
నా మాటలను వక్రీకరించారు. నా వ్యాఖ్యలను ఇష్టమొచ్చినట్లుగా మార్చేసి నెగెటివ్‌గా రాశారు. దాన్నే అందరూ నిజమని నమ్ముతున్నారు. ఇదంతాచూస్తుంటే నా బుర్ర వేడెక్కుతోంది అంటోంది బెంగాలీ నటి మలోబిక బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముందుగా హీరో విజయ్ దేవరకొండకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.

ఆయనకు హిందీ భాష అంటే పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పాను. దాన్ని మీడియాలో దారుణంగా చిత్రీకరించారు. హిందీ అంటేనే తనకు గిట్టదని, ఆ భాషను అసహ్యించుకుంటాడని రాస్తున్నారు. నేనసలు అలా చెప్పనేలేదు. అయినా ఎంతో దారుణంగా ఇష్టమొచ్చినట్లుగా రాస్తున్నారు. దీనివల్ల మంచి మిత్రుడికి దూరమయ్యాను.

నేను చాలా సరదాగా అన్న మాటలను సీరియస్‌గా రాశారు. అది చదివాక విజయ్ నాతో టచ్‌లోనే లేకుండా పోయాడు. నేనేదో సరదాగా అన్నానే తప్ప ఆయన్ను ఇరికించాలనో, తప్పు పట్టాలనో పనిగట్టుకు చెప్పలేదు' అని పేర్కొంది.
కాగా మలోబిక దిల్‌బర్, ప్రెట్టీ గర్ల్ వంటి ప్రైవేట్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. దానికంటే ముందు బెంగాలీ, ఒరియా భాషల్లో అనేక సినిమాలు చేసింది. బంగ్లా బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. విజయ్ దేవరకొండతో.. నీ వెనకాలే నడిచి అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది.
చదవండి: కుడి కాలు, చేయి ఫ్రాక్చర్.. కోలువకోడం కష్టంగా ఉంది: నవీన్ పొలిశెట్టి
Comments
Please login to add a commentAdd a comment