బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా? | Ram Charan and Upasana Off To Italy Trip With Daughter Klin Kaara | Sakshi
Sakshi News home page

Ram Charan- Upasana: క్లీంకారతో తొలిసారి ఫారిన్ ట్రిప్.. వరుణ్- లావణ్య పెళ్లి కోసమేనా?

Published Wed, Oct 18 2023 7:05 PM | Last Updated on Wed, Oct 18 2023 7:33 PM

Ram Charan and Upasana Off To Italy Trip With Daughter Klin Kaara - Sakshi

ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో  పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు.  

(ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..)

అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు.  బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్‌ ట్రిప్‌కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు  సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్‌ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది.

అయితే ఈ జంట ఇటలీ వేకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్‌ కోసమా? అనేది తెలియాల్సి ఉంది.  ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో  నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. 

(ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్‌-5లో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement