![Ram Charan Daughter Klin Kaara Photo reveal - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/27/ra.jpg.webp?itok=3-Ssjwv6)
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది.
అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment