kamineni
-
ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు!
మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ చేరుకున్నారు. (ఇది చదవండి: కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!) తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్-ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామీలితో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్లీంకార ఫేస్ రివీల్! అయితే ఈ ఫోటోలో నెటిజన్స్ మెగా మనవరాలు క్లీంకార వైపే ఆసక్తి చూపారు. ఆ ఫోటోకు ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులివ్వడంతో నీటిలో రివర్స్‌లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను ఉపాసన కవర్ చేయలేదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
LB Nagar: కామినేని ఫ్లైఓవర్ల కింద పార్కు
సాక్షి, హైదరాబాద్: నడక మార్గాలు, ఫౌంటెన్లు, శిల్పాలు, కూర్చునే బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, కెఫ్టేరియా.. ఇలా వివిధ సదుపాయాలతో ఆక్సిజన్‌ను అందించే పచ్చని మొక్కలతో ప్రత్యేక పార్కు త్వరలో నగర ప్రజలకు కనువిందు చేయనుంది. ఇన్ని సదుపాయాలు కలిగిన పార్కు బహిరంగ ప్రదేశంలో కాకుండా రెండు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటవుతుండటమే విశేషం. ఇప్పటికే షేక్‌పేట, బహదూర్‌పురా ఫ్లైఓవర్ల కింద సైతం పచ్చదనం ఉన్నప్పటికీ దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇన్ని సదుపాయాలతో కూడిన అతిపెద్ద ఉద్యానవనం ఇదే కానుంది. ఎల్బీనగర్ జోన్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో యాంఫీథియేటర్ సైతం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్) దాదాపు కోటి రూపాయల వ్యయమవుతున్న ఈ పార్కుకు ఆక్సిజన్ పార్కుగా నామకరణం చేయనున్నారు. పరిసరాల్లో నివసించే ప్రజలకే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వారికి సైతం పచ్చదనంతో కనువిందు చేయడంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఖాళీ ప్రదేశాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం(యూబీడీ) డిజైన్ చేసిన ఈ ఆలోచన.. ఫ్లైఓవర్ల కింద పూర్తిస్థాయి పార్కు రాష్ట్రంలో ఇదే ప్రథమం. (క్లిక్: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి) -
ఎల్బీనగర్ అండర్‌పాస్.. ఈజీ జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లోని ఈస్ట్‌జోన్‌లో సాగర్‌రింగ్ రోడ్, ఎల్బీనగర్ జంక్షన్, కామినేని జంక్షన్, ఉప్పల్ జంక్షన్లు అత్యంత రద్దీ ప్రాంతాలు. విజయవాడ, నాగార్జునసాగర్, శంషాబాద్ విమానాశ్రయం వైపుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రావాలన్నా..తిరిగి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకప్రాయం. ఈ సమస్యల పరిష్కారానికి ఎస్సార్డీపీ ఫేజ్ వన్ ప్యాకేజీ–2లో భాగంగా వివిధ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లూప్‌ల వంటి వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 14 పనుల్లో గురువారం ప్రారంభమైన రెండింటితో సహా ఇప్పటికి ఐదు పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు కొంత మేరఉపశమనం లభించింది. మిగతావన్నీ పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, దిల్సుక్నగర్ల నుంచి నుంచి నల్లగొండ, విజయవాడల వైపు, అలాగే నాగార్జునసాగర్, శంషాబాద్ వైపు వెళ్లేవారికి.. ఆప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి సిగ్నల్ జంజాటాల్లేని ప్రయాణం సాధ్యం కానుంది. పూర్తయి వినియోగంలోకి వచ్చినవి ♦ ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు అండర్‌పాస్, చింతల్‌కుంట వద్ద అండర్‌పాస్ పూర్తి కావాల్సినవి.. ♦ ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్ ♦ ఎల్బీనగర్ వద్ద కుడివైపు అండర్‌పాస్ ♦ బైరామల్ గూడ వద్ద ఫస్ట్ లెవెల్లో కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు ♦ బైరామల్ గూడ వద్ద సెకెండ్ లెవెల్లో ఫ్లై ఓవర్ ♦ బైరామల్ గూడ వద్ద కుడి, ఎడమవైపుల లూప్‌లు ♦ కామినేని అండర్‌పాస్ నాగోల్ జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్ ట్రాఫిక్ రద్దీ ఇలా.. ఈస్ట్‌జోన్‌లోని ఆయా జంక్షన్ల వద్ద భవిష్యత్‌లో ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ నిపుణులు అంచనా వేశారు. ఆమేరకు.. 2034 నాటికి రద్దీ సమయాల్లో గంటకు ఉండే ట్రాఫిక్ పీసీయూ.. పూర్తయిన, పూర్తి కావాల్సిన పనుల అన్నింటి అంచనా వ్యయం :రూ. 448 కోట్లు -
కామినేని ఫ్లై ఓవర్ నేడు ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్లోవడివడిగా పనులు చేసి ఈనెలాఖరులోగా ప్రారంభోత్సవాలు చేయాలనుకున్న ప్రాజెక్టుల్లో భాగంగా ఎల్బీనగర్ జోన్‌లోని రెండింటిని గురువారం ప్రారంభించనున్నారు. మునిసిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభిస్తారు.ప్రారంభోత్సవ అంశాన్ని కేటీఆర్ ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు. కామినేని కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ జంక్షన్ ఎడమవైపు అండర్‌పాస్‌లను ప్రారంభించనున్నారు. While we continue to develop irrigation infra for farmers, Telangana Govt also has been focused on improving urban infrastructure 👇 Will be inaugurating two latest outcomes of #SRDP at LB Nagar tomorrow Kamineni junction RHS 940m flyover & LB Nagar junction LHS 519m VUP pic.twitter.com/e8Q9lvQyJb — KTR (@KTRTRS) May 27, 2020 కామినేని ఫ్లై ఓవర్: పొడవు: 940 మీటర్లు వెడల్పు: 12 మీటర్లు వ్యయం: రూ. 43 కోట్లు ఎల్బీనగర్ అండర్‌పాస్: పొడవు: 519 మీటర్లు క్యారేజ్‌వే: 10.5 మీటర్లు వ్యయం: రూ.14 కోట్లు -
కోర్టుకు హాజరైన కామినేని వారసులు
సాక్షి, కామారెడ్డి: దోమకొండ కోట ఆస్తుల విషయంలో కామినేని వారసుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం చివరకు కోర్టుకు చేరింది. వారసుల్లో ఒకరైన సత్యనారాయణరావు కుటుంబం కోటలోని ఆస్తుల్లో తమ వాటా కోసం కామారెడ్డి కోర్టులో కేసు వేసింది. దీనిపై నోటీసులు అందుకున్న మిగతా వారసులందరూ గురువారం కోర్టుకు హాజరయ్యారు. కామినేని వంశస్తులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమాపతి, అనిల్ కామినేని, సత్యనారాయణరావు, రోహిత్ రాజేశ్వర భూపాల్, లావణ్యతో పాటు మొత్తం 14మంది న్యాయస్తానం ఎదుట హాజరయ్యారు. కోటలోని వెంకటభవన్, అద్దాల బంగ్లా, అజ్గర్ మంజిల్, భరత్‌రాంభూపాల్ బంగ్లాతో పాటు స్థలాల విషయంలో వారసుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడినట్లు సమాచారం. చదవండి: వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా కోటలోని శివాలయంలో పూజలు చేస్తున్న ఉపాసన, రాంచరణ్ (ఫైల్ ఫోటో) కాగా కామినేని అనిల్...అపోల్ ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనను వివాహం చేసుకున్నారు. అలాగే వారి కూతురు ఉపాసన హీరో రాంచరణ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. ఉపాసన-రాంచరణ్ వివాహ వేడుకలు కూడా కోటలో జరిగాయి. వివాహం సందర్భంగా వారిద్దరూ కోటలోని శివాలయంలో పూజలు కూడా నిర్వహించారు. ఇక దోమకొండ కోటకు సంబంధించిన నలభై ఎకరాల ప్రహరీ గోడ ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగతా భవనాలు, భూములు కామినేని వంశస్తులవి. ప్రస్తుతం ఆస్తుల వారసత్వంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. కోటలో చిరంజీవి, రాంచరణ్, ఉపాసన -
వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా
శతాబ్దాల చరిత్ర గల దోమకొండ కోటలోని భవనాల విషయంలో వారసుల మధ్య వివాదం ముదురుతోంది. గడీకోటలోని భవనాలు తమవంటూ మూడు కుటుంబాలకు చెందిన వారు తాళాలు వేయగా.. మరో వారసుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వేసిన తాళాలను తొలగించారంటూ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీనిపైనా కేసు నమోదైంది. సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసుల మధ్య ఆస్తుల కొట్లాట ముదురుతోంది. దోమకొండ కోట కేంద్రంగా కామినేని వంశీయులు శతాబ్దాల పాటు పాలించారు. సంస్థానాల రద్దు అనంతరం దోమకొండ కోట ఎవరిది అన్న విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు. 2013లో సినీ నటుడు రాంచరణ్ తేజ పెళ్లితో కోట వివాదం వెలుగులోకి వచ్చింది. అనిల్ కామినేని కుమార్తె ఉపాసనకు రాంచరణ్‌తో పెళ్లి కుదరడం, అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండడంతో కోటలో కదలికలు మొదలయ్యాయి. ఒక దశలో గడీని రాంచరణ్ సొంతం చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించారు. అప్పుడు కోటలో కొన్ని భవనాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం కోట వ్యవహారాలు అనిల్ కామినేని చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి కోట వెళ్లింది. దీంతో సామాన్య ప్రజలకు కోట సందర్శన అవకాశం లేకుండా పోయింది. గొడవ మొదలైందిలా..... కోట పూర్తిగా అనిల్ కామినేని వశమైందన్న ప్రచారం జోరుగా సాగడంతో ఇతర వారసులైన రాజేశ్వర్రావ్, సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్య కుటుంబాలకు చెందిన వారు స్థానిక కలెక్టర్‌కు ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి రాములును విచారణ అధికారిగా నియమించారు. పంచాయతీ అధికారులు విచారణ జరిపినా వివాదం తేలలేదు. దీంతో ఈ నెల 9న ఆయా కుటుంబాలకు చెందిన వారు కోటలోకి ప్రవేశించి భవనాలకు తాళాలు వేశారు. ఇవి తమ ఆస్తులని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అనిల్ కామినేని మనుషులు పోలీసులను ఆశ్రయించారు. కోటలోకి అక్రమంగా చొరబడి భవనాలకు తాళాలు వేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు తాళాలు వేసినవారిపై కేసు నమోదు చేశారు. ఇంతటితో ఆగకుండా భవనాలకు వేసిన తాళాలను తొలగించారు. విషయం తెలిసిన సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు తమ ఇళ్లకు వేసుకున్న తాళాలను అనిల్ కామినేని మనుషులు తొలగించారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ఫిర్యాదు నమోదు.. దోమకొండ: కోటలో తమ ఆస్తులకు సంబంధించిన భవనాలకు తాళాలు వేసి ఫ్లెక్సీలు కట్టగా.. కామినేని అనిల్‌కుమార్ మనుషులు వాటిని తొలగించారని కోట వారసులుగా చెప్పుకుంటున్న కామినేని సత్యనారాయణ, కామినేని రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు బుధవారం దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్సై నరేందర్ తెలిపారు. అద్దాలమేడ, అస్గర్‌మంజిల్, ఉమా మంజిల్ భవనాలకు ఈనెల 8వ తేదీన తాళాలు వేశామని, ఈనెల 12వ తేదీన కామినేని అనిల్ మనుషులు వాటిని తొలగించి, ఫ్లెక్సీలను తీసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వారి ఫిర్యాదు మేరకు అనిల్ కామినేని మనుషులపై కేసు నమోదు చేశామన్నారు. -
చెర్రీ అత్తారింట్లో చిరు దీపావళి!
కొణిదెల అండ్ కామినేని ఫ్యామిలీలో దీపావళి సంబరాలు మంగళవారమే మొదలయ్యాయి. రామ్‌చరణ్ (చెర్రీ) అత్తారింట్లో మంగళవారం ప్రీ–దివాలి గెట్ టుగెదర్ జరిగింది. చెర్రీ అత్తమామలు శోభన–అనిల్ కామినేని ఫ్యామిలీ.. చిరంజీవి ఫ్యామిలీకి దీపావళి పార్టీ ఇచ్చారు. చిరు ఫ్యామిలీతో పాటు కొంతమంది బంధువులు, స్నేహితులు ఈ పార్టీలో సందడి చేశారు. రామ్‌చరణ్–ఉపాసన దంపతులు, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్... త్వరలో చిరు హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ తీయనున్న దర్శకుడు సురేందర్‌రెడ్డి ఫ్యామిలీ, రామ్‌చరణ్ హీరోగా ‘రంగస్థలం’ తీస్తున్న దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ పాల్గొన్నారు. -
ఇదో కేసు స్టడీ
చాపరాయి మరణాలపై మంత్రి కామినేని ఏజెన్సీలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన కాళ్లవాపు మరణాలతో ఏం గుణపాఠం నేర్చుకున్నారు? ఏజెన్సీలో అంటువ్యాధుల బారినపడి 16 మంది గిరిజనులు నెల్లాళ్ల వ్యవధిలో మరణిస్తే ఆ ౾అంశాన్ని మంత్రి కామినేని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా వ్యాఖ్యానించడమే దానికి అద్దం పడుతోంది. రంపచోడవరం: చాపరాయిలో గిరిజనుల మరణాలు ఒక కేసు స్టడీలాంటివని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వాఖ్యానించారు. మారుమూల లోతట్టు గ్రామాల్లోని గిరిజన పల్లెలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని అమరావతిలో మంగళవారం వ్యాఖ్యానించిన మంత్రి కామినేని బుధవారం రంపచోడవరం పర్యటనలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు. అంతుచిక్కని వ్యాధులతో, అంటురోగాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. రంపచోడవరంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది చనిపోతే నేర్చుకుంటారు? గత ఏడాది విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధితో 14 మంది గిరిజనులు మృతి చెందారు. అప్పుడు చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కనీసం వచ్చిన రోగులకు వైద్య సేవలందించేందుకు పూర్తి స్ధాయిలో వైద్య సిబ్బంది నియమించలేదు. ఒక పక్క గిరిజనుల ప్రాణాలు పోతుంటే కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. ఇప్పటికీ కాళ్లవాపు వ్యాధికి మూలాలను తెలుసుకోలేకపోయారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు ఇచ్చేందుకు ఆర్ఓ ప్లాంట్లును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించడం లేదు. గైనిక్ సేవలు అందక మాతాశిశు మరణాలు రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో 50 వరకు మతాశిశు మరణాలు సంభవించాయి. దీనిపై ప్రభుత్వం నేటికీ సీరియస్‌గా పరిగణించలేదు. గైనిక్ సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన మహిళలకు పౌష్టికాహారం అందడం లేదు. పీహెచ్సీ పరిధిలో క్షేత్రస్ధాయిలో పనిచేసే సిబ్బంది పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదు. ఆశల సేవలకు ఏదీ గుర్తింపు? ఏజెన్సీలో గ్రామస్ధాయిలో పనిచేసే ఆశ వర్కర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే అతి కొద్దిపాటి జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వారు గ్రామాల్లో వ్యాధినిరోధక కార్యక్రమాల అమలుకు పనిచేస్తున్నారు. వైద్య ఆరోగ్య పరిస్ధితులపై పీహెచ్సీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వంటి కీలకమైన పనులు చేస్తున్నారు. అలాంటి వీరికి నెల నెలా చెల్లించాల్సిన రూ. 400 కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఆశవర్కర్లుకు చెల్లించాల్సిన రూ. 6 లక్షలు నేటికీ విడుదల కాలేదు. 2007 నుంచి 2014 వరకు ఎనిమిదేళ్లు పాటు సంవత్సరానికి మూడు నెలలు చొప్పున 24 నెలలు గౌరవ వేతనం రూ.19 లక్షల 20 వేలు నేటికి అందలేదు. విడుదలైన ఈ డబ్బు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. -
మోదీని విమర్శిస్తే ప్రజలు క్షమించరు
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదోని: ప్రధాని మోదీని విమర్శిస్తే ప్రజలు క్షమించబోరని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో కొంత మంది తెలుగు దేశం నాయకులు ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శిస్తున్న విషయాన్ని ఓ విలేకరి మంత్రి దృష్టికి తేగా ఆయనపై విధంగా స్పందించారు. శుక్రవారం ఆదోనిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, టీడీపీ నియోజక వర్గం ఇన్చార్జ్ మీనాక్షినాయుడు స్వగృహాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీకి ప్రజా మద్దతు ఏ స్థాయిలో ఉందో ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ఆసుపత్రులలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగైందన్నారు. డివిజన్ స్థాయిలోని ప్రతి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులను నియమించడంతోపాటు, ఇందుకు అవసరం అయిన వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని తెలిపారు. వైద్యసేవలు మెరుగు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ 32 శాతం, కాన్పులు 10 శాతం పెరిగాయని చెప్పారు. -
జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలి
మంత్రి కామినేని ఆదేశం కాకినాడ వైద్యం(కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై వైద్యులందరూ విధిగా రోగులకు జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ధీరూబాయి లేబొరేటరీ పక్కన రూ.1.50 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక జీఈ కంపెనీకి చెందిన 16 స్లైస్ సిటీ స్కాన్ మెషీన్‌ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటుబడ్జెట్లో ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యపరికరాలు, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జీజీహెచ్‌లో రోగులకు వైద్యులు సమష్టిగా నాణ్యమైన వైద్య సేవలందించడంతో ఓపీ సంఖ్య పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో 1,065 పడకలుండగా, 1,800 మంది ఇన్‌పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సిటీస్కాన్ ప్రస్తుతం విశాఖపట్టణం, కాకినాడలో ప్రారంభించామని, అనంతపురం, తిరుపతి, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో సిటీస్కాన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టామన్నారు. రూ.20 కోట్లతో ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. నెలకు 1,000 ప్రసవాలు జరుగుతుండగా బేబీకిట్లను అందిస్తున్నామని, త్వరలో తల్లికి కూడా కిట్ అందిస్తామన్నారు. ఆసుపత్రికి 80 శాతం మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మిగతా 20 శాతం మందుల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీఎంఈ డాక్టర్ బాబ్జి, జెడ్పీ అధ్యక్షుడు నామన రాంబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు. స్టైఫండ్ కోసం ప్రశ్నించిన పీజీ వైద్యులపై మంత్రి ఆగ్రహం నాలుగు నెలలుగా స్టైఫండ్ విడుదల కావడం లేదని, మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరిన పీజీ వైద్యులపై మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీస్కాన్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన మంత్రిని పలువురు పిజీ విద్యార్థులు కలుసుకుని స్టైఫండ్ కోసం అడిగారు. అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తే. ఇప్పుడా స్లైఫండ్ కోసం అడిగేది..మీ సమస్యలు లేవనెత్తడానికి ఇదా సమయమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులై ఉండి కూడా ఇలా అడగడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీఎంఈ డాక్టర్ బాబ్జి కలుగజేసుకుని తర్వాత మాట్లాడదాం అంటూ సర్ది చెప్పడంతో మంత్రి శాంతించారు. -
వచ్చారు..వెళ్లారు!
► పలాసలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని ► ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై ఆగ్రహం ► ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెళ్లిపోయిన వైనం కాశీబుగ్గ(పలాస): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు జిల్లా పర్యటన వచ్చారు..వెళ్లారు అన్నట్టుగానే సాగింది. కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం ప్రకటిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. శనివారం ఉదయం పలాస చేరుకున్న ఆయన ప్రభుత్వాస్పత్రికి వెళ్లే దారిలో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. వైద్యం అందిస్తున్న తీరుని పరిశీలించి యూనిట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ప్రభు త్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి కామినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ రోగులకు మెరుగై న వైద్య సేవలు అందిస్తామన్నారు. అత్యవస ర పరిస్థితిలో ఉన్న 90 మంది కిడ్నీ రోగులకు కిడ్నీ మార్పిడి జరపాల్సి ఉన్నప్పటికీ.. అంతమందికి కిడ్నీలు తీసుకురాలేమన్నారు. ఈ పరిస్థితిలో డయాలసిస్ కేంద్రాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒక్కసారి డయాలసిస్ చేసుకుంటే రూ.900 ఖర్చవుతోందని, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. శివాజీ చలోక్తి.. ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై చలోక్తులు విసిరారు. పలాసకు ఈఎస్ఐ ఆస్పత్రి ఇస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని అచ్చెన్న దృష్టికి విలేకరులు తెచ్చారు. దీనికి ఆయన స్పందించి మాట్లాడుతుండగానే శివాజీ కలుగజేసుకొని మంత్రి పదవి పొడిగించారు కదా ఇంకేమీ ఈఎస్ఐ ఆస్పత్రి తీసుకొస్తారన్నారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ మూడు వేల మంది కార్మికులు సంతకాలు చేసి ఇవ్వమంటే ఇంతవరకు జీడి పరిశ్రమల యజమానులు, కాష్యూ లేబరు యూనియన్ సభ్యులు, కార్మికులు గాని స్పందించలేదని.. లేదంటే ఇప్పటికే ఈఎస్ఐ ఆస్పత్రి వచ్చేదన్నారు. పలాసకు స్టేడియం మంజూరు చేశామని, దాన్ని సమస్యలు లేకుండా నిర్మించుకునే బాధ్యత స్థానిక నాయకులదేనన్నారు. కార్యక్రమంలో శ్రీకాకు ళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్ మా ధవ్, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మున్సి పల్ చైర్పర్సన్ కోత పూర్ణచంద్రరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్‌రావు, మల్లా శ్రీనివాసరావు, లొడగల కామేశ్వరరావు, శ్రీనివాసరెడి పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధికి కారణాలను అన్వేషిస్తున్నాం ఉద్దాన ప్రాంతంలో మూత్ర పిండాల వ్యాధులు ప్రబలడానికి కారణాలను అన్వేషిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. పలాస ప్రభుత్వ ఆస ్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన సందర ్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో లక్ష మందికి వైద ్యపరీక్షలు చేపట ్టగా 13 వేల మందికి కిడ్నీ వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగిందన్నారు. వీరిలో 90 మందికి మూత్ర పిండాల మార్పిడి అవసరం ఉన్నట్టు చెప్పారు. జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, పలాసలో డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ నెల 17న సోంపేటలో మరో సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నంలో ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కిడ్నీ వ్యాధికి గల కారణాలను వెల్లడిస్తారన్నారు. -
గిరిజనుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్ రంపచోడవరం : గిరిజనుల ఆరోగ్య భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో బు«ధవారం జాతీయ ఆరోగ్యమిషన్ నిధులు రూ.106 లక్షలతో నిర్మించే జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఐటీడీఏ పీఓ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా రూ.59 లక్షలతో నిర్మించిన పేయింగ్ రూమ్‌లను ప్రారంభించారు. వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనులు కూడా మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పేస్లిప్టు కింద 71 ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యులను నియమించాలని, అంబులెన్స్‌లు, అవసమైన చోట కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ రత్నాబాయి మాట్లాడుతూ ఏజెన్సీ వృద్ధాశ్రమం నిర్మించాలని కోరారు. ఆస్పత్రి అదనపు భవనం ప్రారంభం అడ్డతీగల : రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అడ్డతీగలలో రూ.2.76 కోట్లతో నిర్మించిన ఆస్పత్రి అదనపు భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి నఫీసా మంత్రిని కోరారు. అందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, రంపచోడవరం ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, సర్పంచ్ వై నిరంజనీదేవి, ఏజేసీ జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ చంద్రయ్య, డీసీహెచ్ఎస్ రమేష్‌కిçషోర్, ఏజెన్సీ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్, అడ్డతీగల ఎంపీపీ అన్నం సత్తిబాబు, జెడ్పీటీసీ అడారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులకు కష్టాల్లేకుండా చూడండి
అనంతపురం టౌన్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఇన్¯Œ చార్జ్ మంత్రి కామినేని శ్రీనివాస్ బ్యాంకర్లకు సూచించారు. శనివారం డ్వామా సమావేశ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. వచ్చే నెల నుంచి చిన్న నోట్లను పంపే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ కొందరు బ్యాంకర్లు వృద్ధాప్య, వితంతు పింఛన్లు వారి ఖాతాల్లో పడితే అప్పుల్లో జమ చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలకు ఎవరూ దిగరాదని సూచించారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 5,70,000 జ¯ŒSధ¯ŒS ఖాతాలుంటే 4,60,000 మందికి రూపే కార్డులు అందించినట్లు బ్యాంకర్లు చెబుతున్నట్లు తెలిపారు. అయితే సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
అంతా బాగుంది.. భేషుగ్గా సేవలు
వైద్యాధికారుల మాటలకు వంత పాడిన మంత్రి కామినేని వార్డుల వైపు కన్నెత్తి చూడని వైనం తూతూ మంత్రంగా ప్రభుత్వాస్పత్రి సమీక్షా సమావేశం కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు వైద్య విభాగాధిపతులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశం తూతూమంత్రంగా సాగింది. పేరుకే సమీక్ష అన్న రీతిన ముగిసింది. వైద్యాధికారులు చెప్పగా, మంత్రి ఆలకించి ‘అంతా బాగుంది..ఆస్పత్రిలో బేషుగ్గా పేదలకు సేవలు అందుతున్నా’ యంటూ కితాబిచ్చేశారు. ప్రభుత్వాస్పత్రిలోని సమస్యలను ఒకరిద్దరు వైద్య విభాగాధిపతులు మాత్రమే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పడకల కొరత ఎక్కువగా ఉందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఆస్పత్రి ఆవరణలో రూ.40 కోట్లతో 150 పడకల ఎంసీహెచ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. çస్థలాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని బదులిచ్చారు. అలాగే టీబీ వార్డును మల్టీ స్టోరీడ్ భవనంగా తయారు చేస్తామన్నారు. మహిళా వైద్యుల హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఓపీ 3000కు పెరిగింది ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు, ఆరోగ్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఆస్పత్రిలో రోగుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి కామినేని అన్నారు. గతంలో రోజుకు 1800 నుంచి 2,000 వేల వరకూ వచ్చే ఓపీ ఇప్పుడు 3,000 చేరిందన్నారు. సీటీ స్కా¯ŒS యంత్రం కొనుగోలుకు తక్షణమే చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. సర్జికల్, మెడికల్, ఆరో్ధపెడిక్ వార్డుల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS హెచ్.అరుణ్‌కుమార్, సూపరింటెండెంట్ వై.నాగేశ్వరరావు, ఏడీఎంఈ డా. కె.బాబ్జి, డీఎంఅండ్‌హెచ్‌వో చంద్రయ్య, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్డుల వైపు కన్నెత్తి చూడని మంత్రి ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందుతోన్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉన్నా అటువంటి దిశగా మంత్రి చర్యలు చేపట్టలేదు. కనీసం వార్డులను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది పనితీరును కూడా అంచనా వేయలేదు. కేవలం తూతూ మంత్రంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి వెనక్కి వెళ్లిపోవడంపై ౖవైద్యులే పెదవి విరిచారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి శిశువు అపహరణ కేసు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. మంత్రి ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా వైద్యాధికారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ మానవతా దృక్పధంతో బా«ధితురాలిని పరామర్శించడానికి మంత్రి వార్డుకు వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. -
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
రాజపూడి పీహెచ్సీ ప్రారంభోత్సవంలో మంత్రి కామినేని జగ్గంపేట : రాష్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాజపూడి గ్రామంలో రూ.78.15 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉచిత వైద్య పరీక్షల కేంద్రాల ద్వారా రాష్ట్రంలో సుమారు కోటి మంది పరీక్షలను చేయించుకున్నారన్నారు. మాతాశిశుమరణాలు చోటు చేసుకుంటుండడంతో 16వేల మందికి ట్యాబ్‌లు అందించి ఆన్లైన్లో తల్లీబిడ్డల సమాచారం నిక్షిప్తం చేస్తున్నామన్నారు. తద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆస్పత్రులలో కాన్పు తరువాత ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేస్తున్నామన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసం పీహెచ్సీలలో 19, సీహెచ్సీలలో 40, రాజమహేంద్రవరం వంటి ఆస్పత్రులలో 63 పరీక్షల వరకు నిర్వహిస్తున్నామన్నారు. డెలివరీకి ముందు నాలుగు సార్లు పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం కోసం పట్టణాలలో 222 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కొత్తగా 1400 మంది డాక్టర్లను తీసుకున్నామని, ఇంకా 500 మందిని నియమిస్తామన్నారు. 108వాహనాలు కొత్తవి తీసుకుంటున్నామని, 104 వాహన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం జగ్గంపేట సీహెచ్‌సీని సందర్శించి రోగుల వివరాలడిగి తెలుసుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాజపూడి పీహెచ్సీలో 11మంది సిబ్బందిని నియమించామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ రాజపూడి, చుట్టు పక్కల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. డీఎం అండ్‌హెచ్‌ఓ కె.చంద్రయ్య మాట్లాడుతూ ఈ పీహెచ్సీ రాజపూడి, మన్యంవారిపాలెం, జె.కొత్తూరు, వెంగాయ్యమ్మపురం, మల్లిసాల తదితర గ్రామాల పరిధిలో 25వేల మందికి అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల నవీన్‌కుమార్, పాలూరి బోస్, వీరంరెడ్డి కాశీ, ఎంపీపీలు గుడేల రాణి, కంచుమర్తి రామలక్ష్మి, హౌసింగ్ బోర్డు డైరెక్టర్ కందుల కొండయ్యదొర, కోర్పు లచ్చయ్యదొర, సర్పంచ్ నంగన సత్యనారాయణ, అత్తులూరి సాయిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, వత్సవాయి వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్ ప్రకారమే ఫ్రీ సీట్ల భర్తీ: కామినేని
విజయవాడ : మొదటి వెయ్యిలోపు ర్యాంకులకు ఉచిత వైద్య సీటు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం గుంటూరులోని జీజీహెచ్‌లో ఏపీలో తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేసిన ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను మంత్రి కామినేని అభినందించారు. ఆర్డినెన్స్ పరిశీలించాకే మెడికల్ 'బి' కేటగిరి సీట్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంసెట్ ప్రకారమే ఫ్రీ సీట్ల భర్తీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో ‘వైద్యం’ దిగజారింది.. ఆదుకోండి
కేంద్రమంత్రి నడ్డాకు కామినేని లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక పూర్తిగా దిగజారిపోయాయని.. ఇప్పటికైనా ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇటీవలి స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో కామినేని నిధులకోసం కేంద్రాన్ని అర్థిస్తూ లేఖ రాశారు. కేంద్రమంత్రిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. -
సంక్రాంతి సంబరాల్లో...కానరాని కాంతి
ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వం సకాలంలో అందని నిధులు మండలాల్లో తూతూ మంత్రంగా నిర్వహణ విజయవాడ, బందరులోనే బెటర్ మంత్రి కామినేని డుమ్మా సాక్షి నెట్వర్క్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సంక్రాంతి సంబరాలు జిల్లాలో తూతూమంత్రంగా సాగాయి. ఈ సంబరాల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు అధికారులకు సకాలంలో అందలేదు. దీంతో వారు తమ సొంత నిధులు, ఇతర పద్దుల నుంచి సేకరించి సంబరాలను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర పాల్గొన్న విజయవాడ, బందరుల్లో మాత్రం సంబరాలు కాస్తోకూస్తో ఘనంగా జరిగాయి. కైకలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొంటారని అధికారులు భావించినా ఆయన డుమ్మా కొట్టడంతో అధికారులే సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తొలిసారిగా వచ్చిన సంక్రాంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క జిల్లాకు కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. మండలానికి, మున్సిపాలిటీకి లక్ష చొప్పున, కార్పొరేషన్‌కు రెండు లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించాలని ఆదేశించింది. అవి జిల్లా స్థాయి అధికారులకు 13వ తేదీ వరకు అందలేదు. 14 నుంచి పండుగ ప్రారంభం కావడంతో జిల్లా అధికారులకు వచ్చిన నిధుల్ని మండల స్థాయి అధికారులకు పంపిణీ చేయలేకపోయారు. సకాలంలో నిధులు అందకపోవడంతో ఎంపీడీవోలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు. ప్రచారం శూన్యం.. టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యం... చివరి నిమిషం వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సంబరాల నిర్వహణకు అధికారులు నానా ఇబ్బంది పడ్డారు. దీంతో సంబరాల గురించి గ్రామస్థాయిలో పెద్దగా ప్రచారం జరగలేదు. మండల స్థాయి అధికారులు టీడీపీ నేతలను, కార్యకర్తలను పిలిచి నామమాత్రంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సంబరాల నిర్వహణ ఖర్చులను బాగా కుదించుకుని పొదుపుగా జరిపారు. ముగ్గుల పోటీల్లో అనేకచోట్ల ముగ్గు, రంగులు మహిళలే తెచ్చుకోవాలనే నిబంధన విధించారు. వారికి ఇచ్చే బహుమతులు కూడా నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఇక కబడ్డీ, ఖోఖో వంటి పోటీలు నిర్వహించినా వచ్చిన క్రీడాకారులకు అధికారులు చుక్కలు చూపించారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. సంబరాలు సాగిన తీరిదీ... జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు మున్సిపాలిటీల్లో కేవలం ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేవారు వారి సామగ్రిని వారే తెచ్చుకోవాలని చెప్పారు. పెడన మున్సిపాలిటీ, మండలం కలిపి ఒకేచోట సంబరాలు నిర్వహించి ఖర్చును బాగా తగ్గించుకున్నాయి. పెనుగంచిప్రోలు మండలంలో జరిగిన కబడ్డీ పోటీల్లో కేవలం రెండే టీమ్‌లు పాల్గొనగా వారికే ఒకటి రెండు బహుమతులు ఇచ్చారు. కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో నామ్‌కే వాస్తే సంబరాలు చేశారు. గంగిరెడ్లు, హరిదాసులు, భోగిమంటలు వంటివి కానరాలేదు. పోటీదారులకు మంచినీరు కూడా అందజేయలేదు. ఆయా మండలాల్లో రూ.10 వేల నుంచి 20 వేలు ఎంపీడీవోలు ఖర్చు చేశారు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో నానా ఇబ్బందులు పడ్డారు. సంబరాలు అంతంతమాత్రంగానే జరిగాయి. జనరల్ ఫండ్ నుంచి రూ.20 వేలు, స్థానిక ఎంపీపీ పాటిబండ్ల జయపాల్ సొంత నుధుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఖర్చు చేశారు. ఆగిరిపల్లి మండలంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు కేవలం ప్రశంసాపత్రం ఇచ్చి సరిపెట్టారు. విజయవాడ, బందరులలో... విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు నాలుగు గంటల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బందరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో వివిధ రకాల పోటీలతో పాటు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఇతర శాఖల అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బిల్లులు సిద్ధం చేస్తున్న అధికారులు. సంక్రాంతి సంబరాల చెక్కులను ప్రస్తుతం ఎంపీడీవోలకు జిల్లా రెవెన్యూ అదికారులు అందజేస్తున్నారు. తొలుత తూతూ మంత్రంగా నిధులు ఖర్చు చేసినా ఇప్పుడు లక్ష రూపాయలకు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నారు. అయితే సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ఆదేశించారే తప్ప ఏయే పద్దుల కింద ఎంత ఖర్చుచేయాలో చెప్పలేదని, ఇప్పుడు ఏ బిల్లులు ఇస్తారో, ఏవి తిరస్కరిస్తారో అర్థం కావడం లేదని మండల అధికారులు చెబుతున్నారు. -
టీడీపీ x బీజేపీ
కైకలూరులో కమ్ముకుంటున్న విభేదాలు పీటముడిగా మార్కెట్ చైర్మన్ గిరి కైకలూరు : తెలుగు తమ్ముళ్లు, కాషాయ కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా జిల్లాలో కైకలూరు సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ తరఫున విజయం సాధించిన కామినేని శ్రీనివాస్‌ను మంత్రి పదవి వరించింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కార్యకర్తలు వారి ఆవేదనను మంత్రి కామినేని ముందు వెళ్లగక్కారు. గ్రామాల్లో టీడీపీ నాయకులదే పైచేయిగా ఉంటుందనీ, కనీసం సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని వాపోయారు. అధికారులు సైతం టీడీపీ నాయకుల మాటకే ఎక్కువ విలువిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు మండలంలో ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానం బీజేపీకి వచ్చినప్పటికీ ఆమెను ఎంపీపీగా ఎంపిక చేశామని, ఇది కార్యకర్తలు గమనించాలని మంత్రి కామినేని సర్దిచెప్పారు. నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పిస్తామన్నారు. అయితే మరుసటి రోజున జరిగిన మంత్రి పర్యటనకు బీజేపీ ఎంపీపీ బండి సత్యవతి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ హాజరు కాలేదు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ గాలిలో ఎన్నో ఇబ్బందులను తట్టుకుని తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని, నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని టీడీపీ నాయకులు ఒక విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబు వద్ద దీనిపై పంచాయతీ పెట్టాలని భావిస్తున్నారు. దీంతో అటు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఇటు మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. అసహనంతో ఎంపీపీ సత్యవతి...... స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీ రిజర్వేషన్లో ఆలపాడు ఎంపీటీసీ సభ్యురాలుగా బండి సత్యవతి ఎన్నికయ్యారు. ఆమె భర్త శ్రీనివాసరావు మండల బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా కామినేని గెలిచి మంత్రి అయ్యారు. దీంతో పదవీకాలంలో మొదటి సగం సత్యవతి ఎంపీపీగా ఉండాలని నాయకులు నిర్ణయించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా గడచిన కొద్ది కాలంగా టీడీపీ సమావేశాలకు, వివిధ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఎంపీపీని ఆహ్వానించడం లేదని బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలో అప్పటి మంత్రి పార్థసారథి, ఎంపీ కావూరి సాంబశివరావు బీజేపీ నేతలను స్టేజీపైకి ఆహ్వానించారని, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మార్కెట్ చైర్మన్‌గిరికి పెరిగిన గిరాకీ...... వివాదానికి కేంద్ర బిందువుగా కైక లూరు మార్కెట్ చైర్మన్ గిరి మారింది. కైకలూరులో ఎమ్మెల్యే తర్వాత అంతటి స్థానం ఈ పదవికి ఉంది. కైకలూరు వ్యవసాయ మార్కెట్ సంవత్సర ఆదాయం రూ. 3కోట్లు. నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి మండలాల్లో రెండు మార్కెట్ కమిటీలున్నాయి. నూతన ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక్క మార్కెట్ కమిటీ మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని తెలియడంతో కైకలూరు మార్కెట్ పైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కామినేని, ఎంపీ మాగంటి వద్దకు ఆయా సామాజిక వర్గాల నాయకులతో పైరవీలు నెరపుతున్నారు. దీనికి తోడు గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి మార్కెట్ కమిటీ కేటాయించాలనే వాదన వినిపిస్తుంది. టీడీపీ, బీజేపీ, ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు నాయకులు మార్కెట్ చైర్మన్‌గిరిని ఆశిస్తున్నారు -
మంత్రి కామినేనికి చుక్కెదురు
-
కామినేనిలో ఎంబీబీఎస్ విద్యార్ధి ఆత్మహత్య
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి కామినేని వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయి సురేష్ హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. నార్కెట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా విద్యార్థి ఆత్మహత్యపై మృతుని కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు చెబుతున్నారు. అయితే ఆత్మహత్య విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచారు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయంపై నోరు మెదపటం లేదు.