KCC
-
కె పాప్ పోటీలో.. సిటీ విజేతలు వీరే..!
సాక్షి, సిటీబ్యూరో: కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ) సహకారంతో ప్రముఖ గృహోపకరణ ఉత్పత్తుల బ్రాండ్ ఎల్జి ఎల్రక్టానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కె పాప్ పోటీల్లో స్థానిక విజేతలను ప్రకటించారు. ఈ ప్రాంతీయ పోటీల్లో ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా గానంలో నగరానికి చెందిన షైలీ ప్రీతమ్, నృత్యంలో సెజల్ దుబేలు గెలుపొందారని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు.కొరియన్ పాప్ సంస్క్రతికి పట్టం గట్టే అభిమానుల కోసం నిర్వహిస్తున్న జాతీయ పోటీలో భాగంగా ఈ ప్రాంతీయ పోటీలు జులై 27న ప్రారంభమయ్యాయి. బెంగళూరు, కొహీమా, కొల్కతా, ముంబై, ఇటానగర్, చెన్నై, ఢిల్లీల తర్వాత నగరంలో ప్రాంతీయ రౌండ్ జరిగింది. ఇవి సెపె్టంబర్ 1 వరకు 11 ప్రాంతాల్లో జరుగుతాయని, వీటి ద్వారా ఎంపికైన విజేతలు ఢిల్లీలో జరిగే సెమీ ఫైనల్స్‌లో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.స్టార్టప్స్ కోసం మీట్.. 24న..సాక్షి, సిటీబ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ది ఫౌండర్స్ కాంక్లేవ్ స్టార్టప్ మీటప్ నగరంలో జరుగుతోంది. కొండాపూర్‌లోని గోకర్ణ కో వర్కింగ్ స్పేస్‌లో ఈ నెల 24న జరగనున్న ఈ కార్యక్రమంలో భిన్న రంగాల ప్రముఖులు వైశాలి నియోటియా, నీతా సచన్, రత్నాకర్ సామవేదం హాజరై ప్రసంగిస్తారు. కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకూ కొనసాగుతుంది.ఆర్టిస్టిక్ లైసెన్స్.. 25న..సాక్షి, సిటీబ్యూరో: కవితలు, కథలు, సంగీతం, హాస్యం.. ఇలా ఏదైనా సరే మనకు నచి్చన/ వచ్చిన అంశంపై కొన్ని నిమిషాల పాటు మన ఇష్టాన్ని, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుగా ఆర్టిస్టిక్ లైసెన్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మనకు పట్టున్న ఏ భాషలోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ నెల 25న జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న అలైన్ హబ్‌లో నిర్వహిస్తున్న ఈ ఓపెన్ మైక్ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది.మె‘న్యూ’ ఇటాలియన్ రుచుల టొస్కానో..సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఎన్ని రుచులు పరిచయం అవుతున్నా.. ఎప్పటికీ వన్నెతరగని విదేశీ టేస్ట్‌గా ఇటాలియన్ రుచుల్ని చెప్పొచ్చు. సిటిజనుల్లో ఇటాలియన్ రుచుల ప్రియత్వానికి అనుగుణంగా టొస్కానో పేరిట మరో రెస్టారెంట్ ఏర్పాటైంది. సైబరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీ రోడ్లో నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను ఇటలీ రుచులకు ప్రసిద్ధి చెందిన చెఫ్ గౌతమ్ మంగళవారం ప్రారంభించారు.నగరవాసులు గతంలో రుచి చూడని, ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల్ని తాము అందిస్తున్నామని, నేరుగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యుత్తమ ముడి పదార్థాలు, చీజ్‌లను ఉపయోగించి ప్రత్యేక మెనూ తయారు చేశామన్నారు. క్లాసిక్ మార్గెరిటా పిజ్జా, చికెన్ డి టోస్కానో తదితర ఇటలీ వంటకాలు నగరవాసుల్ని ఆకట్టుకుంటాయన్నారు. -
క్రికెట్ లో సరికొత్త రికార్డు... ఒక్క ఓవర్ లో 46 పరుగులు
-
డిజిటల్‌గా కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
న్యూఢిల్లీ: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్‌గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి. ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్)తో జట్టు కట్టాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే పొలం వెరిఫికేషన్ కూడా జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు. -
‘లోన్’లొటారం!
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఐడీబీఐ స్కాం వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రతోపాటు ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిసాన్ క్యాష్ క్రెడిట్ స్కీమ్(కేసీసీ)లో భాగంగా చేపల చెరువుల పేరిట 2009 నుంచి 2011 వరకు జిల్లాలోని మూడు ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు సుమారు రూ.1100 కోట్లను రుణంగా పొందిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తోంది. బ్యాంకు అధికారుల ఆశీస్సులతో రుణగ్రహీతలు చేపల చెరువులను తవ్వకుండానే రుణాలను తీసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం అంతా గప్‌చుప్‌గా జరిగినా సీబీఐ రంగ ప్రవేశంతో స్కాంలో వాస్తవాలు బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు ఉన్నతాధికారులు కూడా అంతర్గత క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా కొంతమందిపై చర్యలు తీసుకోడానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. పర్యవసానంగా వివరణలు నమోదు చేసి, క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్టు ఒక స్కెచ్ ప్రకారం వ్యవహారం నడుపుతున్నట్టుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా దర్యాప్తు! కేవలం బ్యాంకు అధికారులనే కాకుండా అసలు చేపల చెరువులు లేకుండానే చెరువులను సృష్టించడం, చెరువులలో చేపలు చనిపోకుండానే చనిపోయినట్టు, నష్టం జరిగినట్టుగా రికార్డులు సృష్టించడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మత్స్యశాఖ అ«ధికారుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన కొందరు ఐడీబీఐ కిసాన్ క్యాష్ క్రెడిట్ స్కీమ్‌లో స్కామ్‌కు సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని విశాఖ పట్టణంలో సీబీఐ అధికారులకు అందించే ప్రయత్నం చేశారు. వి«ధి నిర్వహణలో , దాడుల్లో ఉన్న సీబీఐ అధికారులను కలవడానికి అవకాశం ఉండదని, నేరుగా ఉన్నతాధికారులకే సమాచారం అందించాలనే మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో వారికే వాస్తవ విషయాలను అందించడానికి కొందరు సిద్ధపడుతున్నారు. మూడు శాఖల పాత్రపై అనుమానం ఐడీబీఐ కేసీసీ స్కీమ్ కింద అడ్డగోలుగా వ్యవహరించిన బ్యాంకు అధికారుల పాత్రతోపాటు, ఈ స్కీమ్ అమలు చేసిన సమయంలో జిల్లాలో చేపల చెరువుల అనుమతులు, రిజిస్ట్రేషన్లు, వంటి వ్యవహారాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ, మత్స్యశాఖ అధికారుల పాత్రపై కేంద్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. చేపల చెరువులకు హామీలుగా చూపించిన భూముల విలువను ఎక్కువగా చూపిస్తూ, సర్టిఫికెట్లు ఇవ్వడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అవతవకలకు పాల్పడినట్టు సమాచారం. చేపల చెరువులు లేకున్నా, ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో మత్స్యశాఖ అధికారులు ఆ సమయంలో భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నారనే అభియోగాలున్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా చర్యలు బ్యాంకుల నుంచి చేపల చెరువుల కోసం రుణాలు పొందే సమయంలో హామీగా చూపించిన స్థలాలలో కొందరి సంతకాలు ఫోర్జరీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ స్కీం స్కాం వ్యవహారంలో ఫోర్జరీ సంతకాల ఎపిసోడ్ కూడా ఉంది. సంతకాలు అసలువా, ఫోర్జరీ చేశారా అనే విషయంపై ఫోరెన్సిక్ సైన్సు ల్యాబ్ ( ఎఫ్ఎస్ఎల్) నివేదికలను ఇక్కడి పోలీసులు తెప్పించుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం ఫోర్జరీతో పాటుగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈడీ దృష్టికి విషయం స్కాం గురించి గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకూ వెళ్లాయి. అంతేకాకుండా విశాఖపట్నంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)కి కూడా వెళ్లాయి. కొంతమందికి డీఆర్టీ నోటీసులు ఇచ్చింది. నోటీసులలో పేర్లు ఉన్నవారు ఆ నోటీసులను అందుకోకుండానే అందుకున్నట్టుగా, వీటి కోసం కొందరు న్యాయవాదులకు వకాల్తా ఇచ్చినట్టు తప్పుడు రిపోర్టులు డీఆర్టీకి పంపినట్టు సమాచారం. డీఆర్టీ విచారణలో ఈ వ్యవహారం బయటపడటంతో రాజీ మార్గాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఐడీబీఐ స్కాం వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సరిగ్గా ఇదేసమయంలో సీబీఐ కూడా తనిఖీల వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్పట్లో ఈ విషయంలో క్రియాశీలక భూమిక పోషించిన వివిధ శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
ఇప్పటికీ సెహ్వాగ్ అదే జోష్
బెంగళూరు: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ అభిమానులందరికీ సుపరిచితమే. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన వీరూ.. అప్పుడప్పుడు పరిమిత ఓవర్ల లీగ్‌లో కనువిందు చేస్తునే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బ్యాట్ పట్టాడు సెహ్వాగ్. బెంగళూరులో కర్ణాటక చలన చిత్ర కప్(కేసీసీ) పేరిట చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ 10 ఓవర్ల మ్యాచ్‌ల్లో నటులు, కర్ణాటకకు చెందిన క్రికెటర్లతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే దక్షిణాది నటుడు కిచ్చా సుదీప్ కెప్టెన్‌గా ఉన్న కదంబ లయన్స్ జట్టులో సెహ్వాగ్ సభ్యుడు. దీనిలో భాగంగా ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్ బ్యాట్‌తో అలరించాడు. మరోసారి బ్యాట్ పడితే ఎలా ఉంటుందో సెహ్వాగ్ రుచి చూపించాడు. ఓపెనర్‌గా దిగిన సెహ్వాగ్.. తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టి తన సత్తా చూపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
తాజాగా మరోసారి బ్యాట్ పట్టిన సెహ్వాగ్