ఇండిపెండెన్స్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ వైరలవుతోంది. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. ఇంతటి అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా? అని నిలదీసింది. మెడికల్ ప్రొఫెషన్‌లపై ఇంత దారుణం జరుగుతుంటే ఇక మనుషుల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా మనం ఇప్పటికీ అనాగరిక సమాజంలో బతుకుతున్నామంటే ఏమని స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామని ఉపాసన ప్రశ్నించింది. ఇది ఎప్పటికీ మానవత్వం అనిపించుకోదని తెలిపింది. మహిళలే దేశానికి వెన్నెముక లాంటివారని.. ఇప్పటికే దాదాపు 50శాతం మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో మహిళల కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలోకి ఎక్కువమంది మహిళలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి మహిళ భద్రత, గౌరవం కాపాడేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment