కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ)
స్టార్టప్స్ కోసం మీట్.. 24న
ఆర్టిస్టిక్ లైసెన్స్.. 25న
విదేశీ టేస్ట్‌గా ఇటాలియన్ రుచులు
సాక్షి, సిటీబ్యూరో: కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ) సహకారంతో ప్రముఖ గృహోపకరణ ఉత్పత్తుల బ్రాండ్ ఎల్‌జి ఎల్రక్టానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కె పాప్ పోటీల్లో స్థానిక విజేతలను ప్రకటించారు. ఈ ప్రాంతీయ పోటీల్లో ఆన్‌లైన్ ఆడిషన్స్ ద్వారా గానంలో నగరానికి చెందిన షైలీ ప్రీతమ్, నృత్యంలో సెజల్ దుబేలు గెలుపొందారని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కొరియన్ పాప్ సంస్క్రతికి పట్టం గట్టే అభిమానుల కోసం నిర్వహిస్తున్న జాతీయ పోటీలో భాగంగా ఈ ప్రాంతీయ పోటీలు జులై 27న ప్రారంభమయ్యాయి. బెంగళూరు, కొహీమా, కొల్‌కతా, ముంబై, ఇటానగర్, చెన్నై, ఢిల్లీల తర్వాత నగరంలో ప్రాంతీయ రౌండ్ జరిగింది. ఇవి సెపె్టంబర్ 1 వరకు 11 ప్రాంతాల్లో జరుగుతాయని, వీటి ద్వారా ఎంపికైన విజేతలు ఢిల్లీలో జరిగే సెమీ ఫైనల్స్‌లో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.
స్టార్టప్స్ కోసం మీట్.. 24న..
సాక్షి, సిటీబ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ది ఫౌండర్స్ కాంక్లేవ్ స్టార్టప్ మీటప్ నగరంలో జరుగుతోంది. కొండాపూర్‌లోని గోకర్ణ కో వర్కింగ్ స్పేస్‌లో ఈ నెల 24న జరగనున్న ఈ కార్యక్రమంలో భిన్న రంగాల ప్రముఖులు వైశాలి నియోటియా, నీతా సచన్, రత్నాకర్ సామవేదం హాజరై ప్రసంగిస్తారు. కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకూ కొనసాగుతుంది.
ఆర్టిస్టిక్ లైసెన్స్.. 25న..
సాక్షి, సిటీబ్యూరో: కవితలు, కథలు, సంగీతం, హాస్యం.. ఇలా ఏదైనా సరే మనకు నచి్చన/ వచ్చిన అంశంపై కొన్ని నిమిషాల పాటు మన ఇష్టాన్ని, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుగా ఆర్టిస్టిక్ లైసెన్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మనకు పట్టున్న ఏ భాషలోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ నెల 25న జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న అలైన్ హబ్‌లో నిర్వహిస్తున్న ఈ ఓపెన్ మైక్ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది.
మె‘న్యూ’ ఇటాలియన్ రుచుల టొస్కానో..
సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఎన్ని రుచులు పరిచయం అవుతున్నా.. ఎప్పటికీ వన్నెతరగని విదేశీ టేస్ట్‌గా ఇటాలియన్ రుచుల్ని చెప్పొచ్చు. సిటిజనుల్లో ఇటాలియన్ రుచుల ప్రియత్వానికి అనుగుణంగా టొస్కానో పేరిట మరో రెస్టారెంట్ ఏర్పాటైంది. సైబరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీ రోడ్‌లో నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను ఇటలీ రుచులకు ప్రసిద్ధి చెందిన చెఫ్ గౌతమ్ మంగళవారం ప్రారంభించారు.
నగరవాసులు గతంలో రుచి చూడని, ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల్ని తాము అందిస్తున్నామని, నేరుగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యుత్తమ ముడి పదార్థాలు, చీజ్‌లను ఉపయోగించి ప్రత్యేక మెనూ తయారు చేశామన్నారు. క్లాసిక్ మార్గెరిటా పిజ్జా, చికెన్ డి టోస్కానో తదితర ఇటలీ వంటకాలు నగరవాసుల్ని ఆకట్టుకుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment