
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్‌లో ఈ చిత్రంలో కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం దొరకడంతో ఫుల్‌గా చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లారు. ఈ సమ్మర్ వేకేషన్‌లో తన ముద్దుల కూతురు క్లీంకారతో ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన కలిసి గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. అంతే కాకుండా వారితో క్లీంకార కూడా ఫోటోలో కనిపించింది. అయితే ఇందులో క్లీంకార గుండు చేయించుకుని కనిపించింది. 'థ్యాంక్యూ నాన్న.. ఇది ఒక అద్భుతమైన అనుభవం.. ఏనుగుల సంరక్షణ క్యాంప్‌లో చాలా నేర్చుకున్నా' అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Thank you, Mr. C/Naana, for an incredible experience. Learned so much at the elephant rescue camp. ❤️🐘#bestdad @AlwaysRamCharan pic.twitter.com/eBt6JpdCX7
— Upasana Konidela (@upasanakonidela) April 7, 2024
Comments
Please login to add a commentAdd a comment