డిసెంబ‌ర్ 19 నుంచి హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ | Hyderabad Book Fair Starting from December 19 | Sakshi
Sakshi News home page

Hyderabad Book Fair: రెండు వేదికలు.. 347 స్టాల్స్‌..

Published Sat, Dec 14 2024 7:12 AM | Last Updated on Sat, Dec 14 2024 7:12 AM

Hyderabad Book Fair Starting from December 19

నగరంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శన 

డిసెంబరు 19 నుంచి 29 వరకూ 

‘సాక్షి’తో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి ఆర్‌ వాసు 

కవాడిగూడ : నగరంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శనను డిసెంబరు 19 నుంచి 29 వరకూ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కార్యదర్శి ఆర్‌ వాసు వెల్లడించారు. ఈ సందర్భంగా సాక్షితో పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బుక్‌ఫేయిర్‌ ప్రారం¿ోత్సవానికి ఎవరు వస్తున్నారు..? అని ప్రశ్నించగా.. 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు హాజరవుతారని, పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తారని వాసు తెలిపారు. మొత్తం ఎన్ని స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు..? అనేదానికి ఈ పుస్తక ప్రదర్శనలో మొత్తం 347 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. అందులో తెలుగు 171, ఇంగ్లి‹Ù, ఇతర భాషలు 135, స్టేషనరీ 10, ప్రభుత్వ స్టాల్స్‌ 14 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  

ఓపెనింగ్స్‌కి రెండు వేదికలు.. 
అయితే గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, బుక్‌రిలీజ్‌ ఫంక్షన్‌లకు ఒకే వేధిక ఉండేదని, ఈ సంవత్సరం ఒకటి బోయి విజయభారతి పేరుతో, మరొకటి తోపుడు బండి సాదిక్‌ పేరుతో మొత్తం రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ సారి బుక్‌ఫెయిర్‌ ప్రాంగణానికి దాశరథి శతజయంతి సందర్భంగా  దాశరథి కృష్ణమాచార్య పేరుతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  

సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా.. 
ప్రతిరోజూ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, రెండు వేదికలపైనా పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని వివరించారు. దీంతో పాటు స్టాల్స్‌ నిర్వాహకుల ఇబ్బంది లేకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని, ఇందు కోసం హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు 15 మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పడిందని, మొత్తం 7 టీములుగా ఏర్పడి, గత రెండు నెలలుగా స్టాల్స్‌ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, ఏ విధంగా సహాయపడాలో ప్లాన్‌ వేసుకున్నామని తెలిపారు. 

మెరుగ్గా.. ఫుడ్‌ స్టాల్స్‌.. 
గతంలో కంటే ఈ సారి కాస్త మెరుగ్గా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన వంటకాలకు సంబందించిన ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఇరానీ చాయ్, హైదరాబాద్‌ బిర్యానీ, కబాబ్స్, తెలంగాణ పిండివంటలు, చాట్‌ ఐటమ్స్‌ వంటివి ఈ సారి ఆహార ప్రియులకు రుచికరమైన విందును అందించనున్నాయి.  

పారిశుధ్యానికీ ప్రాధాన్యం..
పుస్తక ప్రియులకు గతంలో నిర్వహించిన బుక్‌ ఫెయిర్‌లో టాయిలెట్లకు కొంతమేర ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమే. ఈ సారి వాటిని అధిగమించడానికి మొబైల్‌ టాయిలెట్స్‌తోపాటు ప్రత్యేక టాయిలెట్స్‌నూ ఏర్పాటు చేశాం. అయితే టైమింగ్స్‌ విషయంలోనూ కొద్దిగా మార్పులు చేశాం.. గతంలో మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఉండేది. ప్రస్తుతం సాహితీ అభిమానుల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బుక్‌ఫెయిర్‌ అందుబాటులో ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement