
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. పుట్టినరోజు నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉపాసనతో పాటుగా చరణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు.
దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా శ్రీనివాసుడి సన్నిధికి తీసుకుకొచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment