
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో వీకెండ్‌లో ట్రెక్కింగ్, నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్‌డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, అడవులు, జంతువులు, పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు
‘దక్కన్‌వుడ్స్, ట్రయల్ పేరుతో ప్రతి శనివారం, ఆదివారం వివిధ కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకూ ఎకో టూరిజం కార్యక్రమాల వివరాలు..
ఫిబ్రవరి 22న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్
ఫిబ్రవరి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్, మార్చి 1న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్
మార్చి 2న గజ్వెల్ ఫారెస్ట్‌లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్
మార్చి 8న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్
మార్చి 9న ఉదయం 6.30 – 10 గంటల వరకూ బర్డ్ వాక్
మార్చి 15న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్
మార్చి 16న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్
మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్
మార్చి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఉదయం 7 – 10 గంటల వరకూ బర్డ్ వాక్, ట్రెక్కింగ్
మార్చి 29న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్
మార్చి 30న గజ్వెల్ ఫారెస్ట్‌లో ఉదయం 7 – 10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటుందన్నారు. అసక్తిగలవారు 94935–49399, 93463–64583 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
(చదవండి: దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్)
Comments
Please login to add a commentAdd a comment