
‘కూలీ’ సినిమా కోసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ , సత్యరాజ్, రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నారు. ‘కూలీ’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జైపూర్‌లో మొదలైందని కోలీవుడ్ సమాచారం.
రజనీ, ఆమిర్‌తో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ఖాన్ నటిస్తారనే ప్రచారం గతంలో సాగింది. తాజాగా ఆయన జైపూర్‌కు వెళ్లడంతో ఈ మూవీలో ఓ రోల్‌లో నటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. 1995లో వచ్చిన ‘అతంక్ హీ అతంక్’ సినిమాలో రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ‘కూలీ’ కోసం రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ మే 1న రిలీజ్ కానుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment