Nature
-
నేచర్.. లవర్స్
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్‌లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్‌లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్‌ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!! హిల్ పార్క్.. కేబీఆర్ చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్‌కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులుప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్‌గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్‌ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్‌కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్‌లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో.. నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్‌నగర్‌కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మినీ ఫారెస్ట్.. జింకల సందడిరెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్‌కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి.