అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారనే వార్త గుప్పుమనడంతో అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదనే వార్త కూడా రావడంతో కూల్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే... శుక్రవారం తెల్లవారుజాము అమితాబ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారట. అమితాబ్‌కి యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారని సమాచారం.
కాలికి ఒకచోట రక్తం గడ్డ కట్టడంతో యాంజియోప్లాస్టీ చేశారట. ఇక శుక్రవారం మధ్యాహ్నమే అమితాబ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాతే ‘ఇన్ గ్రాటిట్యూడ్ ఎవర్’ (ఎప్పటికీ కృతజ్ఞతగా..) అని ఎక్స్‌లో పోస్ట్ చేసినట్లున్నారు అమితాబ్. అంటే... ఆరోగ్యంగా బయటపడినందుకు ఆయన ఇలా పోస్ట్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ఇక ఇటీవల ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, రజనీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రాల షూటింగ్స్‌లో అమితాబ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment