పునరావాసం కల్పించకుంటే పోరాటమే
నెల్లూరు(మినీబైపాస్): పేదలకు పునరావాసం కల్పిం చకుండా అక్రమణల పేరుతో నివాసాలను తొలగిస్తే వారితో కలిసి పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని భక్తవత్సలనగర్, ఉమ్మారెడ్డిగుంట ప్రాంతా ల్లో ఆదివారం ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటుండగా ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని కోటంరెడ్డికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలు సైతం ఉన్నాయని, కూలి పనులు చేసుకుని తిండి తినకుండా గూడు నిర్మించుకున్నామని, ఉన్న ఫలంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడకు వెళ్లాని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన రూరల్ ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో ఇష్టానుసారంగా మార్కింగ్ చేపట్టి ఉన్నారన్నారు. రైల్వే ట్రాక్ అవసరంలేని చోట మార్కింగ్ ఇచ్చి ఉన్నారని, పునరావా సం కల్పించకుండా ఖాళీ చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పరిహారం, ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజ ల పక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ఇన్‌చార్జి మొయిళ్ల సురేష్‌రెడ్డి, 21 వడివిజన్ ఇన్‌చార్జి చేజర్ల మహేష్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు కట్టా వెంకటరమణయ్య, నాయకుల వెంగళ్‌రెడ్డి, రాజారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భాస్కర్, అమీర్‌జాన్, కృష్ణ, రాజేశ్వరమ్మ, మాదా బాబు, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు.