సినీ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ . ఎంతో మంది నటులకు ఆయన స్ఫూర్తి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయనకు బాలీవుడ్ వరకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకోసమే, అమితాబ్ గత 41 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం తన ఇంటి బయట అభిమానులను పలకరించే ఆచారం ఉంది దానిని అందరూ 'జల్సా' బంగ్లా అంటారు.! ఇదీ చదవండి:
(ఇదీ చదవండి: పెళ్లికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అమ్మాయిల పనే అదట!)
ప్రతి ఆదివారం, ముంబైలోని అమితాబ్ బచ్చన్ యొక్క జల్సా బంగ్లా వెలుపల వందలాది మంది అభిమానులు గుమికూడుతారు. ఆ సమయంలో తను చివరన నిలబడి అభిమానులను పలకరిస్తాడు. ఈ సమయంలో అమితాబ్ ఎప్పుడూ చెప్పులు లేకుండానే కనిపిస్తాడు. తాజాగా దాని వెనుక ఉన్న కారణాన్ని ఆయన వెల్లడించాడు. ఈ విషయంపై కొందరు వివాదాస్పదంగా కూడా తనను ప్రశ్నించినట్లు తెలిపాడు.
(ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్)
ఎవరైనా గుడికి చెప్పులు వేసుకుని వెళ్తారా? వెళ్లరు కదా అంటూ.. ' ప్రతి ఆదివారం నా కోసం వచ్చే అభిమానులే నా శ్రేయోభిలాషులు.. వారిని దేవుళ్లతో సమానంగా భావిస్తాను. అలాంటప్పుడు వారు నిల్చున్న ప్రాంతం గుడితో సమానం అని భావించాను కాబట్టే నాలుగు దశాబ్ధాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను' అని తెలిపాడు. తన కోసం వచ్చిన అభిమానులు తీవ్రమైన ఎండలో నిల్చోని ఉంటే.. చెప్పులు వేసుకుని దర్జాగా ఎలా ఉండగలుగుతానని అమితాబ్ పేర్కొన్నారు. బచ్చన్ ఇటీవల ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్నా ' ప్రాజెక్ట్ కె ' షూటింగ్‌లో ఉండగా గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment