Actress Rupa Dutta Arrested For Theft Wallets: ప్రముఖ టీవీ నటి దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. బెంగాలీ టీవీ నటి రూపా దత్త ఓ బుక్‌ఫేయిర్‌లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో కలకత్తా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త బెంగాలీ సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాలు.. బెంగాలీ సీరియల్స్‌తో రూపా దత్తా నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కలకత్తాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్‌ఫేయిర్‌లో ఖాళీ పర్సు చెత్త బుట్టలో పడేస్తూ పోలీసులకు చిక్కింది.
చదవండి: Poonam Kaur: ప్రభాస్ అలాంటి వాడు, పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా.. బ్యాగ్‌లో ఎన్నో వ్యాలెట్‌లు భయపడ్డాయి. అందులో రూ. 70వేలకు పైగా నగదు ఉంది. దీంతో ఆ నగదుతో పాటు ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని రూపాను విచారించారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయం చెప్పిందని, తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు కలకత్తా పోలీసులు తెలిపారు. డబ్బుతో బయటపడిన డైరీ పలు సంచలన విషయాలు వెలుగు చూశాయని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్
రూపా దత్తాకు చోరీ చేయడం కొత్తేమి కాదని, అంతకుముందు చాలా సార్లు చోరీలు చేసిందని, వాటికి సంబధించిన వివరాలన్నీ డైరీలో రాసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని రూపా కూడా అంగీకరించింది. కోల్‌కతాలోని రద్దీ ప్రదేశాలలో పిక్ ప్యాకెట్స్ చేసేదాన్ని అని, డబ్బు కోసం ఇలా చేయాల్సివచ్చిందని తెలిపింది. దీంతో ఆమెపై పలు కేసులు నమోదు చేసి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల రూపా దత్తా లైంగిక ఆరోపణలు చేసి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment