మొదలైన మెగా సందడి.. హల్దీ వేడుకలో వరుణ్ - లావణ్య! | Varun Tej and Lavanya Tripathi Haldi ceremony sparks joy in Italy | Sakshi
Sakshi News home page

Varun Tej and Lavanya: ఇటలీలో మెగా పెళ్లి సందడి.. హల్దీ వేడుకలో వరుణ్ - లావణ్య!

Published Tue, Oct 31 2023 7:27 PM | Last Updated on Tue, Oct 31 2023 8:39 PM

Varun Tej and Lavanya Tripathi Haldi ceremony sparks joy in Italy  - Sakshi

ఇటలీలో మెగా ఇంట పెళ్లిసందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న టాలీవుడ్ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, ‍అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా జరిగిన హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ జంట నవంబర్ 1వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. 

(ఇది చదవండి: కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌)

అయితే వీరి పెళ్లి వేడుక కోసం ఇటలీ చేరుకున్న కుటుంబ సభ్యులు అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్‌ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. ప్రముఖ డిజైనర్‌ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి వరుణ్ తేజ్- లావణ్య ఈ వేడుకలో పాల్గొన్నారు. 

కాగా.. ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.  ఇటలీలో పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో నవంబర్‌ ఐదో తేదీన గ్రాండ్‌ రిసెప్షన్‌ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

(ఇది చదవండి: బిగ్‌ బాస్‌ ఓ చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ ఫైర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement