Book fair
-
ఉద్యమ వాస్తవ చరిత్ర..
ప్రపంచీకరణ అనంతరం వ్యక్తివాదం పెరిగి పోయి ఉద్యమాలు ఉండవు అనే ప్రచారం బలంగా నడుస్తున్న కాలంలో ప్రాంతీయ అస్తిత్వ వేదనలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుండి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక విద్యార్థులది. మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే.విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక స్వాతంత్య్ర ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటాల స్పూర్తి, ప్రభా వాలు ఉన్నాయి. ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అట్లా ఎగిసిన విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీల కనుసన్నల్లోకి ఎలా పోయింది? దానికి పని చేసిన శక్తులేవి? తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కి తగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర ఇది. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే (నలమాస కృష్ణ) పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.ఇది అకడమిక్ పరిశోధన కాబట్టి దీనికి పరిమితులు ఉన్నా... ఇది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా నమోదు చేసిందని మాత్రం చెప్పవచ్చు. అలా భవిష్యత్తు పరిశోధనకు దారులు వేసిందన్నమాట. ఉద్యమం నడుస్తుండగానే తీరికలేని కార్యాచరణలో దాని తీరూ తెన్నులపై చేసిన ఓ విశ్లేషణ ఇది. ఆ పరిమితుల్లో దీన్ని అర్థం చేసుకుంటూ అధ్యయం చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరుగనున్న ఈ పుస్తకావిష్కరణకు అందరూ ఆహ్వానితులే. – అరుణాంక్, డేవిడ్ (నేడు హైదరాబాద్‌లో ‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’ పుస్తకావిష్కరణ) -
‘చదువరి చెంతకు పుస్తకం’.. ప్రారంభం కానున్న జాతియ పుస్తక ప్రదర్శన!
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. కోల్‌కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటల్ మీడియా వెల్లువలోనూ.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. పిల్లలకు ప్రత్యేక పోటీలు.. బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్‌షాపు, గ్రూప్‌డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. -
సాహిత్య ఒడంబడికలు
59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది. ‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్‌ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు. ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది. అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్‌మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే! ‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు. చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!! మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే! ‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ -
హైదరాబాద్ లో 35వ నేషనల్ బుక్ ఫెయిర్
-
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
Hyderabad National Book Fair: బుక్‌ఫెయిర్‌కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్‌ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి అంటే?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మరోసారి పుస్తకప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తకప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు. అంచెలంచెలుగా... నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్‌గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. కథలు, నవలలు, గల్పికలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
పర్స్‌లు కొట్టేస్తూ పోలీసులకు చిక్కిన నటి, విచారణలో షాకింగ్ విషయాలు
Actress Rupa Dutta Arrested For Theft Wallets: ప్రముఖ టీవీ నటి దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. బెంగాలీ టీవీ నటి రూపా దత్త ఓ బుక్ఫేయిర్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో కలకత్తా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త బెంగాలీ సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాలు.. బెంగాలీ సీరియల్స్‌తో రూపా దత్తా నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కలకత్తాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ఫేయిర్లో ఖాళీ పర్సు చెత్త బుట్టలో పడేస్తూ పోలీసులకు చిక్కింది. చదవండి: Poonam Kaur: ప్రభాస్ అలాంటి వాడు, పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా.. బ్యాగ్‌లో ఎన్నో వ్యాలెట్లు భయపడ్డాయి. అందులో రూ. 70వేలకు పైగా నగదు ఉంది. దీంతో ఆ నగదుతో పాటు ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని రూపాను విచారించారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయం చెప్పిందని, తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు కలకత్తా పోలీసులు తెలిపారు. డబ్బుతో బయటపడిన డైరీ పలు సంచలన విషయాలు వెలుగు చూశాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్ రూపా దత్తాకు చోరీ చేయడం కొత్తేమి కాదని, అంతకుముందు చాలా సార్లు చోరీలు చేసిందని, వాటికి సంబధించిన వివరాలన్నీ డైరీలో రాసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని రూపా కూడా అంగీకరించింది. కోల్‌కతాలోని రద్దీ ప్రదేశాలలో పిక్ ప్యాకెట్స్ చేసేదాన్ని అని, డబ్బు కోసం ఇలా చేయాల్సివచ్చిందని తెలిపింది. దీంతో ఆమెపై పలు కేసులు నమోదు చేసి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల రూపా దత్తా లైంగిక ఆరోపణలు చేసి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. -
పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడు
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతిపెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహమన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమెస్కో అధ్యక్షుడు విజయ్‌కుమార్, పుస్తక మహోత్సవ కో–ఆర్డినేటర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుక ఏపీ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ రూపొందించిన 2022 క్యాలండర్‌ను ప్రత్యేక ప్రధాన కా>ర్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో వచ్చి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీమోహన్ నేతృత్వంలో టీటీడీ పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ డి.గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్య సమాచార కమిషనర్ రమేష్‌కుమార్, కమిషనర్లు రవికుమార్, రమణకుమార్, జనార్ధనరావు, ఐలాపురం రాజా, శ్రీనివాసరావు, హరిప్రసాదరెడ్డి, చెన్నారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జునరావు తదితరులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్: బుక్ ఫెయిర్‌కు పోటెత్తిన పాఠకులు
-
పుస్తకాలు చదివే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు
కవాడిగూడ (హైదరాబాద్): పుస్తకాలు చదవడంతోనే ప్రజలకు మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందని, అందుకుని దర్శనమే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల వేలాది పుస్తకాలు చదివి తెలంగాణను సాధించారని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనకోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలను చైతన్య పరిచి రాష్ట్రానికి తన జీవితాన్ని అర్పించారని మంత్రి వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌కు బోనాలతో స్వాగతం పలికారు. చిందు ఎల్లమ్మ వేదికపై జరిగిన సమావేశంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఎల్లప్పుడు పూర్తి సహకారం ఉంటుందని హామీనిచ్చారు. గోల్కొండ పత్రికతో కవులు, రచయిత సంఖ్య తెలియజెప్పారు నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో కవులు రచయితలు లేరన్న సందర్భంలో సు రవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక నిర్వహిస్తూ తెలంగాణలో కవులు రచయితల సంఖ్యను చెప్పిన మహోన్నత వ్యక్తి అని మంత్రి గుర్తు చేశారు. నిరంతరం బుక్‌ఫెయిర్ నిర్వహించేందుకు రవీంద్రభారతిలో స్థలం కేటాయిస్తామని బుక్‌ఫెయిర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌ రీశంకర్ మాట్లాడుతూ బుక్‌ఫెయిర్‌ను పుస్త క ప్రేమికులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సాంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మదర్ ఫెయిర్
‘మనసు ఉంటే మార్గమూ ఉంటుంది’. చెన్నై బుక్ ఫెయిర్ ఈ నానుడిని నిజం చేస్తోంది. కోవిడ్ కారణంగా ఇల్లు కదలని వాళ్లు కూడా బుక్ ఫెయిర్‌కు వస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మొదలైన ఈ బుక్ ఫెయిర్ మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది. చెన్నైలోని నందనం, వైఎమ్‌సీఏలో ఏడు వందల స్టాళ్లతో మొదలైన ఈ బుక్ ఫెయిర్‌లో వేలాది పుస్తకాలున్నాయి. సాధారణంగా బుక్ ఫెయిర్‌లో పుస్తకప్రియులతోపాటు రచయిత లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ దఫా కూడా రచయితలు తమ పుస్తకాల పట్ల పాఠకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం రోజూ బుక్ ఫెయిర్ కు వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకం ఏమిటంటే... పేరెంట్స్ తమ పిల్లలను బుక్ ఫెయిర్‌కు తీసుకురావడం. పేరెంట్స్‌లో కూడా తల్లులే అధికంగా కనిపిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఏడాది నుంచి గడపదాటలేదు. ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలతో పిల్లలు విసిగిపోతున్నారు. వాళ్లకు నచ్చే పుస్తకాలు కొనిద్దామని తీసుకువచ్చామని చెబుతున్నారు బుక్ ఫెయిర్‌కి పిల్లలతో వచ్చిన తల్లులు. ‘ఈ కోవిడ్ విరామం పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మనకు నచ్చినవి కొనుక్కుని వెళ్లి వీటిని చదవండి అంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలగదు. వాళ్లనే తీసుకు వచ్చి చూపించినట్లయితే తమకు ఇష్టమైన వాటినే ఎంచుకుంటారు, ఇష్టంగా చదువుతారు కూడా’ అన్నారు తన ఇద్దరు పిల్లలతో బుక్ ఫెయిర్ కొచ్చిన రాజి. బుక్ ఫెయిర్‌లో జనసమ్మర్ధం విపరీతంగా ఉంటుందేమోనని రావడానికి కొంచెం భయపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడూ ఉండే రష్ లేదు. మాస్కు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపించకుండా ఇక్కడ మాస్కు ఇస్తున్నారు. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహకులు కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటిస్తున్నారు. దాంతో ధైర్యంగా ఎక్కువ సమయం ఉండగలుగుతున్నాం. కొత్త పుస్తకాలను కూడా డిస్కౌంట్లో ఇస్తున్నారు. దాంతో నాలుగు కొనాలనుకున్న వాళ్లు కూడా మరో రెండు ఎక్కువగా తీసుకుంటున్నాం’ అన్నారామె. చెన్నై బుక్ ఫెయిర్‌లో షాపింగ్ -
ఈచ్ వన్–టీచ్ వన్‌కు పుస్తకం పనిముట్టు
33వ జాతీయ పుస్తకప్రదర్శన హైదరాబాద్ మహానగరంపై చెరిగిపోని సంతకం చేసింది. మాకు కొండంత అండగా ఉన్న రాష్ట్రముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అభినందనలు తెలియజే స్తుంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు సాగిన ఈ పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ‘ఈచ్ వన్–టీచ్ వన్’ పిలుపునందుకుని ఈ పుస్తక ప్రదర్శనలను ఒక ఉద్యమంగా గ్రామగ్రామానికి తీసుకుపోతామని బుక్‌ఫెయిర్ నిర్వాహక కమిటీ ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయ తీలు, పోలీస్స్టేషన్లు, మున్సిపాల్టీలు, పట్టణాల లోని అపార్ట్మెంట్ల దాకా పుస్తక ప్రదర్శనలను తీసుకుపోయేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలు హోదాలలో వున్న ప్రతినిధులు, పాలనారంగానికి చెందిన ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అన్ని కార్యక్రమాలకు పూలదండలు, శాలువాలు, బోకేలకు బదులుగా పుస్తకాలను బహుమతులుగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని పుస్తక ప్రదర్శన కోరుతుంది. బహుమతులుగా ఇచ్చిన పుస్తకాలను తిరిగి పేద విద్యార్థులకు, విద్యాసంస్థలకు బహూకరిస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరం నుంచి 33 జిల్లాల వరకు పుస్తక ప్రదర్శనలను తీసుకుపోవడమే కాకుండా ఇకపై చేయబోయే పుస్తక ప్రదర్శనలను ‘‘టీచ్ వన్–ఈచ్ వన్’’ నినాదంగా ముందుకు తీసుకుపోవాలి. జ్ఞాన తెలంగాణ కోసం 2020 సంవత్సరం పొడుగుతా పుస్తక ప్రదర్శనలను కొనసాగించి ‘అక్షర తెలంగాణ’గా రూపొందించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్యను పటిష్టం చేసేందుకు పుస్తక ప్రదర్శనలను ఒక పని ముట్టుగా అందించాలన్న దీక్షతో కృషి చేయాల్సి ఉంది. పుస్తక ప్రదర్శనలంటే అమ్మకాలు, కొనుగోలు కార్యక్రమాలు అన్న దృక్పథాన్ని మార్చి పుస్తక ప్రదర్శనలను కూడా నాలెడ్జ్ సెంటర్లుగా మార్చేం దుకు ప్రయత్నించడం ఒక పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లుగా పుస్తక ప్రదర్శనల సందర్భంగా వందల కాలేజీల్లో, స్కూళ్లలో సెమినార్లు నిర్వహించడం జరిగింది. పిల్లలతో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించి పుస్తకంపై ప్రచారం కొనసాగించారు. మాతృభాషను సంరక్షించుకునే పనిని, తెలుగు భాషపై ప్రేమను, మమకారాన్ని పెంచేం దుకు, కొత్త తరానికి తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని అందించే విధంగా పుస్తక ప్రదర్శనలను తీర్చిదిద్దాలన్న తలంపుతో బుక్‌ఫెయిర్ కమిటీ ముందుకు సాగడం మొత్తం సమాజం ఆహ్వానించదగింది. పుస్తకాలు చదవటంపై అభిలాషను పెంచటం పుస్తక ప్రదర్శన లక్ష్యం. గ్రంథాలయాలు చేసే పనిని బుక్‌ఫెయిర్ కూడా తమ శక్తి మేరకు చేయా లని తలంచటం రాష్ట్ర గ్రంథాలయాల పునర్నిర్మాణ ఉద్యమానికి దోహదపడుతుంది. ఆసక్తిగల పాఠకులతో బుక్‌లవర్స్ గ్రూప్స్ ఏర్పాటు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాల్సి ఉంది. సంపూర్ణ అక్షరాస్యతకు కావాల్సిన సాహిత్యాన్ని శక్తికొద్దీ బుక్‌ఫెయిర్ ద్వారా కూడా అందించే ప్రయత్నం ముమ్మరంగా జరగాలి. ఇప్పటికే వయోజన విద్యాకేంద్రాల ద్వారా సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బుక్‌ఫెయిర్ నిర్వహణదారులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సంపూర్ణ అక్షరాస్యతకు ప్రోత్సాహం కల్గించే విధంగా సాహిత్యాన్ని తయారుచేసి అందించే పనిని శక్తికొద్దీ చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈ స్ఫూర్తితో 2020 సంవత్సరానికి 2020 పుస్తక ప్రదర్శనలు జరపాలని బుక్‌ఫెయిర్ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే అది ‘ఈచ్ వన్–టీచ్ వన్’ నినాదానికి అండగా మారుతుంది. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ -
విజేత ఉంటే విజయం మీ వెంటే!
-
బుక్ఫెయిర్లో ఆ స్టాల్స్ ఎంతో ప్రత్యేకం!
-
‘ఫోన్లు కాదు పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి’
-
‘ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదు’
-
బుక్ ఫెయిర్
కలల వరద ప్రపంచంతో సంభాషించడా నికి అరుణాంక్ లత ఒక స్వప్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. కలలో తొణికిన ప్రేమను అంతే జాగ్రత్తగా లేఖలుగా మలిచి పాఠకుల ముందుకు తెచ్చాడు. ‘యే తొలి సంధ్య వేళ సూర్యోదయమో, మలి సంధ్య వేళ చంద్రోదయమో చూసినప్పుడు తెరలు తెరలుగా చుట్టుము’ట్టే జ్ఞాపకాల పునాదులు ‘ఖ్వాబ్’లో ఉన్నాయి. ‘హృదయం బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా, పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ’ అని కలవరిస్తాడు. ఇందులో గుండె ఉక్కబోతలు, వాన పలకరింపులే కాదు, ఒక విధ్వంసం కోసం మరో విధ్వంసానికి బలవుతున్న నల్లమల వ్యథ, అసు వులు బాస్తున్న అఖ్లాక్‌ల కథ, వాఘా యుద్ధోన్మాద ప్రకటనలపై విసుర్లు కూడా ఉంటాయి. అందుకే ఇది ప్రేమ, విప్లవాల మేలుకలయిక. మరోవైపు తలత్, సైగల్ గొంతుల పలవరింత మైమరపిస్తుంది. మీరూ వినండి. (ఖ్వాబ్ –అరుణాంక్ లత, వెల: రూ. 120) బస్తర్ తిరుగుబాటు స్వాతంత్య్ర పోరాటంతో సహా ఆదివాసీలు ఎన్నో అసమాన పోరాటాలు చేసినా అవి ఎందుకో సరైన రీతిలో సమగ్రంగా చరిత్రకు ఎక్కలేదు. అలా విస్మృతికి గురైన మరో పోరాటం భూంకాల్ విప్లవ పోరాటం. ఆ పోరాటం నుంచి ఆవిర్భవించినవాడే గుండాధూర్. రాజకీయ నేతలెవరూ ఇంకా స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తక ముందే ఆదివాసీ సమాజం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, తన జీవిత కాలంలోనే పురాణ పురుషుడిగా ఖ్యాతినొందాడు గుండాధూర్. 1910లో 30 గోండు రాజ్యాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంకాల్ తిరుగుబాటు అనివార్యమైంది. గుండాధూర్ చేసిన పోరాటాలు బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీలను ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి. (భూంకాల్– బస్తర్‌లో ఆదివాసీల తిరుగుబాటు–హెచ్.ఎల్.శుక్లా, వెల: రూ. 130) నమ్మకమిచ్చే కథలు కథలన్నీ సంకలనంగా రాకముందే, రచయితగా పాఠకులను మెప్పించినవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో అక్కిరాజు భట్టిప్రోలు ఒకరు. వస్తువును స్వీకరించడంలో, దాన్ని నడిపించడంలో, పాత్రలకు సహజత్వాన్ని అద్దడంలో.. వెరసి పాఠకుడిని కథలోకి ఆవాహన చేయడంలో ఆయన చేయి తిరిగినవాడని ‘మూడు బీర్ల తర్వాత’ సంపుటం నిరూపిస్తుంది. తాను చూసిన జీవితంలోంచే కథా వస్తువులను స్వీకరించాడు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలోని మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించడంలో, అనుభూతి ప్రకంపనలు కోల్పో కుండా కొన్నిసార్లు కథను తర్కబద్ధంగా నడిపించడంలో, ఎవరినీ తప్పుబట్టకుండా జీవన వైరుధ్యాలను ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ పాఠకుడిని ఆకట్టుకుంటుంది. తన జీవన ప్రయాణంలోని అనుభవాలకు ఇచ్చిన ఈ కథలు కొన్నిసార్లు మనకూ తారసపడతాయి. – దేశరాజు (మూడు బీర్ల తర్వాత –అక్కిరాజు భట్టిప్రోలు, వెల: రూ. 170) నిలువెత్తు హింస అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి చేపట్టే భూసేకరణలో అంతు లేని హింస చోటుచేసుకుంటోంది. అందుకు దక్షిణ ఛత్తీస్ గఢ్ నిదర్శనం. అక్కడ ఏం జరిగిందనే వివరాలతో అక్కడి లైంగిక హింసపై ‘నిలువెత్తు సాక్ష్యం’ కార్యాచరణ బృందం వెలువరించిన పుస్తకాన్ని మలుపు ప్రచురణలు తెలుగులోకి తీసుకొచ్చింది. గనుల తవ్వకాల కోసం, ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం స్థల సేకరణ, వారి సామగ్రి రక్షణకు సీఆర్పీఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరిస్తే, ప్రైవేట్ కంపెనీల అవసరాల కోసం సొంత సైన్యాలు రంగంలోకి దిగాయని సమాచారం. వీరంతా కలిసి రెండున్నర లక్షల మంది ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టారు. వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి, అవమానించి తరిమేయడానికి లైంగిక హింసను ఆయుధంగా వాడుకున్నారు. (నిలువెత్తు సాక్ష్యం–దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో లైంగిక హింస, వెల: రూ.130) కవిత్వపు గింజలు పల్లెను ప్రేమించడానికి అక్కడివారే కానక్కర్లేదు. పంటను కళ్లకద్దుకోవడానికి వ్యవసాయదారుడే అవ్వక్కర్లేదు. పచ్చదనాన్ని కలగనడానికి పర్యావరణవేత్తే కానక్కర్లేదు. ‘అతనికి అందరూ తెలియక పోవచ్చు/కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ/అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే–’ అని రైతు గురించి రాయగలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గురించి కూడా కవిత్వం తెలిసినవారందరికీ తెలుసు. పంటను తగలబెట్టకు తండ్రీ, పంట కాల్వ, ధాన్య మానవునికి, మట్టి బిడ్డా, వరిపొలానికి కృతజ్ఞతల్తో, మళ్లీ నా వ్యవసాయ కళాశాలకు వంటి కవితలతో అన్నంపెట్టే రైతుపట్ల, వ్యవసాయంపట్ల తనకు గల అపార అభిమానాన్ని మరో సారి ఆయన చాటుకున్నారు. ‘వాళ్లు/ నేలతో నీటితో నింగితో నిప్పుతో/కలిసి బతికేవాళ్లు/అందుకే వాళ్లకు ప్రేమా దయా కృతజ్ఞతా/చల్లని చూపూ తెలుసు’అంటూ ప్రజల్ని అభిమానించే కవి కాబట్టే ‘కళ్లకు కాసిన్ని/చూపు ఉత్సవాల్ని ఇవ్వకుండా’ ఇంతగా పరుగెత్తాలా అని నిలదీస్తాడు.(ధాన్యం గింజలు–దర్భశయనం శ్రీనివాసాచార్య, వెల: రూ. రూ.80) పల్లె చెప్పిన పాఠం పల్లెటూరినుంచి మద్రాస్ వలసపోయిన విద్యాధిక కుటుంబంలో పుట్టి పెరిగిన పట్నవాసం అమ్మాయి.. పెళ్లయి పల్లె జీవితంలోకి వచ్చి పడితే ఎన్ని వైరుధ్యాలమధ్య నలగవలసి వస్తుందో చెప్పిన అనుభవాల పరంపరే ‘పాలంగి కథలు’. మద్రాసులో గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా పెరిగిన రచయిత్రి.. తణుకు పక్కన పాలంగి పల్లెటూరులో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆధునికత దరిచేరని సమాజంలో, భిన్నమైన వాతావరణంలో ఎలా ఒదిగి పోయిందీ ‘పాలంగి కథలు’లో ఆత్మకథనాత్మక రీతిలో పాఠకుల ముందుపెట్టారు. ఇది ఆమె జీవితం మాత్రమే కాదు. అలనాటి సంప్రదాయ కుటుంబాల స్త్రీల జీవితాల ప్రతిబింబమీ కథలు. ఒక్క మాటలో చెప్పాలంటే ’ఈతరం వారు ఎప్పటికీ చూడలేని, అనుభవించలేని ఒక సహజ సుందరమైన గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకుపోయే’ అరుదైన రచన. దీన్ని చదివే అనుభవాన్ని కోల్పోవద్దు. – కె. రాజశేఖరరాజు వెల: 100, ప్రతులకు స్టాల్ నంబర్ 275 -
అందుకే స్ర్తీవాద రచనలు చేస్తాను!
-
‘మాటల మడుగు’ మెర్సీ.. ‘లవ్ లెటర్స్’ కడలి..
-
పుస్తకం రాయడానికి అంతకు మించి ఇంకేం కావాలి!
-
ఈ ఏడాది ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి!
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి
వేలకొలది పుస్తకాలు.. లక్షలాది మంది పాఠకులు, వీక్షకులు.. కవులు, రచయితలు, పబ్లిషర్స్, ప్రముఖులు.. ఇలా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రారంభమైన నాటినుంచి అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డున తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) వేదికగా ఒక జాతరలా, ఒక ఉత్సవంలా, ఒక వేడుకలా జరుగుతున్న హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.