ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు! | Megastar and Kamineni Families Off To Italy For Varun Lavanya Wedding | Sakshi
Sakshi News home page

Megastar and Kamineni Families: ఒకే ఫ్రేమ్‌లో రెండు కుటుంబాలు.. ఉపాసన బిగ్ మిస్టేక్!

Published Sun, Oct 29 2023 4:27 PM | Last Updated on Sun, Oct 29 2023 5:18 PM

Megastar and Kamineni Families Off To Italy For Varun Lavanya Wedding - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్​- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్‌ చరణ్‌-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ చేరుకున్నారు.

(ఇది చదవండి: కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!)

తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్-ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామీలితో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్‌ వన్‌ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

క్లీంకార ఫేస్ రివీల్!

అయితే ఈ ఫోటోలో నెటిజన్స్ మెగా మనవరాలు క్లీంకార వైపే ఆసక్తి చూపారు. ఆ ఫోటోకు ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులివ్వడంతో నీటిలో రివర్స్‌లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను ఉపాసన కవర్‌ చేయలేదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. 

(ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్‌.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement