Coolie
-
సామజవరగమన హీరోయిన్‌కు సూపర్ ఛాన్స్?
‘సామజవరగమన’ సినిమాలో మంచి నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ . అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్ చాన్స్ లభించిందట. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు రెబ్బా మౌనికా జాన్ ను లోకేష్ కనగరాజ్ ఎంపిక చేశారని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్‌తో స్క్రీన్ స్పేస్ అంటే ఆమెకు కెరీర్ పరంగా ఓ సూపర్‌చాన్స్ కావొచ్చు. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, శ్రుతీహాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. సత్యరాజ్, మహేంద్రన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
వారం తర్వాత కూలీగా...
‘కూలీ’గా మారిపోవడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్. ఆయన హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో సత్యరాజ్, శోభన కీలక పాత్రల్లో నటించనున్నారని, కమల్‌హాసన్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కాగా ‘కూలీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గర పేర్కొన్నారు రజనీకాంత్.తొలి షెడ్యూల్ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభం కానుందని తెలిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ‘కూలీ’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘వేట్టయాన్’ను అక్టోబరు 10న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా రజనీకాంత్ పేర్కొన్నారు. -
రైల్వే కూలీగా రాహుల్ గాంధీ
ఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. కూలీ నెం.1లో వెంకటేశ్‌లా కనిపించారు. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అభిమానులను అలరించారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రైల్వే కూలీలను కలిసి వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు చేసే పనిని స్వయంగా చూసి తాను కూడా మూటలు మోశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ అక్కడ ఉన్న కూలీలు నినాదాలు చేశారు. ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. భారత్ జోడో యాత్ర నడుస్తుందని స్పష్టం చేసింది. He came to listen to the hearts of the people…!!! Shri @RahulGandhi ji… Dressed in the coolie brothers' clothes and picked up the luggage with them at Delhi's Anand Vihar railway station, pic.twitter.com/vPMH3VHdY1 — Telangana Youth Congress (@IYCTelangana) September 21, 2023 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి కూడా 1983 చిత్రం మజ్దూర్లోని "హమ్ మెహనత్కాష్ ఈజ్ దునియా సే" పాటతో రైల్వే స్టేషన్లో రాహుల్ గాంధీ బ్యాగులు లాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. యువనేత పోస్ట్‌కు "ప్రజానాయకుడు" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. जनता का नायक ❤️ pic.twitter.com/6MRkPTmlUM — Srinivas BV (@srinivasiyc) September 21, 2023 ఇదీ చదవండి: Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి -
ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.. ఏం చేయాలో అర్థం కాలేదు: జయా బచ్చన్
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో బిగ్ బీగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన భార్య జయా బచ్చన్ తమ జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో వచ్చిన కూలీ సినిమా సెట్స్‌లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని తలుచుకుని ఎమోషనలయ్యారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన కళ్లముందు కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో దేవున్ని ప్రార్థించడం తప్ప తనకేలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఇవాళ జయ- అమితాబ్ 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) దేవుడిని ప్రార్థించమన్నారు: జయా బచ్చన్ జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను ఆసుపత్రికి వెళ్లగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాం.' అని జయా బచ్చన్ ఆనాటి సంఘటనను వివరించారు. కాగా.. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించారు. అసలేం జరిగిందంటే... అమితాబ్ బచ్చన్ 1982 ఆగస్టు 2న కూలీ సెట్స్‌లో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో నటుడు పునీత్ ఇస్సార్‌తో ఫైట్ సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది. పొత్తికడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా చికిత్సకు స్పందించలేదు. వెంటిలేటర్‌పై ఉంచేముందు ఆయన కోసం దేవున్ని ప్రార్థించడమే తప్ప ఏం చేయలేమని డాక్టర్ చెప్పారని ఆ రోజు భయానక పరిస్థితిని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి) -
కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ రైల్వే కూలీ చేతికి సుమారు రూ. 1.4 లక్షల ఫోన్ దొరికింది. ఐతే అతను ఆ ఫోన్‌ని నేరుగా రైల్వే పోలీసులకు ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ స్టేషన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దశరత్ దౌండ్ అనే రైల్వే కూలి దాదార్ రైల్వే స్టేషన్లో కూలీగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఐతే అతను ఎప్పటిలానే ఆరోజు కూడా అమృత్‌సర్‌కి వెళ్లే రైలు ఆగి ఉన్న ఫ్లాట్ ఫాం 4 వద్ద తన పనిని ముగించుకుని ఇంటికి పయనమవుతున్నాడు. ఆ క్రమంతో రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఒక ఖరీదైన ఫోన్ కనిపించింది. అది ఫ్లాట్‌ఫాంపై నడుస్తుండగా సీటింగ్ ఏరియాలో పడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులను ఆ ఫోన్ గురించి వాకబు చేస్తే మాది కాదనే చెప్పారు. దీంతో దశరత్ నేరుగా రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పి ఆ ఫోన్‌ని ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ ఎవరిదని అని ట్రేస్ చేస్తుండగా..అది అమితాబచ్చన్‌కి విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్‌కి చెందన ఫోన్ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ని బాధితుడు సావంత్‌కి అందజేసి ఈ విషయం చెప్పడంతో అతను ఒక్కాసారిగా ఆశ్చర్యపోయాడు. తన ఫోన్ తనకు తిరిగి లభించినందుకు బహుమతిగా ఆ కూలికి రూ. 1000 కూడా ఇచ్చాడు సావంత్. ఆ కూలీని పోలీసుల తోపాటు సావంత్ కుటుంబం కూడా ఎంతగానో ప్రశంసించింది. ఈ మేరకు కూలీ దశరత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను మర్చిపోయానని, సడెన్‌గా పోలీసుల నుంచి కాల్ రావడంతో ఈ విషయం గురించి తెలిసిందని చెబుతున్నాడు. అయినా తనకు గాడ్జెట్లపై ఎలాంటి అవగాహన లేదని, పైగా తాను ఎవరి వస్తువుని తన వద్ద ఉంచుకోనని చెప్పాడు. ఏదీఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అరుదు. (చదవండి: క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి.. పేరెంట్స్ అరెస్టు) -
కష్టం వృథా కాలేదు.. కూలి కుమారుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని మారుమూల మూగుపురం గ్రామానికి చెందిన కొంకాడ రమేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మార్చి 29న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. రమేష్ తండ్రి పురుషోత్తుకర్ర గ్రామానికి చెందిన ఆదినారాయణ, తల్లి మాణిక్యమ్మ. తల్లిదండ్రుల మధ్య మనస్ఫర్థల కారణంగా రమేష్ చిన్నప్పటి నుంచి తల్లితోనే మూ గుపురంలో పెరిగారు. మాణిక్యమ్మ కూలి పనులు చేసుకుంటూ రమేష్‌ను చదివించారు. రమేష్ ఒకటి నుంచి 7వ తరగతి వరకు టెక్కలి గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. ఇంటర్‌ను మెళియాపుట్టి మండలం పెద్దమడి రెసిడెన్షియల్ కళాశాలలో 2006లో పూర్తి చేశారు. తూముకొండ గ్రామానికి చెందిన తన చిన్నాన్న, పిన్ని రవికుమార్, వజ్రంల సహకారంతో 2009లో కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అనంతరం 2009–11లో విశాఖపట్నంలో ఎంబీఏ పూర్తి చేసి అనంతరం బీఎల్‌ను ఆంధ్రా యూనివర్సిటీలో 2015లో పూర్తి చేశారు. బీఎల్ పూర్తి చేశాక జడ్జి కావాలనే పట్టుదలతో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ పడిన సమ యంలో దరఖాస్తు చేశారు. అలా రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయినా నిరుత్సాహ పడకుండా 2020లో వెలువడిన నోటికేషన్లో ద రఖాస్తు చేసి రోజుకు సుమారు 20 గంటల పాటు కృషి చేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి 2022 మార్చి 29న విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సర్పంచ్ షణ్ముఖరావు, గ్రామస్తులు అభినందించారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్ చేయడంతో... -
తన కల కోసం కూలీగా మారింది!
తల్లే కూలి పనిచేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. అమ్మే పక్కన నిలబడితే ఏ కూతురి కలైనా తీరకుండా ఉంటుందా?! ఒక కలగంటోంది అనూరాధ. కేయేఎస్ ఆఫీసర్ అవాలి తను! ‘నో’ నువ్వు ఆ కల కనేందుకు లేదు. నీ పెళ్లి గురించి కలగను’ ఆనేశాయి ఆమె ఇంటి పరిస్థితులు. అయితే పరిస్థితుల్నే మార్చుకోవాలని నిశ్చయించుకుంది అనూరాధ. ‘‘ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకోకూడదు’’ అని తీర్మానించుకుంది. ఆమె కంటున్న కేయేఎస్ (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) కలకు పేదరికం మరో అవాంతరం అయింది. తనూ సంపాదిస్తేనే ఇంటికి ఇన్ని తిండి గింజలు. కలను పండించుకోడానికి పొలానికి వెళ్లింది. వ్యవసాయ కూలీగా నాలుగు రాళ్లు సంపాదిస్తూ, మిగతా సమయంలో కేయేఎస్ కు ప్రిపేర్ అవుతోంది. ఇరవై రెండేళ్ల అనూరాధ పోస్ట్ గ్రాడ్యుయేట్. పీజీ చేసి, కూలి పనికి వెళ్లేందుకు ఆమె ఏమీ సిగ్గుపడటం లేదు. పొలం నుంచి తిండి గింజలకు మాత్రమే అనూరాధ సంపాదించుకు రావడం లేదు. కొన్ని బుక్స్ కొనాలి. ఖరీదైనవి. కోచింగ్ కూడా అవసరం. ఆ ఖర్చుల కోసం కూడా పొలం పనులు చేస్తోంది. తలపై ఎర్రటి ఎండ. కనురెప్పల మాటున తను కంటున్న కల. కలే ఆమెకు ఆ ఎండలో చల్లదనం, శక్తీ! అడవి అంచుల్లో ఉంది ఆమె గ్రామం. మైసూరు జిల్లా, హెమ్డి కోటె తాలూకాలోని తిమ్మనహోతలహళ్లి. గ్రామంలా ఉండదు. గిరిజన గూడెంలా ఉంటుంది. అక్కడొక చదువుల పువ్వు పూసిందంటే ఏ అండా, ఆశా లేకుండా తనకై తను వికసించిందనే! అలాంటి విద్యాకుసుమం అనూరాధ. తండ్రి లేడు. ఆమె చిన్నతనంలోనే చనిపోయాడు. ఆస్తి లేదు. డబ్బు లేదు. తల్లే కూలి పని చేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. తల్లి మద్దతుతో కేయేఎస్ ప్రిలిమ్స్ పాసైనంతగా సంబరపడింది అనూరాధ. అయితే ఆ అమ్మాయి కేయేఎస్ ఆఫీసర్ అవాలని అనుకుంటున్నది తన కోసమో, తల్లి కోసమో కాదు. గిరిజన గూడేల్లో తనలాంటి ఆడపిల్లలు, ఇంటి బరువు బాధ్యతల్ని తమరొక్కరే మోస్తున్న తల్లులు ఇంకా ఉన్నారు. వారికోసం ఏమైనా చేయాలని అనుకుంది. పేదరికంలో ఉన్న ఆడపిల్లల్ని చదివించే ఆఫీసర్‌గా, వారి తల్లిదండ్రులకు నమ్మకమైన ఒక ఉపాధిని కల్పించగల అధికారిగా తను ఎదగాలని అనుకుంది. ఆ అనుకోవడం లోనే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి పొలం పనులకు వెళ్లి రావడంలోనే పి.ఇ.టి.సి.కి దరఖాస్తు చేసే గడువు తేదీ దాటిపోయాక గానీ ఆమెకు తెలియలేదు! ఐయ్యేఎస్, కేయేఎస్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమమే పి.ఇ.టి.సి. ప్రీ–ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రోగ్రామ్. సాంఘిక సంక్షేమ శాఖ ఉచితంగా ఈ శిక్షణను ఇస్తుంది. ఆన్లైన్లో ప్రాసెస్ అంతా నడవడంతో దరఖాస్తు సమాచారాన్ని సమయానికి చూడలేకపోయింది అనూరాధ. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు బస వసతి కాకుండా, కేవలం శిక్షణకే 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంత మొత్తం కూలి పనితో కూడబెట్టగలిగింది కాదు. ఇంకో పని కూడా వెతుక్కోవాలని అనూరాధ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేయేఎస్ ఆఫీసర్ అయ్యేందుకు అనూరాధ కష్టపడటం అసాధారణమైన విషయమే అయినప్పటికీ అనూరాధ వంటి ఒక నిరుపేద గిరిజన యువతి అసలు పీజీ చేయడం కూడా కేయేఎస్ ఆఫీసర్ అయినంత ఘన విజయమేనని శైలేంద్ర కుమార్ అంటున్నారు. గిరిజన సామాజిక కార్యకర్త అయిన శైలేంద్ర ప్రస్తుతం అనురాధ కోచింగ్ కోసం ఆర్థిక వనరుల్ని సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. -
విజయవాడ రైల్వే స్టేషన్ లో కూలీలా అవస్థలు
-
గుండె గు‘బిల్లు’
కమలాపూర్ : కూలీ ఇంటికి మోయలేని కరెంట్ బిల్లు వచ్చింది. నెలకు సగటున రూ.150 నుంచి రూ.250 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ.41,279 రావడంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. బాధితుడి బాధితుడి కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కూలీ వెల్దండి లక్ష్మీనారాయణ తన పేరిట 2217 సర్వీసు నంబరపై కొన్నేళ్ల క్రితం విద్యుత్ మీటరు తీసుకుని వినియోగించుకుంటున్నాడు. అయితే ఆయన కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి నెలా రూ.150 నుంచి రూ.250 వరకే బిల్లు వచ్చేది. అలాంటిది జూన్ నెలకు సంబంధించి రూ.41,279 బిల్లు వచ్చింది. దీంతో కంగుతిన్న లక్ష్మీనారాయణ వెంటనే బిల్లులు చెల్లించే కౌంటర్ వద్దకు శనివారం వెళ్లారు. అయితే రంజాన్ పర్వదినం కావడంతో అక్కడ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగించలేదని, నెలనెలా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి బిల్లు వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై విద్యుత్‌శాఖ ఏఈ లక్ష్మణ్‌నాయక్‌ను వివరణ కోరగా.. లక్ష్మీ నారాయణ ఇంటికి బిల్లు ఎక్కువ వచ్చేందుకు కారణాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు బిల్లు తగ్గింపుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పేదల బతుకు బుగ్గి
- అగ్నిప్రమాదంలో 18 గుడిసెలు దగ్ధం - రూ. లక్షల్లో నష్టం - కట్టుబట్టలతో మిగిలిన బాధితులు నంద్యాల: నంద్యాల పట్టణంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రలో ఉండగా చెలరేగిన మంటల నుంచి ప్రాణాలు రక్షించుకున్న పేదలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. స్థానిక రాణి, మహారాణి థియేటర్ సమీపంలో ఏడు సెంట్ల స్థలంలో పేదలు రెండు వైపులా 9 చొప్పున మొత్తం 18 గుడిసెలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరంతా పొలాల్లో, కూలీ పని చేసి జీవించేవారే. చలి కావడంతో అందరూ గుడిసెల్లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మొదట లక్ష్మీదేవి గుడిసెలో షార్ట్ సరూ్క్యట్ కారణంగా నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. వీరు కేకలు వేయడంతో మిగతా గుడిసెల వారు అప్రమత్తమయ్యారు. అయితే సమయంలో గాలులు వీయడంతో మంటలు అన్ని గుడిసెలకు వ్యాపించాయి. దీంతో పేదలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, రోడ్డుపైకి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కేవలం అరగంటలో గుడిసెలన్ని బూడిదయ్యాయి. గుడిసెల్లోని బీరువాలు, వంట సామగ్రి, దుస్తులు, తిండిగింజలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ముగ్గురు విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు కాలిపోయాయి. 18 కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. బాధితులకు రూ.లక్ష ఆర్థిక సహాయం: అగ్ని ప్రమాదం గురించి తెలియగానే వైఎస్సార్సీపీ ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం వారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి పక్కా ఇళ్లు ఇవ్వకుండా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇవ్వడంతో ఇంకా పేదలు గుడిసెల్లో నివసిస్తున్నారని చెప్పారు. బాధితులకు పక్కా ఇళ్లను నిర్మించాలని కోరారు. ఆయన వెంట 37వ వార్డు ఇన్చార్జ్ యూసుఫ్, అబ్దుల్లా, మల్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బా«ధితులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ... ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి బాధితులను పరామర్శించారు. లయన్స్ సేవా ప్రగతి కార్యదర్శి శివశంకర్ ఆధ్వర్యంలో బాధితులకు బియ్యం ప్యాకెట్లను, దుప్పట్లను అందజేసి భోజన వసతిని కల్పించారు. వైఎస్‌నగర్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లలోకి మార్చాలని, వీరికి పక్కా ఇళ్లను అందజేస్తామని ఆయన చెప్పారు. తహసీల్దార్ శివరామిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు బియ్యం, రూ.5వేల ఆర్థికసహాయాన్ని అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శేఖర్, వరప్రసాద్, దేవేంద్రనాథరెడ్డి, భాస్కరరెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, డాక్టర్ రవికృష్ణ, జీవీఎల్ నారాయణ పాల్గొన్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయాం: సంజమ్మ, బాధితురాలు: అగ్ని ప్రమాదంలో అందరూ సర్వనాశనమయ్యారు. తిండి గింజలు, వంట పాత్రలు సహ అన్ని దగ్ధమయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిపోయాం. ఏం చేయాలో, ఏం తినాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, నేతలు ఆదుకోవాలి. జీవనాధారం పాడైపోయింది: మద్దిలేటి, రజకుడు రోజూ తోపుడు బండిపై ఇస్త్రీ చేస్తూ జీవనం సాగించే వాడిని. కాని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉన్న నా తోపుడు బండి పాక్షికంగా దగ్ధమైంది. మంటలు ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది దీనిపైకి ఎక్కడంతో కుంగిపోయింది. నా జీవనాధారాన్ని కోల్పోయాను. -
బతుకుదెరువుకు వచ్చి..
* విగతజీవుడిగా మారి * రాజుకాల్వలో అనుమానాస్పద స్థితిలో కలకత్తాకు చెందిన కూలీ మృతి రాజుకాల్వ (రేపల్లె): పొట్టకూటి కోసం పనులకు వచ్చి అనుమానాస్పద స్థితిలో ఒక కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని రాజుకాల్వ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. రేపల్లెలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కలకత్తాకు చెందిన కాంట్రాక్టర్ పాల్ రొయ్యల చెరువుల్లో బోర్లు వేసేందుకు కలకత్తాకు చెందిన మిటూన్, భీమల్, కాజోన్, సామిన్లను ఈ నెల 27వ తేదీన రాజుకాల్వ పిలిపించాడు. వీరు కేశంనేని సాంబశివరావుకు చెందిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన షల్టర్‌లో ఉంటున్నారు. పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం బోర్లు వేసేందుకు వచ్చిన ఆర్డర్లతో పాటు మరికొన్ని ఆర్డర్లు రావటంతో కాంట్రాక్టర్ పాల్ మరికొంత మంది కూలీలను తీసుకువచ్చేందుకు కలకత్తా వెళ్ళాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పాల్ కుమారుడు సోనూ కూలీల బాగోగులు చూసుకునేందుకు రాజుకాల్వలో ఉంటున్న షెల్టర్‌లో చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. బ్యాగులు ఒకదానిపై ఒకటి ఉండడం గమనించి వాటిని సర్దేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని పరదాపట్టా కింద భీమల్(37) మృతదేహం కనిపించడం, మిగిలిన వారి జాడలేకపోవటంతో భయానికి గురై చుట్టుపక్కల వారిని కేకలు వేయగా వారు వచ్చి పరిస్థితిని పోలీసులకు తెలిపారు. రూరల్ సీఐ పెంచలరెడ్డి, చోడాయిపాలెం ఎస్సై పి.శివాజీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల డీఎస్పీ పి.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వారిపైన అనుమానం.. పనులకోసం కలకత్తా నుంచి వచ్చిన నలుగురిలో ఒకరు మృతి చెందటం, ముగ్గురు కనిపించకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు భీమల్తో పాటు వచ్చిన వారే భీమల్ను చంపి ఉంటారా, లేదా ఇతర కారణాలతో మృతి చెందాడా అనే కోణాలలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం, ప్రస్తుతం మృతదేహం ఉన్న పరిస్థితినిబట్టి హత్య జరిగి ఉండవచ్చని, శుక్రవారమే సంఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మాఫీమంటలు
కొవ్వూరు రూరల్ : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడి హామీ పేద కుటుంబాలను నిలువునా దహించివేస్తోంది. మాట తప్పిన సర్కారు వివిధ రూపాల్లో మహిళల ఉసురు పోసుకుంటోంది. ఓ వైపు కోర్టు సమన్లు, మరోవైపు నడ్డివిరిచే వడ్డీలతో బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతుండగా.. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటున్న మహిళా కూలీలకు చెల్లించే కూలి డబ్బులను బ్యాంకులు డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళా కూలీల కుటుంబాలు పట్టెడన్నం తినే అవకాశం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కడుపు కాల్చడమూ ప్రయోగాత్మకమే కొవ్వూరు మండలంలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీలకు ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా కూలి సొమ్ము చెల్లించేది. త్వరలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయిం చారు. తొలి విడతగా కొవ్వూరు మండలంలోని ధర్మవరం, దొమ్మేరు గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లోని ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో సుమారు 20 మంది ఉపాధి కూలీల సొమ్ము రూ.50 వేల వరకు బ్యాంకులు డ్వాక్రా రుణాల ఖాతాల్లో జమ చేసుకున్నాయి. పైగా ఈ మొత్తాలను ఆయా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా గ్రూప్ ఖాతాల్లో జమ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి ఆయనకు ఓటేస్తే.. రెక్కలు ముక్కలు చేసుకునే తమ నోటిదగ్గర కూడు లాగేసుకుంటున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఇదేం దారుణమయ్యా నాలుగు వారాలు కష్టపడితే రూ.4 వేలు కూలి డబ్బులు వచ్చాయి. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలో వేశామని అధికారులు చెప్పారు. తీసుకోవడానికి వెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకుంటున్నామని బ్యాంకోళ్లు చెప్పారు. మా తండ్రి దినకర్మలు ఉన్నాయని చెప్పి బతిమాలడంతో రూ.2 వేలు అప్పుకు జమ చేసుకుని రూ.2 వేలు ఇచ్చారు. మా గ్రూపు సభ్యులంతా కలిసి తీసుకున్న అప్పుకు ఆ సొమ్ము జమ చేశామంటున్నారు. నేను తీసుకున్న వ్యక్తిగత బాకీలో రాసుకోమంటే కుదరదంటున్నారు. నమ్మి ఓటేస్తే మా కడుపులు కాలుస్తారా. ఇదేం దారుణమయ్యా. – వానపల్లి దుర్గ, ఉపాధి కూలీ, ధర్మవరం ఎలా బతకాలి ఏ పనులూ దొరక్కపోవడంతో ఉపాధి పనులకు వెళుతున్నాం. చేతిదాకా వచ్చిన కూడు నోటిదాకా రావడం లేదు. కూలి డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకున్నామని చెప్పారు. కూలి డబ్బులు లేకపోతే మాలాంటోళ్లు ఎలా బతికేది. ఊరి పెద్దల సాయంతో వెళ్లి బ్యాంకోళ్లను బతిమాలుకుంటే రూ.2 వేలు కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటే మానేశాం. ఇప్పుడు కూలి డబ్బులు కూడా మాకు దక్కనివ్వటం లేదయ్యా. ఇలాగైతే మేమెలా బతకాలి. – పొలుమాటి వెంకాయమ్మ, ఉపాధి కూలి, ధర్మవరం కూలీలకు ఇబ్బందే కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పనులు చేసిన కూలీలకు బ్యాంకుల ద్వారా కూలి డబ్బు చెల్లిస్తున్నాం. డ్వాక్రా రుణాలు బకాయి ఉన్నారన్న కారణంగా మహిళా కూలీల వేతనాలను బ్యాంకర్లు ఆ ఖాతాలకు జమ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రభుత్వం కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. వారి కూలి డబ్బుల్ని బకాయిలకు జమ చేసుకోవడం వల్ల ఆయా కుటుంబాలు ఇబ్బందిపడతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం – ఎ.రాము, ఎంపీడీవో, కొవ్వూరు -
పేద కుటుంబంలో విషాదం
ఉపాధి కోసం సొంత గ్రామాన్ని కాదని తల్లిదండ్రులను, బిడ్డలను కాదని భార్యతో హైదరాబాద్ వెళ్తే అక్కడ మృత్యువు భర్తను కాటేసింది. భార్య గాయాల పాలైంది. దీంతో వృద్ధులైన తల్లిదండ్రులు తాము ఎలా బతికేదని తమ మనవరాళ్లను ఎలా పెంచేదని రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మంగళవారం నిర్మాణంలో ఉన్న భవనం కూలి మృతి చెందిన వారిలో జింకిభద్రకు చెందిన ధర్మారావు ఉన్నాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్తే... సోంపేట : జింకిభద్ర గ్రామానికి చెందిన వలస కార్మికుడు మామిడిపల్లి ధర్మారావు కుటుంబంలో మంగళవారం విషాదం అలుముకుంది. ధర్మారావు కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం స్వగ్రామాన్ని విడిచి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే కొన్నాళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో ధర్మారావు(45) భవన నిర్మాణ కార్మికుడిగా విధులు నిర్వíß స్తూ, మంగళవారం భవనం కూలిన ఘటనలో మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ధర్మారావు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జింకిభద్ర గ్రామానికి చెందిన నారాయణ, రాజులమ్మ కుమారుడైన మామడిపల్లి ధర్మారావు తల్లిదండ్రులను, కన్నబిడ్డలను పోషించడానికి పొట్ట చేత పట్టుకుని భార్యతో కలసి హైదరాబాద్ వలస కార్మికుడిగా వెళ్లాడు. కొద్ది సంవత్సరాలుగా వలస కార్మికునిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉంటే వచ్చిన వేతనం సరిపోదని, వృద్ధ తల్లిదండ్రులను జింకిభద్ర గ్రామంలో విడిచి పెట్టాడు. కన్న బిడ్డలైన సాయి(11), నవ్య (8) లను వారి తాతగారు గ్రామమైన బెండిలో విడిచిపెట్టి చదివిస్తున్నాడు. సాయి 6వ తరగతి, నవ్య 3వ తరగతి చదువుతున్నారు. జూలై నెలలో జింకిభద్ర గ్రామంలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. 15 రోజుల కిందటే హైదరాబాద్‌కు మళ్లీ ధర్మారావు తన భార్యతో వెళ్లాడు.ఇంతలోనే విధి వెక్కిరించింది. వారు పనులు చేస్తున్న భవనం కూలడంతో ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. బతుకు తెరువు కోసం సొంత గ్రామాన్ని వీడి హైదరాబాద్ వెళ్తే అక్కడ మృత్యువు వెంటాడి చంపేసిందని ధర్మారావు తల్లిదండ్రులు నారాయణ, రాజులమ్మ రోదిస్తూ చెప్పారు. తాము ఎలా బతికేదని వారు రోదిస్తున్నారు. సంఘటన విషయం తెలిసి గ్రామమంతా విషాదం నెలకొంది. -
నిజంగా ‘బువ్వ’మ్మే
► రూ. 20కే ఫుల్‌మీల్స్ ► కమ్మనైన అమ్మ భోజనం బువ్వమ్మకే సాధ్యమంటున్న నిరుపేదలు డోన్(కర్నూల్): అసలే కాయకష్టం చేసిన చేతులు.. ఉదయం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూరగాయలు, సరుకుల భారాన్ని మోసిమోసి అలసిపోతుంటారు. ఇదే సమయంలో కాసింత కమ్మనైన ముద్ద కడుపులో పడితేకాని కష్టమైన పని చేతకాదు. హోటల్‌కు వెళ్లి తిందామంటే తెల్లవార్లు కష్టపడి పని చేసిన సొమ్మంతా టిఫెన్‌కే పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే టిఫెన్ కోసం రూ.60 దాకా ఖర్చు పెట్టినా కడుపు నిండదు. కానీ, డోన్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రామాల నుంచి వచ్చే కూరగాయలు, సరుకులను దుకాణాలకు తరలిస్తూ కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ దాదాపు వందకు పైగా కూలీలు పనిచేస్తూ ఉంటారు. కాయాకష్టం చేసిన చేతులకు పడిగడుపున కాసింత ముద్ద కోసం రోజూ ఉదయం ఎదరుచూస్తుంటారు. తమకు బువ్వమ్మ ఉన్నంత వరకు పస్తులుండాల్సిన పరిస్థితే రాలేదంటున్నారు ఇక్కడి హమాలీలు, రైతులు. కేవలం రూ.20 కే కొర్రన్నం, రాగిసంగటి, చపాతి, కర్రీ, విజిటెబుల్ పలావ్, కుర్మా, కిచడీ, టమోటా చట్నీ, సాంబారుతో కలిపిన భోజనం, ఇలా రోజుకో వెరైటీ చొప్పున రుచికరమైన భోజనాన్ని ఆరగిస్తూ ఆనందంగా ఉంటున్నామంటున్నారు. అనివార్య కారణాల వల్ల ఏ రోజైనా బువ్వమ్మ రాకపోయినా.. అన్నం పెట్టే ఆ అమ్మపై అందరూ అలకబూనుతారు. కాలేకడుపుతో ఉన్న హమాలీలను, పేద రైతులను అక్కున చేర్చుకొని రుచికరమైన భోజనం వడ్డించగానే అలకమాని చకచకా పనులకు సాగుతారు. ఇంతకు ఎవరబ్బా అందరి మనస్సుల చూరగొన్న ఆ బువ్వమ్మ అనుకుంటున్నారా... అసలు కథ చదవాల్సిందే.. పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసముండే 65 ఏళ్ల వృద్ధురాలు మహబీ, అలియాస్ బువ్వమ్మ తన భర్త ఇమాంసాహెబ్తో కలిసి ఇప్పటికీ నిత్యం కష్టపడుతూ ఎందరో నిరుపేద కూలీల కడుపులు నింపుతోంది. ఉదయమే ఇంట్లోని కట్టెల పొయ్యి మీదనే రకరకాల టిఫెన్లు తయారు చేస్తూ తెల్లవారగానే మార్కెట్‌కు తీసుకొస్తుంది. నిరుపేదకూలీలందరూ ఆమె ముంగిట వాలిపోయి కడుపునిండా భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదీ కొన్నా రూ.20కి పైమాటే ఉంది కాదా.. ఎలా ఇంతటి నాణ్యమైన భోజనం పెడుతున్నావు అవ్వా అని ఎవరైనా అడిగితే దేవుడిస్తున్నాడు.. భోజనం పెడుతున్నా.. అంతే.. అంటూ చిరునవ్వుతో సమాధానమిస్తుంది. మనుమరాళ్లకు ఆమెనే అమ్మ... బువ్వమ్మకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. రెండో కుమార్తె జుబేదా అకాలంగా మతి చెందింది. ఆమె భర్త ఖాజాహుసేన్ కూడా అడ్రస్ లేకుండా పోయాడు. వారి సంతానం బాధ్యత కూడా ప్రస్తుతం అవ్వే మోస్తోంది. తన కుమార్తెకు చెందిన నలుగురు సంతానాన్ని అవ్వే చదివిస్తూ అదనపు భారాన్ని మోస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం పెద్ద మనుమరాళ్లు షర్మిళ, మహబూబ్‌జాన్ నర్సు ట్రై నింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. మరో మనుమరాలు షాజాన్ ఇంటర్మీడియట్, మనుమడు అమీన్‌బాషా 8వ తరగతి చదువుతున్నారు. వారందరి బాధ్యత బువ్వమ్మవ్వే తీసుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. కాసింత గూడు కల్పించండి... మహబీ, (బువ్వమ్మ) సొంత స్థలం ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా కూలిపోయిన ఇంట్లోనే ఉంటున్నాం. అధికారులు స్పందించి ప్రభుత్వ పథకంలో ఓ ఇంటికి మంజూరు చేయిస్తే బాగుంటుంది. -
కూలీ నెంబర్ 1 కాదు.. సహాయక్ నెంబర్ 1!
న్యూఢిల్లీ: ఇక నుంచి రైల్వే స్టేషన్లలో కూలీ.. కూలీ అనే పిలుపులు వినపడటం ఆగిపోనుంది. ఆ పేరు ఇక చరిత్ర పుస్తకాలకు పరిమితం కానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే కూలీలకు గౌరవాన్ని కట్టబెట్టారు. కూలీ అనే పేరు స్థానంలో ఆయన కొత్త పేరును ప్రకటించారు. ఇక నుంచి రైల్వే కూలీలను కూలీలు అని పిలవకూడదని, వారిని సహాయక్‌లు లేదా హెల్పర్స్ అని పిలవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక నుంచి ఇదే పేరు ఉంటుందని చెప్పారు. దీంతోపాటు వారికి కొన్ని ప్రత్యేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు విమానాశ్రయాల మాదిరిగా ట్రాలీలను కూడా అందించనున్నారు. రూ.1.21 లక్షల కోట్ల కేపిటల్ ప్లాన్‌ను మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో రైళ్ల సగటు వేగాన్ని పెంచుతామని, మీటర్‌గేజిని బ్రాడ్ గేజిగా మారుస్తామని, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇప్పటికే రైల్వే కూలీల పేరిట పలు సినిమాలు, పుస్తకాలు విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
బర్త్ డేకి మూతి ముడిచేశారు!
‘‘నాకోసం ఆ భగవంతుడికి చేతులు జోడించి, ప్రార్థించిన వ్యక్తులందరికీ నా ధన్యవాదాలు’’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందుకలా అన్నారు?.. ఆ విషయంలోకే వద్దాం. ఆగస్ట్ 2 అమితాబ్ బచ్చన్ జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. అదే రోజు ఘోరమైన ప్రమాదానికి కూడా గురయ్యారు. 1982లో బర్త్‌డే నాడు ‘కూలీ’ షూటింగ్లో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగింది. అప్పుడు అమితాబ్‌కి బాగానే దెబ్బ తగిలింది. వెంటనే చిత్రబృందం ఆస్పత్రిలో చేర్చడం, ఆ ప్రమాదం కారణంగా ఆయన రెండు నెలలు విశ్రాంతికి పరిమితం కావడం జరిగింది. అందుకే అమితాబ్ ఆగస్ట్ 2 తనకు పునర్జన్మలా భావిస్తారు. ఆదివారం పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ‘కూలీ’ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇంటిల్లిపాదీ అమితాబ్ పుట్టినరోజు నాడు బాగానే సందడి చేశారు. అమితాబ్, అభిషేక్ అయితే చిన్నపిల్లల్లా మారిపోయి, ఎంజాయ్ చేశారు. మూతి ముడిచేసి, సెల్ఫీలు దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.