ఓ రైల్వే కూలీ చేతికి సుమారు రూ. 1.4 లక్షల ఫోన్ దొరికింది. ఐతే అతను ఆ ఫోన్‌ని నేరుగా రైల్వే పోలీసులకు ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దశరత్ దౌండ్ అనే రైల్వే కూలి దాదార్ రైల్వే స్టేషన్‌లో కూలీగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఐతే అతను ఎప్పటిలానే ఆరోజు కూడా అమృత్‌సర్‌కి వెళ్లే రైలు ఆగి ఉన్న ఫ్లాట్ ఫాం 4 వద్ద తన పనిని ముగించుకుని ఇంటికి పయనమవుతున్నాడు. ఆ క్రమంతో రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఒక ఖరీదైన ఫోన్ కనిపించింది.
అది ఫ్లాట్‌ఫాంపై నడుస్తుండగా సీటింగ్ ఏరియాలో పడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులను ఆ ఫోన్ గురించి వాకబు చేస్తే మాది కాదనే చెప్పారు. దీంతో దశరత్ నేరుగా రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పి ఆ ఫోన్‌ని ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ ఎవరిదని అని ట్రేస్ చేస్తుండగా..అది అమితాబచ్చన్‌కి విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్‌కి చెందన ఫోన్ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ని బాధితుడు సావంత్‌కి అందజేసి ఈ విషయం చెప్పడంతో అతను ఒక్కాసారిగా ఆశ్చర్యపోయాడు.
తన ఫోన్ తనకు తిరిగి లభించినందుకు బహుమతిగా ఆ కూలికి రూ. 1000 కూడా ఇచ్చాడు సావంత్. ఆ కూలీని పోలీసుల తోపాటు సావంత్ కుటుంబం కూడా ఎంతగానో ప్రశంసించింది. ఈ మేరకు కూలీ దశరత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను మర్చిపోయానని, సడెన్‌గా పోలీసుల నుంచి కాల్ రావడంతో ఈ విషయం గురించి తెలిసిందని చెబుతున్నాడు. అయినా తనకు గాడ్జెట్‌లపై ఎలాంటి అవగాహన లేదని, పైగా తాను ఎవరి వస్తువుని తన వద్ద ఉంచుకోనని చెప్పాడు. ఏదీఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అరుదు.
(చదవండి: క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి.. పేరెంట్స్ అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment