాగా తెలిపారు. అపోలో ఆసుపత్రి ట్రస్ట్ యందు వైస్ చైర్‌పర్సన్‌గా ఆమె విధులు నిర్వహిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనుంది.ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో గాయపడిన పులులు, ఏనుగులు వంటి ప్రాణులకు వైద్యం అందించడమే కాకుండా.. అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందించనున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్
సలార్‌తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్.. కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఉపాసన ఇంటికి బుజ్జిఅయితే సినిమా రిలీజ్‌కు ముందే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ సిరీస్ లాంచ్ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్‌ను రామ్‌చరణ్- ఉపాసనల కూతురు క్లీంకారకు బహుమతిగా ఇచ్చింది. చిత్రయూనిట్‌కు థ్యాంక్స్వాటితో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోను ఉప్సీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే కూతురు ముఖం కనిపించకుండా ఆ ఫోటో తీసింది. తనకు ఈ బహుమతి పంపినందుకు హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రింయాక దత్‌లకు కృతజ్ఞతలు తెలియజేసింది.చదవండి: Bujji And Bhairava Review: యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే.. -
చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడని ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఎంత వైరలయ్యాయో తెలిసిందే! ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, అండగా నిలబడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెప్పింది ఉపాసన. కేవలం సూక్తులు చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూపిస్తున్నారీ జంట.ఉపాసన వెంటే..ఆ మధ్య చరణ్ ఆస్కార్ కోసం అమెరికాకు వెళ్తే కడుపుతో ఉన్నా సరే ఉపాసన అతడి వెంటే వెళ్లింది. ఇప్పుడు ఉప్సీ వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్ దేశానికి వెళ్లింది. షూటింగ్స్‌తో ఎంతో బిజీగా ఉండే చరణ్ పనులన్నీ పక్కనపెట్టి భార్యతో సహా వెళ్లాడు. తమ పాప క్లీంకారను కూడా తీసుకెళ్లారు. గర్వంగా ఉంది..ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'చరణ్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నేను చేసే పనులకు సపోర్ట్‌గా నిలబడుతున్నావు. తండ్రిగానూ బాధ్యత నెరవేరుస్తున్నావు. అలాగే ఈ మీటింగ్‌ను ప్రత్యేకంగా మార్చిన మహిళామణులందరికీ థ్యాంక్స్' అంటూ మూడు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఉపాసన కెమెరా వైపు పోజిస్తే చరణ్ మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుదిరిగి నిల్చున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..! -
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్లైన్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్‌గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) -
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్‌చరణ్ (ఫోటోలు)
-
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
గుండుతో క్లీంకార.. ఏనుగుతో చిల్ అవుతోన్న గ్లోబల్ స్టార్!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం దొరకడంతో ఫుల్‌గా చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లారు. ఈ సమ్మర్ వేకేషన్లో తన ముద్దుల కూతురు క్లీంకారతో ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కలిసి గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. అంతే కాకుండా వారితో క్లీంకార కూడా ఫోటోలో కనిపించింది. అయితే ఇందులో క్లీంకార గుండు చేయించుకుని కనిపించింది. 'థ్యాంక్యూ నాన్న.. ఇది ఒక అద్భుతమైన అనుభవం.. ఏనుగుల సంరక్షణ క్యాంప్‌లో చాలా నేర్చుకున్నా' అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Thank you, Mr. C/Naana, for an incredible experience. Learned so much at the elephant rescue camp. ❤️🐘#bestdad @AlwaysRamCharan pic.twitter.com/eBt6JpdCX7 — Upasana Konidela (@upasanakonidela) April 7, 2024 -
రామ్‌చరణ్ బర్త్‌డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది. అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by TIRUMALA DEVASTANAM OFFICIAL (@anandanilayam_)