![Ram Charan Wife Upasana Konidela Shares beach Video with Klin kaara - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/19/up.jpeg.webp?itok=4LY6Ib-L)
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
అయితే షూటింగ్‌కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్‌లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్‌ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment