బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రీడల్లోనూ అడుగుపెట్టారు. సీనియర్ నటుడు సడన్‌గా ఆటల్లోకి ఎలా వచ్చారని అనుకుంటున్నారా? అయితే అమితాబ్ ఎంట్రీ ఇచ్చింది ఆటగాడిగా కాదండి.. ఆయన కూడా ప్రముఖ క్రికెట్ లీగ్‌లో జట్టును కొనుగోలు చేశారు. టెన్నిస్ బాల్ టీ10 క్రికెట్ టోర్నీ ఇండియన్ స్ట్రీట్ ప్రిమియర్ లీగ్‌లో అమితాబ్ ముంబయి టీమ్‌ను దక్కించున్నారు.
ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ముంబయిలో తొలి సీజన్ జరగనుంది. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు ఈ లీగ్‌లో బరిలో ఉన్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్‌కుమార్, హృతిక్ రోషన్ కూడా ఇటీవలే ఐఎస్‌పీఎల్ జట్లను కొనుగోలు చేశారు. శ్రీనగర్‌ను అక్షయ్.. బెంగళూరును హృతిక్ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment