![Amitabh Bachchan Discharged From Mumbais Kokilaben Hospital After Angioplasty - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/15/amitabh_0.jpg.webp?itok=z_4GRM9m)
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చేసిన అనంతరం సాయంత్రమే ఇంటికి పంపించారు.
కాగా.. అమితాబ్‌ను గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్‌తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది. అమితాబ్ ఇటీవల టైగర్ ష్రాఫ్, కృతి సనన్ నటించిన గణపత్‌లో కనిపించారు. అంతే కాకుండా ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment