అనంతపురం టౌన్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఇన్¯Œ చార్జ్ మంత్రి కామినేని శ్రీనివాస్ బ్యాంకర్లకు సూచించారు. శనివారం డ్వామా సమావేశ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. వచ్చే నెల నుంచి చిన్న నోట్లను పంపే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ కొందరు బ్యాంకర్లు వృద్ధాప్య, వితంతు పింఛన్లు వారి ఖాతాల్లో పడితే అప్పుల్లో జమ చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలకు ఎవరూ దిగరాదని సూచించారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 5,70,000 జ¯ŒSధ¯ŒS ఖాతాలుంటే 4,60,000 మందికి రూపే కార్డులు అందించినట్లు బ్యాంకర్లు చెబుతున్నట్లు తెలిపారు. అయితే సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు.