poor people
-
నిలువ నీడ లేకుండా.. కుప్పంలో పేదల ఇళ్లపై దౌర్జన్యం!
కుప్పం(చిత్తూరు జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. శాంతిపురం మండలం మఠం పంచాయితీ సంతూరు గ్రామంలోని నిరుపేదల ఇళ్లను బలవంంతగా ఖాళీ చేయించి కూల్చివేసే పనులను ఆరంభించింది. కీనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు, టీడీపీ నేతలు.. ఆపై కూల్చివేసే కార్యక్రమం చేపట్టారు. అది చెరువు స్థలమని అందుచేత కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.30 ఏళ్లుగా ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయం అంటున్నారు బాధితులు. 10 కుటుంబాలకు చెందిన ఇళ్లను జేసీబీల సాయంతో కూల్చివేశారు అధికారులు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టింది. బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. బాధిత కుటుంబాలు ఉండటానికి మరొకచేట స్థలం కేటాయించక ముందే ఇళ్లను కూల్చివేయడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని పేద ప్రజలకు మరొకచోట స్థలం కేటాయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. -
మీ కాళ్ళు మొక్కుతాం.. మా కడుపులు కొట్టొద్దు
-
అర్ధరాత్రి దౌర్జన్యంగా పేదల ఇళ్లు కూల్చేసిన పోలీసులు
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
-
చేపల వేటకు వెళ్లినట్లుగా అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు
‘కేజీఎఫ్’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్’లో పెద్ద విలన్లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు. ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్ శర్మ. నిజానికి ఇది ప్రకాష్ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్..! (చదవండి: ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!) -
అంధకారం లోనే అంధ వృద్ధ దంపతులు .. మానవత్వం చాటుకున్న నాగోల్ సీఐ
-
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
కదిలిన కావ్యం! వారాంతాల్లో పేదలకు అండగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.మురికివాడలే లక్ష్యంగా.. నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఆ ఆనందం వెలకట్టలేనిది..ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
అ‘సామాన్యులు’ వైఎస్సార్సీపీ తరఫు అభ్యర్థుల్లో నిరుపేదలు..
సాక్షి నెట్వర్క్: అటుపక్క.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు.. మతిపోయే చరాస్తులు. వేలకోట్ల ధనికస్వాములూ ఉన్నారు. దేశంలోనే అపర కుబేర అభ్యర్థుల్లోని వారూ ఆ బ్యాచ్‌లో కొలువుదీరారు. ఇలా పెత్తందారులంతా ఒక్కటై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి తరఫున రాష్ట్ర ఎన్నికల కదనరంగంలో మోహరించారు. వీరికి దన్నుగా కోటానుకోట్ల సంపద ఉన్న ఐశ్వర్యవంతులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో వారి తరఫున రాష్ట్రంలో వాలిపోయారు. వైఎస్సార్సీపీ అభిమానులను ‘వెధవలు’ అంటూ సంభోదిస్తూ కుటుంబానికి రూ.3–4 లక్షలు వెదజల్లయినా వారిని లోబరుచుకునేందుకు వీరంతా బరితెగిస్తున్నారు.కానీ, ఇటుపక్క చూస్తే పేదలకు కొమ్ముకాసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా సై అంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఈ పార్టీ బలగం. ఈ పార్టీ ఎంపిక చేసిన అనేకమంది అభ్యర్థుల ఆర్థిక స్థోమత కూడా అంతంతమాత్రమే. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులున్న వారేమీ కాదు. కేవలం కోటి రూపాయలు అంతకన్నా తక్కువ ఆస్తి ఉన్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తూ రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరంటే.. ► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్‌లోని వివరాలను పరిశీలిస్తే.. ఈరలక్కప్పకు సొంత ఇల్లు, కారు కూడా లేదు. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. బ్యాంకు బ్యాలెన్స్ రూ.27,883 మాత్రమే ఉంది.గుడిబండ కెనరా బ్యాంకులో రూ.41, ఇదే మండలంలోని మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ.26,950 , అగళి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.11, మడకశిర యూనియన్ బ్యాంకులో రూ.881 బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అదే విధంగా అప్పు రూ.1,13,050 ఉంది. గుడిబండ కెనరా బ్యాంకులో వ్యక్తిగత రుణం రూ.86,100, మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ,26,950 అప్పు ఉంది. రూ.99,883 విలువ చేసే చరాస్తులు ఈరలక్కప్పపేరు మీద ఉన్నాయి. అలాగే చేతిలో రూ.10 వేలు ఉన్నట్లు అఫిడవిట్లో ఈరలక్కప్ప పేర్కొన్నారు. ► అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎం.వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద. సెంటు స్థలం కానీ, తులం బంగారం కానీ లేదు. నామినేషన్లో ఈయన సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యంత పేద అభ్యర్థుల్లో ఒకరన్న విషయం స్పష్టమవుతోంది. ఈయన పేరున విలువైన చరాస్తులు రూ.1,06,478 ఉన్నాయి.ఇందులో చేతిలో నగదు రూ.50 వేలు, అనంతపురం ఎస్బీఐలో రూ.11,193, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొత్తూరు బ్రాంచ్)లో రూ.10,002 నగదు నిల్వ ఉంది. అలాగే, 2020లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం ఉంది. దీని విలువ రూ.35 వేలు. ఇక ఆయన భార్య పేరున శింగనమలలోని కెనరా బ్యాంక్‌లో కేవలం రూ.283 నగదు ఉంది. ► పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం. విశ్వేశ్వరరాజు పేరు మీద రూ.20,39,512లు, భార్య పేరున రూ.16,20,320లు, ఇద్దరు పిల్లల పేరున రూ.7,25,927లు, రూ.7,12,606లు కలిపి మొత్తం రూ.50,98,365ల ఆస్తులున్నాయి. రూ.1,20,000 గోల్డ్‌లోన్ అప్పు ఉంది. ► రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం ఆస్తి రూ.53,45,321లు. ఈమె చేతిలో ఉన్న నగదు రూ.2,50,000. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నది రూ.23,72,821లు. ఇన్నోవా కారు రూ.11,22,500, బంగారు ఆభరణాల విలువ రూ.16,00,000, బ్యాంకులో అప్పు రూ.1,76,223లు ఉంది. ► కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి రూ.4,27,066లు. స్థిర, చరాస్తులు రూ.1,89,642లు. తన పేరుతో మైలవరం సెంట్రల్ బ్యాంకు అకౌంట్లో రూ.88, మైలవరం కెనరా బ్యాంకులో రూ.1000, మైలవరం మండల పుల్లూరు ఎస్బీఐ అకౌంట్లో రూ.9,823లు.. రూ.73,531 విలువ గల 2016 మోడల్ బైకు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల బంగారు ఉంగరం.. చేతిలో క్యాష్ రూపంగా రూ.50వేలు ఉన్నాయి. ఇందులో ఆయన భార్య పేరున మైలవరం యూనియన్ బ్యాంకులో రూ.1,624లు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు.. రూ.1,65,600 విలువ గల 24 గ్రాముల బంగారు చైను.. చేతిలో క్యాష్ రూపంగా రూ.15వేలు ఉన్నాయి. -
CM Jagan: ఏ కష్టం వచ్చినా.. క్షణం కూడా ఆలోచించకుండా సాయం (ఫొటోలు)
-
రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం శుభవార్త
-
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్‌ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్‌ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
Fact Check: పేదల ఇళ్లపై కుళ్లు రాతలేలా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఒకేసారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను అప్పగించడం... వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తుండడం పెత్తందారు రామోజీరావుకు మింగుడు పడటంలేదు. నిరుపేదలు సొంతింట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తన వంకర రాతలతో బురదజల్లి అలిసిపోయాడు. ఇక మిగిలిందల్లా ఆ ఇళ్ల స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండడాన్ని కూడా మాయాజాలమంటూ తప్పుడు రోత రాతలు రాస్తోంది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తుండడాన్ని, ఆ ఇళ్లను ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ ప్రజలను, నిరుపేదలు ఆందోళన చెందేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం కింద వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 ఊళ్లను కొత్తగా నిర్మించడం వారి కళ్లకు కనిపించడంలేదు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరుగా మారుతున్నా ఆ పత్రికకు కనిపించదు. ఒక్కో పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ఇంటి రూపంలో రూ.20 లక్షల వరకూ విలువైన స్థిరాస్తి సమకూరుస్తుంటే ఈనాడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. పేదలకు ఇంత పెద్దమేలు జరుగుతుండడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుండడం.. అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు గంగవెర్రిలెత్తిపోతున్నారు. దీంతో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సేవలపైనా నిత్యం వక్రీకరించడమే విధిగా పెట్టుకున్నారు. జియో ట్యాగ్ ఉంటే ప్లాట్లు గుర్తించడం కష్టమెలా అవుతుంది? ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారనడం పచ్చి అబద్ధం. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దు రాళ్లు వేశారు. లబ్ధిదారులను వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోట్యాగ్ కూడా చేశారు. ప్లాటులో నిలబడి ఫోటో దిగడం ద్వారా లబ్ధిదారులకు వారి ప్లాటు ఎక్కడ ఉందో తెలుసు. ’పచ్చ‘పాతంతో చూసే ఈనాడుకు ఇవేమీ కనిపించవు. కేటాయించిన ప్లాట్‌లో ఫోటో దిగి జియోట్యాగ్ చేయడమంటే వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసనే కదా? ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం ఎలా అవుతుంది..? గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఅవుట్లో 9,219 ఇళ్లను మంజూరు చేశారు. ఇంకా 6,152 ఇళ్ళకు సంబంధించి రెండవ విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1,230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 రూఫ్ స్థాయిలోనూ, మిగతావి బేస్మెంట్ స్థాయిలోనూ ఉన్నాయి. మూడవ ఆప్షన్ కింద ఇళ్ల నిర్మాణానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ వాస్తవాలను చూడని ఈనాడు ప్రభుత్వంపై ఆక్రోశంతో విషం చిమ్ముతూ తన దిగజారుడుతనానికి ప్రదర్శించుకుంటోంది. రిజిస్ట్రేషన్ చేయడం మాయాజాలమా? పేదలందరికీ స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఆయా రిజిస్ట్రేషన్లను చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటా బేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టీఫైడ్ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోర్జరీ చేస్తారని గానీ, ట్యాంపర్ చేస్తారని గాని భయం ఉండదు. అమ్మే సమయంలో ఆ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేదలకు లబ్ధి చేకూరే రిజిస్ట్రేషన్ మాయాజాలం అవుతుందా? ఇప్పటికే 8 లక్షల మంది లబ్ధిదారులు తమ పేరున పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటవ లేఅవుట్లో 53 ఎకరాల 33 సెంట్లు 345 మంది లబ్ధిదారులకు, రెండో లేఅవుట్లో 29 ఎకరాల 66 సెంట్లు భూమిలో 777 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్ అధీనంలో ఉన్న భూమిని రూ.43.93 కోట్లతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్ అధికారులకు లేఅవుట్ అభివృద్ధి కోసం అప్పగించారు. -
నేనున్నానంటూ ఓ పేద కుటుంబానికి సీఎం జగన్ భరోసా
-
#HBDYSJagan జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!
జనం మాటే. జగన్ బాట. ఆపదలో ఆపన్నహస్తం. కష్టాల్లో తోడు నీడ. అనేకమంది ఆశలకు, ఆశయాలకు రెక్కలు...ఏ దైవం పంపాడో ..పండగలా దిగివచ్చిన దేవుడు. తమ నీడకు నీడై, తోడుకు తోడై..వెలుగు పూలు పూయించిన జనహృదయనేత. జయహో జగన్. ఇదీ జనం మాట! అడగనిదే అమ్మ అయినా పెట్టదు అనేది సామెత. అన్నా..అని సాయం కోరితే చాలు.. నేనున్నానంటూ ఇచ్చే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాకూ ఓ జగన్ కావాలనేంత.. భరోసా! మాట నిలబెట్టు కోవడంలో, హామీలను తు.చ. తప్పకుండా నెరవేర్చడంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తరువాతే ఎవరైనా. అన్నదాతలను అక్కున చేర్చు కోవడం దగ్గరినించి వైద్య ఆరోగ్య సేవల వరకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల నుంచి , మహిళా సాధికారత వరకు, చదువుల నుంచి పౌరసేవల దాకా అన్నింటా ఆయనొక భరోసా.పేదలు గెలిచే వరకు.. వారి జీవితం బాగుపడే వరకు.. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.Telugu Rap Song 🔥#HBDYSJagan pic.twitter.com/aQ812SOH5H— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2023ఆడపడుచులకు అండగా, బిడ్డలకు విద్యా దీవెనగా, పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు ఆయన మానస పుత్రికలు. కనుకనే ఎన్ని విమర్శ లొచ్చినా నిండుమనసుతో అమలు చేస్తున్న నిబద్ధత ఆయన సొంతం. అందుకే మాట తప్పని నేతగా, జననేతగా నిలిచారు. అంతేకాదు కరువొచ్చినా, కష్టమొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, అరుదైన వ్యాధి వచ్చినా, చదువు కోవాలన్నా ‘నేను ఉన్నాను’ అంటూ ఆదుకునే ఆ మంచి మనసు భరోసా నభూతో నభవిష్యతి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రుజువు చేస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్. అవినీతికి, వివక్షకు తావులేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వేగిరమే ముందుకు రావడమే కాదు. ప్రకటించిన సంబంధిత సాయాన్ని తక్షణమే అందించడంలో ఆయన తీరే వేరు. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో గానీ, ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించడంలో గానీ, ముఖ్యంగా తుపాను సమయాల్లో, ప్రభావిత ప్రాంతాలను పర్యటించడంలోగానీ, బాధితులను ఆదుకోవడంలోగానీ సీఎం జగన్ ఎపుడూ ముందే ఉంటారు. బాధితులను ఆదుకునేలా వెనువెంటనే సాయాన్ని అందించే పెద్ద మనసు. అలాగే ఆరుగాలం పండించిన పంట పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి, వరద ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జమచేసిన ఘనత ఆయనది. ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా తడిసిన ధాన్యంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను తీసుకొవడమే ఇందుకు గొప్ప నిదర్శనం.2023లొ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి పైలట్ కావాలన్నకలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రావణి ఏవియేషన్ శిక్షణకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే సాయం, అన్ని విధాలా ఆదకుంటామని హామీ. 2022లో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న హనీ చిన్నారికి కోటి రూపాయిల సాయం అందించారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి హృదయానికి హత్తుకునే ఘటనలు కోకొల్లలు. ఉద్ధానమా.. గర్వించు!అంతెందుకు ఏ నాయకుడూ నామమాత్రంగా కూడా పట్టించుకోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సంగతి చూడండి. ఉద్ధానం కిడ్నీ బాధితులకిచ్చిన మాటను జగన్ అక్షరాల నెరవేర్చిన సందర్భం అపూర్వం, వేనోళ్ల కీర్తి దగించిందే! దశాబ్దాల తరబడి ఆ ప్రాంత వాసులను వేధించిన సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మచ్చుతునకలు. వీటన్నింటికీ మించి ఆయన రాష్ట్రంలో ఏమూల పర్యటనకు వెళ్లినా.. పేద, గొప్ప, కులం, జాతి మతంతో సంబంధం లేకుండా తన దగ్గరికొచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కున చేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏ ప్రజకైనా తమ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. (విన్నారు.. ఆదుకున్నారు)కోవిడ్-19 సంక్షోభ సమయంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రజల్ని మహమ్మారి ముప్పునుంచి కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసల్ని దక్కించుకున్నాయి. కరోనా కష్టకాలంలో తమ ప్రియతమ నేత తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపించిన ప్రేమ, ఆదరణను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు మరువలేరు. సీఎం జనగ్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నతండ్రిలా తమను ఆదుకున్న జన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే జగనన్నా.. వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అంటూ నిండు మనసుతో జనం ఆశీర్వదిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ తో మెరుగైన వైద్యం
-
కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న మనసున్న అమ్మ
ప్రేమను పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా! కొంతమంది తల్లులు తమ పిల్లల్లాగే... ఇతరులను సైతం ప్రేమగా చూసుకుంటుంటారు. కడుపున జన్మించక పోయినప్పటికీ ఆ తల్లి చూపే ప్రేమాభిమానాలకు అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బిందు రమాకాంత్ ఘట్ పాండే. బిందుని తన పిల్లలేగాక, వేలాదిమంది ‘అమ్మ’ అని అప్యాయంగా పిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెడుతూ ఎందరికో అమ్మగా మారింది బిందు రమాకాంత్ ఘట్పాండే. అంతమందికి అమ్మగా మారిన బిందు గురించి ఆమె మాటల్లోనే.... ‘‘రాజస్థాన్‌లోని ఝుంఝునులో పుట్టాను. ముగ్గురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబం మాది. నాన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ప్రతి రెండేళ్లకోసారి నాన్నకు బదిలీలు జరిగేవి. దీంతో చాలా భాషలు పరిచయం అయ్యాయి. పంజాబీ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలు చక్కగా మాట్లాడగలను. నా పెళ్లి అయిన తరువాత మా ఆయనతో కలిసి భోపాల్‌లో స్థిరపడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి కోల్‌కతా ఐఐఎమ్ టాపర్. అమ్మాయి దుబాయ్‌లో రేడియో జాకీ. యాంకర్‌గా పనిచేస్తోంది. పిల్లల బాధ్యతలు తీరాక నాకు చాలా ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో సమాజానికి ఏదైనా మంచి చేయాలనిపించింది. ఏం చేయాలా... అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు టీవీలో ‘గ్రాండ్ మదర్స్ కిచెన్’ గురించి చూశాను. అప్పుడే నాకు కూడా ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మా ఆయనకు చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే ఇంట్లో భోజనం తయారు చేసి కారులో పెట్టుకుని రోడ్డుమీదకు ఆకలితో ఉన్న వారు కనిపిస్తే వారికి భోజనం పార్శిల్ ఇచ్చేదాన్ని. వాళ్లు తిన్న తరవాత చెప్పే కృతజ్ఞతలతో నాకు కడుపు నిండిపోయేది. అలాగే ఉదయాన్నే పాతిక లీటర్ల గంజి తయారు చేసి వీధికుక్కలకు పోసేదాన్ని. ఆ తరువాత ‘ఉత్కర్షిణి’ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం ఈ ఉత్కర్షిణి వందలాది మంది ఆకలి తీరుస్తోంది. రోజుకో మెను... కిచెన్‌లో ఎంతో పరిశుభ్రంగా భోజనం వండిస్తాను. తయారీ అంతా నా పర్యవేక్షణలో జరుగుతుంది. రోజుకొక మెను పెడుతున్నాను. ఒక రోజు పప్పు, కూరలు, అన్నం పెడితే.. మరుసటిరోజు రాజ్మా, అన్నం, ఇంకోరోజు పూరీ, కూరలతో వడ్డిస్తున్నాం. పప్పు, అన్నం అయితే ప్లేటు ఐదు రూపాయలకు, రసగుల్లా, హల్వా పూరీ ఉన్న రోజు ప్లేటు ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నాం. మా భోజనం తినేవారి సంఖ్య పెరగడం... ‘‘భోజనం బావుంది, కానీ స్వీట్ ఉంటే బావుంటుంది’’ అని కస్టమర్లు చెప్పడంతో తొలుత హల్వా పెట్టడం మొదలుపెట్టాము. ఇప్పుడు రసగుల్లా కూడా పెడుతున్నాం. ఆకలి తిరడానికి మాత్రమే... ఉత్కర్షిణి కిచెన్‌లో తయారైన భోజనానికి ఎలాంటి నిబంధనలు లేవు. నిరుపేదల నుంచి ఎవరైనా తినవచ్చు. మా భోజనం తినేవారిలో పారిశుధ్య కార్మికులు, రిక్షా నడిపేవాళ్లు, నర్సులు, డాక్టర్లు, విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఆకలి వేసినా తిని వెళ్లాల్సిందే తప్ప.. ఇంటికి ప్యాక్ చేసి ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులు మందులు వేసుకునే ముందు ఏదైనా తినాలని చెప్పి సమోసా, బిస్కెట్లు తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే వీరు సైతం తినేలా మా కిచెన్ ఆహార పదార్థాలు అందిస్తోంది. అలా వందలమందికి.. నేను పెడుతోన్న భోజనానికి డిమాండ్ పెరగడంతో వంటవాళ్లను పెట్టుకుని వండించడం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఆసుపత్రి, దానిపక్కన స్టూడెంట్ క్యాంపస్ ఉంది. అక్కడ భోజనం ప్లేటు ఐదు రూపాయలకు ఇస్తున్నాను. చాలామంది విద్యార్థులు వచ్చి తింటున్నారు. అలా నా దగ్గర భోజనం చేయడానికి వచ్చేవారు నన్ను ‘‘అమ్మ లేదా మా’’ అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా ఉత్కర్షిణి కిచెన్ కుటుంబం రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకే త్వరలో భోపాల్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా నా సేవలను విస్తరించబోతున్నాను. మరింత మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం’’అని చెప్పింది బిందు రమాకాంత్ ఘట్పాండే. -
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్
-
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
Zubeda Ali: నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ పంచిన కమెడియన్ అలీ భార్య జుబేదా (ఫోటోలు)
-
పేదలపై దాడులు చేయడమే ఫ్రెండ్లీ పోలీసా: షర్మిల
హస్తినాపురం: తెలంగాణలో అణగారిన వర్గాలు, పేదలపై పోలీసులు పాశవికంగా దాడులకు పాల్పడటమే ఫ్రెండ్లీ పోలీసా.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ల మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం హస్తినాపురంలోని శ్యాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు లక్ష్మిని ఆమె పరా మర్శించారు. అనంతరం షర్మిల మాట్లాడు తూ గిరిజన మహిళ అని చూడకుండా లక్ష్మి ని పాశవికంగా చిత్రహింసలకు గురిచేసిన ఎల్బీనగర్ పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో తన కూతురు పెళ్లి ఉందని కార్డు చూపించినా వినకుండా ఎస్ఐ రవికుమార్ చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, 120 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని మంత్రిగాని, ఎమ్మెల్యేగాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు షర్మి ల గంటసేపు ధర్నా చేశారు. అనంతరం నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ ఆదేశాలతో షర్మి లను మ హిళా కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు. -
విశాఖ పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
సంపద సృష్టి అనే మాటను తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఏపీలో ఒక నాయకుడు తనకే సంపద సృష్టించడం తెలుసు అని ఏదేదో చెబుతుంటారు. కానీ, మరో నాయకుడు సంపద సృష్టించి చూపించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే పేదలను ధనికులను చేస్తానని పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతుంటే, ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు లక్షల విలువైన ఆస్తి సమకూర్చి ‘ఇదీ.. పేదలను ఆదుకోవడం’’ అని రుజువు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఇరవైఐదు లే అవుట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం చూస్తే కొన్ని స్పష్టమైన నినాదాలు, విధానాలతో ఆయన ముందుకు వెళుతున్నట్లు అర్ధం అవుతుంది. తొలుత ఒక లబ్దిదారు మాట్లాడుతూ తనకు కేటాయించిన సెంటు భూమి విలువ ఇప్పుడు పది లక్షలకు పైనే ఉంటుందని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దానికి తోడు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరో మూడు లక్షలు, అక్కడ మౌలిక వసతులకు ఖర్చు పెట్టబోయే నిదులను లెక్క వేసుకుంటే మొత్తం పదిహేను లక్షల వరకు ఆమెకు సమకూరినట్లవుతుంది. నిజంగానే సంపదను సృష్టించడం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ✍️ గతంలో అమరావతి గ్రామాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజధాని అని ప్రకటించినప్పుడు భూములు కలిగిన ఆసాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు లబ్ది పొందితే.. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఆ ప్రాంతంలో లబ్ది పొందడం గమనించదగిన అంశమే అవుతుంది. అందుకే ఆయన పెత్తందారులే అక్కడ పాగ వేయాలని అనుకున్నారని, కాని తాము పేదలకు అవకాశం ఇచ్చామని, దీనిని సామాజిక అమరావతిగా. మనందరి అమరావతిగా మార్చామని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ఉపన్యాసం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం జరగకుండా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు. ✍️ అయినప్పటికీ మీ బిడ్డ మీ తరపున మూడేళ్లపాటు న్యాయపోరాటం చేసి, పేదలకు ఇళ్లు కట్టించడం వరకు తెచ్చామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్లు కట్టవద్దంటూ ఏపీలోనే ప్రతిపక్షం అడ్డుపడిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేసి అడ్డుకునే యత్నంచేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చేయాలని, నిధులు రాకుండా అడ్డుపడాలని చూశారని ఆయన తెలిపారు. ఊరుపేరులేని సంఘాలను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ✍️ ఒకప్పుడు అమరావతి రాజధానిలోకి జగన్ రాకూడదని కొందరు పసుపు నీళ్లు చల్లి అవమానించే యత్నం చేస్తే.. ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్ యాభై నాలుగువేల మందికి ఇళ్లు కట్టిస్తుండడం విశేషం. చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన , అలాగే ఈనాడు తదితర ఎల్లో మీడియా పేదలకు ఎలా వ్యతిరేకంగా ఉన్నారో ఆయన ఆధారసహితంగా వివరించడం ద్వారా రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ పంపించారు. తాను పేదల ప్రతినిధినని.. చంద్రబాబు, పవన్ లు పెత్తందార్ల ప్రతినిధులని, పేదల కోసం తాను పలు స్కీములు అమలు చేస్తుంటే, చంద్రబాబు తదితరులు వాటిని అడ్డుకుంటున్నారని.. తాను చేస్తున్న వాదనకు ఆయా ఉదాహరణలను కూడా జగన్ ఇచ్చారు. ప్రత్యేకించి పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్నారని ఆయన గుర్తు చేశారు.అదే టైమ్ లో ఆ పెత్తందార్లంతా తమ పిల్లలను ఇంగ్లీష్ బడులలో చదివిస్తున్నారని ఎద్దేవ చేశారు. ✍️ పేదవారికి తాను మేలు చేస్తుంటే వీరు ఓర్వలేకపోతున్నారని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాకపోతే వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఆయన మాట్లాడలేదు. మొత్తం స్పీచ్ లో పెత్తందార్లు, పేదల మధ్య పోరాటం గురించే ఆయన చెప్పే యత్నం చేశారు కాని, ఇతరత్రా రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. ✍️ అమరావతి ప్రాంతంలో గజం విలువపదిహేను వేల వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావించి , ఆ స్థలాలతో పాటు,రోడ్లు, నీరు, పార్కులు, తదితర సదుపాయాలు సమకూర్చుతున్న సంగతిని ఆయన వివరించి 12 లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల మేర ఆస్తిని సమకూర్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పేదలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేకపోయారు. సంపద సృష్టి అంటే ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చూస్తారన్న భావన ఉంది. అదికూడా బాగా డబ్బున్నవారికే అదనంగా వచ్చే ఆదాయవనరుగా మార్చడం మినహాయించి పేదల పక్షాన ఆయన ఉండేవారు కాదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అమరావతిని ఒక వర్గం రాజధానిగా, ధనికుల రాజధానిగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసనకు గురయ్యారు. అందుకే అమరావతిని జగన్ పేదలు కూడా నివసించే రాజధానిగా మార్చినట్లయింది. ఇక్కడ కొందరు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు. ✍️ జగన్ ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమేకాని, ఇతరత్రా అభివృద్ది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన జవాబు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఏ పని చేద్దామన్నా కేసులు వేసి అడ్డుకుంటున్నవారే ఈ ప్రశ్నలు వేస్తున్నారని , తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, కేసుల గొడవ లేకపోతే అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన అన్నారు. రాజధాని గ్రామాలలో కొంతమంది తెలుగుదేశం, తదితర కొన్ని రాజకీయ పక్షాల ట్రాప్ లో పడి , అక్కడ అభివృద్ది కన్నా, ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. అది వాస్తవం. ✍️ చంద్రబాబు నాయుడు పరాజయం చెందినా, ఆయన మాట ప్రకారమే నడుచుకుని వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి కాగానే అనవసర నిరసనలకు పోకుండా, వారంతా ఒక కమిటీగా ఏర్పడి, జగన్ ను కలిసి తమకు కావల్సిన అభివృద్ది పనులను చేయించుకుని ఉంటే బాగుండేది!. పైగా ఒకేసారి 55 వేల ఎకరాల భూమిని అభివృద్ది చేయడం ఎవరి వల్లా కాదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం అలివికాని పనిని భుజాన వేసుకుని చతికిలపడ్డారు. పైగా ఆయన టైమ్ లో రాజధాని ప్రాంతంలో పేదలకు ప్రాతినిధ్యమే లేదన్నట్లుగా వ్యవహారాలు సాగాయి. చివరికి అస్సైన్డ్ భూములను కూడా తమ అధీనం చేసుకున్నారు. దానికి ఆనాటి ప్రభుత్వం సహకరించి అప్రతిష్టపాలైంది. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త టౌన్ షిప్ లు నిర్మించడం కూడా అభివృద్దిలో భాగమే అవుతుంది. ఇదే మాదిరి ఇతరత్రా అభివృద్ది పనులు కూడా జరిగేలా అందరు సహకరిస్తే మంచిది. లేకుంటే ఎప్పటిమాదిరి పెత్తందారి పోకడలతోనే,కుట్రలలోనే భాగస్వాములవుతామని ప్రతిపక్షం అనుకుంటే అది వారికే నష్టం అని వారు తెలుసుకోవాలి. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్ జీవితాంతం రుణపడి ఉంటా లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. :::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
కేంద్రం ఒప్పుకోకున్నా ఆ భారం భరించడానికి ప్రభుత్వం సిద్ధం: సజ్జల
సాక్షి, అమరావతి: కలల రాజధాని కట్టబోతున్నామని చంద్రబాబు భ్రమలు కల్పించారు తప్ప చేసిందేమి లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం జీవం ఏమీ లేదని.. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలతో ఈ ప్రాంతంలో జీవం కన్పిస్తోందన్నారు. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పేదల నిర్మాణాలకి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఆరు నెలలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా 25 ఊర్లు ఈ ప్రాంతంలో రాబోతున్నాయన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఈ భారాన్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆరు నెలలలో ఊళ్లు వస్తాయి.. పాఠశాలలు, డిజిటల్ లైబ్రరీలు లాంటివి వస్తాయి.. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అన్ని సౌకర్యాలతో కొత్త ఊళ్లు రాబోతున్నాయని అన్నారు. పేదల నివాసానికి అనువుగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని సజ్జల తెలిపారు. చదవండి మూడు నెలల తర్వాత ఐటీ ఉద్యోగి సమాధి బద్ధలు.. పిల్లల భవిష్యత్తు కోసమేనట -
‘మంగళగిరిలో లోకేష్ ఓటమి.. అందుకే పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోంది’
సాక్షి, అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24 న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించింది.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రాజధానిలో పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని భావిస్తున్నామన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే పేదల ఇళ్ల నిర్మాణాలని టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి ‘ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్‌కే ప్రజలు మద్దతు’ -
పేదల సమస్యలపై తక్షణం స్పందిస్తోన్న సీఎం వైఎస్ జగన్
-
పేదరికం.. తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ‘పేదరికంపైనే నా యుద్ధం.. పేదల సంక్షేమమే నా లక్ష్యం’ అని విస్పష్టంగా పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధనలో కీలక మైలురాయిని అధిగమించారు. మొత్తం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువగా ఉండాలన్న నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 2021లో సాధించింది. విపక్షాలు రాజకీయ దురుద్దేశాలతో ఎంత బురద జల్లుతున్నా సంక్షేమ ఫలాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నట్లు మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘జాతీయ బహుముఖ పేదరిక సూచీ’ నివేదిక ఈ వాస్తవాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. 2016 కంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారని నివేదిక తెలిపింది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. పౌష్టికాహారం, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంటనూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం లాంటి 12 అంశాలు ప్రామాణికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. గ్రామాల్లో గణనీయంగా తగ్గుదల.. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గుతోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గారు. నిరుపేదలు 5.71 శాతం తగ్గారని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గడం గమనార్హం. 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 14.72 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 4.63 శాతం మంది నిరుపేదలున్నారు. 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు 7.71 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 2.20 శాతానికి తగ్గారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.01 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.43 శాతం పేదరికం తగ్గింది. 12 అంశాల్లోనూ మెరుగైన పనితీరు బహుముఖ పేదరిక నిర్మూలనకు సంబంధించి నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకున్న 12 అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు (వంటనూనెల వినియోగం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ వినియోగం, గృహనిర్మాణం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు) ఇలా అన్నింటిలో రాష్ట్రం ప్రగతి సాధించింది. చంద్రబాబు సాధించలేనిది... జగన్ చేసి చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలను అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. పేదరిక నిర్మూలనకు నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమించడమే అందుకు నిదర్శనం. బహుముఖ పేదరిక సూచీల ప్రమాణాల ప్రకారం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువ ఉండాలని నీతి ఆయోగ్ పేర్కొంది. 2016 డిసెంబర్లో నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10 శాతం కంటే తక్కువ పేదలున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా, మిజోరాం రాష్ట్రాలే ఆ జాబితాలో ఉన్నాయి. 2016 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు 11.77 శాతం మంది ఉన్నారు. అంటే జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయింది. అయితే 2021నాటికి ఆంధ్రప్రదేశ్ పేదల సంక్షేమంలో గణనీయమైన ప్రగతి సాధించింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించింది. పేదరికాన్ని సమర్థంగా కట్టడి చేసిన రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. రాష్ట్ర జనాభాలో నిరుపేదలను 6.06 శాతానికి తగ్గించింది. -
సీఎం దృష్టికి వచ్చిన అర్జీల సమస్యలకు తక్షణ పరిష్కారం
-
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
సీఎం దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు
-
మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు.. మహిళల పేరు మీదే ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబునాయుడు అండ్ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్. ఏపీలో అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద ఉంచాం. ఇళ్ల స్థలాలతో పాటు 5 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలోనే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ వ్యయంతో ఐదు వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశారా? అని సీఎం జగన్ సభా వేదిక నుంచి నిలదీశారు. నరకాసురుడినైనా నమ్మొచ్చుగానీ.. సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. మంచి చేసే ప్రభుత్వం ఇది కోవిడ్ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం. నాన్ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్ -
ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన. 👉 ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్ ప్రకటించారు. 👉 దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేస్తామని తెలిపారాయన. 👉 ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్ ప్రకటించారు. -
CM YS Jagan:పెత్తందారుల కుట్రలు చేధించి మరీ..
తాము మాత్రమే బాగుండాలనేది పెత్తందారుల తత్వం.. అందుకే న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారు కోర్టులో కేసులు వేయించి.. పట్టాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు పైగా అమరావతిలో పేదలకు స్థానంలేదని తక్కువచేసి మాట్లాడారు.. పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వక్రభాష్యాలు చెప్పారు.. చివరకు.. ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలను సమాధులని కూడా అవహేళన చేశారు. యెల్లో మీడియా సైతం ఆ కుటిల యత్నాలకు వంతపాడింది.. కానీ, ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రేలాపనలు చేసినా.. జగనన్న పట్టించుకోలేదు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆ అంశంపైనే దృష్టి పెట్టారు. పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్నది ఆయన అభిమతం. నిలువ నీడలేని వారికి సొంత గూడు ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం. పేద కుటుంబాల భవిష్యత్తు బాగుండాలన్న కృతనిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ ఆగిపోలేదు. పేద కుటుంబాల ముఖాల్లో సంతోషం చూడాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా.. అమరావతిలో 50,793 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరగనుంది. తుళ్లూరు(గుంటూరు) మండలం వెంకట పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక నుంచి ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అదే సమయంలో పేద లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారాయన. విశేషం ఏంటంటే.. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఇళ్లకు సైతం మౌలిస వసతులను అందించింది జగనన్న సర్కార్. మొత్తంగా.. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. పక్షపాత రహితంగా పంపిణీలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం.. ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని లబ్ధిదారులకు సూచిస్తోంది కూడా. ఈ నిజాయితీ, నీతివంతమైన పాలనను ఏపీ ప్రజానీకం మెచ్చుకుంటోంది. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ.. ప్రజలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీలు చేపట్టారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం.. అందులో భాగంగా నేడు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. #YSRJaganannaIllaPattalu#YSRJaganannaColonies#CheppadanteIsthadanthe #CMYSJagan #APDC pic.twitter.com/JG00Yh2C63 — AP Digital Corporation (@apdigitalcorp) May 26, 2023 -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ, పెత్తందారులు అడ్డుకున్నారు: పొన్నవోలు
-
‘రాజకీయాల నుంచే కాదు.. దేశ బహిష్కరణ చేయాలి’
సాక్షి, గుంటూరు: చరిత్రలో చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యయం అయితే.. ఆ పాలనలో పేదలకు ఇల్లు అనేది ఒక కలగానే ఉండిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేయడానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. కోపం, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు సజ్జల. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. 2014-19 మధ్య రాష్ట్రంలో పేదలకు ఎక్కడైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. నిజంగా ఇస్తే ఎవరికి ఇచ్చారో బయట పెట్టగలరా?. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం. కనీసం టిట్కో ఇళ్లలో కూడా 16 గజాలు ఇవ్వలేదు. అందులో కూడా కాంట్రాక్టర్లకు అధిక రేట్లుకు ఇచ్చి.. వారి నుండి కిట్ బ్యాగులు తీసుకున్నారు. ఇప్పుడేమో సెంటు స్థలంలో మురికివాడలు అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అని సజ్జల మండిపడ్డారు. చక్కని రోడ్లు, మంచినీరు, కరెంటు అన్నీ కల్పిస్తుంటే మురికివాడలు అంటారా?. స్థానిక ఎమ్మెల్యేలు ఆ పేదలకు సామాజిక బాధ్యతగా సిమెంట్, ఇసుక, కంకర లాంటివి తక్కువ రేటుకు ఇప్పిస్తున్నారు. జగన్ కట్టించిన టిట్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని సజ్జల అన్నారు. ముందస్తు ఎన్నికలనే తప్పుడు ప్రచారం చేసుకుని పార్టీని బతికించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని, చంద్రబాబు బలవంతుడు అవుతాడని భావించినప్పుడే తాము ముందస్తుకు వెళ్తామని.. కానీ, అలాంటిదేం లేనప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏంటని సజ్జల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబుది దింపుడుకల్లం ఆశ. లోకేష్ ఎదగలేదనీ, పార్టీ బతకదని చంద్రబాబుకు పూర్తిగా అర్థం అయ్యింది. అందుకే ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారు’’ అని సజ్జల అన్నారు. -
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం: సజ్జల
సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్5 జోన్‌పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు. టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం. రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల. విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు. చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఎన్టీఆర్ జిల్లాలో అదనంగా 168 ఎకరాలు కేటాయింపు
-
Andhra Pradesh: నిరుపేదకు న్యాయ ‘పట్టం’
సాక్షి, అమరావతి: నిలువ నీడలేని దాదాపు 50,000 నిరుపేద కుటుంబాలకు మంచి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ అసంబద్ధమైన వాదనలతో రైతుల ముసుగులో కోర్టుకెక్కిన టీడీపీ నేతలకు చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలివ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని రైతుల పేరుతో కొందరు దాఖలు చేసిన అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈమేరకు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 45, ఇళ్ల పట్టాల కేటాయింపు ప్రధాన వ్యాజ్యాలు తాము వెలు వరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని వర్గాల అభివృద్ధితోనే.. రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు మేరకే ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజధాని నగర నిర్మాణం చేపట్టేందుకు, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. అన్ని వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్), దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాల అభివృద్ధి కూడా రాజధాని అభివృద్ధిలో భాగమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రైతులు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులిస్తే అది న్యాయ ఔచిత్యాన్ని ఉల్లంఘించినట్లవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా అడ్డుకోండి.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏను అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతుల పేరుతో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలను కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై గత నెల 21న వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ధర్మాసనం తన నిర్ణయాన్ని వెలువరించడానికి ముందే రాజధాని రైతుల తరఫు న్యాయవాది సంజయ్ సూరనేని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆ లేఖలో కోరారు. దీంతో ధర్మాసనం రైతుల వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టింది. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవ్‌దత్ కామత్, సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్డీఏ తరఫున కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రైతులు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని వెలువరించింది. పిటిషనర్లు ప్రభావితం కావడం లేదు.. ‘గత మాస్టర్ ప్లాన్‌లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) ఇళ్ల స్థలాల కోసం ఎలాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని కేటాయించలేదు. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇస్తోందని, ఆ భూమి ల్యాండ్ పూలింగ్ స్కీంలోని లేఔట్లలో భాగం కాదని మా దృష్టికి తెచ్చారు. పేదలకు ఇప్పుడు కేటాయిస్తున్న స్థలంతో పిటిషనర్లకు (రాజధాని రైతులు) ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. పేదలకు ఇవ్వదలచిన స్థలం ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించింది. రాజధాని అభివృద్ధిలో భాగమైన నవ నగరాలు చెక్కు చెదరకుండా ఉండటమన్న అంశం సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూములపై పిటిషనర్లకు ఎలాంటి హక్కు లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ప్రత్యక్షంగా వారు ఏ విధంగానూ ప్రభావితం కారు. రాజధాని అభివృద్ధి కోసం పూలింగ్‌లో భాగంగా తమ భూములిచ్చామని పిటిషనర్లు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ కూడా అందులో భాగమని, ఎలక్ట్రానిక్ సిటీని దెబ్బ తియ్యడమంటే తమ హక్కులను హరించడమేనని వారు వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. అందువల్ల పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మేం సుముఖంగా లేం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే -
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్
-
పేదింట వెలుగు నింపిన వైఎస్ఆర్ ఆసరా
-
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
-
Ms శ్రీదేవి.. ఎల్లలెరుగని సేవ
ఇరవై నాలుగేళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? శ్రీదేవి మాత్రం సమాజ సేవకు సిద్ధపడింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుంది. పేదలతో మమేకమవుతూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తోంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ నేపథ్యమే తనను ఈ దిశగా అడుగులు వేసేలా చేశాయంటున్న శ్రీదేవి.. సేవా కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్న ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం. మద్దిపాడు(ప్రకాశం జిల్లా): Ms శ్రీదేవి. పేరు ఎక్కడో విన్నట్టు.. చూసినట్టు అనిపిస్తోందా? తను సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో ఇన్ఫ్లూయెన్సర్. నిరుపేదలకు సేవ చేయడంలో కలిగే సంతృప్తిని సమాజానికి పరిచయం చేస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కృప, సత్యనారాయణల మూడో కుమార్తె శ్రీదేవి. తను పుట్టిన మూడు నెలలకే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటే ముందు ఇద్దరు అక్కలు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది తన తల్లి. ఈ క్రమంలో తల్లి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన శ్రీదేవి మనసులో పేదలకు సేవ చేయాలన్న ఆలోచన నాటుకుపోయింది. తన 24వ ఏట నుంచి సేవా కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించింది. భర్తను కోల్పోయి చిన్న పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు లేని వృద్ధులు, చదువుపై ఆసక్తి ఉన్నా చదివించే స్థోమత లేని నిస్సహాయ తల్లిదండ్రుల దీనగాథలు ఆమె దృష్టికి రాగానే వెంటనే స్పందించడం, ఆఘమేఘాల మీద ఆ ప్రాంతానికి వెళ్లి సాయం అందించి ఆత్మ సంతృప్తి పొందడం అలవాటుగా చేసుకుంది. గురువారం ఆమె మద్దిపాడు మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీకి వచ్చింది. స్థానిక సర్పంచ్ గంగిరెడ్డి ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంది. కాలనీ పది మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు దుస్తులు, కొంత నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకుంది. ‘నా ఆత్మ సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి నెలా సుమారు రూ.3 లక్షలకు పైగా పేదల కోసం ఖర్చు చేస్తున్నా. చిన్న పిల్లలను చదివిస్తున్నా. నా టీమ్‌లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఏఏ జిల్లాలకు వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఆ తర్వాత గ్రామాలను ఎంచుకుని సహాయం అవసరమైన వారిని గుర్తిస్తాం. 20 మంది బాలబాలికలకు స్కాలర్షిప్ అందిస్తూ వారి చదువుల బాధ్యతను కూడా తీసుకున్నా’ అని సంతోషంగా చెప్పింది. శ్రీదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆశిద్దాం. -
కేసీఆర్ సర్కార్ భారీ ప్రణాళిక.. జాగా ఉంటే నిధులు.. లేదంటే స్థలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఇంటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సొంత జాగా ఉన్నవారితో పాటు లేని పేదలకు కూడా గృహ వసతి కల్పించే అంశంపై కసరత్తు ప్రారంభించింది. సొంత జాగా ఉంటే ఇళ్ల నిర్మాణానికి నిధులు, భూమి లేని వారికి నిర్ధారిత పరిమాణంలో స్థలాల కేటాయింపు దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించటం ద్వారా వారే ఇళ్లను నిర్మించుకునే పథకానికి గతేడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే విధివిధానాలు ఖరారు చేయకపోవటంతో ఆ బడ్జెట్ కాలంలో నిధులు విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లో 4 లక్షల ఇళ్లను మళ్లీ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలో.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం రూపురేఖలు గొప్పగా ఉన్నప్పటికీ, ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉండగా, ఈ ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఒకరికి ఇస్తే వంద మంది గొడవకు దిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం లభించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. పేదల ఇళ్ల విషయంలో వెంటనే దిద్దుబాటు అవసరమంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్, హరీశ్‌లకు వివరించారు. దీంతో దీనిపై ప్రభుత్వం కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూములను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సొంత స్థలాలు లేని వారి కోసం.. సొంత స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్లోనూ రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించింది. తద్వారా నాలుగు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. అయితే కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇస్తే జాగా లేని వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో సొంత స్థలాలు లేనివారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. అలా స్థలాలు ఇవ్వాల్సి వస్తే ఎంతమంది లబ్ధిదారులుంటారు? ఒక్కొక్కరికి 60 గజాల నుంచి 80 గజాల వరకు అందించాలంటే ఎంత భూమి అవసరమవుతుంది? సరిపడా ప్రభుత్వ భూమి ఉందా? లేని పక్షంలో ఎంతభూమిని సమీకరించాల్సి వస్తుంది? వినియోగంలో లేని అస్సైన్డ్ భూములను వాడుకునే వీలుందా?.. తదితర అంశాలపై వివరాలను వచ్చే సోమవారం నాటికి అందజేయాల్సిందిగా తాజాగా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈ వివరాలు అందిన తరువాత తుది నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
దిగులు తొలగిస్తూ.. ధీమానిస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు.. ఊహించని విపత్తులు.. పేద కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆయా కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంటోంది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం తలకిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు సైతం ఆగిపోతున్నాయి. పేదల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తూ వారిలో దిగులును తొలగిస్తోంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తూ ధీమా నింపుతోంది. రూపాయి కూడా ప్రీమియం లేకుండా.. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి (ఇంటి యజమానికి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 5,05,094 కుటుంబాలకు, నంద్యాల జిల్లాలో 4,13,498 కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో రెండు కాళ్లు లేదంటే రెండు చేతులు పోతే రూ.5 లక్షలు, ఒక కాలు, ఒక చేయిపోతే రూ.2.50 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.లక్ష ప్రకారం పరిహారం లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ప్రమాద బీమా, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణం బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని క్లయిమ్‌లను పరిష్కరిస్తారు. సహజ మరణానికి పరిహారం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అసంఘటిత రంగంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా వైఎస్సార్ బీమా సదుపాయం కల్పించడం విశేషం. సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తూ మరణించినా వెంటనే సంబంధిత సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంటుకు సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లిస్తారు. గడువులోపు పరిహారం.. వైఎస్సార్ బీమా కింద క్లయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేక షెడ్యూలు ఉంది. దీని ప్రకారం సహజ మరణం క్లయిమ్‌లను 24 రోజులు, ప్రమాద మరణం క్లయిమ్‌లను 65 రోజుల్లోను పరిష్కరిస్తున్నారు. సచివాలయం స్థాయిలో జరిగే డాక్యుమెంటేషన్‌ను అనుసరించి క్లయిమ్‌లు పరిష్కారం అవుతాయి. సహజ, ప్రమాద మరణాలకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కలెక్టరేట్లోని డీఆర్డీఏ– వైకేపీలోని వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంది. కాల్ సెంటరులో బీమా డీపీఎం, డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆమోదించి పరిహారం చెల్లింపు కోసం జీఎస్డబ్ల్యూస్ డిపార్టుమెంట్‌కు పంపుతారు. సహజ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాద మరణాలకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. సత్వర సాంత్వన వైఎస్సార్ బీమా పరిహారం ప్రొసీడింగ్స్ అందుకుంటున్న ఈమె పేరు జెల్లి జయమ్మ. ఆదోని మండలం ఆరేకల్ గ్రామానికి చెందిన ఈమె భర్త జెల్లి రాఘవేంద్ర ప్రమాదవశాత్తూ్త 2022 సెప్టెంబరు 6వ తేదీన మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి వైఎస్సార్ బీమా అండగా నిలిచింది. నాలుగు నెలల్లోనే 2022 డిసెంబరు 1న రాఘవేంద్ర భార్య జెల్లి జయమ్మకు రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. సత్వర స్వాంతన చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని జయమ్మ తెలిపారు. బాధిత కుటుంబానికి ఊరట ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు నాగేశ్వరమ్మ, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని మాసామసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కురువ నాగరాజు ప్రమాదవశాత్తు 2022 ఆగస్టు 10న మృతి చెందాడు. ఇద్దరు కుమారుల పోషణ కష్టంగా ఉన్న తరుణంలో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా ద్వారా చేయూత ఇచ్చింది. నాగేశ్వరమ్మకు రూ. 5 లక్షల పరిహారం లభించింది. పకడ్బందీగా బీమా పథకం అమలు వైఎస్సార్ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సచివాలయంలో ఎంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పంపితే అంత త్వరగా క్లయిమ్ పరిష్కారం అవుతుంది. రైస్ కార్డు కలిగిన కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ బీమా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో 5 లక్షలకుపైగా కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ–వైకేపీ లక్షలాది పేద కుటుంబాలకు భరోసా జాప్యం లేకుండా క్లయిమ్‌లు పరిష్కారమవుతుండడంతో ఆయా కుటుంబాలకు భరోసా లభిస్తోంది. 2021–22లో వైఎస్సార్ బీమా కింద 1,398 కుటుంబాలకు భరోసా దక్కింది. 2022–23లో కర్నూలు జిల్లాలో సహజ మరణం పొందిన 496 కుటుంబాలకు రూ.4.82 కోట్లు, నంద్యాల జిల్లాలో 477 కుటుంబాలకు రూ.4.60 కోట్లు పరిహారం లభించింది. 30 క్లయిమ్‌లకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 80 రిజిష్టర్ కాగా 35 పరిష్కారం అయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 76 రిజిష్టర్ కాగా 23 పరిష్కారం అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి. -
వలస బతుకుల మెతుకు వేట..!
సొంతూరులో ఉపాధి కరువు.. ప్రతి పూటా బతుకు పోరాటం.. జీవనయానం కోసం వేల కి.మీ. పయనం. రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఆ చెంతనే నిప్పుల కొలుములు పెట్టుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ సీజన్లోనే వీరికి ఆదరువు. ఒక వైపు యాంత్రీకరణ పెరిగిపోతున్నా.. బుక్కెడు మెతుకుల కోసం వలస జీవులు ఊరూరా తిరుగుతూ తమకు తెలిసిన నైపుణ్యంతోపనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. వలస జీవుల జీవన ఆరాటంపై స్పెషల్ ఫోకస్... దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): మధ్యప్రదేశ్..ఉత్తరప్రదేశ్..ఛత్తీస్‌ఘడ్.. ఇవన్నీ జిల్లాకు సుదూర ప్రాంతాలే. ఎన్నో వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఎన్నో ఆశల మధ్య జీవనం సాగిస్తున్నారు వలస జీవులు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. పనిచేస్తేకానీ నోటికందని మెతుకుని రెక్కల కష్టం చేద్దామన్నా స్థానికంగా అండ లేక, పూటగడవడమే కష్టమైన వేళ.. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిప్పుల కొలిమిలో ఇనుమును కరిగించి.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాల్లో పిల్లా పెద్దా,.. ఆడ, మగ.. ఇలా అందరికీ ఇనుముతోనే బతుకు అంతా ముడిపడి ఉంటుంది. ఒకరో ఇద్దరో కాదు ఐదు వేల మందికి పైగా నిరుపేదలకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిల్లాకు పొట్టచేత పట్టుకుని వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఏటా వ్యవసాయ సీజన్లో ఒక్కడే ఉండి ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా సీజన్లో నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే.. యాంత్రీకరణ గణనీయంగా పెరిగిన ఈ రోజుల్లోనూ వారు చేతి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలై పని రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. ఆడ, మగ తేడా లేకుండా పనిముట్లు తయారు చేస్తారు. పనిముట్లు తయారు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు తమ వెంట తెచ్చుకుంటారు. వీటి తయారీకి లారీల పాత కమాన్ ప్లేట్లు కేజీ రూ.80కి కొంటారు. వాటిని కొలిమిలో కాల్చి ఇనుమును కరిగించి, సమ్మెటల సాయంతో గునపాలు, కొడవళ్లు, పారలు, వంట పనిముట్లు తయారు చేస్తారు. రోడ్డు పక్కన నిప్పుల పొయ్యి రాజేసుకుని చపాతీలు, రోటీలు తయారు చేసుకుని తింటారు. రాత్రయితే రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని గుడి మెట్ల పక్కనో..షాపుల ఆవరణలో నిద్రిస్తారు. సైజును బట్టి కొడవలి రూ.20 నుంచి రూ.200 వరకు విక్రయిస్తారు. గొడ్డలి రూ.150 నుంచి రూ.300, మాంసం కత్తి రూ.100 నుంచి రూ.250 వరకు విక్రయిస్తారు. రోజుకు వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయాలు ఉంటాయి. ఊరూరా తిరుగుతూ వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలను సాకుతున్నారు. సంచార జీవితం సాగిస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 5 వేల మందికి పైగా పనిముట్ల తయారీలో జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా జన సంచార ప్రాంతాల్లో కొంత స్థలంలో తాత్కాలికంగా కొలిమి ఏర్పాటు చేసుకుని పనిముట్లు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఎక్కువగా దర్శి బస్టాండ్ ప్రాంతం, తాళ్లూరు వీకే కళాశాల వద్ద, వినుకొండలో కురిచేడు రోడ్లో గొర్రెల బడ్డి వద్ద వ్యవసాయ పరికరాలు తయారు చేసుకుని విక్రయిస్తున్నారు. దొనకొండ నాలుగు కూడళ్ల ప్రాంతంలో, చీమకుర్తిలో జవహర్ హాస్పిటల్ వద్ద, బీవీఎస్ కళాశాల ప్రాంతం, గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, మోటు వద్ద, మార్కాపురంలో తర్లుపాడు మండల కేంద్రం, కొండపి బస్టాండ్ ప్రాంతంలో, కట్టంవారిపాలెం వద్ద, యర్రగొండపాలెం బస్టాండ్ ప్రాంతంలో అర్ధవీడు మండలం కుంట వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని డిమాండ్ ఉన్న రోజుల వరకు అక్కడే ఉంచి పనిముట్లు తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తారు. అక్కడ ఆదరణ లేదు మధ్యప్రదేశ్‌లో పనిముట్లు తయారు చేసినా సరైన ఆదరణ లేదు. అమ్ముకోవాలంటే గిరాకీ లేదు. అందుకే వ్యవసాయ సీజన్లో ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటూ పలు గ్రామాలు తిరుగుతూ పనిముట్లు అమ్ముకుంటాం. రోజుకు గ్రామాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు వస్తాయి. ఖర్చులు పోను జీవనానికి ఇబ్బందులు ఉండవు. ఉపాధి కల్పిస్తున్న ఏపీకి ప్రత్యేక కృతజ్ఞతలు. – జగదీష్, భోపాల్, మధ్యప్రదేశ్ -
జోరుగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు
-
కడప పర్యటనలో అనేక మంది బాధితులకు ఆర్థిక సాయం
-
పేదలకు గృహవరం.. ఏళ్ల నాటి కల సాకారం
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు. సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్‌లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి గృహప్రవేశం ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు. వేగంగా నిర్మాణాలు జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. – పి.ప్రశాంతి, కలెక్టర్ కల నిజమాయె.. పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు. చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
5 నెలల్లో పేదలకు రూ.3,400 కోట్ల ఉపాధి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు నెలల మధ్య ఐదునెలల్లో రాష్ట్రమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనుల కల్పన ద్వారా ప్రభుత్వం పేదలకు రూ.3,400.46 కోట్ల లబ్ధి కలిగించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజు సైతం పనుల కోసం ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆ గ్రామంలోనే అడిగిన వారికల్లా పనులు కల్పించింది. రాష్ట్రంలో దాదాపు 98 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో 40.36 లక్షల కుటుంబాలు ఈ ఐదునెలల్లో సొంత ఊళ్లోనే ఉపాధిహామీ పథకంలో పనులు చేసుకున్నాయి. ఒక్కో కుటుంబం సరాసరి రూ.8,425 చొప్పున ప్రయోజనం పొందింది. 40.36 లక్షల కుటుంబాలకు చెందిన 65.74 లక్షలమంది కూలీలు 16.02 కోట్ల పనిదినాలపాటు ఈ పథకంలో పనిచేసుకుని లబ్ధిపొందారు. అందులో అత్యధికంగా 23.71 శాతం మేర ఎస్సీ కుటుంబాల వారున్నారు. ఈ పనులతో 9.44 శాతం ఎస్టీ కుటుంబాలు లబ్ధిపొందాయి. ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మన రాష్ట్రంతో పోలిస్తే మూడురెట్ల కన్నా ఎక్కువ ఉండే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17.73 కోట్ల పనిదినాలు కల్పించి రూ.3,818 కోట్ల మేర పేదలకు లబ్ధికలిగించింది. ఇదే కాలంలో మన రాష్ట్రం 16.56 కోట్ల పనిదినాలపాటు పేదలకు పనులు కల్పించి రూ.3,400.46 కోట్ల ప్రయోజనం చేకూర్చి రెండోస్థానంలో ఉంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య పేదలకు అత్యధికంగా ఉపాధి పనులు కల్పించిన పది రాష్ట్రాలు -
అన్నపూర్ణ.. అక్షయ పాత్ర
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటోంది. దేశంలోనే విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా సైతం లభిస్తోంది. రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతున్న యువతకు ప్రభుత్వ పరంగా అన్నపూర్ణ భోజన పథంకం అక్షయ పాత్రగా మారింది. కేవలం రూ.5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనం లభిస్తోంది. జీహెచ్ఎంసీ చొరవతో 2014లో అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీని అమలు కోసం నిరంతరం పర్యవేక్షణ సాగిస్తోంది. ఎనిమిదేళ్లుగా.. ఎనిమిదేళ్లుగా అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చయ్యాయి. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. లాక్డౌన్ సమయంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్– మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించారు. రాత్రి పూట సైతం 259 రెగ్యులర్– మొబైల్ కేంద్రాలు పనిచేశాయి. పేదల సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ సదుపాయం కూడా కల్పించారు. మొదటి విడతగా 32 ఏరియాల్లో సిట్టింగ్ అన్నపూర్ణ కాంటీన్లను ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నారు. -
డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పేదలు
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన ప్రజలు
-
తన ఇంటి ఖర్చు మీద ఈనాడు రోతరాత.. పద్మావతి ఆగ్రహం
-
పేదల ఇళ్లపై పచ్చమీడియా కుట్ర బట్టబయలు
-
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్‌మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్‌సిద్దిక్, హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
అదో మురికివాడ.. కానీ చాలా ప్రత్యేకం!
సాధారణంగా నిరుపేదలు ఎక్కువగా జీవించే ప్రదేశాలను మురికివాడలు అంటాం. నీటి ప్రవాహం, పారిశుధ్య వ్యవస్థ, కనీసం మౌలిక సదుపాయాలు లేని మురికి వాడల్ని చాలానే చూసుకుంటాం. కానీ బ్రెజిల్‌లోని రియోలో ‘శాంటా మర్ట ఫావెల’ అనే మురికివాడ చాలా ప్రత్యేకం. అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ ఇది. అక్కడ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి స్లమ్ పెయింటింగ్స్ అనే వినూత్న ప్రయోగమే.. ఈ మురికి వాడని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది. నిత్యం రద్దీగా ఉండే, మురికి భవనాలను రంగుల కాన్వాస్‌గా మార్చి చూపించింది.ఇక్కడే మైకేల్ జాక్సన్ ప్రసిద్ధిగాంచిన ‘దే డోంట్ కేర్ అబౌట్ అస్’ పాట చిత్రీకరణ చేశారు. దానికి గుర్తుగా అక్కడ స్థానికులు మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. చదవండి: Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
పేదోడి ఫ్రిడ్జ్‌కు భలే గిరాకీ!
దిల్సుఖ్నగర్: అప్పుడే వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి... రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మలక్‌పేట, మహేశ్వరం, యాకత్పురా నియోజకవర్గాలలో కొందరు పేదల రిఫ్రిజిరేటర్ అయిన మట్టి కుండల్లోని శ్రేష్ఠమైన చల్లని నీటిని తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుండలకు గిరాకీ పెరిగింది.ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెట్లలో రకరకాల డిజైన్లలో కుండలు, కూజాలను అందుబాటులో ఉంచారు. చల్లదనంతో పాటు మంచి డిజైన్లలో అందంగా ఉన్న కుండలను కొనుగోలు చేసేందుకు సామాన్యులతో పాటు ధనవంతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రూ. 60 నుంచి రూ.500 .. సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, మాదన్నపేట ఎన్‌టీఆర్‌నగర్‌తో పాటు ప్రధాన చౌరస్తాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు. మార్కెట్లలో రూ. 60 నుంచి రూ.500 వరకు వివిధ ధరల్లో రకరకాల కుండలు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం కొంత అధికమనే చెప్పవచ్చు. వేసవి ఎండలు ఒకవైపు కొలిమిలా కాగుతుండగా దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలంటే ఈ మాత్రమైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
తండ్రి జ్ఞాపకార్థం 12 ఎకరాల్లో పేదల కోసం పట్టాల పంపిణీ
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలిలో కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 12 ఎకరాల తన సొంత పొలంలో 670 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్థలాల్లో ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి, మంత్రి జయరాం తనయుడు అశోక్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు రా మ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొని నాగేంద్ర, వరలక్ష్మి దంపతులను అభినందించారు. -
ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్
ముంబై: చెడు మార్గాలు పట్టకుండా ఇకపై నిరుపేదల అభ్యున్నతి కోసం పని చేస్తానని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అన్నారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఆర్థర్రోడ్ జైల్లో ఉన్న ఆర్యన్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక మీరంతా గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఆర్యన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకు హామీ ఇచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి కోసమే పని చేస్తానని.. చెడు మార్గాల్లో నడవనని ఆర్యన్ చెప్పినట్టుగా ఆ అధికారి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీబీ అధికారులు కలిసి ఆర్యన్, అతడి సహ నిందితులకు జైలులో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 20న తీర్పు వెలువరించనుంది. చదవండి: (తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్..) -
పేదలకు మెరుగైనవైద్యమే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి అందించాలన్నదే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన తండ్రి సూర్యనారాయణరావు వర్ధంతిని శనివారం గోల్కొండ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఓ వైద్యుడిగా తన తండ్రి కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో మందికి సేవలు చేశారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన్ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని బాధను మిగిల్చిందన్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే జీఎస్ఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీఎస్ఆర్ ట్రస్టుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పేదలను గుర్తించి వారికి క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, ఉపాధి అందించేందుకు ట్రస్టులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెల్త్సెక్రటరీ రిజ్వీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
అప్పుడు ఒక్క పూట తిండి దొరకలేదు.. ఇప్పుడు నెలకు 5 లక్షలు
భువనేశ్వర్: పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు..కానీ పేదవాడిగా గానే పోతే మన తప్పు. అది అక్షరాల నిజం.. ఒక పూట తిండికి నోచుకుని ఓ గిరిజన యువకుడు ప్రస్తుతం యూట్యూబ్‌లో నెలకు రూ.5లక్షలు సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. వివరాలు.. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడు ఒకప్పుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. కరోనా మహ్మరి కారణంగా ఏర్పడిన లాక్డౌన్ వలన అతడు తన ఉపాధిని కోల్పోయాడు. దీంతో తన కుటంబం రోడ్డున పడింది. దీంతో ఏంచేయాలో తోచని పరిస్ధితిలో ఉన్న ముండా తన స్నేహితుడి ఫోన్లో యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్ కు సంబంధించిన వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో ఫుడ్ బ్లాగర్లను ప్రేరణగా తీసుకుని యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే స్మార్ట్‌ఫోన్ కొనే స్థోమత లేదు. దీంతో ముండా స్మార్ట్‌ఫోన్ కొనడానికి రూ.3,000 అప్పుగా తీసుకున్నాడు. దీంతో తన మొదటి వీడియోలో తాను తీసుకునే ఆహారం కోసం చేశాడు. ఒక ప్లేట్ లో అన్నం, పచ్చి టమాటో, పచ్చిమిర్చి కలిపి తింటున్న వీడియో ను పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెటిజన్లు ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలా మొదలైన ముండా యూట్యూబ్ చానల్‌కు ప్రస్తుతం 7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు అతడు నెలకు సూమారు 5 లక్షలు పైగా సంపాదిస్తున్నాడు. ఈ విషయంపై యువకుడు మాట్లడూతూ నేను చేసే వీడియోల్లో నా ఇళ్లు , తమ గ్రామంలో ప్రజలు జీవనం కోసం వీడియోలు చేస్తాను అని చెప్పాడు. తన వీడియోలు వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం వచ్చిన డబ్బులతో తన తల్లి దండ్రలుకు ఇల్లు కట్టానని తెలిపాడు. తన ఏకైక లక్ష్యం యూట్యూబ్ వీడియోల నుంచి డబ్బు సంపాదించడం కాదు .. తమ స్థానిక సంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలనుకుంటున్నా అని ముండా అన్నాడు. ప్రస్తుతం ముండా వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.. -
వహ్వా.. వలంటీర్!
పుత్తూరు (చిత్తూరుజిల్లా) : కరోనా కష్టకాలంలో నిరుపేదలు, యాచకులను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్నాడు సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ఓ వలంటీర్. తండ్రిని పోగొట్టుకుని పేదరికపు కష్టాలను స్వయంగా చవిచూసిన ఈ యువకుడు పదిమందికి ఉపయోగపడాలన్న తన లక్ష్యసాధనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువకుడి సేవాగాథ వివరాలివీ.. పుత్తూరు మండలం తడుకు పంచాయతీ వీఎస్ఎస్ పురం గ్రామానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు బాలాజీ. తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. ఆ తర్వాత ఉద్యోగ వేటలో ఉన్న బాలాజీ గ్రామ వలంటీరుగా ఎంపికయ్యాడు. గ్రామస్థులకు ‘సచివాలయ’ సేవలందిస్తూ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. మరోవైపు.. ఎలక్ట్రీషియన్‌గా కూడా పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో.. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో నిరుపేదలు, యాచకులు పడుతున్న బాధలను గుర్తించాడు. వీరికి చేయూతనివ్వాలన్న తలంపుతో ‘సేవా మిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. రోజూ 30 మందికి భోజనాలు, టిఫిన్ అందిస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ యజ్ఞం శనివారం 101వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలోని గిరిజన కుటుంబాలకు, వీఎస్ఎస్ పురంలోని గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశాడు. వలంటీరుగా తనకు వచ్చే రూ.5 వేల గౌరవ వేతనంతోపాటు సేవామిత్ర పురస్కారం ద్వారా అందించిన రూ.10 వేలు, ఎలక్ట్రికల్ పనుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నిరుపేదల సేవకు ఖర్చు చేస్తున్నాడు. సేవలోనే సంతోషం.. పేదరికం అంటే ఏమిటో చూశాను. కరోనా కాలంలో కొందరు ఆకలితో రోడ్డు పక్కనే చనిపోయారు. అందుకే నాకు వీలైనంత వరకు సాయం చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాను. మూడు నెలలుగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. వలంటీరుగా వచ్చే సంపాదన పూర్తిగా పేదలకే ఖర్చు చేస్తున్నాను. – బాలాజీ, వలంటీరు, వీఎస్ఎస్ పురం, పుత్తూరు మండలం -
లాక్డౌన్: అమ్మలా.. ఆకలి తీరుస్తున్నాడు
సాక్షి, వనపర్తి: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో కోవిడ్ బాధితులతో పాటు సహాయకులకు భోజనం అందక పస్తులుండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో రెండు పూటలా భోజనంతో పాటు బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ అండగా మేమున్నామంటూ జిల్లాకేంద్రానికి చెందిన పలువురు భరోసా కల్పిస్తున్నారు. అమ్మలా ఆకలి తీరుస్తున్నారు. నవోదయ ఓల్డేజ్ హోం ఆధ్వర్యంలో పలువురు యువకులు కరోనా బాధితులతో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులు, యాచకులకు రోజు అన్నం ప్యాకెట్లతో పాటు గుడ్డు, అరటిపండు అందిస్తున్నారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాధితులకు సైతం ప్రత్యేక వాహనంలో వెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెల్‌నంబర్ 9052507793కు కాల్ చేసి బాధితుల వివరాలు తెలియజేస్తే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకుడు రాము తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన జర్నలిస్టు రహీం 12 రోజులుగా రాత్రిళ్లు రోడ్లపై ఉండే యాచకుల కడుపు నింపుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన డీఎస్పీ కిరణ్‌కుమార్ తనవంతుగా రూ.7 వేల సాయం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో రహీం స్నేహితులు కూడా తమవంతు సాయం అందిస్తున్నారు. ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న నవోదయ ఓల్టేజ్ హోం నిర్వాహకులు జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు భోజనాలు బ్రహ్మంగారికాలనీ మిత్రబృందం వారు స్వయంగా వంట చేసి ఆహార ప్యాకెట్లను జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు, రోగులకు మధ్యాహ్నం సమయంలో అందజేస్తూ ఆకలి తీరుస్తున్నారు. కాలనీ యువకుల సహకారంతో వారం రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రతి ఆదివారం మాంసాహారం అందించనున్నట్లు కౌన్సిలర్ బ్రహ్మం తెలిపారు. రోజూ 200 మందికి భోజనం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది లాక్డౌన్ సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. -
'ఆకలేస్తే వచ్చి తీసుకొని తినండి'
చెన్నై: రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. లాక్డౌన్ విధించడంతో నిరుపేదలు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుల అభిమానులు నిరుపేదలు, అనాథలు, బిచ్ఛగాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్నారు. నటుడు అజిత్ అభిమానులు పుదుచ్చేరిలో వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్ల ప్యాకెట్లతో కూడిన బండ్లను రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నారు. ఆకలి వేసిన వారు వచ్చి ఆహారాన్ని తీసుకుని తినొచ్చు అనే పోస్టర్లను అంటించారు. అజిత్ అభిమానుల ఉదార స్వభావాన్ని, సేవా దృక్ఫథాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. -
పేదల అకౌంట్లలో రూ. 6 వేలు జమ చేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా రూ. 6,000 అందించాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా పేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల వారికి ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం సహాయం మాత్రమే కాదని, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. అర్హులైన పేదలందరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయాలని ఆయన మోదీని కోరారు. లాక్డౌన్లో ఏ పనులూ లేకపోవడం వల్ల ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. -
కరోనా సెకండ్‌వేవ్: ప్రజలకు కేంద్రం తీపికబురు!
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి విజృంభణ వలన దేశంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది సొంత రాష్ట్రాలకు తిరిగి వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం, పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం కింద పేదలకు తీపికబురు అందించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క లభ్దిదారునికి మే, జూన్ నెలలో 5 కిలోల చొప్పున ఆహర ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో, దాదాపు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఆహర ధాన్యాల కోసం కేంద్రం తొలిదశలో రూ. 26 వేల కోట్లను ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి మరో వ్యాక్సిన్ -
అమరావతిలో బరి తెగించిన టీడీపీ నేతలు
సాక్షి గుంటూరు: మంగళగిరి నుంచి మందడం వికేంద్రీకరణ దీక్షకు వెళ్తూ ఉండగా కృష్ణాయపాలెంలో పేదలను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి పేదల ఆటోలు అడ్డుకున్న టీడీపీ నేతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడారు. దీనిపై స్పందించిన మహిళలు టీడీపీ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కృష్ణాయపాలెం రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడికి యత్నించిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఆ లాజిక్‌ను చంద్రబాబు ఎప్పుడో గాలికొదిలారు! మహిళలు మాట్లాడుతూ..రాజధానిలో ఇళ్ల పట్టాలకోసం వెళ్తున్న తమపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ను తమపై ఎక్కించడానికి ప్రయత్నిస్తూ, ట్రాక్టర్ తొక్కించి చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఆటో అద్దాలు కూడా పగులగొట్టారని, మహిళలని చూడకుండా అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమపై దాడికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం గుంటూరు: అమరావతిలోని మందడంలో అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష 24వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజధానిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన 52 వేలకు పైగా ఇళ్ల స్థలాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. దీక్ష కు భారీ స్థాయిలో మహిళలు తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 12 బార్ అసోసియేషన్ నుంచి భారీ స్థాయిలో న్యాయవాదులు చేరుకుఉని.. దీక్షకు సంఘీభావం తెలిపారు. -
పేదల ‘ఇళ్ల’కు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే అంశానికి శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలాంటి వారిలో ఇప్పటికే కొందరికి 58, 59 జీవోల ద్వారా యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. ఇంకా కొంత మందికి ఈ సమస్య అపరిష్కృతంగా ఉందని, దీనిని శాశ్వతంగా పరిష్కరించేందుకు త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్రమబద్ధీకరించిన ఆస్తుల క్రయవిక్రయాలకు సైతం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకుండా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం, పేద ప్రజల ఇళ్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో అన్ని జిల్లాల మంత్రులు, పట్టణ ప్రాంత ఎమ్మెల్యేలతో మున్సిపాలిటీల వారీ గా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ గ్రామాల కన్నా పట్టణాల్లో ప్రజలు ఆస్తుల యాజమాన్య హక్కుకు సంబంధించిన సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతి ఇంచ్ భూమీ రికార్డుల్లోకి.. రాష్ట్రంలోని ప్రతి ఇంచ్ భూమినీ ప్రభుత్వ రికార్డులకు ఎక్కించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఆస్తి హక్కులకు భద్రత కల్పించే ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులను ధరణి పోర్టల్ డేటాబేస్‌లో నమోదు చేయడం ప్రారంభించిందన్నారు. దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అలాగే పట్టణాల్లో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలన్నారు. కాలనీల్లో ఎలాంటి భూసమస్యలున్నాయి? ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? సాధ్యమైన పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలపై సూచనలు అందించాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి శాశ్వత పరిష్కా రం చూపుతుందని హామీ ఇచ్చారు. అనం తరం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాల్లో ని పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంగ ళవారం సాయంత్రంలోగా ఆయా పట్టణా లు, కాలనీల్లో ఉన్న ప్రతి సమస్యనూ మున్సి పల్ అధికారులకు అందజేస్తామన్నారు. -
గుడివాడలో 'హౌస్ ఫర్ ఆల్' పథకం ప్రారంభం
సాక్షి, గుడివాడ : కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పనులను బుధవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతులిస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నాని వెల్లడించారు. -
కరోనా బిల్లుకు భయపడిన వ్యాపారి ఏం చేశారంటే
సూరత్: కరోనా బిల్లు చూసి గుండె గుభేలుమన్న సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న వ్యాపారవేత్త తనలాగా పేదలు కష్టపడకూడదని భావించి పెద్ద మనసు చేసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. సూరత్‌కు చెందిన, ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ క్లినిక్‌లో 20 రోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి బిల్లు చూసి ఒక్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఫలితంగా తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం కోవిడ్-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు. వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు. -
పేదలకు అండగా
-
పేదల కోసం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
-
వీలైతే కొనండి, లేదా ఫ్రీగా తీసుకెళ్లండి
ఔరంగాబాద్: కొండంత చేసినా, గోరంత చేసినా సాయం విలువ మారదు. కరోనా విపత్తు వల్ల పూట గడవటమే కష్టంగా మారిన నిరుపేదల గురించి ఆలోచించిన ఓ కూరగాయల వ్యాపారి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఉచితంగా కూరగాయలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌కు ఎందిన రాహుల్ లాబ్డే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల కంపెనీ జీతాలివ్వడం మానేసింది. దీంతో అతను తన తండ్రితో కలిసి కూరగాయాల వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు అతని బండి దగ్గరకు ఓ వృద్ధురాలు వచ్చి రూ.5కు కూరగాయలివ్వమని అడిగింది. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం) దీంతో విస్తుపోయిన లాబ్డే ఆమె దీన స్థితిని అర్థం చేసుకుని ఉచితంగా కూరగాయలిచ్చాడు. ఆ క్షణమే అతనిలో నిరుపేదలకు సాయం చేయాలన్న ఆలోచన మనసులో బలంగా నాటుకుంది. వెంటనే తన కూరగాయల బండికి ఒక బోర్డు తగిలించాడు. అందులో "వీలైతే కొనండి, లేదంటే ఉచితంగా తీసుకోండి" అని రాసి ఉంది. దీన్ని గమనించిన జనం కొందరు విడ్డూరంగా చూడగా మరికొందరు మాత్రం అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.2 వేలు విలువ చేసే కూరగాయలను ఉచితంగా ఇచ్చాడు. దీని గురించి లాబ్డే మాట్లాడుతూ.. 'రోజు ముగిసే సరికి ఆకలితో ఎవరూ నిద్రించవద్ద'న్నదే తన కోరిక అని చెప్తూ మంచి మనసును చాటుకున్నాడు. (‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’) -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
టీడీపీ తీరుపై భగ్గుమన్న గిలకలదిండి పేదలు
మచిలీపట్నం: పేదల ఇళ్ల స్థలాలు కోసం ఎంపిక చేసిన భూమిపై టీడీపీ నాయకులు తప్పుడు కేసులు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మచిలీపట్నం గిలకలదిండి గ్రామస్తులు మంగళవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం సంబంధిత భూమిలో స్థానిక పేదలు పిల్లాపాపలతో కలిసి బైఠాయించారు. వివరాల్లోకి వెళితే.. ► మచిలీపట్నం శివారు గిలకలదిండి గ్రామానికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. లోతట్టుగా ఉన్న ఆ స్థలాన్ని ఎత్తు చేసే పనులు కొనసాగుతున్నాయి. ► గిలకలదిండికి చెందిన సుమారు 1,100 కుటుంబాలకు ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే జాబితా సిద్ధమైంది. తాజాగా ప్లాట్లుగా విభజించే పనులు జరుగుతున్నాయి. ► అయితే, ఆ భూమిలో మడ అడవులున్నాయని, దీనివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కోర్టును ఆశ్రయించి.. ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే తెచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులై ఆందోళనకు దిగారు. ► నిరుపేదలకు స్థలాలు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ► అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోని రవీంద్ర ఇప్పుడు ప్రభుత్వ పథకాలేవీ అందకుండా కుట్రలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ► సమాచారం అందుకున్న తహసీల్దార్ సునీల్‌బాబు రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ► అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, పేదలకు తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. ► ఆ భూమి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించే నిమిత్తం డ్రోన్ కెమేరాతో ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు. ► గిలకలదిండి వద్ద ఎంపిక చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని, వాటిపై స్టే ఇచ్చినట్లుగా న్యాయస్థానం నుంచి తమకెలాంటి పత్రాలు అందలేదని తహసీల్దార్ సునీల్‌బాబు మీడియాకు తెలిపారు. -
వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ముచ్చటించిన ప్రముఖ ఆర్థిక వేత్త నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం కీలక అభిప్రాయాలను వ్యక్తంచేశారు. మహమ్మారి కారణంగా ప్రభావితమైన వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రజల చేతుల్లోకి నగదు చేరాలంటే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వుందని బెనర్జీ సూచించారు. నిరుపేదలకు నగదు బదిలీ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని బెనర్జీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభుత్వాల ముందు పెద్ద సవాలు విసిరిందని, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవచ్చన్న రాహుల్ వ్యాఖ్యాలను అంగీకరించిన ఆయన ఈ సూచన చేశారు. అంతేకాదు వీలైనంత తొందరగా లాక్డౌన్ నుంచి బయటపడాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి స్వభావం గురించి తెలుసుకోవాలి తప్ప లాక్డౌన్ పొడగింపు సహాయపడదని పేర్కొన్నారు. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) ఆహార కొరత సమస్యపై స్పందించిన ఆయన తాను ఇంతకుముందే ప్రభుత్వానికి సూచించినట్టుగా కనీసం మూడు నెలలు చెల్లుబాటయ్యేలా ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులివ్వాలని బెనర్జీ చెప్పారు. వీటి సాయంతో ఒక్కరికి ప్రస్తుతం బియ్యం, పప్పుధాన్యాలు, గోధుమలు, చక్కెర లాంటి వాటిని ఉచితంగా అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ కాలంలో కేంద్రం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రాష్ట్రాలు డైరెక్ట్ బెనిఫిట్ ఫథకాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ఉదాహరణను బెనర్జీ ఉదహరించారు. (లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల) కరోనావైరస్ అనంతరం ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండాలన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బెనర్జీ మాట్లాడుతూ, లాక్డౌన్ ద్వారా దెబ్బతింటున్న చిన్న, మధ్య వ్యాపారాలు, ఉపాధి మార్గాలపై స్పందించిన ఆయన చిన్న వ్యాపారాల రుణాలను కేంద్రం రైట్ ఆఫ్ చేయాలని పేర్కొన్నారు. తద్వారా వారిని నిలబెట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలను కూడా బెనర్జీ ప్రశంసించారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అనుభవం గురించి రాహుల్ బెనర్జీని అడిగినపుడు దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పడం విశేషం. (లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) కాగా ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ్ రాజన్‌తో గత వారం ప్రారంభమైన రాహుల్ చర్చా సిరీస్‌లో ఇది రెండో భాగం. లాక్‌డౌన్‌తో బాధపడుతున్న పేదలకు సహాయం అందించేందుకు రూ.65వేల కోట్లు అవసరమని రాజన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. (270 కోట్ల తప్పుడు ప్రకటనలు తొలగించాం: గూగుల్) -
నిరుపేదలకు ఉచిత ప్రయాణం
నేటి రోజులతో పోల్చుకుంటే ఒకనాడు పడిన కష్టమే నయం అనిపిస్తుంది. ఈ రోజు ఎలా గడుస్తుందా అని ఆపన్నుల కోసం దిక్కులు చూసే జీవులే ఎన్నో. ఇక అత్యవసర పరిస్థితి వస్తే.. ఆరోగ్యం సహకరించకపోతే.. ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టమే. కావల్సిన సరుకులు తీసుకొని ఇంటికి తిరిగి రావాలన్నా సరైన రవాణా సదుపాయం లేక యాతనపడే వారెందరో. ఇలాంటి సమయంలో పేదలకు ఉచితంగా ఆటో సదుపాయం అందిస్తోంది ముంబయ్‌లోని ఓ మహిళా డ్రైవర్. ఆమె పేరు శీతల్. తన కుటుంబ పోషణకు శీతల్ కొన్నేళ్లుగా ఆటో నడుపుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నిరుపేదలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళుతోంది. తిరిగి వారిని వారున్న చోటుకు చేర్చుతోంది. ‘నా కుటుంబ పోషణకు ఆటోను నడిపేదాన్ని. ఇప్పుడు పేదప్రజల ఇబ్బందిని చూసి, వారికి ఇలా సేవ చేయాలనుకున్నాను. వారిని వారి గమ్యాలకు చేర్చడం, అవసరాలు తీరే మార్గం చూపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది శీతల్. ఈ కష్ట సమయంలో శీతల్ లాంటి వ్యక్తులు తమ సేవాగుణంతో గొప్పవారిగా నిలుస్తున్నారు. -
లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన
సాక్షి, బెంగళూరు: కరోనావైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ కొనసాగింపు అంచనాలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. లాక్డౌన్ పొడిగిస్తే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగితే అనధికారిక లేదా అసంఘటిత రంగంలోని కార్మికులు చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతారన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్డౌన్ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని ఆయన అన్నారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు. వ్యాపారాలపై కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్ ప్రభావం గురించి మూర్తి మాట్లాడుతూ, చాలా సంస్థలు తమ ఆదాయంలో 15-20 శాతం కోల్పోయారన్నారు. ఇది ఆదాయపు వస్తువు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఇండియా లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవు. మరింత కాలం ఈ పరిస్థితి కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువయ్యే ప్రమాదముందన్నారు. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి పొందుతున్న వారు సుమారు 20 కోట్లమంది ఉన్నారని, లాక్డౌన్ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని మూర్తి హెచ్చరించారు. (లాక్డౌన్ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు) ఇతర అభివృద్ధి దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం మరణాల రేటు 0.25 నుంచి 0.5 శాతం మధ్యలో ఉన్నాం. అయితే అనేక రకాల కారణాలతో దేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మరణాల్లో పావు వంతు శాతం కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయన్నారు. ఈ లెక్కన గత రెండు నెలల్లో వెయ్యి కరోనా మరణాలతో పోలిస్తే కరోనాపై అంత భయాందోళన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి కొత్త మార్గాలను అన్వేషించాలి, కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని మూర్తి వ్యాపార వర్గాలకు సూచించారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు) -
కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందించేందుకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,000 కోట్లు) రుణాన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది. కోవిడ్-19 కట్టడి, నివారణ చర్యలు, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహణ లాంటి తక్షణ ప్రాధాన్యతా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టనుంది. ఏడీబీ ప్రెసిడెంట్ మసాట్సుగు అసకావా (ఫైల్ ఫోటో) భారతదేశానికి 150 కోట్ల డాలర్ల రుణం (రూ. 11,000 కోట్లు) ఇవ్వడానికి ఏడీబీ మంగళవారం అంగీకరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ -19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రాం పేదలు, మహిళలు , ఆర్థికంగా బలహీన వర్గాలకు సామాజిక రక్షణతో పాటు, వ్యాధి నివారణ చర్యలకు మద్దతుగా ఈ నిధులను సమకూర్చనున్నామని ఏడీబీ అధ్యక్షుడు మసాట్సుగు అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. 2020 మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాలను సక్రమంగా అమలులో ఏడీబీ అందించిన ఆర్థిక సాంకేతిక సహకారం దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిసమీర్ కుమార్ ఖరే చెప్పారు. దీంతోపాటు వృద్ధిని పెంచడానికి, బలమైన పునరుద్ధరణకు సాధ్యమైన మద్దతు అందించేందుకు ఏడీబీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. క్రెడిట్ గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం తద్వారా ప్రభావిత పరిశ్రమలు వ్యవస్థాపకులకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఇ) మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ) -
కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్
రమజాన్ మాసం ఈ సారి కరోనా సంక్షోభసమయంలో వచ్చింది. సాధారణంగా ముస్లిములు జకాత్‌ను పవిత్రమైన రమజాన్ మాసంలో చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు వచ్చి పడిన తర్వాత, వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ సొంతూళ్ళకు పిల్లాపాపలతో కాలినడకన బయలుదేరిన విషాద దృశ్యాలు ముందుకు వచ్చిన తర్వాత, అనేకమంది లాక్డౌన్ వల్ల తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని తెలిసిన తర్వాత చాలా మంది ముస్లిములు పేదలకు అన్నదానాలు ప్రారంభించారు. పేదల కోసం ఖర్చు పెట్టడానికి రమజాన్ వచ్చే వరకు ఆగవలసిన పనిలేదని, కరోనా విపత్తు ముంచుకు వచ్చింది కాబట్టి వెంటనే జకాత్ చెల్లించాలని ధర్మవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటనల ప్రభావంతో అనేకమంది తమ తమ జకాత్ ఎంత ఉందో లెక్కించి దానధర్మాలకు ఖర్చు చేయడం ప్రారంభమయ్యింది. నిజం చెప్పాలంటే రమజాన్ మాసం ఆర్థికవ్యవస్థకు గొప్ప వేగాన్నిస్తుంది. భారీగా క్రయవిక్రయాలు జరుగుతాయి. ముస్లిములు ఈ మాసంలో దానధర్మాలకే కాదు, షాపింగ్ కోసం కూడా ఖర్చుపెడతారు. తక్కిన పదకొండు నెలల్లో జరిగే వ్యాపారం కన్నా ఈ ఒక్క నెలలో జరిగే వ్యాపారం చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువ. ద్రవ్యం మార్కెటులో చలామణీలోకి వెళుతుంది కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్ధికవ్యవస్థ బలం పుంజుకుంటుంది. కాని ఈ సారి రమజాన్ మాసం కోవిద్ 19 లాక్ డౌన్లో వచ్చింది. ఈ లాక్డౌన్, భౌతిక దూరాల నియమాలను పాటించడం చాలా అవసరం. అంటు వ్యాధుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలు, సంప్రదాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటువ్యాధి ప్రబలిన ప్రాంతం నుంచి ప్రజలు బయటకు వెళ్ళరాదని, ఆ ప్రాంతానికి బయటి వారు రాకూడదని ప్రవక్త స్పష్టంగా చెప్పారు. లాక్ డౌనంటే ఇదే కదా. కాబట్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌కు కట్టుబడి, భౌతికదూరం పాటిస్తూ రమజాన్ మాసాన్ని దైవారాధనలో గడపవలసి ఉంది. ఆ విధంగా కరోనా మహమ్మారిని నిరోధించాలి. సాధారణ పరిస్థితుల్లో మాదిరిగా ఇఫ్తార్ పార్టీలు, సామూహిక ప్రార్థనలు చేయరాదు. ఎవరి ఇంట్లో వారు నమాజులు చదువుకోవాలి. ఇలా ఇంటికి పరిమితం కావడమే ధర్మాన్ని పాటించడం. ఒకçప్పటి కాలంలో ప్రజలు తమ చేయి గుండెలపై పెట్టుకుని ఒకరికొకరు అభివాదం తెలిపేవారు. ఆ పద్ధతి పాటించడం శ్రేయస్కరం. ఇక జకాత్ విషయానికి వస్తే, ఇప్పుడు జకాత్ 60 వేల కోట్ల రూపాయలకు పైబడి పంపిణీ అవుతుందని పలువురి అంచనా. జకాత్ మాత్రమే కాకుండా ఇతర దానధర్మాలు, అన్నదానాలు, ఆహారపంపిణీ వంటివి కలుపుకుంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చవుతాయని అంచనా. కోవిద్ 19 సంక్షోభ సమయంలో ఈ జకాత్ నిధులను సరయిన విధంగా ఖర్చు పెడితే పేదవారికి ఎంతైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరోనా కారణంగా, లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి, నగరాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు, తమ తమ ఊళ్ళకు కాలినడకన బయలుదేరిన అనేకమంది కూలీల దీనావస్థను చాలా మంది చూశారు. ఇలాంటి ఎంతో మంది నిరుపేదలను ఈ నిధులతో ఆదుకోవచ్చు. అలాగే ఈ సారి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే అవకాశాలు లేవు, కాబట్టి ముస్లిములు ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారపొట్లాలు అన్నార్తులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ సొమ్ము ఇవ్వడం ద్వారా రమజాన్ శుభాలను పొందవచ్చు. జకాత్ అంటే..? ఇస్లాంకు మూలస్తంభాలుగా పరిగణించే ఐదు మౌలికవిధుల్లో జకాత్ ఒకటి. జకాత్ అనేది ఆర్థిక ఆరాధన. కాబట్టి స్తోమత ఉన్న ముస్లిములకు మాత్రమే విధి. స్తోమత ఉన్న ముస్లిములంటే ఎవరనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానముంది. ఏడున్నర తులాల బంగారం లేదా యాభైరెండున్నర తులాల వెండికి సమానమైన సంపద ఒక సంవత్సరం పాటు తన వద్ద ఉన్న వ్యక్తి ఆ సంపదపై రెండున్నర శాతం జకాత్ చెల్లించాలి. అంటే ఏడున్నర తులాల బంగారం వెల లేదా యాభై రెండున్నర తులాల వెండి వెల ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అది జకాత్ చెల్లించడానికి నిసాబ్ గా భావించాలి. ఇప్పుడు మార్కెటు ధరల ప్రకారం ఏడున్నర తులాల బంగారం కన్నా యాభై రెండున్నర తులాల వెండి ధర తక్కువగా ఉంది. కాబట్టి యాభై రెండున్నర తులాల వెండి విలువ కన్నా ఎక్కువ సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. ఈ రోజు వెండి విలువను బట్టి లెక్కేస్తే 23 వేల రూపాయల సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. – అబ్దుల్ వాహెద్ -
అందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని శ్రీకాంట్ విఙ్ఞప్తి
-
దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్
సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి కరోనా మహమ్మారి విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విస్తరణ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. షికాగో బిజినెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా ఉన్న రాజన్ దేశం స్వాతంత్ర్యం తరువాత 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి, తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. 'ఇటీవలి కాలంలో భారతదేశపు గొప్ప సవాలు' అనే పేరుతో తన బ్లాగులో ఈ విషయాలను పేర్కొన్నారు. ( కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు) ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008-09 నాటి కంటే నేడు తీవ్రంగా వుంది. 2008-09లో అదొక తీవ్రమైన డిమాండ్ షాక్. ఆ సమయంలో కార్మికులు యధావిధిగా పనులకు వెళ్లారు. మన దేశానికి సంబంధించి పలు సంస్థలు బలమైన వృద్ధిని సాధించాయి. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇపుడు కుదేలై ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాయని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆర్థిక సంక్షోభంపై పోరాడటానికి సాధ్యమైన చర్యలను కూడా ఆయన సూచించారు. లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇపుడు దృష్టి పెట్టాలని రాజన్ బ్లాగులో పేర్కొన్నారు. భౌతిక దూరం లాంటి కీలక జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని సూచించారు. తయారీదారులు తమ మొత్తం సరఫరా గొలుసును తిరిగి కొనసాగించడానికి, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఆవైపుగా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రణాళికలను రూపొందించడం, ఆమోదించడంతో పాటు సమర్ధవంతంగా అమలయ్యేలా పరిపాలన విభాగం చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కూడా నిరుపేదల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, మానవత్వంతో వారిని ఆదుకోవడం సరైన పని అని రాజన్ ప్రధానంగా సూచించారు. చదవండి : కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట -
పేదలకు ఆర్ధిక సహాయం
-
మానవత్వపు పరిమళాలు
సాక్షి, హైదరాబాద్: ఇవీ.. డీజీపీ కార్యాలయంలో ‘గుడ్ సమారిటన్, పోలీస్ గ్రూప్’నకు వస్తున్న వినతులు. రాష్ట్రంలోని నిత్యావసరాల సరఫరాకు ఎక్కడా ఆటంకం కాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ‘కమోడిటీస్ కంట్రోల్ రూము’ను అధికారులు ఏర్పాటు చేశారు అందులో ‘గుడ్ సమారిటన్, పోలీస్’పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ, మెప్మా, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పలు ఎన్జీవోలు, యువ వలంటీర్లు, వ్యాపారులు, అధికారులు ఈ విపత్కర సమ యంలో చిక్కుకున్న పలువురి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపులో అనాథాశ్రమాలు, వృద్ధజనాశ్రమాల నిర్వాహకులను కూడా సభ్యులుగా చేర్చారు. ఫలితంగా ఎలాంటి వినతి వచ్చినా.. వెంటనే వారికి కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను అప్పటికప్పుడు దాతలతో మాట్లాడి వారికి చేరవేసేలా చూస్తున్నారు. సాధారణ వ్యాపారుల నుంచి బహుళజాతీయ కంపెనీల సీఈఓల వరకు అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్య పోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో తోటి మానవుడిని ఆదుకునేందుకు ముందుకు వస్తోన్న వారినిచూసి గర్వంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విరాళాలను చూసి తాము పడుతున్న శ్రమను మర్చిపోతున్నామన్నారు. ► సార్.. నేను ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నా.. నేనో చిరువ్యాపారిని. ఈరోజు మా ప్రాంతంలో కనీసం ఐదుగురికి భోజనం పంపాలనుకుంటున్నా. ► సార్..! నేనో బహుళజాతి కంపెనీకి సీఈఓను.. నిరాశ్రయులు, యాచకులకూ కడుపు నింపేందుకు రెండు క్వింటాళ్ల బియ్యం పంపాలనుకుంటున్నా. విరాళాల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కి పైగా వృద్ధజనాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆహారం, బియ్యం, ఉప్పు, పప్పు, నూనె కావాలని ‘గుడ్ సమారిటన్ , పోలీస్’గ్రూపును ఆశ్రయిస్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే విమెన్ అండ్ చైల్డ్ విభాగం, సివిల్ సప్లై విభాగం, ఇతర దాతలు, ఎన్జీవోలకు చేరవేసి కావాల్సిన నిత్యావసరాలు సరఫరా చేయిస్తున్నారు. అలాగే ఇటుక బట్టీ కార్మికులు, యాచకులు, ఇతర రాష్ట్రాల కూలీలు, నిరాశ్రయులకు చాలామంది క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని, ఇతర పప్పులు, నూనె, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు తదితర నిత్యావసరాలను విరాళంగా ఇస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చిన నిత్యావసరాలను ఆయా పోలీసుల ద్వారా సజావుగా పంపిణీ చేయిస్తున్నారు. కొందరు స్వచ్ఛంద సంస్థలు దూరమైనా శ్రమకోర్చి అన్నార్తులకు నిత్యావసరాలను చేరవేస్తున్నాయి. -
ఏపీలో నిరుపేదలకు వరం
-
సీఎంఆర్ఎఫ్కు భారీగా ప్రముఖుల విరాళాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసరాల సర ఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం అంటే రూ.48 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కారం రవీందర్‌రెడ్డి, మమత సీఎంకు అందజేశారు. సినీ హీరో నితిన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్–టీఎస్ సభ్యులు రూ.16 కోట్ల విరాళం ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చెక్కు రూపంలో సీఎంకు అందించారు. -
పేదలకు ప్రభుత్వ సాయం
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఆహార భద్రతా కార్డు కలిగిన పేద కుటుంబాలకు ఉచితంగా బియ్యంతో పాటు నిత్యవసర సరుకుల కోసం రూ.1500 నగదు అందనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు నిత్యవసర వస్తువుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలకు ఉచితంగా బియ్యంతో పాటు నగదు అందజేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 9.80 లక్షలపైకు పైగా కార్డులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన 9,80,257 కుటుంబాలున్నాయి. అందులో 40 లక్షలకు పైగా సభ్యులున్నారు. కార్డులోని ఒక్కో సభ్యుడికి 12 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే (కార్డులోని సభ్యులు) అన్ని కిలోలు ఉచితంగా బియ్యం అందజేయనున్నారు. ప్రతి కార్డు కలిగిన కుటుంబానికి నిత్యవసర వస్తువుల కోసం రూ.1,500ల చొప్పన నగదును అందిస్తారు. ఇందుకు రూ.147 కోట్ల పైచిలుకు ఖర్చవుతుంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అర్బన్ ప్రాంతాలు వస్తాయి. మొత్తం మీద 12 సర్కిళ్లున్నాయి. అర్బన్ వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,80,808 ఆహార భద్రత కార్డులు, 21,77,934 యూనిట్లు రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ అర్బన్ పరిధిలో 1,87.969 కార్డులు 6,24,702 యూనిట్లు, మేడ్చల్ జిల్లాలోని బాలనగర్, ఉప్పల్ అర్బన్ పరిధిలో 3,65,241 కార్డులు, 12,24,830 యూనిట్లున్నాయి. వాస్తవంగా మార్చి నెల సరుకుల పంపిణీ గడువు 15వ తేదీతో ముగిసింది. ఇప్పటికే ఏప్రిల్ మాసం సరకుల కోటా కోసం డీలర్లు సిద్ధమవుతున్నారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్డుదారులకు రూ.1లకు కిలో చొప్పన యూనిట్‌కు ఆరు కిలోల అందిస్తోంది. తాజాగా యూనిట్‌కు 12 కిలోల చొప్పున ఉచితంగా అందజేసేందుకు సిద్ధమైంది. -
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ముంబై: రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే లక్ష్యంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. (ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..) ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాక్రే కదులుతున్నారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ('88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ') -
అమ్మఒడితో కొండంత భరోసా
ప్రజా సంకల్పయాత్రలో ఎందరో అక్కాచెల్లెమ్మల కన్నీటి గాథలు విని వైఎస్ జగన్మోహన్రెడ్డి కదిలిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కులేకపోవడంతో.. కూలికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నామని, రోజూ రెండు పూటలా తినడమే కష్టమైన తమకు పిల్లల్ని బడికి పంపడం ఎలాగని వారంతా వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు. వారి కష్టాల్ని చూసి చలించిపోయిన జగన్మోహన్రెడ్డి.. పిల్లల్ని చదివించలేని నిస్పహాయ స్థితిలో ఉన్న పేదతల్లులకు భరోసా ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఒక్కో తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తానని, పేదరికంతో చదువుకు పిల్లలు దూరమవడం ఇకపై ఉండదని హామీనిచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ పిల్లల చదువుకోసం తల్లుల ఖాతాలో జగనన్న అమ్మఒడి పథకంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 15 వేలు జమ చేశారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరిన వేళ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది తల్లులు తమ కన్నీటిని తుడిచిన అన్న జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ పిల్లల చదువుకు కొండంత భరోసాగా నిలిచిన సీఎంకు ఎన్నటికీ రుణపడి ఉంటామంటున్నారు. – సాక్షి నెట్వర్క్ చదువుకు చింతలేదిక లక్షలాది మంది పేదల జీవితాల్లో కాంతిరేఖ అమ్మఒడి. అందుకు ఉదాహరణే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వడ్డిజల్లుపుట్టుగకు చెందిన ఈశ్వరి దొళాయి ఉదంతం. తన పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తపించిన ఆ తల్లికి అన్నీ కష్టాలే. పూట గడవడమే గగనమైన ఆ కుటుంబంలోని పిల్లల చదువులకు అమ్మఒడి పథకం దారి చూపింది. ఇప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందం ఈశ్వరి మాటల్లోనే విందాం.. ‘ఏడేళ్లుగా నా భర్త కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నరకం అనుభవిస్తున్నాడు. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కూలీనాలి చేసుకుని జీవించేవాళ్లం. పిల్లల్ని మంచిగా చదివించాలనుకున్నాం. అప్పులు చేసి నా భర్తకు వైద్యం చేయించినా లాభం లేకపోయింది. నేను కూలికెళితేనే కుటుంబం గడిచే పరిస్థితి. ఇక నా కొడుకును ఎలా చదివించగలను అన్న బెంగతో ఎన్నో సార్లు బాధపడేదాన్ని. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం నా బిడ్డ చదువుకు వెలుగురేఖ అయ్యింది. మాలాంటి దిక్కు లేని వారికి జగనన్నే దిక్కు’ అని ఉప్పొంగిపోతూ చెప్పింది. నా పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తాను అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడురుకు చెందిన అపర్ణది మరో కన్నీటి గాథ. అయితే ఇప్పుడు ఆమె బతుకులో అమ్మఒడి సంతోషాన్ని నింపింది. ఆ సంతోషాన్ని ఆమె పంచుకుంటూ.. ‘నా భర్త బలరాముడు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఇద్దరు పిల్లల్లో కుమార్తె 7వ తరగతి, కుమారుడు 5వ తరగతి చదువుతున్నారు. కూలి చేసుకుంటూ వీళ్లను పోషిస్తున్నా. నా భర్త చనిపోయాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఇద్దరిలో ఒకరిని మాత్రమే చదివించాలనుకున్నా. పిల్లలిద్దరినీ గొప్ప చదువులు చదివించాలన్న నా కోరిక నెరవేరకుండా పోతుందేమోనని ఎంతో బాధపడ్దా.. అయితే పిల్లలను బడికి పంపితే చాలు, అమ్మఒడిలో రూ.15వేలు ఇస్తానన్న వైఎస్ జగన్ హామీతో ఇద్దరినీ చదివించాలని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాది ఇద్దరినీ స్కూలు పంపించాను. ఇప్పుడు అమ్మఒడి కింద నా ఖాతాలో రూ. 15 వేలు పడ్డాయి. జగనన్న నాకు కొండంత ధైర్యాన్నిచ్చారు. నా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తానన్న నమ్మకం కలిగింది’ అని అపర్ణ ఆనందంతో చెప్పింది. పర్వీన్ జీవితంలో కొత్త వెలుగు పేదల బతుకుల్లో అమ్మఒడి నింపుతున్న వెలుగులకు పర్వీన్ సంఘటనే ఉదాహరణ.. పిల్లల చదువుకు, వారి భవిష్యత్ గురించి మచిలీపట్నానికి చెందిన పర్వీన్ బాధపడని రోజు లేదు. భర్త మద్యానికి బానిసై తీవ్ర అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. తనకొచ్చే వితంతు పింఛన్‌తో పాటు.. రోజు కూలీగా పనిచేస్తే వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి దిక్కు. తాను కడుపునిండా తినకపోయినా.. తన పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఎన్నో కలలు కంది. సంపాదించే నాలుగు డబ్బుల్ని దాచుకుని ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తోంది. ఏటా ఫీజులు, పుస్తకాల కోసం రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. ఎప్పుడైనా పిల్లల చదువుకు అవసరమొస్తే ఆమెకు అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో అమ్మఒడి పథకంలో రూ.15వేలు తన ఖాతాకు జమైందని తెలియగానే ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అమ్మఒడి..ఆ అమ్మకు కొండంత భరోసానిచ్చింది. పిల్లల ఫీజులకు పోను మిగిలిన డబ్బును వారి పేరిట డిపాజిట్ చేస్తానని పర్వీన్ చెబుతోంది. నారాయణమ్మ కుటుంబంలో ఆనందోత్సాహాలు ఈ చిత్రంలో కనిపిస్తున్న కుటుంబం కష్టాలు వింటే మన కళ్లు చెమర్చక మానవు. ఆమె పేరు జాన నారాయణమ్మ. ఊరు విజయనగరం జిల్లా దుప్పాడ గ్రామం. పెళ్లైన మూడేళ్లకే భర్త చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింటికొచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి చేసుకుని బతుకుతోంది. నేల మీద కూర్చుని అమాయకంగా చూస్తున్న చిన్న కుమార్తె పేరు ఝాన్సీ. చిన్నప్పటి నుంచే ఫిట్స్‌తో బాధపడుతోంది. మానసిక ఎదుగుదల కూడా లేదని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి కృంగిపోయింది. అప్పటి నుంచి ఆ చిన్నారి వైద్యం కోసం అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఒక వైపు పేదరికం, మరోవైపు చిన్న కూతురి అనారోగ్యం.. వీటిన్నింటి నడుమ పెద్ద కూతురు సంతోషిని చదివిస్తోంది. ఇప్పుడు నారాయణమ్మ జీవితంలో అమ్మఒడి పథకం వెలుగులు నింపింది. ఆమె బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు పడ్డాయి. 8వ తరగతి చదువుతున్న సంతోషి కోసం వీటిని ఖర్చుపెడతానని చెబుతోంది. ‘అమ్మఒడి’పై అక్కసు.. దివ్యాంగుడిపై దాడి ధర్మవరం అర్బన్: అమ్మఒడికి మద్దతుగా ఫేస్బుక్లో పోస్టు పెట్టిన దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. స్థానిక నాగులబావి వీధికి చెందిన దివ్యాంగుడు ఎల్లారెడ్డి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను అమ్మఒడిపై ఫేస్బుక్లో ఓ పోస్టు షేర్ చేశాడు. అయితే.. అదే వార్డుకు చెందిన సుబ్రహ్మణ్యం తప్పుడు పదాలతో పోస్టు కింద కామెంట్ పెట్టడంతో ఎల్లారెడ్డి అతడిని మందలించాడు. దీంతో సుబ్రహ్మణ్యం ఆటోస్టాండ్‌లో ఉన్న ఎల్లారెడ్డిపై చెప్పుతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుపేదకు నీడ కోసం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిరుపేదకు నీడ కల్పించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా శరవేగంగా చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీ సుకున్నప్పటి నుంచి పేదల సంక్షేమం కోసం వరుసగా పథకాలు తీసుకువస్తున్నారు. ఇదే క్రమంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు కూడా రూపకల్పన చేశారు. ఈ పట్టాలను రానున్న ఉగాది నాటికి కుటుంబంలో మహిళ పేరిట అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిమితి లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయి లో ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 56 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జాబితాలను సిద్ధం చేశారు. వీరందరికీ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాదికి పట్టాలు అందజేయనున్నారు. వీరి కోసం ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట్ల కొనుగోలు చేసేందుకు కూడా భూములు గుర్తించారు. ఈ కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్హులకు ఇళ్లు ఇచ్చే ప్రక్రియ ఐదేళ్లూ కొనసాగుతుంది. ఈ ఐదేళ్లలో సొంతిల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. నిధులు రెడీ.. పేదల ఇళ్ల పట్టాలకు ఇళ్ల స్థలాల సేకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో పాటు ఆ స్థలాలు అందుబాటులో లేని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి అనువైన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసేందుకు కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను సేకరించి ఆ స్థలాలను చదును చేయడం, కాలువలు, రోడ్లను కల్పించడం, లే ఔట్‌గా తయారు చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి గాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హా మీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సమకూర్చారు. ఇప్పటికే అవసరమైన నిధులు అంచనాలు వేయడం ద్వారా పనులు ప్రారంభమైన ప్రాంతాలకు నిధుల మంజూరుకు పరిపాలనా ఆమోదం కూడా పూర్తయింది. జిల్లాలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలు 891.84 ఎకరాలను గుర్తించారు. ఈ భూములు 810 నివాస ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.74.54 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. జిల్లాలో 38 మండలాల్లో ఈ స్థలాలను లే ఔట్లు వేయడం, ఆ స్థలంలో ఉపాధి హామీ నిధులతో చదును చేయడం వంటివి చేస్తారు. తొలివిడతలో జిల్లాలో 301 లే ఔట్లలో(ప్రాంతాల్లో) 357.63 ఎకరాల్లో చదును చేయడానికి గాను రూ.24.95 కోట్లకు పరిపాలన ఆమోదం పొంది పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ పనులు ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. పనులు ప్రారంభించాం పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వ భూములు చదును చేసేందుకు నిధులు కేటాయించడం జరిగింది. అంచనాగా రూ.74.54 కోట్లు వేశాం. ఇప్పటికే పరిపాలనా ఆమోదం సుమారుగా రూ.25 కోట్లకు ఇచ్చారు. ఉపాధి హామీ పనుల నిధులతో ఇప్పటికే ఎచ్చెర్ల తదితర మండలాల్లో చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పరిపాలన ఆమోదం పొందిన భూముల్లో చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఫిబ్రవరి చివరి నాటికి నిర్దేశించిన అన్ని స్థలాలను చదును చేసేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం. – హెచ్.కూర్మారావు, డ్వామా పీడీ -
పది లక్షల ఇళ్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత గూడు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు వడివడిగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి గృహ నిర్మాణశాఖ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనలో నిమగ్నమయ్యారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అక్టోబర్‌లో 1,24,624, నవంబర్‌లో 2,58,648 మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3,83,272 ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేసిన విషయం తెలిసిందే. 7.86 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తింపు రాష్ట్రంలో 7.86 లక్షల మంది లబ్ధిదారులకు సొంత ఇళ్ల స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేసేలా గృహ నిర్మాణశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి ఉగాది నాటికి పంపిణీ చేసి దశలవారీగా నాలుగేళ్లలో నిర్మించి ఇవ్వనున్నారు. ఏడాదికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, భూసేకరణ, అభివృద్ధి కోసం దాదాపు రూ.11 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇక ఉగాది కానుక!
సొంతింటి కల సాకారం దిశగా.. సొంత స్థలం కానుక కాబోతున్న వేడుక ఉగాది. ఆ రోజు రాక కోసం కోటి ఆశలతో నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడినా కాసింత జాగా కూడా కొనుక్కోలేని రోజులివి. పేదలను సొంతింటి మారాజులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదల్లో ఆనందాలు నింపుతోంది. సాక్షి, మచిలీపట్నం: ఉగాది నాటికి జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రూపాల్లో అందిన దరఖాస్తులను ఇంటింటి సర్వేలో గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. దరఖాస్తు చేయని అర్హుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా జరిపిన సర్వేలో అర్హుల గుర్తింపు పూర్తి పారదర్శకంగా సాగింది. ఈ జాబితాలను ఇప్పటికే పంచాయతీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కూడా ఇటీవల జరిగిన గ్రామసభల్లో పరిష్కరించారు. ఇప్పటి వరకు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన జాబితాను వివిధ కోణాల్లో పరిశీలన అనంతరం జిల్లాలో 2,71,033 మంది అర్హులుగా లెక్కతేల్చారు. వీరిలో గ్రామీణ జిల్లాలో 1,31,660 మంది, అర్బన్ ప్రాంతంలో 1,39,373 మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వీరికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలంటే కనీసం 4601.36 ఎకరాలు భూమి అవసరమని గుర్తించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో 2132.02 ఎకరాల ప్రభుత్వ భూములను ఆ ఇళ్ల స్థలాలకు అనువైనవిగా నిర్ధారించారు. కాగా మరో 2497.79 ఎకరాలు సేకరించాల్సి ఉందని లెక్కతేల్చగా, ఇప్పటి వరకు భూసేకరణ కోసం 960.2 ఎకరాల ప్రైవేటు భూములు గుర్తించారు. మరో 1537.77 ఎకరాల భూముల కోసం అన్వేషిస్తున్నారు. భూసేకరణ కోసం రూ.2326.80 కోట్లు అవసరమని అంచనా వేశారు. కాగా ఆ భూముల లెవలింగ్ కోసం మరో రూ.306.75 కోట్లు ఖర్చవుతాయని లెక్కతేల్చారు. మొత్తం జిల్లాకు 2633.52 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అర్బన్ ప్రాంతాల్లో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 86,513 మంది అర్హులుగా లెక్క తేల్చగా, నందిగామలో కేవలం 1072 మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరంతా అర్హులని సమాచారం కూడా అందించారు. ఒకటికి పదిసార్లు ఇంకా ఎవరైనా అర్హులున్నారేమో బూతద్దంతో గుర్తించే కార్యక్రమం కూడా చేశారు. చివరకు ఎవరూ లేరని తేలడంతో అర్హుల జాబితాలను ప్రభుత్వామోదం కోసం పంపించారు. వీరందరికీ వచ్చే ఏడాది ఉగాది రోజున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన ప్రైవేటు భూముల కోసం త్వరలోనే ప్రభుత్వాదేశాల మేరకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు జిల్లాలో అర్హులను గుర్తించారు. వారికి ఇళ్ల స్థలాల కోసం ఎంత భూమి అవసరమో లెక్కతేలింది. అందుబాటులో ప్రభుత్వ భూముల గుర్తింపు పూర్తయింది. ఇక సేకరించాల్సిన ప్రైవేటు భూములను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వాదేశాలతో త్వరలోనే గుర్తించిన ప్రైవేటు భూముల కోసం భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నాం. ఏదిఏమైనా ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఏడాది ఉగాది రోజున అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి స్థలం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ -
పేదల భూములపై పెద్దల కన్ను..!
అవి పేద గిరిజనులకు ప్రభుత్వం ఫలసాయం కోసం ఇచ్చిన ఢీ పట్టా భూములు. క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా నేరం. ఆ భూములను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోవాలని స్కెచ్ వేశారు. కబ్జా చేసేందుకు ఏడునెలల కిందట పావులు కదిపారు. దీనిని పసిగట్టిన స్థానిక ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూములను రక్షించారు. మళ్లీ అవే భూములను సొంతం చేసుకునేందుకు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికులకు సొమ్ములు ఎరవేసి, అధికారుల కళ్లుగప్పే ప్రయత్నాలు చేస్తున్న అంశం మెంటాడ మండలంలోని కొండలింగాలవలసలో అలజడి రేపుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మెంటాడ మండలంలోని కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో రెడ్డివానివలస–కొండమామిడివలస మధ్యన సర్వే నంబర్ 269లో 25.14 ఎకరాలు , 267/3లో 3.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కాజేసుం దుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. అయితే, ఈ భూమిని గతంలో సమీప గ్రామాల గిరిజనులు సాగు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వం ఢీ పట్టాలు మంజూరు చేసింది. సుమారు పదిమంది రైతులు ఆ భూమిని సాగుచేసేవారు. వారిలో ఇబ్బరు మినహా మిగిలినవారు చనిపోయారు. వారి వారుసులెవరూ ఆ భూములను సాగుచేయడంలేదు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య రేటు పలుకుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన విశాఖకు చెందిన ఓ మహిళ రంగంలోకి దిగారు. ఆ ఇద్దరి నుంచి భూమిని కొనుగోలు చేయడంతో పాటు మిగిలిన భూమినంతటినీ దక్కించుకోవాలని పథకం వేశారు. ఈ ఏడాది జనవరిలో ఆ భూమిలో బోర్లు కూడా వేసి, చుట్టూ ఇనుప కంచె వేయడానికి సన్నాహాలు చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు విశాఖ మహిళ దుశ్చర్యలను స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. భూములు తమవిగా చెబుతున్న వారు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని అప్పటి తహసీల్దార్ రొంగలి ఎర్రినాయుడు వారికి నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు మొత్తం భూమిని సర్వే చేశారు. 269,67/3 సర్వేనెంబర్లలో గల భూమిని ప్రభుత్వం భూమిగా గుర్తించారు. ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమించి భూముల్లో ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అప్పటి తహసీల్దార్ రొంగలి ఎర్రినాయుడు ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. భూమిని చదును చేసిన జేసీబీని కూడా స్వాధీనం చేసుకొని ఆండ్ర పోలీసులకు అప్పగించించారు. మళ్లీ కథ మొదలు.. ఏడు నెలల పాటు ఈ భూముల గురించి పట్టించుకోని విశాఖ మహిళ మరలా తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకున్నారు. ఇదే సమయంలో తహసీల్దార్ ఎర్రినాయుడికి బదిలీకావడంతో ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా నెల్లూరి మంగరాజు గత నెల 24న వచ్చారు. ఆయనకు విషయం తెలిసి, అర్ధమయ్యేలోగా భూములు పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. దీనికోసం కొందరు స్థానిక వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారు. వారికి కొంత సొమ్ము కూడా ఆ మహిళ ముట్టజెప్పారు. అయితే, ఆ సొమ్ములు పంచుకోవడంలో ఆ వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల కొత్త వివాదం మొదలైంది. డబ్బుల కోసం ఆ మహిళను వారిలో కొందరు వేధించడం ప్రారంభించారు. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వారి పంచాయితీ చేరింది. ఈ నేపధ్యంలో కొత్త తహసీల్దార్‌కు ఈ వివాదం గురించి తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ భూములపై మరోసారి సర్వేయర్‌తో సర్వే చేయించడానికి సిద్ధమవుతున్నారు. చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ భూములను కాపాడడం తహసీల్దార్‌గా నా బాధ్యత. కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో కొన్ని భూములకు సంబంధించి వివాదాలున్నట్టు నా దృష్టికి వచ్చింది. గత తహసీల్దార్ వాటిని సర్వే చేయించి ప్రభుత్వ భూములుగా గుర్తించి బోర్డులు పెట్టించారని తెలిసింది. నేను కొత్తగా వచ్చినందున కొంత అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా రెండు రోజుల్లో భూములను సర్వే చేయిస్తాం. రికార్డులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ భూములు తన్నుకుపోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. – నెల్లూరి మంగరాజు, తహసీల్దార్, కొండలింగాలవలస -
నెరవేరనున్న పేదింటి కల!
సాక్షి, విజయనగరం : ప్రతి మనిషికి కూడు..గూడు..గుడ్డ కనీస అవసరాలు. వాటిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ గత పాలకులు తమ స్వార్ధప్రయోజనాలకే పెద్దపీట వేసి పేదల అవసరాలను కనీసం పట్టించుకోలేదు. ఇళ్లకోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇంటిస్థలమైనా ఇవ్వమని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సొంతిల్లులేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో వేస్తున్న అడుగులు వారికి ఊరటకలిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చాలా మంది అర్హులకు సొంత ఇల్లు సమకూరలేదు. కొందరికి ఇళ్లు మంజూరైనా వాటి నిర్మాణం పూర్తి కాలేదు. చాలా ఇళ్లకు రుణ మొత్తాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వచ్చే ఉగాది నాడు అర్హులైనవారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయనే వివరాలను సేకరించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే అత్యధిక స్థలాలు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల భూదాహానికి ఖాళీ అయ్యాయి. జిల్లాలో 6వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నా యి. వీటిలో చాలా వరకూ నివాసయోగ్యంగా లేవు. కొండలు, గుట్టలతో నిండి ఉన్నాయి. వీటి ని ఇళ్ల నిర్మాణానికి తగిన విధంగా తయారుచేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భూములైనా కొనుగోలు చేసి పేదలకు పంచిపెట్టాలని సీఎం జగన్ స్పష్టం చేయడంతో ఆ దిశగా కూడా చర్యలు మొదలవుతున్నాయి.స్థలాలు కొనాలన్నా... ఖర్చుతో కూడుకున్నపనే. ఉన్న స్థలాలను అనుకూలంగా మా ర్చుకోవాలా... లేక ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేయాలా... అన్న చర్చలు అధికార వర్గాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పేదలకు పంచి పెట్టడానికి జిల్లాలో అందుబాటులో ఉన్న ది కేవలం 130 ఎకరాలు మాత్రమే. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగా ఇల్లు లేని ప్రతిపేదవాడికీ 1.5సెంట్ల భూమి ఇవ్వాలంటే ఈ 130 ఎకరాలను 8,666 మందికి పంచవచ్చు.జిల్లాలో 7.13లక్షల మంది తెల్లరేషన్ కార్డు కలిగినవారున్నారు. వీరంతా పేద ప్రజలు. 2006 నుంచి 2019 వరకూ మంజూరైన ఇళ్లు దాదాపు 3.63లక్షలు. మిగిలిన 3.5లక్షల మందిలో సొంతిళ్లు ఎందరికి ఉందనేది తేలాల్సి ఉంది. అదీగాక గత ప్రభుత్వాల్లో ఇళ్లు మంజూరవ్వడమేగానీ మంజూరైనవన్నీ నిర్మాణం పూర్తిచేసుకోలేదు. టీడీపీ హయాంలో 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇల్లయినా మంజూరు కాలేదు. తర్వాత మూడేళ్ల కాలంలో జిల్లాకు వివిధ స్కీంల ద్వారా 99,297 ఇళ్లు మంజూరు కాగా అందులో 74,876 ఇళ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. వాటిలో పైకప్పు వరకూ(ఆర్సి) కంప్లీట్ అయినవి 30,324 ఇళ్లు, పూర్తిగా నిర్మాణం జరిగినవి 43,188 ఇళ్లు మాత్రమే. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తే తప్ప ఎందరికి ఇళ్లు అవసరమనే వాస్తవ సంఖ్య తేలదు. ఈ నేపథ్యంలో అధికారులు ఒక వైపు గృహæ, స్థల లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. -
ఇల్లు లేని పేదలు ఎందరు?
సాక్షి, హైదరాబాద్: నీడ లేని పేదల లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడు లేని బడుగులను జూన్ 10 కల్లా గుర్తించాలని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించింది. మున్సిపాలిటీల్లో రహదారులు, చెట్లే అడ్డాగా జీవనం సాగిస్తున్న పేదల డేటా సేకరించాలని.. వారందరికీ కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సేకరించే వివరాల ఆధారంగా ఇల్లు లేని పేదలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పింఛన్, బ్యాంక్ ఖాతాలు తెరిచేలా చొరవ చూపాలన్నారు. నీడ లేని వారందరినీ షెల్టర్లకు తరలించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కమిషనర్లు విధిగా షెల్టర్లను సందర్శించాలని, వారికి అందుతున్న సేవలను తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ స్థానిక సంస్థలుండగా.. ఇందులో 53 మున్సిపాలిటీల్లోనే షెల్టర్లు ఉన్నాయని, 11,389 మంది ఇక్కడ నివసిస్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో 5,807 మందికి ఆధార్ కార్డులు, 787 మందికి ఓటరు గుర్తింపు కార్డులు, 1,555 మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. 3,497 మందికి రేషన్ కార్డులు కూడా ఉన్నాయని, 201 మందికి బీమా సౌకర్యం కూడా కల్పించినట్లు కమిషనర్లు వివరించారు. 694 మందిని అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నామని, 5,728 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,050 ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో 129 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఆస్పత్రులకు సిఫారసు చేసినట్లు వివరించారు. 1,541 మందికి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్లు తెలిపారు. -
కూలీబిడ్డలు.. బాక్సింగ్ కింగ్‌లు
కరీంనగర్ స్పోర్ట్స్: వారంతా కూలీల బిడ్డలు. ఇల్లుగడవడమే కష్టంగా ఉన్న తరుణంలో వారి తల్లిదండ్రులు తమ పిల్లలను బాక్సర్లుగా చూడాలనుకున్నారు. మేరీకాం లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నారు.దేశానికి ఒలింపిక్ పతకం తేవాలనుకున్నారు.ప్రపంచానికి ఇండియా పంచ్ పంచ్ చూపించాలనుకుంటున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రెండ్రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నేపథ్యంపై కథనం.. కూలీబిడ్డ కాంస్య పతక విజేత వరంగల్ జిల్లా హన్మకొండకు సీహెచ్.దివ్య బాక్సింగ్‌లో దిట్ట. నాన్న కూలీ చేస్తుండగా అమ్మ గృహిణి. ఇప్పటి వరకు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గత సంవత్సరం పాఠశాలల జాతీయక్రీడా పోటీల్లో అద్వితీయ పోరాటపటిమ కనబరిచి కాంస్య పతకం సాధించింది. మేరీకామ్ స్ఫూర్తితో ఒలింపిక్లాంటి మెగాపోటీల్లో ప్రాతినిథ్యం వహించాలనుకుంటోంది. ఆటోడ్రైవర్ కొడుకు భాగ్యనగరంలో బాక్సింగ్‌లో రాణించి ఇండియన్ బాక్సర్‌గా పేరుసంపాదించడమే తన ఆశయమంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన వేణు. నాన్న సిటీలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. నాలుగుసార్లు జాతీయస్థాయితో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో పాల్గొని సత్తా చాడాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఖేలో ఇండియాలో కూలీకొడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణేష్ బాక్సింగ్‌లో దిట్ట. మంథనిలోని గురుకుల కళాశాలలో చదువుతున్నాడు. ఇప్పటి వరకు 8సార్లు సత్తా చాటాడు. తండ్రి కూలీ పనిచేస్తుండగా తల్లి గృహిణి. గతేడాది జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో కరీంనగర్ నుంచి సత్తాచాటాడు. గణేష్ భవిష్యత్‌లో ఐపీఎస్ అధికారిగా సేవలందించాలనుకుంటున్నాడు. -
పేదల పెన్నిధి పాలియేటివ్ కేర్ సెంటర్
సాక్షి, పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చివరి దశలో ఉన్న క్యాన్సర్ నిరుపేదలకు పాలియేటివ్‌కేర్ ఎంతో చేయూతను అందిస్తోందని పాలమూరు మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి ఆవరణలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పుట్టా శ్రీనివాస్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ హాజరై కేకు కట్ చేశారు. ఆనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాదిలో పాలియేటివ్ కేర్ ద్వారా 782 ఓపీ కేసులు, 276ఐపి రోగులకు, 934 క్యాన్సర్ రోగులకు ఇంటికి వెళ్లి చికిత్స అందించినట్లు తెలిపారు. చివరి దశలో.. క్యాన్సర్ రోగి చివరి దశలో నొప్పి లేని జీవితం గడపటానికి ఈ సేవ కేంద్రం ఉపకరిస్తోందని పుట్టా శ్రీనివాస్, రాంకిషన్ అన్నారు. జిల్లాలో కేన్సర్ వ్యాధిపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగహన ఉండడం లేదన్నారు. మారిన జీవన పరిస్థితుల కారణంగా అప్పుడే జన్మించిన చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్లు పంజా విసురుతున్నాయన్నారు. వ్యాధి సోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాల వారే అధికంగా ఉంటున్నారని తెలిపారు. గతంలో గర్భాశయ ముఖద్వారా కేన్సర్ 50ఏళ్లపైబడి మోనోపాజ్ దశలో ఉన్న వారికే మాత్రమే వచ్చేదని తెలిపారు. నోటి క్యాన్సర్ ప్రమాదం.. జిల్లాలో నోటి క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ ఉందని పుట్టా శ్రీనివాస్, రాంకిషన్ అన్నారు. ఇక్కడ బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉండడంతో వీరు బీడీ, సిగరెట్లు, గుట్కా, జర్దా, పాన్‌మసాలా తదితర విరివిగా వినియోగిస్తుండడంతో నోటి క్యాన్సర్లు పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యువత అధికంగా నోటి కేన్సర్ భారిన పడుతున్నట్లు వెల్లడించారు. నాలుక, దవడ, పెదవి, గొంతు తదితర అవయవాలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు. వ్యాధి నివారణకు క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే కన్నా.. వ్యాధి రాకుండా జీవనశైలిలో మార్పు తెచ్చుకోవడం ఉత్తమమని పుట్టా శ్రీనివాస్, రాంకిషన్ అన్నారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్ రాకుండా జననావయవాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లైంగిక సంబంధాలు కలిగి ఉండకపోవడంతో సుఖ వ్యాధులు సోకే ప్రమాదం తప్పుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి, రవికుమార్, అరుణ్‌కుమార్, ఉషారాణి, భారతి, నిర్మల, చందు, స్వప్న, సుజాత, సంతోష, యాదమ్మ, సత్యమ్మ, రాధ, బాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
పేదలకు వరం ‘పోషణ్ అభియాన్’
సాక్షి,దామరగిద్ద: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఐసీడీఎస్ పథకం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన పోషణ్ అభియాన్ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తుంది. గర్భిణులు, చిన్నారులు తీసుకునే ఆహరంలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి ప్రజలను అవగాహణ కల్పించడంలో అంగన్వాడీ కార్యకర్తలు వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు గ్రామంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. స్థానికంగా లభించే ఏ ఆహారంలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలియజేస్తున్నారు. తీసుకోవల్సిన జాగత్రలు వాటిని కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. పక్షోత్సవాల్లో చైతన్య కార్యక్రమాలు మద్దూర్ ప్రాజెక్టు పరిధిలోని దామరగిద్ద, కోస్గి, మద్దూరు మండలాల్లోని 239 అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ స్వప్నప్రియ సమక్షంలో మహిళ దినోత్సం సందర్భంగా మార్చి 8 నుంచి పోషణ్ అభియాన్ నిర్వహిస్తున్నారు. మండలంలో 63 కేంద్రాల పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్ రాధిక జ్యోతి పర్యవేక్షించారు. పౌష్టికాహరం ప్రాధాన్యతను తెలిపే ప్రదర్శణలు క్షేత్ర పర్యటను అవగాహణ సదస్సులు నిర్వహించారు. రోజుకో కార్యక్రమంతో.. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 8న పోషణ మేళా– పోషణ పక్షం, 9న అన్నప్రాసన, సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, 10న పోషణ్ ర్యాలీ, 11న రకతహీణతపై పాఠశాలలో క్యాంపు, కిషోర బాలికలకు అవగాహన, 12న పోషక ఆహారం పై సమావేశం, 13న ఇంటింటి పోషణ పండుగ ప్రతిజ్ఞ, 14న యువజన సంఘాలతో సమావేశం పోషణ నడక, 15న పోషకాహార ప్రదర్శన, 16న రైతు క్లబ్‌ల సమావేశం, అంగడి సంత కార్యక్రమం, 17న ప్రభాత్ ఫెరి పోషణ, 18న యువజన సంఘాల లేదా పాఠశాలల్లో సమావేశం,19న కిచెన్ గార్డెన్ల పై క్షేత్ర పర్యటన, 20న రక్తహీనతపై కిషోర బాలికల ఆవగాహణ క్యాంపు, 21న పోషణ్ ర్యాలీ నిర్వహించారు. పౌష్టికాహార ప్రాధాన్యత తెలిపేందుకే పౌష్టికాహార లోపంతో గర్భిణులు, చాన్నిరులు అనారోగ్యపాలవుతున్నారు. ఈ సమస్యను తొలగించేందుకు ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం పోషణ అభియాన్ పక్షోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు పరిధిలోని 239 కేంద్రాల్లో పక్షం రోజులుగా నిర్ధేశిత షెడ్యూలు ప్రకారం అంగన్వాడీ కార్యర్తలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. శుక్రవారం ప్రాజెక్టు స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. –స్వప్నప్రియ, సీడీపీఓ, మద్దూరు -
అందరికీ అను‘గృహం’..
సాక్షి, ప్రత్తిపాడు : పేదవాని గూడు గోడుగానే మిగిలిపోతోంది. కలల సౌథం కూలిపోతోంది. అర్హత ఉండీ ఇళ్లు మంజూరు కాని వారు కొందరు..మంజూరై బిల్లులు రాని వారు ఇంకొందరు.. బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన వారు మరికొందరు.. ఇలా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బాధ అంతులేకుండా ఉంది. ఇలాంటి పేదలందరికీ గూడు కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన పథకం వివరాలు పేదలందరికీ పక్కా ఇళ్లు ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం పక్కా ఇళ్ల నిర్మాణాల వివరాలు.. టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లు : 3,61,732 అసంపూర్తిగా నిలిచిన ఇళ్లు : 21,568 ప్రారంభం కాని ఇళ్లు : 60,279 అందరికీ ఇళ్లు గొప్ప విషయం టీడీపీ ప్రభుత్వ హయాం లో పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే జన్మభూమి కమిటీల దయ తప్పని సరి. అలాంటి వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులకు ఇస్తామని చెప్పడం గొప్ప విషయం. – కొత్త అమేష్, బీకేపాలెం జగన్ హామీ హర్షణీయం ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక లబ్ధిదారులు అగచాట్లు పడుతున్నారు. మండలాల్లోని హౌసింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. నిర్మించుకున్న ఐదారు నెలలకు కూడా బిల్లులు రాని దుస్థితి ఉంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన మాటిస్తే నెరవేరుస్తారు. అందుకే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – బాపతు శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు -
పేదల పాలిట సంజీవని.. ఆరోగ్యశ్రీ
సాక్షి, గంపలగూడెం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ లేకుంటే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళే స్థాయి పేద, మధ్య తరగతి కుటుంబాలకు లేదు. ఆ పరిస్థితిలో పెద్ద రోగం వస్తే దేవుని మీద భారం వేసి స్థానికంగా ఉండే వైద్య సేవల్ని మాత్రమే పొందుతూ ఉండే వారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక ఎంతో ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు ఉచితంగా పొందామంటూ ప్రజలు మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైఎస్ మరణానంతరం ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం తిరిగి పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందరికో ప్రాణదానం చేసింది.. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రాణాల్ని కాపాడింది. పేదలకు సంజీవని లాంటిది. ఆరోగ్యశ్రీకి ముందు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడేవారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చింది. – కోట దాసు, మాజీ ఎంపీపీ, గంపలగూడెం పథకాన్ని టీడీపీ నీరుగార్చింది.. పేదలకు వరంలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ఈ పథకం ద్వారా అవసర సమయాల్లో నిరుపేదలు సైతం లక్షలాది రూపాయల వైద్య సేవల్ని పొందగలిగారు. ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. –చెరుకు నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, కనుమూరు ఉచితంగా పెద్ద ఆపరేషన్లు.. ఆరోగ్యశ్రీ పథకంతో అవసరమైన రోగులకు పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా నిర్వహించటంతో ప్రాణదానం అయ్యింది. ఈ పథకమే లేకుంటే ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయేవి. వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తానని జగన్ ప్రకటించడం పేదలకు మరింత మేలు చేసే విధంగా ఉంది. – బొల్లా కరుణాకరరావు, కొణిజెర్ల -
పేదింటికి వెలుగు
ఆదిలాబాద్‌టౌన్: కిరోసిన్ దీపాలు పెట్టుకొని కాలం గడిపే రోజులు పోనున్నాయి.. విద్యుత్ వైర్లకు కొండ్లు తగలించి కరెంట్ వాడుకోవడం వంటి బాధలు ఇక తప్పనున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి పేదింట్లో విద్యుత్ కాంతులు వెదజల్లే పథకం జిల్లాలో అమలవుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల్లో రూ.125కే విద్యుత్ వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే జిల్లాకు ప్రభుత్వం 9వేల కనెక్షన్లు లక్ష్యం ఇవ్వగా, అంతకు మించి 11,114 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కావడంతో మరిన్ని దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేని ఇల్లు ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న పేదల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపనుంది. అయితే ఈ పథకం చివరి గడువు ఈనెల 31తో ముగియనుంది. గతేడాది కాలంగా వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు మీటర్లు బిగించి కరెంటు సరఫరా చేస్తున్నారు. రూ.125కే గృహ విద్యుత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకం ద్వారా రూ.125కే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. విద్యుత్ మీటర్‌తోపాటు ఒక ఎల్ఈడీ బల్బు, పది మీటర్ల సర్వీస్ వైర్, స్విచ్‌బోర్డు, అర్తింగ్, ఎంసీబీ బటన్ కూడా ఇస్తున్నారు. ఈ పథకానికి 2018 అక్టోబర్‌తో గడువు ముగిసినా పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్లకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారులు ఇంటి పన్ను రశీదు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్, రేషన్‌కార్డు జిరాక్స్‌లను దరఖాస్తుతోపాటు రూ.125 అందజేస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. లక్ష్యానికి మించి దరఖాస్తులు.. జిల్లాకు ఈ పథకం కింద 9వేల లక్ష్యం కేటాయించారు. కాగా ఇప్పటి వరకు 11,114 మంది లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మార్చి 31 వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 80 శాతం వరకు కనెక్షన్లు కూడా అమర్చామని చెబుతున్నారు. జిల్లాలో కనెక్షన్లు ఇలా.. మండలం కనెక్షన్లు ఆదిలాబాద్ ఉమ్మడి మండలం 649 బజార్హత్నూర్ 955 బేల 832 బోథ్ 1082 ఇచ్చోడ 546 జైనథ్ 414 నేరడిగొండ 951 తలమడుగు 1055 తాంసి 1309 గుడిహత్నూర్ 155 ఇంద్రవెల్లి 849 నార్నూర్ 228 ఉట్నూర్ 904 -
ఎన్నికల వేళ.. రాహుల్ కీలక హామీ
రాయ్‌పూర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన పేద ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ దేశం అమలు చేయ్యని విధంగా కొత్త పథకం తీసుకువస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు కనీస ఆదాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఆకలితో పేదరికంలో మగ్గుతున్న పేద ప్రజలకు ఈ పథకం ద్వారా తోడ్పాటు అందజేస్తామని అన్నారు. ప్రతి పేద వ్యక్తి జీవించడానికి కనీస ఆదాయం కావాలి. అలాంటి వారికి కనీస ఆదాయం అందించడం ద్వారా భారత్‌లో ఆకలి, పేదరికాన్ని దూరం చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తమ భవిష్యత్తు కార్యచరణ అని.. ఈ హామీకి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. దేశ ప్రజల కోసం బీజేపీ ఏమి చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన దేశంలో ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మనం నవభారతాన్ని నిర్మించలేమని పేర్కొన్నారు. గతవారం తన సోదరి ప్రియాంక గాంధీకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన రాహుల్.. తాజా హామీతో దేశంలో ఎన్నికల వేడిని పెంచారు. -
దారిద్య్రం దిగొచ్చింది!
భారత్.. పేద దేశం అనే భావన క్రమక్రమంగా తొలగిపోతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు చర్యలు, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా దేశంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రోజుకు 1.90 డాలర్ల కంటే (దాదాపు రూ.120) తక్కువ సంపాదన ఉన్న వారు కటిక పేదలు. 2011లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 26 కోట్ల 80 లక్షల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. అయితే, ఇప్పుడు వీరి సంఖ్య 5 కోట్ల లోపే ఉందని తాజా సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి. –సాక్షి నాలెడ్జ్సెంటర్ పేదల జనాభా తగ్గింది.. గృహ వినియోగం (ఒక ఇంటివాళ్లు ఎంత ఖర్చు చేస్తున్నారన్నది) గణాంకాల ఆధారంగా దేశంలో పేదరికాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దేశంలో 2011లో గృహ వినియోగ సర్వే జరిగింది. తర్వాత సర్వే 2017–18లో జరిగింది. ఆ గణాంకాల నివేదిక ఈ ఏడాది జూన్‌లో వెలువడుతుంది. తాజాగా నిర్వహించిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దేశంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలుస్తోందని భారత ప్రధాన గణకుడు (స్టాటష్టీషియన్) ప్రవీణ్ శ్రీవాత్సవ చెప్పారు. తాజా గణాంకాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అంచనా వేసే వరల్డ్ డేటా ల్యాబ్ ప్రస్తుతం దేశంలో పేదల సంఖ్య 2011తో పోలిస్తే బాగా తగ్గిందని తెలిపింది. రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు 5 కోట్ల కంటే తక్కువ ఉండొచ్చని అంచనా వేసింది. త్వరలోనే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్‌లో దారిద్య్రం కూడా శరవేగంగా తగ్గుతోందని, 2017–18 గృహ వినియోగ సర్వే నివేదిక బయటికొస్తే దారిద్య్రం తగ్గుదల మరింత కచ్చితంగా తెలుస్తుందని బ్రూకింగ్స్ నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం చివరికి కటిక పేదలు 4 కోట్లకు తగ్గుతారని, 2030 నాటికి భారతదేశంలో కేవలం 30 లక్షల మంది మాత్రమే కటిక దారిద్య్రంలో ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. పథకాలు, సాంకేతికతే కారణం ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకోవడం, సామాజిక సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో సాంకేతికత వినియోగం, నగదు బదిలీ వంటి పథకాలు దేశంలో దారిద్య్రం తగ్గడానికి దోహదపడ్డాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2004–05 నుంచి దేశంలో కటిక పేదరికం నిలకడగా తగ్గుతూ వస్తోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలు, ఎంఎన్ఆర్ఇజీఏ, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలు విజయవంతం కావడంతో పేదలు తగ్గుతున్నారని వివరించారు. 2030 నాటికి మన దేశం అత్యధిక పేదలున్న పది దేశాల జాబితా నుంచి తొలగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పట్టణ పేదల ఇళ్లకు శాపం!
నిలువనీడ లేక పట్టణ ప్రజలు పడుతున్న బాధలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం ద్వారా పట్టణ, నగర ప్రజలకు గృహవసతి కల్పించాలని కేంద్రం భావించింది. కానీ ఈ పథకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఏరుకుంటోంది. తనకు నచ్చిన సంస్థలకు గృహనిర్మాణ బాధ్యతలు అప్పగించడంతో అవి అంచనాలు పెంచేసి లబ్ధిదారుడిపై ఆర్థిక భారం మోపుతున్నాయి. వీటికితోడు పచ్చనేతల అవినీతి, బ్యాంకర్ల నిబంధనల కారణంగా పట్టణ గృహనిర్మాణం నత్తనడకన సాగుతోంది. సబ్సిడీ వస్తుందనే నమ్మకంతో సొంత నగదుతో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు రుణభారంతో నలిగిపోతున్నారు. పట్టణ గృహనిర్మాణ పథకంపై పాలకులు చెబుతున్న మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా లేకపోవడం, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడం, ఇంటి లోపల వసతులు సంతృప్తిగా లేకపోవడం, టీడీపీ నేతల అవినీతి కారణంగా ఇప్పుడీ పథకం పట్ల ప్రజలు ఆసక్తి చూపడం లేదు. సాక్షి, అమరావతి: కేవలం డబ్బు ఉన్నవారికే కాకుండా ప్రతి ఒక్కరికీ (పేద, మధ్య తరగతివారితో సహా) పక్కా గృహ వసతి కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5.24 లక్షల ఇళ్లను (ఫ్లాట్లు) నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్లను మూడు కేటగిరీలుగా 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇంటి నిర్మాణ వ్యయం విస్తీర్ణాన్ని బట్టి రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఇంటికయ్యే మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడికి బ్యాంకు రుణంగా అందిస్తారు. లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణం ఆధారంగా నెలసరి వాయిదాల చెల్లింపులను నిర్దేశించారు. నెలకు రూ.2,500, రూ.2,900, 3,500 వాయిదాలుగా నిర్ణయించి 20 ఏళ్ల పాటు చెల్లించే విధానాన్ని రూపొందించారు. నచ్చిన సంస్థలకు అప్పగింత రెండేళ్ల క్రితం పిలిచిన టెండర్లలో నచ్చిన సంస్థలకు గృహనిర్మాణ బాధ్యతలను అప్పగించడంతో ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణమూ పూర్తికాలేదు. ఆ జిల్లాల్లో 1.39 లక్షల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు పొందిన ఈ సంస్థలు ఒక్క ఇంటినీ నిర్మించలేదు. రాష్ట్రం మొత్తం 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో ఇప్పటివరకు 64,370 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తుండటంతో అనేకమంది దరఖాస్తుదారులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. 3.36 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని జిల్లాల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 2,534 మంది లబ్ధిదారులకే మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. మిగిలినవన్నీ ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. దరఖాస్తు చేసిన నాటి నుంచి స్థానిక కార్పొరేటర్, జన్మభూమి కమిటీ, గృహనిర్మాణ సంస్థ అధికారులు, బ్యాంకర్లు చుట్టూ తిరగలేక ఆర్థిక వెసులుబాటు కలిగిన కొందరు లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే వీరు కూడా బ్యాంకు రుణం పొందడానికి అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఇళ్ల కేటాయింపునకు భారీ వసూళ్లు టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జన్మభూమి కమిటీలు తమ మామూళ్లు తీసుకుని ఇళ్ల కేటాయింపునకు సిఫారసు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. అయితే ఆ లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులు, నెలవారీ వాయిదాలు చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవడంతో రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది తిరస్కరణకు గురయ్యారు రాష్ట్రంలో మొత్తం 5.24 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, జిల్లా స్థాయి కమిటీలు 3.36 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపాయి. వీటిలో 1.87 లక్షలు పెండింగ్‌లో ఉండగా 27,379 దరఖాస్తులు మాత్రమే రుణాల కోసం బ్యాంకుల వద్దకు చేరాయి. ఇప్పటివరకు బ్యాంకులు 2,534 మంది లబ్ధిదారులకు మాత్రమే రుణాలు మంజూరు చేశాయి. అనర్హులుగా మిగిలిన లబ్ధిదారులు రెంటికీ చెడిన రేవడిలా మారారు. ఇటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ఇచ్చిన మామూళ్లు తిరిగి తీసుకోలేకపోతున్నారు. అటు బ్యాంకర్లు అడిగిన రీపేమెంట్ సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు. అధ్వానంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వం అర్బన్ గృహనిర్మాణంపై చేసుకుంటున్న ప్రచారానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల నాణ్యతా ప్రమాణాలు, ఇంటి లోపల వసతుల కల్పన, అధికారులు, టీడీపీ నేతల అవినీతిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంటిలోపల వసతులు సంతృప్తిగా లేవని 39.67 శాతం మంది లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, ఇంటి కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని 31.16 శాతం మంది, దరఖాస్తు చేసినా ఇల్లు కేటాయించలేదని, కనీసం సమాచారం కూడా రాలేదని 16.95 శాతం మంది, అధికారులు అవినీతికి పాల్పడ్డారని 4.94 శాతం మంది, ఇంటి నిర్మాణం బాగోలేదని 3.88 శాతం మంది, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని 3.42 శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వ సర్వేలోనే పేర్కొన్నారు. పేదలపై భారీగా భారం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలు టెండర్ల సమయంలో సిండికేటు కావడంతో అంచనాల వ్యయం పెరిగింది. దీనికితోడు ఆ సంస్థలకు రెండేసి జిల్లాల్లో ఇళ్లను నిర్మించే టెండర్లు రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నాగార్జున, షాపూర్జీ పల్లోంజీ, లార్సెన్ అండ్ టూబ్రో, వీఎన్‌సీ, సింప్లెక్సు సంస్థలు ప్రతి జిల్లా టెండరులో కుమ్మక్కె ఒక్కరికే ఆ పనులు దక్కేలా చేశాయి. నాగార్జున నిర్మాణ సంస్థకు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు, షాపూర్జీ పల్లోంజీకి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఇళ్ల నిర్మాణ టెండర్లు లభించాయి. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సెంట్రింగ్, ఇతర పరికరాలు ఈ సంస్థలకు పూర్తిగా లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ సంస్థల పనితీరును అధికారులెవరూ ప్రశ్నించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణ సంస్థలకు చదరపు అడుగు నిర్మాణానికి రూ.900 నుంచి రూ.1,290 వరకు ధర చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే సంస్థలకు చదరపు అడుగుకు రూ.1,600 రేటును నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులపై ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి సగటున రూ.400 ఆర్థిక భారం పడింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కల ప్లాట్‌ను పొందే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.1.20 లక్షలు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని పొందే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.1.46 లక్షలు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటిని పొందే ఒక్కొక్కరిపై రూ.1.72 లక్షల ఆర్థిక భారం పడుతోంది. ఈ మొత్తమంతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నిర్మాణ సంస్థలకే దక్కుతోంది. ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం టీడీపీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చదరపు అడుగుకు రూ.2,200లు పేదల నుంచి వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతోంది. ఉయ్యూరు లాంటి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చదరపు అడుగుకు అయ్యే ఖర్చు కేవలం రూ.1,800 నుంచి రూ.2200 వరకు ఉంది. ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి, ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నప్పుడు చదరపు అడుగుకు రూ.2,200 ఎందుకవుతోంది? తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు చదరపు అడుగుకి కేవలం రూ.900 నుంచి రూ.1100 మాత్రమే అవుతోంది. ఫ్లాట్ల కేటాయింపులో, లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రజలను టీడీపీ నేతలు మోసం చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపులో టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. –జంపాన కొండలరావు, వైఎస్సార్సీపీ, ఉయ్యూరు, పట్టణ అధ్యక్షుడు రాజకీయ నాయకుల ప్రతిపాదనే ప్రధాన అర్హత హౌసింగ్ ఫర్ ఆల్ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే జరగడం లేదు. టీడీపీ నేతలు ప్రతిపాదించిన పేర్లను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. నా తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్ల కేటాయింపు పత్రాలు ఇచ్చారు. నాకు మాత్రం మూడు నెలల నుంచి ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందంటూ రోజూ ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. నిన్న జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని చెప్పారు. అక్కడకు వెళ్తే ఏమీ లేదు. ఓట్ల కోసమే సామాన్యుల ఆశలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. – వి.నాగలక్ష్మి, సీతన్నపేట, విజయవాడ ►విజయనగరం ఒకటో వార్డులో ఉంటోన్న బొడ్డు అన్నపూర్ణ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మూడుసార్లు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఆమెకు ఇల్లు మంజూరు కాలేదు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఇల్లు ఎందుకు మంజూరుకాలేదో కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నానని, చిన్నచిన్న పనులు చేయగా వచ్చిన ఆదాయంతో ఇంటి అద్దె కట్టుకోవడం భారంగా ఉందని అన్నపూర్ణ వాపోతోంది. ►కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఆదర్శనగర్‌కు చెందిన నండూరి వెంకటలక్ష్మి (60) నాలుగేళ్ల క్రితం ఇంటికి దరఖాస్తు చేసుకుంది. మంజూరు కావడంతో తాపీ పనులు చేసుకుంటూ కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్ముతో ఇంటి పనులు ప్రారంభించింది. ఆ డబ్బుకు మరో రూ.2 లక్షలు అప్పు చేసి పిల్లర్స్తోపాటు గోడలు నిర్మించింది. ఇది జరిగి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా ముట్టలేదు. ఇంటి పనులు వీసమంతైనా ముందుకు సాగలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక మనోవేదనతో పక్షవాతం వచ్చి మంచానపడింది. వచ్చే పింఛన్‌తో మందులు కొనుక్కుంటూ అద్దె ఇంట్లో తలదాచుకుంటోంది. -
పేదల బతుకుల్లో వెలుగులు నింపుతాం
సాక్షి, చిన్నచింతకుంట: పేదల స్థితిగతులను అధ్యయనం చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతామని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, ధనుంజయ్ అన్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రెట్టింపు పింఛన్లుతో పాటు రైతులకు పంట పెట్టుబడి సాయం, ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ దేవరకద్ర నియోజకవర్గ యూత్ కన్వీనర్ మహిపాల్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, తిర్మలాపూర్ గ్రామ ఎంపీటీసీ. సత్యం, కతలప్ప, మాసిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, మహేష్, శ్రీను పాల్గొన్నారు. అమిస్తాపూర్‌లో రెండో రోజు ప్రచారం భూత్పూర్: మున్సిపాలిటీ పరిదిలోని అమిస్తాపూర్‌లో సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన హామీలు అమలు గురించి వివరించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని వారు కోరారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని గ్రామాల్లో ఓటర్లకు వివరిస్తున్నారు. పెన్షన్ల పెంపు, తిదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రె‹స్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సాధిక్, ఫసియోద్దీన్, ఫారుక్, ఆనంద్ ,నరేందర్,,తిరుపతి రెడ్డి,యాదిరెడ్డి,గాల్‌రెడ్డి ,ఆగిరి రవి, హతిరాం పాల్గొన్నారు. నేటి నుంచి ముమ్మర ప్రచారం మూసాపేట: నేటి నుంచి మండలంలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారాన్ని ముమ్మరం చేద్దామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల నర్సింహులు, అజయకుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ మండల ముఖ్యనాయకులంతా సమావేశమయ్యారు. నియోజకవర్గం నుంచి తనకే పోటీ చేసే అవకాశం వచ్చిందని ఢిల్లీలో ఉన్న పవన్‌కుమార్ ఫోన్లో తెలిపారని, దీంతో నేటి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో శెట్టి శేఖర్, సీఎచ్ వెంకటయ్య, సుధాకర్‌రెడ్డి యాదయ్య, వెంకటేష్, సమరసింహారెడ్డి, శ్రీనివాసులు, రవి సాగర్, రాజేందర్‌రెడ్డి, రాంకుమార్‌యాదవ్, నర్సింహారెడ్డి, మహేష్, రాజు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కిట్.. బడుగుల్లో హిట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అనేక వైద్య, ఆరోగ్య పథకాలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చేరువయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల హైదరాబాద్ వచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ కమిటీకి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం... 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ తో ఇప్పటి వరకు 29.8% మంది ఎస్సీ, ఎస్టీలు లబ్ధి పొందారని తెలిపింది. ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచడం, తల్లీబిడ్డల మరణాలను తగ్గించడం కోసం దీన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు 10.60 లక్షల మంది ఉపయోగించుకున్నారు. వీరిలో ఎస్సీలు 1.99 లక్షల మంది, ఎస్టీలు 1.17 లక్షల మంది. దీనికిగాను ప్రభుత్వం 392.61 కోట్లు వెచ్చించగా, వారికోసం 31 శాతం నిధులను ఖర్చు చేశారు. తెలంగాణలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉపయోగించుకున్నది కేసీఆర్ కిట్టేనని కేంద్రానికి తెలిపింది. కంటి వెలుగుకు ఆదరణ అంధత్వంలేని తెలంగాణగా మార్చేందుకు ఆగస్టులో ప్రారంభమైన కంటి వెలుగు పథ కాన్ని 40 లక్షల మంది ఉపయోగించుకుంటే, అందులో ఎస్సీ, ఎస్టీలే 27.45% మంది ఉన్నారు. దీనిలో ఎస్సీలు 7.04 లక్షలు, ఎస్టీలు 3.94 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కంటి వైద్యశిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ చేసి అద్దాలు ఇస్తారు. అవసరమైతే శస్త్రచికిత్సకు సిఫారసు చేస్తారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో పూర్తిగా కంటి పరీక్షలు నిర్వహించాలనేది ఈ పథకం లక్ష్యం.కంటి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 827 బృందాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 21.3 శాతం ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలో 2015–16 నుంచి ఇప్పటి వరకు ఎస్సీలు 14.41 శాతం, ఎస్టీలు 6.89 శాతం ఉపయోగించుకున్నారు. మొత్తంగా 21.3 శాతం ఈ వర్గాల ప్రజలు ఉపయోగించుకున్నట్లు నివేదికలో ప్రస్తావించింది. ఈ పథకం కింద 949 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. 2015–16లో 2.60 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే, అందులో 14.35 శాతం మంది ఎస్సీలు, 6.76 శాతం మంది ఎస్టీలున్నారు. 2016–17లో మొత్తం 2.76 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే అందులో ఎస్సీలు 14.30 శాతం, ఎస్టీలు 6.90 శాతం ఉన్నారు. ఇక 2017–18లో 3.11 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే, అందులో ఎస్సీలు 14.59 శాతం, ఎస్టీలు 7.01 శాతం ఉన్నారు. పిల్లల్లో వచ్చే వ్యాధులను గుర్తించే రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో 2016–18 మధ్య 36.55 లక్షల మంది కవర్ కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలు 24.3 శాతం ఉపయోగించుకున్నారు. కేసీఆర్ కిట్ కింద ఎస్సీ, ఎస్టీలు పొందిన లబ్ధి –––––––––––––––––––––––––––––––––––– ఏడాది మొత్తం ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం 2017–18 7,75,168 1,45,286 18.7 86,264 11.1 2018–19 2,84,898 54,474 19.1 30,996 10.8 మొత్తం 10,60,066 1,99,760 18.8 1,17,260 11.0 -
కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తిర్యాణి(ఆసిఫాబాద్) : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని జీవణ ప్రమాణాలు పెంపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రచారశాఖ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాలతో ప్రజలు లబ్ధిపొందాలన్నారు. ప్రజలకు పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో మరింత అవగాహన కల్పించడానికి ప్రచార మంత్రిత్వశాఖ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష యోజన, జీవన జ్యోతి బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, స్వచ్ఛభారత్ అభియాన్, బేటీ పడావో, బేటీ బచావో, ముద్రయోజన, కౌషల్ యోజన, పంటల బీమా యోజన, ఆయుష్మాన్‌భవ యోజన, ఉజ్వల యోజన పథకాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు ప్రజాప్రతినిధులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. రోడ్లు శుభ్రం చేశారు. సమావేశంలో ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి, సీడీపీవో సావిత్రి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో శంకర్, టీఆర్ఎస్ నాయకులు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. చింతలమానెపల్లి(సిర్పూర్): కేంద్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని రుద్రపూర్ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి సుదర్శన్ రెడ్డి, డీఎల్ఎం రామయ్య, డీపీవో గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
90 శాతం మందికే రూపాయి బియ్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్ /గార : ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టుపట్టించేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది సరుకుల నుంచి రెండు సరుకులకు కుదించగా, తాజాగా శతశాతం రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా, 90 శాతమే డీడీలు కట్టాలని ఆదేశించింది. అంటే మిగిలిన 10 శాతం రేషన్ అందకుండా చేస్తుందన్నమాట. ఇలా మున్ముందు మొత్తం పేదలను ప్రజా పంపిణీ వ్యవస్థకు దూరం చేసేఎత్తుగడ చేస్తోంది. జిల్లాలో 8,27,468 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో తెలుపురంగు 7,76,552, అంత్యోదయ 49,943, అన్నపూర్ణ కార్డులు 973 ఉన్నాయి. కార్డుదారుల్లో సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి అయిదు కిలోల బియ్యాన్ని, కిలో బియ్యాన్ని అందిస్తున్నాయి. దీనికోసం కోట్లాది రూపాయల ప్రజాధనం కేటాయిస్తున్నారు. జిల్లా మొత్తంగా ఈ రేషన్ బియ్యాన్ని ప్రజలకు 98 శాతం మేర సక్రమంగా పంపిణీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో సంతృప్తి మాత్రం 75 శాతం మించడం లేదని సంబంధిత అధికారులపై, డిపో డీలర్లుపై ప్రభుత్వ వర్గాలు, సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. 98 శాతం సక్రమంగా పంపిణీ అవుతున్నా ఎందుకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం విడ్డూరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల కేవలం 90 శాతం మేర డీడీలు కట్టాలని డీలర్లను ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలో 83,000 కార్డుదారులకు బియ్యం ఇవ్వబోమని చెప్పినట్టే. అయితే ఉండిపోయిన 10 శాతం మేర నిరుపేదలే కచ్చితంగా ఉంటారని అధికారులు అనధికారికంగానే చెబుతున్నారు. ఎందుకంటే ఇంతో అంతో ఉన్నవారే ప్రభుత్వ పథకాలకు ముందుంటారన్నది నానుడి. మిగిలిన 10 శాతం 1,200 మెట్రిక్ టన్నులు పేదలకు చేరడం లేదు. దీంతో పేద కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరుపేదలకు అన్యాయం చేసినట్టేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ భ్రష్టుపట్టేలా టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు బియ్యం, పంచదారే.. జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు బియ్యం, పంచదార అందుతున్నాయి. గత ప్రభుత్వం ఎనిమిది సరుకులు సబ్సిడీల రూపంలో ధర తగ్గించి పేదలకు అందించేవి. దీని ద్వారా పేదలకు ఇంట్లోకి అవసరమైన ముఖ్య సరుకులు అందేవి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కో సరుకు తగ్గిస్తూ వచ్చింది. ఇందులో కేంద్రం కిరోసిన్ నిలిపేస్తే మిగిలిన సరుకులకు మాత్రం సీఎం చంద్రబాబు ప్రభుత్వం కత్తెర వేసింది. ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగలకు మాత్రం చంద్రబాబు డిజిటల్ బొమ్మ, పసుపు రంగు సంచులు పెట్టి మరీ ఉచితంగా సరుకులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇలా ప్రజల్లో సంతృప్తి పెరిగితే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగుంటందన్న సంగతి అధికారులకు తెలుసు. -
‘డబుల్’ లేట్!
గూడులేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నాలుగేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదు. మంజూరైన ఇళ్లలో పది శాతం కూడా నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. దీంతో పేదల సొంతింటి కళ.. కలగానే మిగిలిపోయింది. నిజామాబాద్‌అర్బన్ : అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తమ సొంతింటి కళ నెరవేరుతుందని పేదలు ఆనందించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం పదిశాతం ఇళ్లను కూడా నిర్మించలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ల లబ్ధిదారులకు కేటాయింపు జరిగినా.. 90 శాతం పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో అనేక మంది లబ్ధిదారులు ఇళ్లను పొందలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో 15,533 వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 8,375 ఇళ్లను మంజూరు చేయగా, కామారెడ్డి జిల్లాకు 7,158 వేల ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ కనీసం 10 శాతం ఇళ్లను సైతం నిర్మించలేకపోయారు. బాన్సువాడ నియోజక వర్గంలో 2,950 ఇళ్లును మంజూరు చేస్తే 2,195 ఇళ్ల నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వంద ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. జిల్లాలో ఈ ఒక్క చోటనే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. మంత్రి పోచారం సొంత నియోజకవర్గం కావడంతో ఆయన చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించి కొందరు లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాకపోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 6,454 ఇళ్లను మంజూరు చేశారు. 5,207 ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇందులో 3,765 ఇళ్లకు టెండర్లు పూర్తికాగా 1,442 ఇళ్లకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 1,086 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్‌లలో మంజూరైన ఇళ్లలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల టెండర్లు కూడా ఖరారు చేయలేదు. ఇళ్ల నిర్మాణాలు మందకొడిగానే కొనసాగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మొత్తం 1,150 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన 1,100 ఇళ్లు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 50 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 300 నిర్మాణాలు కొనసాగుతుండగా, పీఆర్‌కు సంబంధించినవి 50 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా నిర్మాణాలు చేపట్టలేదు. దుబ్బ ప్రాంతంలో నిర్మించనున్న ఇళ్లకు నేల సక్రమంగా లేకపోవడం, తరచూ నీరు రావడంతో నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బోధన్ నియోజక వర్గంలో పీఆర్ ఆధ్వర్యంలో 1,871 ఇళ్లు మంజూరు కాగా 500 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 1,622 ఇళ్లకుగాను 210 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. 50 ఇళ్లకు ఇంతవరకు టెండర్లు పిలువలేదు. ఆర్మూర్ నియోజక వర్గంలో 1,532 ఇళ్లకుగాను 180 ఇళ్లు మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మరో 865 ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇంకా 392 ఇళ్లకు ఇంత వరకు టెండర్లు ఖరారు కాలేదు. బాల్కొండ నియోజక వర్గంలో 800 ఇళ్లకుగాను టెండర్లు పూర్తయిన ఒక్కటి కూడా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో 1,715 ఇళ్లు మంజూరయితే 1,239 ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 893 ఇళ్లు మంజూరవగా 202 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. జుక్కల్ నియోజక వర్గంలో 1,600 ఇళ్లు మంజూరయితే 160 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ నియోజక వర్గంలో 2,950 ఇళ్లు మంజూరు కాగా.. 2,195 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. వంద ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించారు. నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో.. డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షకాలం మొదలైంది. దీనివల్ల పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు 16 ప్రాంతాల ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకవచ్చేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కేవలం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లాలన్న నిబంధన ఇబ్బందికరంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో నిర్మాణాలు ఉండడంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకురావడం ఇబ్బందికరంగా మారిందని, పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులు సైతం చెబుతున్నారు. మరో వైపు పనులు దక్కించుకున్న నిర్మాణదారులు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. పనులు దక్కించుకున్న వారిలో ప్రజాప్రతినిధులకు దగ్గరివారు, సంబంధీకులు ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణం వారికి గిట్టుబాటు కాకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి అధ్వానంగా ఉంది. టెండర్లు సైతం ఖరారు కాలేదు. అయినా చోట కూడా నిర్మాణాలు ప్రారంభంకాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారే తప్పా పనులు పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో చొరవతీసుకోవడం లేదని తెలుస్తోంది. పాలకులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పనులను త్వరగా పూర్తిచేయించి ఇళ్లు కేటాయించాలని నిరుపేదలు కోరుతున్నారు. పనులు కొనసాగుతున్నాయి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పనులకు కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడినా నిర్మాణాలు ఆపకుండా చూస్తున్నాం. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తాం. ఎలాంటి ఆటంకాలు ఉన్నా సమస్యలను పరిష్కరించి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. – హన్మంత్‌రావు, ఆర్అండ్బీ ఈఈ -
రజనీ కూడా ఎంజీఆర్ టైపేనా?
సాక్షి, చెన్నై : కొత్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజనీకాంత్ గత కొంత కాలంగా అందుకు అనువైన చిత్రాలలోనే నటిస్తున్నారు. తాజాగా అయన నటించిన చిత్రం ‘కాలా’ ఈ నెల ఏడవ తేదీన విడుదలవుతున్న విషయం తెల్సిందే. నాటి బాషా నుంచి నేటి కాలా వరకు ఏ చిత్రంలో రజనీకాంత్ నటించినా అందులో పేదల పక్షమే వహించారు. రాజకీయాల్లో రాణించాలనుకునే సినీ నటులకు సినిమా పేద ప్రేక్షకులే పట్టం గడతారు. నాడు ఎంజీ రామచంద్రన్ విషయంలో అదే జరిగింది. పేదలు, అణగారిన వర్గాల పెన్నిధిగా రజనీకాంత్ కన్నా ఆయనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. అలాంటి వారిని గెలిపించుకుంటే తమ అభ్యున్నతికి పాటు పడుతారని పేదవాడు ఆశిస్తాడు తప్పా. అది జరిగే పని కాదు. 1977లో తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎంజీ రామచంద్రన్ పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగినా పేద ప్రజలకు చేసిందేమీ లేదు. ఆయన అనుసరించిన పన్ను విధానం వల్ల ధనవంతులకు రాయితీ లభించగా, పేదలపై పన్ను భారం పడింది. ఆయన తీసుకొచ్చిన గూండాస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ లా చట్టాలు ప్రజా ఆందోళనలను, ప్రతిపక్షాన్ని అణచివేసేందుకే ఉపయోగపడ్డాయి. వార్తా పత్రికలను సెన్సార్ చేయడానికి ఓ చట్టం చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రతిష్టను కోరుకునే ఎంజీఆర్ సద్విమర్శలను కూడా అనుమతించేవారు కాదు. అందుకనే ఎంజీఆర్ మరణానంతరమే ఆయనపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఎంజీఆర్ దృక్పథాల గురించి ఎంఎస్ఎస్ పాండ్యన్ రాసిన ‘ఇమేజ్ ట్రాప్’ పుస్తకంలో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎంజీఆర్ లాగా కాకుండా ఏ పదవి లేనప్పుడే రజనీకాంత్‌పై విమర్శలు వస్తున్నాయి. నాడు ఎంజీఆర్లాగానే నేడు తమిళనాడులో రజనీకాంత్‌కు కూడా పేద, మధ్యతరగతి అభిమానులే ఎక్కువగా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఎంజీఆర్ లాగా కాకుండా పేదల పక్షపాతిగానే రజనీకాంత్ కొనసాగుతారా? చూడాలి! -
నిరుపేదకు నీడనిచ్చిన ‘ఫేస్బుక్’ మిత్రులు
ధర్మపురి: ఫేస్బుక్ మిత్రుల సాయంతో ఓ నిరుపేదకు నూతన గృహాన్ని నిర్మించగా.. జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం స్వచ్ఛంద సభ్యులు ధర్మపురి తహసీల్దార్ నవీన్‌కుమార్, సీఐ లక్ష్మీబాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు. వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన నిరుపేద అయిన కుంకునాల పోశవ్వ భర్త సూరయ్య గతంలో అనారోగ్యంతో మృతిచెందాడు. ఓ పూరిగుడిసెలో ఉంటూ.. కూలి పనిచేస్తూ.. ఇద్దరు కుమారులను చదివిస్తోంది. పోశవ్వ దీనస్థితిని ఫేస్బుక్ వేదికగా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ గత నెల పోస్ట్ చేశాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫేస్బుక్ మిత్రులు రూ.90 వేలు విరాళం అందించారు. స్థానికులంతా కలిసి మరో రూ.12వేలు అందించారు. పోశవ్వకు సొంతస్థలం లేకపోవడంతో సర్పంచ్ అందుర్థి గంగాధర్ పంచాయతీ తీర్మానంతో కొంత స్థలం కేటాయించారు. దీంతో రమేష్ నూతన గృహాన్ని నిర్మించి అన్ని వసతులు కల్పించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ పోశవ్వ కుమారుల చదువు ఖర్చుల కోసం రూ.ఐదువేలు సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ రవి, ఆర్ఐ గంగాధర్, సామాజిక సేవకులు బోనాల సునీత, పాల్తెపు భూమేశ్వర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వినోద, దహగం గణేష్, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులున్నారు. -
‘రిచ్ ట్యాక్స్’ వచ్చేస్తోంది....
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ తమ మేనిఫెస్ట్‌లతో సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ తీవ్ర వ్యూహారచన చేస్తోంది. దీనిలో భాగంగానే పేద ప్రజలను ఆకట్టుకోవడానికి అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నట్టు వెల్లడించింది. ‘రిచ్ ట్యాక్స్’ పేరుతో ఈ సెస్‌ను విధించబోతోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ 84వ ప్లీనరీలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ‘జాతీయ దారిద్య్ర నిర్మూలన ఫండ్’ ను తాము ఏర్పాటుచేయనున్నామని, తాము అధికారంలోకి వచ్చాక 1 శాతం అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నామని పేర్కొంది. ఈ ఫండ్‌ను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు, ఇతర దారిద్య్ర దిగువనున్న కుటుంబాలకు విద్యా స్కాలర్షిప్లను అందించనున్నామని తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఓ రెజుల్యూషన్‌ను తమ ప్లీనరీలో ప్రవేశపెట్టారు.దేశంలో పేరుకుపోయిన అసమానతలను గుర్తించాల్సినవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తగ్గుతున్న సామాజిక సంక్షేమ పథకాల ప్రాముఖ్యంపై విమర్శలు గుప్పించింది. పెరుగుతున్న ఆదాయ అసమానతలపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అని బీజేపీ వాగ్ధానం చేసిందని, కానీ దానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ పాలనలో 1 శాతం ధనికుల సంపద 73 శాతం పెరిగిందని, కిందనున్న జనాభా సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగినట్టు తెలిపింది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న డిమానిటైజేషన్ ప్రక్రియతో, ప్రజలు తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక, గంటల పాటు క్యూలైన్లో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంది. పెద్ద నోట్లను మార్చుకోవడానికి క్యూలైన్లో నిల్చుని 100కి పైగా ప్రజలు మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. -
గూడు కూల్చి.. రోడ్డుకీడ్చి!
మహబూబ్‌నగర్ రూరల్: వారంతా రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు.. వారి స్థితిగతులను పరిశీలించి గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆ పేదలంతా ఎంతో ఆశపడ్డారు. అయితే వారికి కేటాయించిన స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు కేటాయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ పోతాయోననే అభద్రతాభావంతో ఇటీవల గుడిసెలు వేసుకోవడంతో ఇళ్లుకుట్టుకుని స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని మహబూబ్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు ఆదివారం బలవంతంగా తొలగించారు.. 1400 మందికి స్థలాల కేటాయింపు 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్ పట్టణం క్రిష్టియన్‌పల్లి పంచాయతీ శివారులోని ఆదర్శనగర్‌లో 523 సర్వేనంబర్‌లో సుమారు 1400మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించింది. స్థలాలను పొందినవారిలో చాలామంది సొంతిళ్లు నిర్మించుకోలేదు. ఈ స్థలంలోనే డబుల్ బెడ్రూమ్ల కోసం ఇటీవల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ‘జీ’ ప్లస్– వన్ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు. తమకు కేటాయించిన స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించొద్దని లబ్ధిదారులు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం బలవంతంగా అక్కడినుంచి తొలగిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది చేత తొలగించారు. పట్టణంలో ఎన్నో ప్రభుత్వ భూములు ఒకపక్క కబ్జాకు గురవుతున్నా అధికారులు వాటినేమి పట్టించుకోకుండా నిరుపేదలపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ప్రవర్తించిన తీరుపై నిరుపేదలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరుపేదలకు అండగా ఉంటామని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ముందుకొచ్చారు. అధికారుల చర్యలను ఖండించారు. పోలీసులు దౌర్జన్యం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంటిస్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో గుంతలు ఉంటే రూ.లక్షతో చదును చేసుకున్నాం. మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ముగ్గురు పిల్లలను పోషించడానికి ఇబ్బందిగా ఉన్నా నెలకు రూ.3500కు ఇంటిని అద్దె తీసుకుని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ల పేరిట మాకు ఇచ్చిన స్థలాన్ని అధికారులు లాక్కుంటున్నారు. మాకు ఇచ్చిన స్థలంలో గుడిసె వేసుకుంటే పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు. – సంగీత, బాధితురాలు, క్రిష్టియన్‌పల్లి అద్దె కట్టలేకపోతున్నాం.. మాకు సొంతిల్లు లేక నెలకు రూ.3వేలు చెల్లించి అద్దెఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గుడిసైనా వేసుకుందామనుకుంటే అధికారులు బలవంతంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. మాకు ఇచ్చిన స్థలానికి బదులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తే సంతోషిస్తాం. ఏదీ ఇవ్వకుండా స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కుంటే ఎక్కడ ఉండాలి. ప్రభుత్వం డబుల్ బెడ్రూంల పేరిట మా లాంటి వారికి ఇచ్చిన స్థలాలను లాక్కోవడం సరికాదు. మాకు కచ్చితమైన హామీ ఇచ్చేంతవరకు స్థలాన్ని వదిలిపెట్టేది లేదు. –పద్మ, బాధితురాలు, క్రిష్టియన్‌పల్లి పేదలకు న్యాయం చేస్తాం ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా అన్యాయం చేయం. కాకపోతే వారికిచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలు తమకు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఇందులో నిరుపేదలు ఎవరి మాటలను పట్టించుకోకూడదు. రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదు. – ఎంవీ ప్రభాకర్‌రావు, తహసీల్దార్, అర్బన్ మండలం -
పరువు తీసుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే
సాక్షి, లక్నో : సాయం చేసేందుకు వెళ్లి వేరే విషయంపై ఫోకస్ చేసి ఇద్దరు బీజేపీ నేతలు పరువు తీసుకున్నారు. అది కూడా వారు చిన్నాచితక చోటామోటా నేతలు కాదు.. ఒకరు ఎంపీ కాగా మరొకరు ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధులు ఇలాగేనా వ్యవహరించేదని, పైగా ఒక పార్టీ వారికి చెందిన వారే ఇలా చేస్తే మిగితా పార్టీల వారు ఏమనుకుంటారో తెలియదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రేఖావర్మ, మరో మహిళా ఎమ్మెల్యే తమ మద్దతుదారులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసేందుకు సీతాపూర్ జిల్లాకు వెళ్లారు. పెద్దపెద్ద అధికార ప్రతినిధులు హాజరవడంతోపాటు వారి మద్దతుదారులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా విపరీతమైన చలికారణంగా పలువురు రోడ్డుపక్కన ఉండేవారు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వారికి దుప్పట్ల సాయం చేసేందుకు వెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన వారు దుప్పట్లు పంచే క్రమంలో ఫొటో విషయంలో పంచాయితీ పెట్టున్నారు. తానంటే తాను ముందు ఫొటో దిగాలంటూ గొడవకు దిగారు. అందరూ చూస్తున్నారనే సోయి మరిచిపోయి ఆగ్రహంతో ఊగిపోతూ ఒకరినొకరు తోసుకున్నారు. ఎంపీ రేఖా వర్మ ఓ వ్యక్తిపై చేయి చేసుకోగా మరో మహిళా ఎమ్మెల్యే తన చెప్పు తీసుకొని ఎంపీ మద్దతుదారుపై దాడి చేసింది. ఇలా ఆ కార్యక్రమం రచ్చరచ్చయింది. చివరకు అక్కడికి జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు బాసు చేరుకొని గొడవ సదర్దుమణిగేలా చేశారు. అయితే, ఈ వీడియో మాత్రం బాగా హల్చల్ చేస్తోంది. -
మీకెందుకు ప్రభుత్వ పథకాలు!?
బొబ్బిలి: జిల్లాలో ఈ రెండు కుటుంబాలే కాదు...వేల సంఖ్యలో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులంటూ సుమారు 300 మందికి, భూములున్నాయని 3500 మందికి, వాహనాలు, ఇతర ఆస్తులున్నాయని మరో 11వేల మందికి కార్డులను తొలగించారు. వీరిలో కొందరికి పునరుద్ధరించగా సుమారు 4,600 మంది కార్డులు, పింఛన్ల కోసం తిరుగుతునే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛనుదారులు, రేషన్‌కార్డు దారుల్లో నిజంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా రేషన్ కార్డులు జారీ చేశారు. మరికొంత మందికి అసలేమీ లేకుండానే తొలగించారు. సర్వే సిబ్బంది కొంత, అధికారుల నిర్వాకం మరికొంత! గతంలో జరిగిన పల్స్ సర్వే ప్రకారం నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలకు పెద్ద ఎత్తున ఆస్తులున్నట్టు నమోదు జరిగింది. ఇందులో కార్లు, భవనాలు, ఇతర ఆస్తులున్నట్టు నమోదు చేసేశారు. ఇవో రకం తప్పిదాలయితే భూముల తప్పుల తడకల్లో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు మరికొన్ని! దీని వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న ప్రయోజనాలే కాకుండా పలు సంక్షేమ పథకాలకు కూడా దూరమవుతున్నారు. ఈ చిత్రంలోని మహిళ బాడంగి మండలం వీరసాగరానికి చెందిన డోకల సింహాచలమమ్మ. రోజు వారి కూలి చేసుకునే ఈ కడుపేదకు పింఛను లేదు. భర్త అప్పలనాయుడు చనిపోయి ఏడాదైంది. పెళ్లయిన కొడుకు కోడలు ఆదుకుంటారనుకుంటే కోడలు చనిపోయింది. కుమారుడు ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపై వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఈ వయసులో ఇద్దరు మనవలను పెంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వితంతు పింఛను ఇవ్వాలని కోరితే మీకు 20 ఎకరాల పల్లం మాగాణి ఉందని రికార్డుల్లో నమోదై ఉండటంతో పింఛను ఇవ్వడం కుదరదని చెప్పేశారు అధికారులు. మనవల్ని చూసి కుమిలిపోతూ కూలి పనికి వెళ్తోంది. ఆ డబ్బులతో పిల్లలకో ముద్ద పెట్టి తనో ముద్ద తింటోంది. కూలి పని లేని రోజు ఆ ముద్దా లేదు. ఈ చిత్రంలోని కుటుంబాన్ని చూ డండి! కుటుంబ యజమాని పేరు బంకురు శంకరరావు, ఆటో డ్రైవర్. రోజూ వాహనానికి కట్టాల్సిన ఫైనాన్స్, ఆయిల్ డబ్బులు, వడ్డీ డబ్బులు తీసేస్తే వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే భార్య నాగమణి, కుమారుడు గౌతమ్‌లను పెంచుకుంటున్నాడు. రేషన్ కార్డు కోసం గతంలో దరఖాస్తు చేసుకుంటే ఇచ్చారు. కానీ ఒక్క బియ్యం గింజయినా ఇవ్వక ముందే ఇతను ప్రభుత్వ ఉద్యోగి అని పేర్కొంటూ రేషన్ కార్డు డిలీట్ చేశారు. ఏడాదిగా ఇతను తహసీల్దార్ కార్యాలయానికి, కలెక్టరాఫీసుకు తిరుగుతునే ఉన్నాడు. కానీ రేషన్ కార్డు మంజూరు కాలేదు. జనం తిప్పలు ! జిల్లాలోని ఇటువంటి తప్పుడు ఆన్లైన్ నమోదుల కారణంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరమవుతుంటే మరో పక్క జన్మభూమి కమిటీల పరంగా అర్హులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జన్మభూమి కమిటీల చేతుల్లో ఓ వైపు నలిగిపోతూ ప్రభుత్వ పథకాలంటే అర్రులు చాసేలా చూస్తున్న జనం మరో పక్క అధికారులు, ప్రభుత్వ సిబ్బంది తప్పుడు నమోదు కారణంగా సాఫ్ట్వేర్ స్కానింగ్‌లో అనర్హులైపోతున్నారు. వాస్తవానికి వారికి తిండి బట్టాలేని వారైనా ఐశ్వర్యవంతులుగా చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలను అందించాల్సింది పోయి ఇలా అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకూ సబబని జిల్లాలోని పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
మళ్లీ ‘మైక్రో’.. గద్దలు!
-
పేదల నుంచి పార్టీ ఫండ్
నటుడు కమల్‌హాసన్ వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ స్థాపన కోసం పేదల నుంచి నిధులు సమీ కరిస్తానని నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన తాను త్వరలో పార్టీని ప్రకటిస్తానని అన్నారు. ప్రముఖ తమిళ దినపత్రిక ‘ది హిందూ’ చెన్నైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఒక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వక్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధా నాలిచ్చారు. ‘పేదల జీవన పరిస్థితులు మె రుగుపడటం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా. అది గాం«ధేయవాదమా, మార్క్సి జమా అనేది ముఖ్యం కాదు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ నడిపేందుకు నిధులను ‘పేదల నుంచే’ సమకూర్చుకుంటాను’ అని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీకాంత్‌ను కూడా కలుస్తానని, వస్తానంటే ఆయన్ని కూడా కలుపుకుపోతానని తెలిపారు. -
నిరుపేదకు పెద్ద జబ్బు
► రెండు కిడ్నీలు ఫెయిల్ ► ఆపరేషన్‌కు రూ.4లక్షలు అవుతుందన్న వైద్యులు ► భర్తను కాపాడాలని భార్య వేడుకోలు మదనపల్లె టౌన్: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. ఈ క్రమంలో కుటుంబ పెద్దకు అకస్మాత్తుగా పెద్ద జబ్బు రావడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లె పంచాయతీ చిన్నమొరవపల్లెకు చెందిన ఉత్తన్న కుమారుడు కపిలి వెంకటరమణ(32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. వివాహం చేసుకుని బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తూ భార్య, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చూపించగా రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేస్తే ఆపరేషన్‌కు రూ.4 లక్షలు ఖర్చువుతుందని తెలిపారు. నిరుపేదలమైన తాము అంత డబ్బు ఖర్చు పెట్టలేమని, దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని భార్య అంజలమ్మ కోరుతోంది. సాయం చేయాల్సిన వారు 957319 6473కు సంప్రదించాలని కోరారు. -
తలైవా.. పేదల ముఖ్యమంత్రి!
చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆయన అభిమానుల ఆకాంక్ష, ఆయన రాజకీయ తెరంగేట్రం ఉంటుందా? లేదా? అన్న మీమాంస రాజకీయ వర్గాల్లోనూ కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. మరి కొందరైతే రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా రజనీ అభిమానులు మాత్రం చాలా ఖుషీ అయ్యిపోతున్నారు. అందుకు కారణం ఇటీవల ఐదు రోజుల పాటు అభిమానులను కలుసుకున్న రజనీకాంత్ సమయం ఆసన్నమైనప్పుడు పోరుకు సిద్ధం అవుదాం అన్న ఆయన ఒకే ఒక్క పిలుపు అభిమానుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. అంతే కాదు తమ కథానాయకుడు తమిళనాడు నాయకుడవడం తథ్యం అనే నిర్ణయానికి వచ్చేసిన కొందరు రజనీ వీరాభిమానులు తమకు మంత్రి పదవులు వద్దు, ఎంఎల్ఏ, ఎంపీ పదవులు వద్దు, కార్యకర్తలన్న పదవే చాలు. ‘తలైవా మీరు రాజకీయాల్లోకి రండి, పేదల ముఖ్యమంత్రి..’ అంటూ వారు వేసిన పోస్టర్లు రాష్ట్ర ప్రధాన నగరాల్లో వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. -
పేదల వైద్యానికి భరోసా ఏదీ?
∙గుండెపోటుతో వృద్ధురాలు విలవిల ∙ఆస్పత్రుల్లో ఎదురైన నిరాశ పేదల ఆరోగ్యానికి భద్రత డొల్లగా మారింది. వైఎస్ జమానాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు విస్తృతంగా కార్పొరేట్ వైద్యం అందింది. నేటి పాలకులు ఎన్టీఆర్ భరోసాగా ఆ పథకం పేరు మార్చారు. పేరుతో పాటే దాని రూటూ మారింది. కార్పొరేట్ వైద్యం పేదలకు చుక్కలను చూపుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడం లేదు. దానికి ప్రత్యక్ష సాక్ష ్యమే ఈ వృద్ధురాలు. చింతూరు : ఆర్థిక పరిస్థితి సరిగా లేని ఓ వృద్ధురాలికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ప్రభుత్వాస్పత్రులకు వెళితే ఆమెకు వైద్యం అందలేదు. ఎన్టీఆర్ భరోసా లభిస్తుందేమో అని కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే ముందుగా వేలాది రూపాయలు డిపాజిట్‌గా కట్టమన్నారు. అంత స్థోమత లేక ఆమె కుమారులు నిరాశతో ఎటువంటి వైద్యమూ చేయించకుండానే ఆమెను ఇంటికి తీసుకుపోయారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. చింతూరులోని ఎస్టీ కాలనీకి చెందిన తమ్మినేడి అమ్మాజీకి ఈనెల 16వ తేదీన గుండెపోటు వచ్చింది. దాంతో ఆమెను కుమారులు వెంకటరామయ్య, జగ¯ŒSమోహ¯ŒSరావు భద్రాచలం ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ డబ్బులు ఎక్కువవుతాయని చెప్పడంతో అదే రోజు చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రాజమహేంద్రవరం తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా కార్డులు ఉండడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అమ్మాజీని పరిశీలించిన వైద్యులు నాలుగు రోజులు అబ్జర్వేష¯ŒSలో ఉంచాలని. దానికి రూ. 33 వేలు ఖర్చవుతుందని, అనంతరం స్టెంట్ లేదా ఆపరేష¯ŒS చేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. తమవద్ద అంత సొమ్ము లేకపోవడంతో వారు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ 36 గంటలపాటు ఉంచినా తమ తల్లికి సరైన చికిత్స అందించలేదని, ప్రశ్నిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వెంకట్రామయ్య, జVýæన్మోహన్ రావు వాపోయారు. చివరకు తమ తల్లిని కాకినాడ లేదా గుంటూరు తీసుకు వెళ్లాలని ప్రభుత్వాస్పత్రి వైద్యులు సూచించారని వారు తెలిపారు. దానికి తాము సిద్ధమై అంబులెన్సు కోసం ఎదురు చూడగా 18 గంటలైనా రాకపోవడంతో చేసేదిలేక తమ తల్లికి ఎటువంటి వైద్యం చేయించకుండానే చింతూరు తీసుకొచ్చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా కార్డులు ఉన్నప్పటికీ తమ తల్లికి వైద్యం అందలేదని వారు వాపోయారు. ఆర్థికస్థోమత లేనందునే తమ తల్లికి వైద్యం అందించలేక పోతున్నామని, అధికారులు స్పందించి ఆమెకు వైద్యం అందించాలని వారు వేడుకుంటున్నారు. -
పునరావాసం కల్పించకుంటే పోరాటమే
నెల్లూరు(మినీబైపాస్): పేదలకు పునరావాసం కల్పిం చకుండా అక్రమణల పేరుతో నివాసాలను తొలగిస్తే వారితో కలిసి పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని భక్తవత్సలనగర్, ఉమ్మారెడ్డిగుంట ప్రాంతా ల్లో ఆదివారం ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటుండగా ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని కోటంరెడ్డికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలు సైతం ఉన్నాయని, కూలి పనులు చేసుకుని తిండి తినకుండా గూడు నిర్మించుకున్నామని, ఉన్న ఫలంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడకు వెళ్లాని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రూరల్ ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో ఇష్టానుసారంగా మార్కింగ్ చేపట్టి ఉన్నారన్నారు. రైల్వే ట్రాక్ అవసరంలేని చోట మార్కింగ్ ఇచ్చి ఉన్నారని, పునరావా సం కల్పించకుండా ఖాళీ చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పరిహారం, ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజ ల పక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ఇన్చార్జి మొయిళ్ల సురేష్‌రెడ్డి, 21 వడివిజన్ ఇన్చార్జి చేజర్ల మహేష్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు కట్టా వెంకటరమణయ్య, నాయకుల వెంగళ్‌రెడ్డి, రాజారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భాస్కర్, అమీర్జాన్, కృష్ణ, రాజేశ్వరమ్మ, మాదా బాబు, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంజీవని ఆరోగ్యశ్రీ
► ప్రారంభమై దశాబ్ధం పూర్తి ► వైఎస్సార్ చలువతో లక్షలాది పేదలకు లబ్ధి వనపర్తి: దశాబ్ధలుగా కార్పెరేట్ వైద్యం చేయించుకోలేక తమ విధిరాత అని రోదిస్తున్న ప్రజానీకానికి పదేళ్ల కిందట వైఎస్ రూపంలో అదృష్టం తలుపుతట్టినట్లయ్యింది. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి నేటితో పదేళ్లు పూర్తియింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నామని ఏ పేదవాడు బాధపడకూడదనే ధృఢ సంకల్పంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి పురుడు పోశారు. ఎన్నో వ్యాధులకు డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేక అర్ధాంతరంగా తనువులు చాలించే పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలిచింది. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్యసేవలు పొంది ఆరోగ్యశ్రీ పథకంతో తమకు పునర్జన్మ లభించిందని నేటికీ వైఎస్సార్‌ను స్మరించుకునే వాళ్లున్నారు. చరిత్రాత్మకం దేశ చరిత్రలోనే అరుదైన రికార్డును ఆరోగ్యశ్రీ పథకం సొంతం చేసుకుంది. 2007మార్చి 31న ఉమ్మడి తెలుగు రాష్ట్ర సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఈ పథకంలో 948 రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలు అందించేలా రూపకల్పన చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు జిల్లా సమన్వయకర్త, జిల్లా మేనేజర్, అడ్మిస్ట్రేషన్ ఆఫీసర్‌తో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 130మంది పథకంలో పనిచేస్తున్నారు. వీరదందరూ ఔట్‌సోరి్సంగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం లక్షా 79వేల 442 మంది వైద్యసేవలు పొందారు. ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 474కోట్ల 53 లక్షల 66 వేల 523 కోట్లు ఖర్చుచేసింది. 2007లో మార్చి 31నుంచి 2014 జూన్ 1వరకు లక్షా 2వేల,551 లక్ష మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం రూ. ఖర్చు రూ. 271కోట్ల 70లక్షల 27వేల979 కోట్లు వెచ్చించి. నూతన రాష్ట్రంలో జూన్ 2 నుంచి 2017 మార్చి 30వరకు 76,891లబి్ధపొందగా, ప్రభుత్వం ఖర్చు రూ. 202కోట్ల 83లక్షలు 38వేల 544కోట్లు ఖర్చుచేసింది. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ ఆరోగ్య శ్రీ పథకంలో ప్రధానంగా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వ్యాధుల్లో పదేళ్ల నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 42,348మంది చికిత్సా పొందగా, రెండవ స్థానంలో జాన్టోయరీనరి సర్జరీ 23539మంది, తర్వాత స్థానంలో పాలీట్రామా 22,368మంది చికిత్సా చేయించుకున్నారు. అతి తక్కువగా ఆర్గన్ ట్రాన్స్లాన్టేషన్ ఇప్పటి వరకు ఇద్దరూ ఉపయోగించుకొనగా, రెండో స్థానంలో డర్మటాలాజీకి చెందిన వ్యాధిగ్రస్తులు 42మంది చికిత్స పొందారు. -
బినామీలు బలే!
► మద్యం టెండర్లల్లో భారీగా పేదలు ► కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు ► రేషన్ కార్డు, ఇతర సంక్షేమ పథకాలు రద్దయ్యే అవకాశం ప్రొద్దుటూరు క్రైం: మద్యం టెండర్లలో ఈసారి బినామీల హవా ఎక్కువగా ఉంది. చాలా మంది మద్యం వ్యాపారులు తమ బినామీల పేర్ల మీద టెండర్లు వేయించారు. భారీ ఎత్తున పోటీ నెలకొనడంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు ఎలాగైనా తమ షాపులను నిలబెట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలోపనిగా తమ వద్ద పనిచేసే పనివార్ల పేరుతో దరఖాస్తులు భారీగా దాఖలు చేయించారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచనుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలో 255 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 29వ తేదీ సాయంత్రం వరకు 1,900 దరఖాస్తులు వచ్చాయి. 30వ తేదీ (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇచ్చిన గడువును మరో మూడు గంటలుపెంచి 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో గడువులోగా 3,654 దరఖాస్తులు అందాయి. 31 మధ్యాహ్నం 2 గంటల నుంచి జెడ్పీ ఆవరణంలో కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు: ఈసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధన వస్తుందని పసిగట్టిన కొందరు వ్యాపారులు తమ అనుమాయులకు పాన్‌కార్డులను ఇప్పించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 12-15 రోజుల్లోనే పాన్‌కార్డు జారీ చేస్తున్నారు. వీరిలో చాలామంది కూలి పనికి వెళ్తున్న వారు ఉన్నట్లు సమాచారం. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే వారు ఈఎండీ కింద రూ.3 లక్షలు డీడీ తీయాల్సి ఉంది. ఒకరి పేరు మీదనే ఎక్కువ మొత్తంలో డీడీ తీస్తే ఐటీశాఖతో సమస్య వస్తుందని భావించిన మద్యం వ్యాపారులు తమ ఇళ్లల్లో పనిచేసే వారు, బంధువుల పేరు మీద దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వ్యాపారులు పెద్దఎత్తున వస్తున్నారు. వీరిలో కూలి పనికి వెళ్లేవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో వీరు ఆదాయం చూపించడంతో భవిష్యత్తులో వారి రేషన్‌కార్డు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈపాస్‌తో పాటు ఆధార్‌కార్డు కూడా నమోదు చేస్తుండటంతో వారికి దక్కే ప్రభుత్వ లబ్ధి పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలియడంతో బినామీలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిపై ఐటీ అధికారులు కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో వారి చిట్టా బయటికి తీసే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు: ఒక్క ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలో సుమారు 105 మద్యం షాపులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు ఉన్న మద్యం షాపులను తొలగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన మద్యం విధానంతో టెండర్లకు శ్రీకారం చుట్టింది. 105 షాపుల్లో 90 శాతం 500 మీటర్లలోపు ఉన్నాయి. జిల్లాలో ప్రొద్దుటూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులకు మంచి డిమాండు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 22 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు సుమారు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాజుపాళెం, చాపాడు మండలాల్లోని దుకాణాలకు ఎక్కువ డిమాండు ఉన్నట్లు సమాచారం. 22 షాపులకు 450 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. -
పేదలకు అండగా స్వేరోస్
దుగ్గొండి (నర్సంపేట) : నిరుపేదలకు అండగా స్వేరోస్ వెంట ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అ«ధ్యక్షుడు రాజన్న అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వరంగల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్యాంకుమార్ అధ్యక్షతన స్వేరోస్ భీం దీక్షా శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నిరుపేద మామునూరి మల్లయ్య ఇంటి నిర్మాణాన్ని సంస్థ విరాళాలతో రాజన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులను ఒక్కటిగా చేసే స్వేరోస్ సంస్థ ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో పేద విద్యార్థులు, పేద కుటుంబాలకు తోచిన సాహాయాన్ని దాతల సహకారంతో అందిస్తామని తెలిపారు. నిరుపేద ఇంటి నిర్మాణానికి చేయూతనందించిన శ్యాంకుమార్‌ను అభినందించారు. గ్రామాల్లో దళిత నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఆర్ఎస్.ప్రవీణ్‌కుమా ర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్వేరో పనిచేసి మంచి ఫలితాలు సాధించా లని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాదారపు రవి, శ్యామలపట్టాభి, చక్రి, శివ, శ్యాం, లెనిన్, ప్రవీణ్, భరత్, ప్రసాద్, యాకూబ్ పాల్గొన్నారు. -
అక్కడ పేదోళ్ల కష్టాలు వినే మార్గాలన్నీ క్లోజ్
-
ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నారంటే...
బెంగళూరు: కాసుల కక్కుర్తి కోసం శవాలకు చికిత్సలు చేసే కార్పొరేట్ ఆస్పత్రులున్న నేటి సమాజంలో డాక్టర్ అరవింద్ భటేజా లాంటి డాక్టర్లను చూడలేం, కనీసం ఉంటారని ఊహించలేం. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన న్యూరోసర్జన్లలో ఒకరైన భటేజా 2013 నుంచి 2016 డిసెంబర్ వరకు దాదాపు మూడువేల వెన్నముక సర్జరీలు చేయగా, వాటిలో 97 ఉచితంగా లేదా నామ మాత్రపు ఛార్జీలపై చేశారు. పేదప్రజలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం కోసం ఆయన వందల కిలోమీటర్లు సైకిల్ ట్రెక్కింగ్ చేసి మరీ విరాళాలు సేకరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి రెండింటిలోనే ఆయనకు అమితాసక్తి. ఒకటి సైక్లింగ్‌లో ఛాంపియన్ కావాలన్నది. మరోటి డాక్టరు కావాలన్నది. డాక్టర్ డిగ్రీ కోసం కొంతకాలం సైకిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. న్యూరోసర్జన్ కోర్స్ పూర్తయ్యాక ఆయన చనిపోయిన తన తల్లి సీతా భటేజా (ఆమె కూడా డాక్టరే) పేరిట స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సైక్లింగ్‌పై ఉన్న ఆసక్తితో ప్రతి ఏటా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ 800 కిలోమీటర్లు సాగే 'వెటరన్ నీలగిరి టూర్'లో 2009 నుంచి ఆయన పాల్గొంటున్నారు. దాదాపు ప్రతి ఏటా ఆయనకే ఛాంపియన్ షిప్ వస్తోంది. 2013 నుంచి టూర్‌కు స్పాన్సర్షిప్ పార్టనర్‌గా ఆయన ఆస్పత్రి ఉండడంతో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయనకు ఉచిత స్లాట్ లభించింది. ఈ టూర్ ద్వారా విరాళాలు సేకరించి పేదల వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదన్న ఆలోచన రావడంతో ఆయన 2013 నుంచి నీలగిరి టూర్లో ఆస్పత్రి తరఫున విరాళాలు సేకరిస్తున్నారు. 2013లో లక్షన్నర రూపాయలు విరాళాలు రాగా, 2014లో ఆయన తరఫున ఆయన సోదరుడు వివేక్ ఈ టూర్లో పాల్గొని మూడున్నర లక్షల రూపాయలు సేకరించారు. 2015లో టూర్లో మళ్లీ అరవింద్ భటేజానే పాల్గొని ఛాంపియన్‌షిప్‌తోపాటు పది లక్షల రూపాయల విరాళాలను సాధించారు. 2016లోనూ నీలగిరి టూర్లో ఆయన ఛాంపియన్షిప్ సాధించడమే కాకుండా పదిలక్షల రూపాయల కన్నా ఎక్కువగా విరాళాలు సేకరించారు. ఈసారి ఛాంపియన్షిప్ సాధించిన తన సైకిల్ని కూడా వేలంవేసి వచ్చిన సొమ్మును ఆస్పత్రికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన చెప్పారు. వారానికి ఎనిమిది నుంచి పది గంటలు యువతకు సైక్లింగ్‌లో శిక్షణ ఇస్తానని, ఎక్కువగా వారాంతంలోనే ఆ శిక్షణ ఉంటుందని చెప్పారు. సైక్లింగ్ చేసినా తన ప్రధాన వృత్తి ఎప్పటికీ వైద్యమేనని ఆయన అన్నారు. ఉచితంగా లేదా సబ్సిడీపై పేదలకు చికిత్స చేసిన వారికి, డబ్బు చెల్లించే వారికి ఇచ్చే వైద్యంలో ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. జీవితంలో రెండింటి పట్ల ప్రేమతో వ్యక్తిగత జీవితం పూర్తిగా కరవైందని, అయినా ఇదిచ్చే తృప్తికన్నా జీవితంలో మరింకేమీ కావాలంటూ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. -
మరో కీలక ఆర్ధిక దిశగా మోదీ సర్కార్?
-
జగన్ జన్మదినం సందర్భంగా పేదలకు దుప్పట్లు
-
పది రోజులాగితే ఖాతాలోకి రూ.15 లక్షలు వస్తాయా?
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకొని నేటికి దాదాపు 40 రోజులవుతోంది. తన నిర్ణయం వల్ల తలెత్తిన ఇబ్బందులను ఒక్క యాభై రోజులు భరించమని దేశ ప్రజలు మోదీ చేసిన విజ్ఞప్తిలో కూడా మిగిలింది ఇంకా పది రోజులే. నేటికి బ్యాంకుల ముందు ప్రజల క్యూలూ తగ్గలేదు. ఏటీఎంలు పనిచేయడం లేదు. బ్యాంకుల వద్ద అసహనం భరించలేక ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని చితకబాదుతున్న సంఘటనలు కూడా వింటున్నాం. పింఛను డబ్బుల కోసం ముగ్గుబుట్ట ముసలవ్వలు బ్యాంకుల వద్దే తెల్లార్లు పడిగాపులు పడుతున్నా దృశ్యాలను చూస్తున్నాం. ఇన్ని బాధలు, కష్టాలు భరిస్తూ కూడా నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పేదలు, బడుగువర్గాలు, సగటు జీవులు ఎందుకు విమర్శంచడం లేదు? రాబిడ్ హుడ్లాగా మోదీ పెద్దోళ్లను దోచి పేదోళ్లకు పెడతారని ఆశిస్తున్నారా? ఆయన హామీ ఇచ్చినట్లుగా జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంక్‌ల ఖాతాల్లోకి 15 లక్షల రూపాయలు వచ్చి పడతాయని భ్రమ పడుతున్నారా? మోదీ చెప్పినట్లుగా ఇంకా పది రోజులే కాదు, మరో పాతిక రోజులు కష్టనష్టాలను భరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నా బడుగు జీవులు కూడా దేశంలో ఎంతమందో ఉన్నారు. ఎందుకు? మొదట దేశభక్తి, జాతీయవాద ప్రభావమని భావించారు. అదంతా రాజకీయ వాదమే. వివిధ మీడియాల ముందు పేదలు, బడుగు జీవులు, సగటు భారతీయులు, మధ్యతరగతి ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిశీలిస్తే ఇది ఒకరకమైన మానసిక పరిస్థితిని సూచిస్తోంది. ధనవంతుల మీద పేదవాళ్లకున్న ఆక్రోశంగా కనిపిస్తోంది. తామింత కాలం పడిన ఇబ్బందులకు కనీసం ఒక్కసారైనా ధనవంతుడు ఇబ్బంది పడాలన్న ఆక్రందన అనిపిస్తోంది. తమ కష్టాలకు ఫలితం తమకు దక్కకపోయినా మిద్దెల్లో నివసించే పెద్దలకు కొంతైన బుద్ధి చెప్పాలనే గద్దింపు గోచరిస్తోంది. ఎప్పుడూ హిందూ, ముస్లింలు అనే అంశంపై చర్చ జరిగే ఈ దేశంలో మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల మొట్టమొదటిసారిగా ప్రజల మధ్య పేద, ధనిక అనే చర్చ జరుగుతోంది. ధనిక, పేద మధ్య వ్యత్యాసం బాగా పెరిగి పోవడమే ఈ చర్చకు దారి తీసిందేమో? ఓ సగటు జీవి వెయ్యి సంవత్సరాలు కష్టపడితే వచ్చే ఆదాయానికి సమానమైన మొత్తాన్ని ఓ ధనవంతుడు నేడు ఓ కారు కొనడానికి ఖర్చు పెడుతున్నారు. అంటే ధనవంతుల పట్ల వారికి ఎంత ఆక్రోశం పెరుగుతుండాలి. ‘మేము 15, 20 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు కుటుంబం ఆ రోజు అవసరాలకే సరిపోతుంది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు. ఇకముందు వస్తుందన్న ఆశలేదు. మోదీ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలివ్వాలి. ముఖ్యంగా నల్ల డబ్బున్న వారిని జైలుకు పంపాలన్న కసి మాలో ఎంతో ఉంది. రేపు ఇందులో మోదీ విఫలమైనా మాకొచ్చే నష్టమేమి లేదు. మా జీవితాలు ఇలాగే కొనసాగుతాయి’ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఢిల్లీలోని కొంత మంది ఆటో డ్రైవర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ‘నేను 15 ఏళ్లుగా ఓ పెద్ద మనిషి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఇన్నేళ్లకు నా జీతం 15 వేల రూపాయలకు చేరుకుంది. డబ్బులు పెంచుమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. అడిగిన రోజున ఇంటికెళ్లిపో, మరోకడు వస్తాడని బెదిరిస్తారు. అది కూడా నిజమే. కార్లలో వాళ్ల కులుకులను, షికార్లను చూస్తుంటే కడుపు మండిపోతోంది. మోదీ నిర్ణయం వల్ల వాళ్లకు ఏదైనా కావాలి’ ఇది మరో మీడియా ముందు కారు డ్రైవర్ ఆవేదన. పేదల్లో ఉండే ఇలాంటి సైక్‌ను ‘ష్రేడన్ ఫియూడ్’ అనే జర్మనీ పదంతో పోల్చవచ్చు. మరో వ్యక్తి సొమ్ము కోల్పోతే ఒక వ్యక్తి ఆనందించం ఈ పదానికి అర్థం. దీన్ని మన భారతీయ మానసిన శాస్త్రవేత్తలు ‘మూమెంటరసీ ఫ్లెజర్’ అని పిలుస్తారు. అది అప్పటికప్పుడు కలిగే క్షణికానందం లాంటిది. ఇలాంటి వారితో పాటు తమకేదో మేలు జరుగుతుందన్న ఆశిస్తున్నవారు, రాజకీయంగా మోదీని సమర్పిస్తున్నవారు కూడా ఎక్కువే ఉన్నారు. మోదీ నిర్ణయం ‘మిస్‌ఫైర్’ అయితే అది మళ్లీ పేద, బడుగువర్గాల వారినే బలి తీసుకుంటుందా? అన్నదే బాధంతా. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
సామాన్యులకు కష్టాల్లేకుండా చూడండి
అనంతపురం టౌన్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఇన్¯Œ చార్జ్ మంత్రి కామినేని శ్రీనివాస్ బ్యాంకర్లకు సూచించారు. శనివారం డ్వామా సమావేశ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. వచ్చే నెల నుంచి చిన్న నోట్లను పంపే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ కొందరు బ్యాంకర్లు వృద్ధాప్య, వితంతు పింఛన్లు వారి ఖాతాల్లో పడితే అప్పుల్లో జమ చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలకు ఎవరూ దిగరాదని సూచించారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 5,70,000 జ¯ŒSధ¯ŒS ఖాతాలుంటే 4,60,000 మందికి రూపే కార్డులు అందించినట్లు బ్యాంకర్లు చెబుతున్నట్లు తెలిపారు. అయితే సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ రూ.11,400 కోట్లు ఏమవుతాయి?
దేశంలోని పేదలకు ప్రాణసంకటంగా మారిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం డబ్బున్న పెద్దలకే మేలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) లెక్కల ప్రకారం దేశంలో ఆధార్ కార్డులేని ఇంటి యజమానులు 5.8 కోట్ల మంది. బ్యాంక్ ఖాతాలు సహా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడం వల్లనే వారికి ఇంతవరకు ఆధార్ కార్డులు అందజేయలేకపోయామని అధికారులే చెబుతున్నారు. ఈ కార్డులేని వారంతా నగదుతోనే కాపురాలు నెట్టుకొస్తుంటారు. అత్యవసరాల కోసం ఉన్నంతలో కొంత నగదును దాచుకుంటారు. ఇలాంటి వారంతా రెండువేల రూపాయలు విలువైన పాత 500 రూపాయల నోట్లను దాచుకున్నారనుకుంటే వారు దాన్ని ఎలా మార్చుకుంటారు? వారంతా 20, 30 శాతం కమీషన్‌కు మార్చుకుంటారా? నిజాయితీగా రిజర్వు బ్యాంకులో మార్చుకుందామంటే వారివద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు కదా? ఉత్తరాఖండ్, జార్ఖండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి ప్రజలు వంద రూపాయలకు 500 రూపాయల నోట్లను అమ్ముకుంటున్నారంటూ మీడియాలోనే ఎన్నో కథనాలు వస్తున్నాయి. అలా అమ్మినా నాలుగు నోట్లకు 1600 రూపాయలు నష్టపోతారు కదా? తక్కువ సొమ్ముకు అమ్ముకోలేకపోతే వారి వద్ద ఉన్న రెండు వేల రూపాయలు వృధా అవుతాయి. ఇలా 5.8 కోట్ల మంది వద్ద ఉన్న రూపాయలు వృధా అవుతాయనుకుంటే వాటి మొత్తం విలువ 11,400 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ విధంగా 'బ్లాక్' అయ్యే ఈ సొమ్మును ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ ఏ లెక్కల్లో చూపిస్తుంది? ఇప్పటికే ప్రజల సేవింగ్స్ మీద, ఫిక్సిడ్ డిపాజిట్లపై, రుణాలపై వడ్డీలు తగ్గించిన బ్యాంకులు, మున్ముందు మరింత తగ్గుతాయని చెబుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఎవరికి లాభం. దేశంలోని పది పెద్ద కార్పొరేట్ సంస్థలు కలిసి 7.3 లక్షల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాయని ఆర్బీఐ లెక్కలే చెబుతున్నాయి. తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం ఈ కార్పొరేట్ సంస్థలకు ఒక్క ఏడాదికి 7,300 కోట్ల రూపాయలు కలిసొస్తుంది. దేశంలో నల్లడబ్బును అరికడితే పేదలకు లాభం జరుగుతుందని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిరోజూ చెబుతోంది. ఎలాంటి లాభాలు జరుగుతాయో ఇంతవరకు ఒక్కటంటే ఒక్కదాని గురించి వివరించలేదు. పేదలకు ఒనగూడే లాభాల గురించి ప్రభుత్వం వద్ద అసలు రోడ్ మ్యాప్ ఉందా? అసలు ఏం ఒరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా? ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా మోదీ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తుందా? ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అప్పటి వరకు త్యాగం చేసే దేశభక్తి మా పేదలకు ఉంది. రోడ్లపై టిఫిన్లు, కూరగాయలు, చిల్లర సరకులు అమ్ముకునేవాళ్లు వ్యాపారం లేక, పని దొరక్క పస్తులుంటున్న కూలీలు రోడ్లపైనా, వలసవచ్చినా బతుకుతెరువు కనిపించని కార్మికులు దిక్కులేని చోట, కంపెనీ లేఆఫ్‌లతో ఆకలి తాళలేక కార్మికులు గేట్ల వద్ద, క్యూలో సత్తువుడిగిన వయస్సులో నిలబడలేక పేదలు, పెద్దలు మరణిస్తూనే ఉంటారు. వారి త్యాగాలకు ప్రతిఫలం ఏనాటికైనా ఉంటుందా? -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
'పేదలకు విత్‌డ్రా పరిమితిని పెంచాలి'
-
సొంతింటి కలను నిజం చేస్తాం
‘రాకీ’ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు నేడు చక్రద్వారబంధంలో భూమి పూజ దానవాయిపేట (రాజమహేంద్రవరం) : సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయమని రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు తెలిపారు. రాజమహేంద్రవరం బలరామ కృష్ణరాజు నగర్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన వెంచర్ చంద్రిక అవంతిక (ది ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం) వివరాలను వెల్లడించారు. రాజానగరం మండలం చక్రద్వారబంధంలోని జీఎస్ఎల్ ఆసుపత్రి వెనుక ఉన్న తొమ్మిది ఎకరాల పదిసెంట్లలో గంగ, గోదావరి, యమున, సరస్వతి, కృష్ణ, తుంగభద్ర, కావేరీ, నేత్రావతి, అర్కావతి, బ్రహ్మపుత్ర తదితర నదుల పేరులతో 11 బ్లాక్‌లుగా విభజించి, వాటిలో 480 ప్లాట్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన భూమిపూజ శనివారం అర్ధరాత్రి 3.38 నిమిషాలకు జరుగుతుందన్నారు. ఈ వెంచర్లో టూ బెడ్ రూమ్ ప్లాట్ రూ.16 లక్షలు, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ రూ.22 లక్షలకు అందిస్తున్నట్లు తెలిపారు. వెంచర్ ప్రారంభించిన రెండు మాసాల వ్యవధిలో సుమారు 200 ప్లాట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయన్నారు. 22 ఏళ్ల అనుభవంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్న ఈ వెంచర్లో సూపర్ మార్కెట్, పార్కు, ఆసుపత్రి, క్లబ్‌హౌస్, జీమ్, యోగా రూమ్, కాన్ఫరె¯Œ్సహాలు, స్విమ్మింగ్ ఫూల్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రెండేళ్లలో వెంచర్‌ను పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందిస్తామన్నారు. అనంతరం చంద్రిక అవంతిక బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్బారావు, కోటేశ్వరరావు, కిరణ్, శ్యామ్, శేఖర్, స్వామి, శ్రీధర్, అకీర్, రాజు పాల్గొన్నారు. -
మాతాన్నపూర్ణేశ్వరీ...
–ఆకలిగొన్నవారిని ఆదుకుంటోన్న అన్నపూర్ణ సేవా ఫౌండేషన్ –జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచిత అన్నప్రసాద వితరణ –అడిగి మరీ కడుపారా అన్నం పెడుతున్న మనసున్న మారాజులు ఏలూరు అర్బన్ ః అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే భగవాన్ సత్యసాయి మాటలు సత్యసాయి సేవా సమితి నగర కమిటీ సభ్యుల్లో స్ఫూర్తిని నింపాయి. సమాజంలో ఆపన్నులను ఆదుకోవాలనే ఆలోచన రేకెత్తించాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్. అలా రూపుదిద్దుకున్న ఆ ఫౌండేషన్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నిత్యం వందలాదిమంది పేద రోగుల సహాయకుల ఆకలి బాధ తీరుస్తోంది. జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్ పేరిట ఫిబ్రవరి 1, 2015లో ప్రారంభమైన సేవా సంస్థ నిత్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగుల సహాయకులకు నిత్యం ఆప్యాయంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఆకలి తీరుస్తోంది. నిత్యం సుమారు 300 మంది ఆకలిపీడితులకు షడ్రుచులతో కడుపారా అన్నం పెడుతోంది. సేవా తత్పరత కలిగిన ఫౌండేషన్ సభ్యులు ఉదయమే ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో కలియతిరిగి అమ్మా భోజనం చేస్తారా అని అడిగిమరీ వారికి కూపన్లు అందిస్తారు. అలా ఎందరికి కూçపన్లు ఇచ్చారో అంతమందికి సరిపడా అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు సి«ధ్ధం చేసి మధ్యాహ్నం గం.11.30 నుంచి గం 1 వరకూ అన్నప్రసాద వితరణ చేస్తుంటారు. ఇక ఎవరైనా దాతలు వారి ఇళ్ళల్లో జరుపుకునే వేడుకల సందర్భంగా ముందుకు వచ్చి ఏదైనా తీపి వంటకాలు అందిస్తే దానిని కూడా అన్నార్తులకు అందిస్తుంటారు. ఇలా నిత్యం ఎందరో పేదలకు కడుపారా మష్టాన్న భోజనం అందించడం ద్వారా ఆత్మ సంతప్తి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నారు. – అన్నదాతా సుఖీభవ. రంపాడ. రామాయమ్మ. వంగాయగూడెం. రోజులు మారాయి. ఇంటికి ఎవరైనా బంధువు వస్తే వారికి ఒక పూట భోజనం పెట్టేందుకు ఆలోచించాల్సిన కరువు రోజులివి. అలాంటిది మేమెవరిమో వాళ్ళెవరో మాకు తెలీదు. ఆసుపత్రిలో వార్డులోకి వచ్చి మరీ అమ్మా భోజనం చేస్తావా అని అడిగిమరీ మూడు రోజుల నుంచి భోజనం పెడుతున్నారు. వాళ్ళు చల్లగా ఉండాలి. – వారి దయవల్లే కడుపు నిండుతోంది. పాము. సుబ్రహ్మణ్యం, పడమట పాలెం, కైకలూరు మండలం. కూతురిని ప్రసవానికి తీసుకువచ్చాను. కూలి పనులే మా కుటుంబానికి ఆధారం. ఆసుపత్రిలో కూతురివద్ద ఉండడంతో పనికి పోయి కూలి తెచ్చుకునే అవకాశం లేదు. డబ్బులు లేవు ఈ పరిస్థితుల్లో సమాజం వాళ్ళు పిలిచిమరీ కడుపునింపుతున్నారు. వారికి ఎంతైనా రుణ పడి ఉన్నాం. – రెండు పూటలా భోజనం అందించాలనేది లక్ష్యం. కానుమిల్లి. శశి శేఖరరావు, నందిగం. సత్యనారాయణ,ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు. నిధులు పరిమితంగా ఉండడంతో రోగుల సహాయకులకు మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టగలుగుతున్నాం. అన్న ప్రసాద వితరణ కోసం మేము ఎవరినుంచీ ఆర్ధిక సహాయం అర్ధించం. దాతలు స్వఛ్ఛంధంగా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందిస్తే స్వీకరిస్తున్నాం. ఈ నేపథ్యంలో దాతలెవరైనా ముందుకు వస్తే వారి నుంచి విరాళాలు సేకరించి కార్పస్‌ఫండ్ ఏర్పాటుచేసి దానిపై వచ్చే ఆదాయంతో ఇకపై రెండుపూటలా భోజనం పెట్టాలని భావిస్తున్నాం. త్వరలో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించాం. ఇప్పటికే ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అతిధి దేవుళ్ళ సేవ చేసుకుంటున్నాం. -
పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం
అనంతపురం న్యూటౌన్ : ఓసీ కులాలలోని నిరుపేదలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేదరికం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వాలని, దళిత బడుగు బలహీన వర్గాలలో ధనవంతులున్నట్టే అగ్రవర్ణాలలో పేదలెక్కువగా ఉన్నారని అందరికి ఒకే విధానం ఉండడం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. -
అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు...
ఆదర్శం ఒక్క రూపాయితో ఆకలి తీరుతుందా? ఆకలి తీరడం వరకు ఎందుకు? సింగిల్ టీ కూడా తాగలేము. కానీ అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు... కమ్మని భోజనంతో కడుపు నిండుతుంది. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కరూపాయికి పేదసాదలకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు వెంకట్రామన్. ఈరోడ్ జనరల్ హాస్పిటల్ సమీపంలో తాను నిర్వహిస్తున్న ‘ఏఎంవీ హోమ్లీ మెస్’లో ఒక్క రూపాయికే పేదలకు భోజనం సమకూరుస్తున్నడు వెంకట్రామాన్. ప్రతి మంచి పని వెనుక ఏదో ఒక సంఘటన ఉంటుంది. వెంకట్రామన్ విషయంలోనూ ఇది జరిగింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక యువతి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వెంకట్రామన్ రెస్టారెంట్‌కు వచ్చింది. ఆమె ఇడ్లీలు కొనడానికి వచ్చింది. ఆరు ఇడ్లీలకు పది రూపాయలు. పది రూపాయలు పెట్టి ఇడ్లీలు కొనడానికి ఆమె సుముఖంగా లేకపోవడంతో దోశలు కొనమని చెప్పాడు వెంకట్రామన్. పది రూపాయలకు మూడు దోశలు. మూడు దోశలు తన కుటుంబానికి సరిపోవంటూ కొనడానికి తిరస్కరించింది. ఆమె పరిస్థితికి జాలి పడి పది రూపాయలకే ఆరు దోశలు ఇచ్చాడు వెంకట్రామన్. వేరే రెస్టారెంట్ యజమానులు అయితే ఈ సంఘటనను ఇక్కడితో మరిచిపోయి ఉండేవారు. అయితే వెంకట్రామన్ చాలా రోజుల వరకు ఈ సంఘటనను మరవలేకపోయాడు. కొందరు కేవలం పది రూపాయల మీదే రోజంతా వెళ్లదీస్తున్న కఠిన వాస్తవాన్ని గ్రహించాడు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పేద రోగుల దీనపరిస్థితిని, ఆకలిని కళ్లారా చూశాడు. మనసు కదిలిపోయింది. ‘‘నా పరిధిలో ఏదైనా చేయాలి’’ అని అప్పుడే గట్టిగా అనుకున్నాడు వెంకట్రామన్. తన భార్యతో కలిసి రోజూ పొద్దున హాస్పిటల్‌కు వెళ్లి పేదవారికి రూపాయి కూపన్ ఇస్తాడు. కూపన్ తీసుకున్నవారు మధ్యాహ్నం రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం తెచ్చుకుంటారు. ఒకప్పుడు 20 మందికి టోకెన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు 70 మందికి ఇస్తున్నాడు. ఈ రెస్టారెంట్లో రెగ్యులర్ కస్టమర్ల విభాగం కూడా ఉంది. అక్కడ మాత్రం ప్లేట్ భోజనం రూ.50కి విక్రయిస్తారు. రూపాయి భోజనానికయ్యే ఖర్చు కోసం మొదట్లో ఎవరీ దగ్గర సహాయం తీసుకోలేదు వెంకట్రామన్. తన రెస్టారెంట్ లాభాల నుంచే ఈ మొత్తాన్ని కేటాయించేవాడు. అయితే రెస్టారెంట్‌కు వచ్చే లాభాలు తక్కువ కావడంతో ఖర్చులు సర్దుబాటు చేయడం కష్టంగానే ఉండేది. అయితే వెంకట్రామన్ చేస్తున్న పని నచ్చి అడగకుండానే దాతలు ఆయనకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. వెంకట్రామన్ కూతురికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు కాలేజీ ఫీజు కట్టడానికి అతని దగ్గర డబ్బులేదు. ఇది తెలిసిన చెన్నై రామక్రిష్ణ మఠ్ వెంకట్రామన్ కూతురు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందడానికి అవసరమైన సహాయం చేసింది. ‘‘కష్టం ఉందని బాధ పడనక్కర్లేదు. ఆ కష్టాన్ని తీర్చే ఆపన్న హస్తం కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది’’ అని నమ్ముతాడు వెంకట్రామన్. ‘‘చదువు అయిపోయిన తరువాత నా కూతురుకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నేను మరింత ఎక్కువ మందికి సహాయం చేయగలను’’ అంటున్నాడు వెంకట్రామన్. యోగా టీచర్‌గా పని చేస్తున్న వెంకట్రామన్ భార్య తనవంతుగా సహాయం అందిస్తోంది. ‘‘పేద కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నేనేమీ ఆర్థికంగా స్థిరపడలేదు. అయినా... ఒక్క రూపాయికి భోజనం మాత్రం సమకూర్చడాన్ని మాత్రం మానుకోను. రోజుకు వంద కూపన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నాడు వెంకట్రామన్. ‘‘మానవత్వం అనేది సముద్రం లాంటిది. అందులో రెండు చుక్కలు కలుషితం అయినంత మాత్రాన... సముద్రం అంతా కలుషితం కాదు’’ అంటారు మహాత్మగాంధీ. వెంకట్రామన్ చేస్తున్న మంచిపనిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మహాత్ముడి మాటలు గుర్తుకు వస్తాయి. మానవత్వం మీద పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఈ కాలానికి ఇంత కంటే కావాల్సింది ఏముంది! -
క్రైస్తవులపై చిన్నచూపు తగదు
ఏఐసీసీ జాతీయాధ్యక్షుడు రెవ.డాక్టర్ గేరహోనోక్ నెల్లూరు(బారకాసు) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నాయని, ఇది తగదని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు రెవ.డాక్టర్ గేరహోనోక్ అన్నారు. ఏఐసీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని రేబాల లక్ష్మీనరసారెడ్డి స్మారక భవనంలో బెస్ట్ పాస్టర్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గేరహోనోక్ మాట్లాడుతూ రాజ్యాంగం క్రైస్తవులకు కల్పించిన హక్కులను ఏప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పాస్టర్లను చంపుతూ, క్రైస్తవులను అణగదొక్కుతూ, చర్చిలను కూల్చాలనే ప్రయత్నాలు ప్రధానిమంతి నుంచి కింది స్థాయి ప్రజాప్రతినిధితో పాటు ప్రభుత్వాధికారులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. విజయవాడలో దేవాలయాలు, మసీదులను కూల్చివేసి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఇతర ప్రాంతాల్లో స్థలాలను కేటాయించి నిర్మాణానికి నిధులను విడుదల చేస్తుందన్నారు. అయితే చర్చిలను కూల్చివేసి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 3వ తేదీన విజయవాడలో జరిగే క్రైస్తవ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాసరి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు అభిలాష్సన్ని, జిల్లా గౌరవాధ్యక్షుడు బిషప్ ఎంజే ప్రదీప్‌కుమార్, రవికుమార్, బాబుబిల్డర్తో పాల్గొన్నారు. -
దీనులకు అండగా నిలుస్తున్న పగానో
ఏలూరు (ఆర్ఆర్ పేట) : సామాజిక సేవా కార్యక్రమాలతోనే మానసిక సంతృప్తి చేకూరుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ (సీడ్స్) సంస్థ ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న దిడ్ల పగానోను ఇటీవల ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ సంస్థ రాజీవ్‌గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలో ఇంటర్నేషనల్ లా హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో జూలై 25న పగానోకు మాజీ గవర్నర్ భీష్మ నారాయణ్ సింగ్ ఈ అవార్డును అందచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యానగర్‌లో పగానోకు ఆర్సీఎం పరిరక్షణ సమితి ఏలూరు నేత్రాసనం, కోనసీమ ప్రతినిధులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ పగానో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధితో పాటు 56 మండలాల్లో బడి మానివేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించి వారికి విద్యావకాశాలు కల్పిస్తూ దేశంలో అక్షరాస్యత పెంపొందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. అలాగే సీడ్స్ సంస్థ ద్వారా ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన దీనులకు అండగా నిలిచి వారికి కావాలసిన నిత్యావసరాలు, బియ్యం తదితర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేస్తూ తన వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చుతున్నారని తెలిపారు. ఫాదర్ గుదే బల్తజార్, ఫాదర్ జీజే ఛార్లెస్, దిడ్ల ఏంజిలో, పీజే కెనడీ, తోట ఎడ్వర్డ్, తలారి మరియదాస్, టి.రాబర్ట్, టి.శ్యామ్, టి.స్వామినాథన్ పాల్గొన్నారు -
ఎగ్గొట్టే వారికే రుణాలిస్తారా? బ్యాంకర్లను ప్రశ్నించిన కలెక్టర్ భాస్కర్
ఏలూరు (మెట్రో) : పెద్ద మనుషులు ఎగ్గొట్టిన రూ. 25 వేల కోట్లు మాఫీ చేయడానికి ముందుకు వచ్చిన బ్యాంకర్లు పేదలకు రుణాలివ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్లో డీఎల్ఆర్సీ సమీక్ష సమావేశంలో బ్యాంకు అధికారులతో కలెక్టర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎంతో మంచివారని తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని తిరిగి బ్యాంకులకు చెల్లించే ఆలోచనలతో ఉన్న ప్రజలకు రుణాలివ్వడానికి ఎందుకు బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్పాదక రంగానికి రుణాలివ్వకుండా వడ్డీ వ్యాపారం చేసే బడాబాబులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం వల్ల జిల్లాలో ఆశించిన ప్రగతి ఎలా సాధ్యపడుతుందని, పేదలకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్ల కమిటీ, జిల్లా బ్యాంకు అధికారుల సంప్రదింపుల కమిటీ నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు పేదలకు రుణాలు ఇవ్వడం లేదని కలెక్టర్ ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతేడాది 42 మందికి , బీసీ కార్పొరేషన్ ద్వారా 440 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 280 మందికి లోన్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ బ్యాంకర్లు నేటికీ ఖాతాలు ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే వారికి లోన్లు ఇస్తే ఉత్పాదకత పెరిగి అటు రైతులు ఇటు జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో విప్ చింతమనేని ప్రభాకర్, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం గురుమూర్తి, ఆర్బీఐ ఏజీఎం హరిహరశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు డీడీఎం రామప్రభు పాల్గొన్నారు -
హృదయవేదన
♦ ప్రాణ సంకటంలో నిండు గర్భిణి ♦ నిమిషానికి 167 సార్లు కొట్టుకుంటున్న గుండె ♦ దగ్గర పడుతున్న డెలివరీ తేదీ ♦ ప్రసవ సమయంలో కార్డియాలజీ, గైనకాలజీ డాక్టర్ల పర్యవేక్షణ అవసరం ♦ఆపరేషన్‌కు రూ. 6 లక్షల ఖర్చు ♦ బోరున విలపిస్తున్న గిరిజన దంపతులు గూడూరు: పేద కుటుంబానికి పెద్ద జబ్బు వచ్చింది. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న దంపతులపై ఖర్చుల పిడుగు పడింది. భార్యకు వచ్చిన కష్టాన్ని చూడలేక భర్త.. ఆర్థిక ఇబ్బందులు ఎలా భరించాలని భా ర్య.. నిత్యం బోరున విలపిస్తున్నారు. దయామయులు ఆర్థికసాయం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గూడూరు శివారు కేశ్యతండాకు చెందిన వాంకుడోతు మహేందర్‌కు అదే తండాకు చెందిన భారతితో 2009లో పెళ్లి జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ దంపతులు తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2011లో వారికి ఒక పాప, 2013లో మరో అమ్మాయి జన్మించింది. అప్పటి వరకు ఎలాంటి జబ్బు లేని భారతికి ఆరునెలల తర్వాత ఒకసారి గుండె నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను మాను కోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా రిపోర్టులను పరిశీలించిన డాక్టర్.. భారతిని హన్మకొండలోని కార్డియాక్ సెంటర్లో చూపించుకోమని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడి వైద్యుడి పరీక్షల ఆధారంగా మందులు వాడుకుంటూ వస్తోంది. మూడోసారి గర్భం.. భారతి ఎనిమిది నెలల క్రితం మరోసారి గర్భం దాల్చింది. ఈ మేరకు అప్పటి నుంచి మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుంటూ ఆమె మందులు వాడుతోంది. అయితే అటు గుండె నొప్పి, ఇటు గర్భానికి సంబంధించిన మందులు వాడుకుంటూ వస్తున్న భారతికి మరో 20 రోజుల్లో డెలివరీ ఆపరేషన్ చేయాలని కన్సల్టెంట్ డాక్టర్ చెప్పారు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన ఆమెకు మరోసారి గుండెనొప్పి వచ్చింది. దీంతో భర్త, కుటుంబసభ్యులు భారతిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. ఆమె గుండె ఎక్కువగా కొట్టుకుంటుందని వెంటనే కార్డియాలజీ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ క్రమంలో వారు అక్కడి నుంచి తరచు చూపించుకునే హన్మకొండలోని గుండె వైద్య నిపుణుడి వద్దకు చేరుకున్నారు. నిమిషానికి 167 సార్లు స్పందన వాస్తవంగా ప్రతి మనిషికి నిమిషానికి 72 నుంచి 80 సార్లు గుండె కొట్టుకుంటోంది. కానీ.. భార తి గుండె నిమిషానికి 167 సార్లు కొట్టుకుంటుందని ఈసీజీ ద్వారా డాక్టర్ గుర్తించారు. దీంతో ప్రసవ సమయంలో గుండె నొప్పి వస్తే ఇబ్బందికరంగా ఉంటుం దని.. కార్డియాలజీ, గైనకాలజీ పర్యవేక్షణలో డెలివరీ చేయించాలని ఆయన కుటుంబసభ్యులకు సూచించారు. అయితే ఇంతటి పెద్ద వైద్యానికి రూ. 6 లక్షల వరకు ఖర్చవుతోందని డాక్టర్ చెప్పడంతో భారతి దంపతులు బోరున విలపిస్తున్నారు. వర్తించని ఆరోగ్యశ్రీ వైద్యం.. భారతికి ఆరోగ్యశ్రీ పథకం కింద డెలివరీ ఆపరేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆమె భర్త మహేందర్ చెబుతున్నారు. కార్డియాలజీ, గైనకాలజీ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రసూతి చేసే అవకాశం ఆరోగ్యశ్రీలో లేదని వారు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి మాది నిరుపేద కుటుంబం. రోజు కూలీ పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితి ఉంది. గతంలో వైద్య ఖర్చుల కోసం రెండెకరాల్లో కొంత భూమిని అమ్మినా. నా భార్య గుండె ఎక్కువగా కొట్టుకుంటుండడంతో డాక్టర్లు ఇక్కడ ఆపరేషన్ చేసేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించాలంటే రూ. 6 లక్షలు ఖర్చవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మరో 20 రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు. దయామయులు కరుణించి ఆర్థిక సాయం అందించి నా భార్యకు ప్రాణభిక్షపెట్టాలి. –వాంకుడోతు మహేందర్, కేశ్యతండా, గూడూరు -
పేదలకు అండగా ఉంటాం
ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుంటాం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కేఎల్ రావు కాలనీ (తాడేపల్లిరూరల్) : నిరంతరం పేద ప్రజలకు వైఎస్సార్సీపీ అండదండగా ఉంటుందని, ప్రభుత్వం పేదలపై చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు అడ్డుకుని అండగా నిలబడతుందని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేఎల్ రావు కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో బాధితుల తరఫున కోర్టును ఆశ్రయించిన ఆర్కే సోమవారం కోర్టు ఇచ్చిన స్టేటస్ కో కాపీలను వారికి అందజేసేందుకు కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబునాయుడు తన ప్రతాపాన్ని పేదప్రజల గుడిసెలపై చూపిస్తున్నారని, ఆయనకు పేదలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. పేదల జోలికి వస్తే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో బాబు చేసే కుట్రలను అడ్డుకుని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. లేదంటే ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగపూర్, జపాన్ కంపెనీలలో బినామీ అయిన నీ కొడుకును ఆర్థికంగా బలపరిచేందుకు పేదవాడి ప్రాణాలు పణంగా పెడితే భవిష్యత్తులో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆర్కే వ్యాఖ్యానించారు. పేదల పక్షాన నిలబడే వైఎస్సార్ సీపీని అణగదొక్కేందుకే దివంగత నేత వైఎస్ విగ్రహాలు తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వైఎస్ ఎప్పుడూ పేదల ప్రజల గుండెల్లోనే ఉంటాడనే విషయం చంద్రబాబునాయుడు గమనించాలని ఆర్కే అన్నారు. -
దరఖాస్తులు చేసి చేసి...
‘దరఖాస్తుపల్లి’ అయింది! ఓ ఊరి వెనుక కథ ఇదీ.. రేగోడ్ : కొన్ని దశాబ్దాల క్రితం జమీందారులకు వందల ఎకరాల్లో భూములు ఉండేవి. పట్టాభూములు, సీలింగ్ భూములతో దొరలుగా చలామణి అయ్యేవారు. ఈ భూములను తమకివ్వాలంటూ పేద ప్రజలు దరఖాస్తులు చేసుకునే వారు. ఈ క్రమంలో ఆ గ్రామం దరఖాస్తుపల్లిగా పేరు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. రేగోడ్ మండలం ఉసిరికపల్లి గ్రామ పంచాయతీలో దరఖాస్తుపల్లి ఉంది. టేక్మాల్ గ్రామానికి చెందిన ఖాదర్‌బాషా నలుగురు అన్నదమ్ములు. సుమారు వందేళ్ల క్రితం దరఖాస్తుపల్లి శివారుల్లోని ప్రాంతాల్లో వీరిలో ఒక్కొక్కరికి వందల ఎకరాల భూమి ఉండేదని పూర్వికులు చెప్తున్నారు. నలుగురు అన్నదమ్ముల్లోని ఒకరైన ఖాదర్బాషాకు దరఖాస్తుపల్లి ప్రాంతంలో సుమారు 760 ఎకరాల భూమి ఉండేదని తెలిపారు. మొదట్లో ఇక్కడ ఐదారుగురు గుడెసెలు వేసుకునే జీవించే వారు. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన మరికొందరు గుడెసెలు వేసుకుని నివసించే వారు. ఈ క్రమంలోనే జమీందారు ఖాదర్‌బాషా.. దరఖాస్తుఖేడ్గా పేరును పెట్టారట. ఆ తరువాత తమకు సీలింగ్ భూములు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకునేవారట. ఇక అందరూ దరఖాస్తుపల్లి అంటూ పిలుచుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా ప్రస్తుతం దరఖాస్తుపల్లి అనే ఉంది. ఈ గ్రామంలో సుమారు వంద ఇళ్లు, 260 మంది ఓటర్లు, 600 జనాభా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. దరఖాస్తుపల్లిలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సీలింగ్ భూముల కోసం దరఖాస్తులు చాలా ఏళ్ల కిందట దొరలకు వందల ఎకరాల భూములు ఉండేవి. సీలింగ్ భూములు ఇవ్వాలని ప్రజలు దరఖాస్తులు చేసేవారు. దీంతోనే దరఖాస్తుపల్లి గ్రామంగా పేరిపొందింది. – తలారి బాలయ్య, దరఖాస్తుపల్లి ఇంకా దరఖాస్తులు చేస్తూనే ఉన్నాం నాడు దరఖాస్తులు చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తులు చేయడంతోనే దరఖాస్తుపల్లి గ్రామంగా పేరుగాంచింది. నాటినుంచి నేటివరకూ గ్రామాస్తులు సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు చేస్తూనే ఉన్నా సమస్యలు పరిష్కారాం కావడం లేదు. – సూర్రెడ్డి అడ్వకేట్, ఉసిరికపల్లి -
భూమిని సద్వినియోగం చేసుకోవాలి
సీఎం ముఖ్య సలహాదారు రామ్‌లక్ష్మణ్ మిడ్జిల్: ప్రభుత్వం నిరుపేద ఎస్సీలకు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య మంత్రి ముఖ్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్‌లక్ష్మణ్ సూచించారు. బుధవారం మండలంలోని కొత్తూర్ గ్రామంలో ప్రభుత్వం గతేడాది ముగ్గురు ఎస్సీ రైతులకు తొమ్మిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమిలో హరితహారంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండువేల టేకు మొక్కలను నాటుతుండగా, ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టేకు మొక్కలను పెంచడంతో అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్య, డీడీలు విజయ్‌కుమార్, సంధ్యారాణి,ఎంపీడీఓ కుమారస్వామి, సర్పంచ్ కష్ణ పాల్గొన్నారు. -
ఏపీలో పేదలకు ఆకాశ హర్మ్యాలు
*ఆధునిక శైలిలో నిర్మాణాలు-అత్యాధునిక సౌకర్యాలు *ముందుకొచ్చిన సైబర్‌సిటీ బిల్డర్స్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఆకాశ హర్మ్యాలు రానున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక శైలిలో నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం ప్రయివేటు నిర్మాణ సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సామాన్యులు కూడా కొనగలిగే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. రానున్న కాలంలో ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణం మురికివాడల్ని ప్రోత్సహించేదిగా కాకుండా ఎకనమిక్ యాక్టివిటీ పెంచేందుకు దోహదపడేలా వుంటుందని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుని పేద వర్గాలకు కూడా సౌకర్యవంతమైన గృహ నిర్మాణాలను చేపట్టే ఉద్దేశంతో ముందుకువచ్చినట్టు ఈ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో లక్షకు పైగా ఫ్లాట్లను నిర్మించిన అపారమైన అనుభవం తమకుందని, ఈ అనుభవంతో ఏపీలో పేదవారికి అన్ని సదుపాయాలు వున్న ఇళ్లను అందుబాటు ధరలో నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చామని వీరు తెలిపారు. నాణ్యమైన పద్దతుల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ చేసి ఫర్నిచర్‌తో సహా లైఫ్ స్టయిల్ ఇళ్లను అందివ్వడమే తమ ప్రాజెక్టు ప్రత్యేకత అని వివరించారు. విట్రిఫైడ్ టైల్స్, లిఫ్టు సౌకర్యాలతో బహుళ అంతస్థుల భవనాలను తమ సొంత పెట్టుబడితో ప్రభుత్వ సహకారంతో నిర్మించి ఇస్తామని వీరు తెలిపారు. పేదల ఇళ్లంటే స్లమ్ హౌసెస్‌గా కడతారనే ముద్రను చెరిపేసి ఆధునిక శైలిలో గృహనిర్మాణం చేస్తామని, అక్కడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన గృహ నిర్మాణంలో ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి భాగస్వామ్యం కావడం ఆహ్వానించతగ్గ పరిణామమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అందుబాటులో వుండేలా ఇళ్లను నిర్మించడానికి ఇంకా మరిన్ని సంస్థలు ముందుకురావాలని ఆయన కోరారు. అధునాతన సాంకేతిక పద్దతులు, నాణ్యమైన నిర్మాణ సామాగ్రి ఉపయోగించి సాధ్యమైనంత వేగంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే నెలలో విశాఖలో జరిగే పార్టనర్షిప్ సమ్మిట్‌కు పూర్తి ప్రతిపాదనలతో వస్తే అక్కడ చర్చించి మరికొన్ని సంస్థలను కూడా కలుపుకుని కార్యరూపం దాల్చేలా నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి సైబర్‌సిటీ డెవలపర్స్‌కు చెప్పారు. ప్రభుత్వ ఇంటర్నల్ ఆర్కిటెక్ట్ బాధ్యతలను ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు అప్పగిస్తామని సీయం చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ కార్యదర్శి లవ్ అగర్వాల్, సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణ, శ్రీవర్ధన్ రెడ్డి... ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు. -
పేదల కోసం హైఫై టవర్స్
9 అంతస్తుల భవంతులు.. లిఫ్టు, ఫైర్ ఫైటింగ్ ఏర్పాట్లు, సకల సౌకర్యాల కల్పన ‘గ్రేటర్’లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కొత్త నమూనా 24 నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో మురికివాడలో నిర్మాణం సర్కారుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదన.. రూ.647.13 కోట్లతో 8,560 ఇళ్లకు అంచనాలు సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం.. పేదల్లో సొంతింటి ఆశలను రేకెత్తిస్తోంది. రెండు పడక గదులు, వంట గది, హాల్, రెండు టాయిలెట్లతో ఇంటి నిర్మాణంతో పాటు నీటిసరఫరా, విద్యుత్, అంతర్గత రోడ్లు, మురికి కాల్వలు తదితర కనీస సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. కాగా హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో మురికివాడలో స్టిల్ట్+9 అంతస్తుల నమూనా(సూటబుల్ ప్యాటర్న్)లో నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో 8,560 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.647.13 కోట్ల అంచనాలతో జీహెచ్ఎంసీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వాస్తవానికి డబుల్ బెడ్రూం పథకం కింద రూ.517.88 కోట్ల అంచనా వ్యయంతో నగరంలోని 24 నియోజకవర్గాల్లో 8,560 ఇళ్ల నిర్మాణానికి గత సెప్టెంబర్ 26న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతులు(జీవో నం.8) జారీ చేసింది. అయితే నగరంలో స్థలాలు లభించకపోవడంతో ఈ ఉత్తర్వుల మేరకు రెండంతస్తుల(జీ+2) నమూనాలో పేదల ఇళ్ల నిర్మాణం సాధ్యం కావడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు. అదే విధంగా చెరువులు, నాలాలు, రైల్వే స్థలాలు, రహదారుల స్థలాలను కబ్జా చేసి నివసిస్తున్న పేదలను ఇతర ప్రాంతాల్లోని మురికివాడల్లో నిర్మించే ఇళ్లకు తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండంతస్తుల సముదాయానికి బదులు లిఫ్ట్, అగ్నిమాపక ఏర్పాట్లతో 9 అంతస్తుల టవర్లను నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తాజాగా జీహెచ్ఎంసీ.. ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కింది(స్టిల్ట్) భాగాన్ని వాహనాల పార్కింగ్తో పాటు అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులను రాబట్టేందుకు వ్యాపార/వాణిజ్య కార్యక్రమాలకు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సూచించారు. 560 చదరపు అడుగుల స్థలంలో ఒక్కో ఇంటిని నిర్మిస్తారు. ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షల వ్యయం చొప్పున 8,560 ఇళ్ల నిర్మాణానికి రూ.453.68 కోట్లు, కనీస సదుపాయాల కల్పనకు రూ.64.20 కోట్లు... మొత్తం రూ.517.88 కోట్లను గతంలో ప్రభుత్వం మంజూరు చేయగా.. తాజాగా సవరించిన నమూనాతో ఇళ్లను నిర్మించడానికి ఒక్కో ఇంటిపై రూ.75 వేలు మాత్రమే అదనంగా వెచ్చించాల్సి రానుంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే అదనంగా రూ.129.25 కోట్లను మంజూరు చేయాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది.