ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం : అబ్బురపర్చే వెంకటేష్‌ చిత్రాలు | venkatesh kandunoori interesting arts on nature | Sakshi
Sakshi News home page

ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం : అబ్బురపర్చే వెంకటేష్‌ చిత్రాలు

Published Thu, Jan 9 2025 2:24 PM | Last Updated on Thu, Jan 9 2025 2:31 PM

venkatesh kandunoori interesting arts on nature

 భూగర్భమే..   ఓ విచిత్రం

శాలు, జాతులు, మతాలు, కులాల పేరిట విద్వేషాల కుంపట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మానవులందరూ సహోదరులేనని, అందరి అమ్మఒడి భూగర్భమేననే విషయాన్ని గుర్తు చేస్తూ ఓ అద్భుత చిత్రాన్ని రూపొందించారు నగరవాసి. త్వరలోనే ఆ చిత్రాన్ని అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ చిత్రకారుడు  వెంకటేష్‌ కందునూరి(35) తన చిత్రం వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..   – సాక్షి, సిటీబ్యూరో 

మాది మహబూబ్‌నగర్‌ జిల్లా.. ప్రస్తుతం నగరంలోని చైతన్యపురిలో ఉంటున్నా.. చిన్నప్పటి నుంచీ కళల పట్ల ఉన్న ఆసక్తితో నగరంలోని జేఎన్‌టీయూలో బీఎఫ్‌ఏ చేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాను. తరచూ సామాజిక అంశాలపై చిత్రాలను గీయడం నాకు అలవాటు. అదేవిధంగా ఈ ఆర్ట్‌ వర్క్‌ రూపొందించాను. 

భూమి.. బలిమి.. 
ఈ చిత్రంలో ప్రధానంగా భూమి, మనుషులు, జెండాలు, తుపాకులు అనే నాలుగు అంశాలు కనిపిస్తాయి. ఒక మహిళ తన గర్భంలో భూమిని మోస్తూ ఉంటే, ఆ భూమి లోపల తుపాకీతో కాలుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తుపాకీ భూమి లోపల దించి ఉండటం వల్ల ఆ మట్టిని తాకిన తుపాకీకి ఉన్న చెక్క జీవం పోసుకుని, చిగురు ఆకులతో కనిపిస్తుంది. మరోవైపు వివిధ రకాల జెండాలు, తుపాకులను చేతబట్టిన ప్రజలు యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తారు. ‘ఓ మనిషి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా చిత్రవధ చేసినా నేను మాత్రం చివరి వరకూ నిన్ను కాపాడుతూనే నీకు జీవాన్ని పోస్తూనే ఉంటా’ అని చెబుతున్న భూమి విలువ గుర్తించమనేదే ఈ చిత్రంలోని అంతరార్థం. ఆరు అడుగుల పొడవు, ఆరున్నర అడుగుల వెడల్పు కలిగిన ఈ భారీ చిత్రాన్ని దేశ రాష్ట్రపతితో ప్రారంభించి, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలని, అలాగే ఐక్యరాజ్యసమితి వరకు చేర్చాలని ప్రయత్నిస్తున్నాను అన్నారాయన.

  • ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం 

  • జాతి కుల మత విద్వేషాలు వదిలితేనే బలం 

  • ఆలోచింపజేసే సందేశం అందిస్తున్న అద్భుత చిత్రం 

  •  అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement