‘కేజీఎఫ్’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్’లో పెద్ద విలన్‌లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....
‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.
‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.
మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.
ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు.
ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్ శర్మ. నిజానికి ఇది ప్రకాష్ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్..!
(చదవండి: ఆ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!)
Comments
Please login to add a commentAdd a comment