Jalsa
-
జీవితాలను నాశనం చేస్తారంటూ 'పూనమ్' డైరెక్ట్ ఎటాక్
పూనమ్ కౌర్.. సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా స్పందించే హీరోయిన్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా డైరెక్ట్‌గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే చాలు కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. కొందరి గురించి తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవ్ అనేలా రియాక్షన్ ఇచ్చింది. తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది.ఏం జరిగింది..? డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లుడుతున్న సీన్స్‌లో రేప్ డైలాగ్స్ రన్ అవుతాయ్. ఆ వీడియో చాలామంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది. 'త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది' అని తెలిపింది. అయితే, విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ రియాక్ట్ ఇలా అయ్యాడు 'మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి' అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.జీవితాలను నాశనం చేస్తాడు: పూనమ్పూనమ్ కౌర్‌కు ఉచిత సలహా ఇచ్చిన సదరు వ్యక్తికి కౌంటర్ కూడా ఇచ్చింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అని పూనమ్ మరోసారి ఫైర్ అయింది. Dialouges written by trivikram- don’t expect anything worthwhile .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2024 -
ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?
ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసిన హీరోయిన్. పలు చిత్రాలతో హిట్ కొట్టినా సరే ఈమెకు ఎందుకో లక్ కలిసి రాలేదు. లేదంటే మరేదైనా కారణముందో తెలియదు గానీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. అలాంటి ఈమెని ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పార్వతి మెల్టన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తుందా? అవును మీరు ఊహించింది కరెక్టే. 'జల్సా'లో ఓ హీరోయిన్గా చేసింది ఈమెనే. అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఈమె తండ్రిది జర్మనీ, తల్లి ఇండియాలోని పంజాబ్. చిన్నప్పుడే భరతనాట్యం లాంటివి నేర్చుకుంది. చదువుతూనే మోడలింగ్ చేసింది. అలా పలు పోటీల్లో విజయం సాధించింది.(ఇదీ చదవండి: నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?)ఇక 'వెన్నెల' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. అది హిట్ కావడంతో తెలుగులో పార్వతి మెల్టన్‌కి అవకాశాలు వచ్చాయి. అలా గేమ్, మధుమాసం, అల్లరే అల్లరి తదితర సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు రాలేదు. ఎప్పుడైతే 'జల్సా' చేసిందో ఈమె నలుగురి కంట్లో పడింది. దీంతో ఈమెకి ఛాన్సులు క్యూ కడతాయని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. 'దూకుడు'లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత కూడా తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పెద్దగా పట్టించుకోలేదు.చివరగా 2012లో 'యమహో యమ' అనే సినిమా చేసి తిరిగి యూఎస్ వెళ్లిపోయింది. అదే ఏడాది సమ్ష లలానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. అప్పటి నుంచి యూఎస్‌లోనే ఉంటున్న అక్కడి వాతావరణానికి తగ్గట్లు మారిపోయింది. రీసెంట్గా ఈమె ఫొటోలు చూస్తున్న కొందరు నెటిజన్స్.. సడన్‌గా పార్వతిని గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జల్సా' హీరోయిన్ కదా అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే) View this post on Instagram A post shared by Parvati Melton (@parvatim) -
జల్సా హీరోయిన్ ఇలా మారిపోయిదేంటి? గుర్తుపట్టడం కష్టమే(ఫోటోలు)
-
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్లు. ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు గానీ ఏది ఏమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు. వాళ్లలో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్.. తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు. ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్‌కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ ఉండాల్సిందే పవన్ కల్యాణ్ చేసిన వాటిలో చాలావరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. బయటకు అనుకోరు గానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మళ్లీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీలవుతాడని అస్సలు బయటపెట్టరు. అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల్సిందే. 'వకీల్ సాబ్'నే తీసుకోండి.. స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్ని తీసుకొచ్చారు. ఓ పాట, లవ్ ట్రాక్ పెట్టారు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) పార్వతికి గిఫ్ట్ పవన్ కల్యాణ్‌కి ఉన్న ఒకటో రెండో హిట్స్‌లో 'జల్సా' ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్‌కి హీరోయన్లుగా ఇలియానా, పార్వతి మెల్టన్ చేశారు. అయితే షూటింగ్ టైంలో పవన్-పార్వతికి ఎక్కడో కుదిరిసిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దానికి ఓ కారణముంది. అప్పట్లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.. 'జల్సా' రిలీజైన తర్వాత ఓ సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దూ వద్దంటున్నాసరే రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చాడట. 2 గంటలు హోటల్లో? తొలుత డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్‌గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్‌లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఓ హోటల్లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట. అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్‌ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి వచ్చాడట. తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది. అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: రజనీ, కమల్ తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్‌తో!) -
చెప్పులు లేకుండా అమితాబ్.. ఆ సీక్రెట్ రివీల్
సినీ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ . ఎంతో మంది నటులకు ఆయన స్ఫూర్తి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయనకు బాలీవుడ్ వరకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకోసమే, అమితాబ్ గత 41 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం తన ఇంటి బయట అభిమానులను పలకరించే ఆచారం ఉంది దానిని అందరూ 'జల్సా' బంగ్లా అంటారు.! ఇదీ చదవండి: (ఇదీ చదవండి: పెళ్లికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అమ్మాయిల పనే అదట!) ప్రతి ఆదివారం, ముంబైలోని అమితాబ్ బచ్చన్ యొక్క జల్సా బంగ్లా వెలుపల వందలాది మంది అభిమానులు గుమికూడుతారు. ఆ సమయంలో తను చివరన నిలబడి అభిమానులను పలకరిస్తాడు. ఈ సమయంలో అమితాబ్ ఎప్పుడూ చెప్పులు లేకుండానే కనిపిస్తాడు. తాజాగా దాని వెనుక ఉన్న కారణాన్ని ఆయన వెల్లడించాడు. ఈ విషయంపై కొందరు వివాదాస్పదంగా కూడా తనను ప్రశ్నించినట్లు తెలిపాడు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) ఎవరైనా గుడికి చెప్పులు వేసుకుని వెళ్తారా? వెళ్లరు కదా అంటూ.. ' ప్రతి ఆదివారం నా కోసం వచ్చే అభిమానులే నా శ్రేయోభిలాషులు.. వారిని దేవుళ్లతో సమానంగా భావిస్తాను. అలాంటప్పుడు వారు నిల్చున్న ప్రాంతం గుడితో సమానం అని భావించాను కాబట్టే నాలుగు దశాబ్ధాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను' అని తెలిపాడు. తన కోసం వచ్చిన అభిమానులు తీవ్రమైన ఎండలో నిల్చోని ఉంటే.. చెప్పులు వేసుకుని దర్జాగా ఎలా ఉండగలుగుతానని అమితాబ్ పేర్కొన్నారు. బచ్చన్ ఇటీవల ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్నా ' ప్రాజెక్ట్ కె ' షూటింగ్లో ఉండగా గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు. -
విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ
క్రైమ్ అండ్ పనిష్మెంట్... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్‌తో సినిమా రిలీజ్ కావడం పెద్ద బాలీవుడ్ లీప్. మరో విశేషం సెరిబ్రల్ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా. మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత. ‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్‌తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ. కథ ఏమిటి? ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ విద్యాబాలన్. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్ విలువలు ఉన్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది. కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్‌గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి. పరిస్థితులు ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్ యాక్సిడెంట్ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్‌లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు. నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్‌గా ఉంటుంది చూడటానికి. ఆ పిల్లాడు ఈ సినిమాలో విద్యాబాలన్ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది. ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్ సురేశ్ త్రివేణి చెబుతున్నది. అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. -
పవన్ కళ్యాణ్ జల్సా సినిమా సీన్‌ను గుర్తు చేసిన ఢిల్లీ గ్యాంగ్స్టర్స్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్స్ లాక్ అప్‌లో ఉండి జల్సా సినిమాలోని సీన్లను రిపీట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళితే..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాను చూసి ఉంటారుగా.. ఆ సినిమాలోని విలన్ ముకేష్ రిషి జైలు నుంచే సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సన్నివేశం ప్రారంభంలో అది జైలు అని మనకు ఏ మాత్రం అనిపించదు. విచారణ నిమిత్తం కోర్టు నుంచి జైలుకు వెళ్లే దారిలో మర్డర్లు కూడా చేసి వస్తాడు ఆ సినిమాలోని విలన్. సినిమాలో చూడటానికి ఆ సన్నివేశం ఎంత బాగున్నా కూడా నిజ జీవితంలో ఇలా జరుగుతాయా అని మనం అనుకుంటూవుంటాం. అయితే తాజాగా అలాంటి సంఘటనలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకపోతే ఆ సినిమాలో జైలు నుంచి చేస్తే ఈ వీడియోలో మాత్రం లాకప్ నుంచి. నలుగురు వ్యక్తులు లాకప్‌లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే లాకప్‌లోని మరొక గ్యాంగ్‌స్టర్ సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేయడం ఇందులోని ట్విస్ట్ అని చెప్పాలి. అంతే కాదు ఆ వీడియోలో ఉన్నది నీరజ్ బవన సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం ఇందులోని మరో ట్విస్ట్. View this post on Instagram A post shared by Neeraj_bawana_ (@neeraj_bawanaa_official_) అయితే అప్పటికే రాహుల్ కాలా, నవీన్ బాలి జైలులో ఉండగా ఈ నెల ఐదవ తారీకున పోలీసులు వారిని మళ్లీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన పోలీసులు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే వీళ్లను మళ్లీ అరెస్టు చేసింది కూడా జైలు నుంచి బయటి వారిని బెదిరింపులకు గురి చేసినందుకు కావడం గమనార్హం. ఇంకా ఈ వీడియోలో వీరున్న సెల్‌కి ఎదుట సెల్లో కొందరు ఖైదీలు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా తమకు ఏమీ తెలియనట్టుగా లాకప్‌లో మద్యం అందించబడదని జరిగిన సంఘటణపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరలై చక్కర్లు కొడుతోంది. -
పవన్ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా హిట్టయినా ప్లాఫయినా ఆయనకు ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఖుషితో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవర్‌స్టార్ ఆ తర్వాత ఏడేళ్ల పాటు విజయం రుచి చూడలేదు. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ సమయంలోనే ఓ క్రేజీ కాంబినేషన్‌కు బీజం పడింది. అప్పుడెవరూ అనుకోలేదు ఈ కాంబినేషన్ టాలీవుడ్లో నయా రికార్డులను సృష్టిస్తుందని.. సినీ అభిమానుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తుందని.. ఆ జోడీయే పవన్-త్రివిక్రమ్. పవన్ క్రేజ్.. త్రివిక్రమ్ మాటలు.. దేవిశ్రీప్రసాద్ పాటలు ఇవన్నీ కలగలపి వచ్చిన చిత్రం ‘జల్సా’ . గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి పన్నెండేళ్లు పూర్తయింది. పవన్ కల్యాణ్-ఇలియానల మధ్య వచ్చే లవ్ సీన్స్, పవన్-బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కామెడీ సీన్స్, సినిమా ప్రారంభంలో మహేశ్ బాబు వాయిస్ ఓవర్, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సమాజంపై కోపంతో నక్సలైట్ పాత్రలో చెగువేరా గెటప్‌లో పవన్ కనిపించడం ఇవన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అంతేకాకుండా ప్రతీ సీన్లోనూ త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించాడు. ఇక తివిక్రమ్ అంటేనే ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ‘యుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’అంటూ పవన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌లు థియేటర్లో ఈలలు వేయించాయి. అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో మెట్టుపై నిలిచేలా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఎక్కువ థియేటర్లలో వందరోజులు పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి జల్సా చూసి ఎంజాయ్ చేయండి. చదవండి: చిరంజీవికి జేజేలు: పవన్ కళ్యాణ్ ‘బాహుబలి’ని బ్రేక్ చేసిన మహేశ్ చిత్రం -
యువత పెడదారి
♦ జల్సాల కోసం నేరాల బాట ♦ చోరీల్లో 80 శాతం యువకులే ♦ మట్కా, పేకాటలోనూ అదేస్థాయిలో ♦ ఇలాగైతే భవిష్యత్ నాశనమే ఆదిలాబాద్: దేశానికి యువతే వెన్నెముక అంటారు. కొంతమంది యువత మంచిదారిలో వెళ్తూ అద్భుత ఆవిష్కరణలతో సత్తా చాటుతుంటే.. మరికొందరు చెడుదారిని ఎంచుకుని భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. హత్యలు, చోరీలు, దోపిడీలకు పాల్ప డుతూ నేరస్తులుగా మారుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు దొంగతనాల్లో పట్టుబడ్డ నిందితుల్లో ఎక్కువ శాతం మంది 20నుంచి 30 సంవత్సరాల లోపు యువతే ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఎన్నో చోరీ, మట్కా, పేకాట కేసుల్లో అరెస్టయిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. వీరంతా జల్సాల కోసమే నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇంటర్మీడియెట్, డిగ్రీ వరకు చదువుకున్న పలువురు ఈజీమనీ కోసం నేరస్తులుగా మారుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో ఇటీవల జరిగిన దొంగతనాలు, ఇతర నేరాలను పరిశీలిస్తే ఈ నేరాల్లో 80శాతం మంది యువతే ఉన్నారు. జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న వారు కొందరైతే.. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మట్కా, పేకాటవైపు మొగ్గు చూపుతున్నారు. చోరీ కేసుల్లోని యువత చైన్‌స్నాచింగ్, ద్విచక్ర వాహనాలు, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. వారి మెడలోంచి బంగారాన్ని లాక్కెళ్తున్నారు. వీరు కరుడుగట్టిన నేరగాళ్లనుకుంటే పొరపాటే. ఉన్నత చదువులు చదువుతున్నవారు జల్సాలకు అలవాటు పడి అడ్డదారులు తొక్కుతున్నారు. మరికొంత మంది యువత తక్కువ సమయంలో డబ్బులకు ఆశపడి మట్కా, పేకాట ఆడుతున్నారు. వీరు పట్టుబడినప్పటికీ మళ్లీమళ్లీ అదేదారిలో నడుస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే సినిమాల ప్రభావం యువతపై ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాను సైతం యువత చెడుకు ఉపయోగించుకుంటోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో పట్టుబడ్డ సురేశ్ అనే యువకుడు యూట్యూబ్‌లో నేరాల కథనాలు చూసి దొంగతనాలు చేశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరదాగా మొదలైన ఈ చెడును.. రానురాను వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఇంటర్మీడియెట్ చదివి వదిలేసిన ఓ యువకుడు జిల్లా కేంద్రంలో మహిళల మెడలోంచి గొలుసు చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొట్టేసిన గొలుసులను విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. దొరికితే జైలు పాలవుతున్నారు. దొంగతనాలకు ఇవీ కారణాలు.. ► ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని, వీలైతే అందినంత దోచుకుని ఎదగాలనే ఆలోచన రావడం. ► ఎదుటి వ్యక్తి విలువైన దుస్తులు, షూలు ధరిస్తే తాము అలాగే వేసుకోవాలని ఆశపడడం. ► పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, సినిమాలకు ప్రభావితమై జల్సాలు చేయాలనుకోవడం. తల్లిదండ్రులు ఇవీ పాటించాలి.. ► పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. పిల్లలు చదువుకునే సమయంలోనే వారి స్నేహం, నడవడికపై దృష్టిపెట్టాలి. ► తల్లిదండ్రులను కాదని సొంతంగా డబ్బులు ఖర్చుపెడుతున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో వారికి అవగాహన కల్పించాలి. ► సమాజంలో హోదా, గౌరవం, సంప్రదాయాలు, విలువలు, నిజాయితీ, పద్ధతులపై అవగాహన కల్పించాలి. ఇటీవల చోరీ కేసుల్లో అరెస్టయిన యువకులు.. ► జల్సాలకు అలవాటు పడి వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకుంటున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆరెపల్లి సురేశ్ (25)ను ఈనెల 11న పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్‌లో నేరాలపై కథనాలు చూసి ప్రభావితమై జల్సాల కోసం డబ్బులు లేక దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఇతడిని అరెస్ట్ చేసి 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ► ఆదిలాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఎండీ మోయిజ్ 40 దొంగతనాల కేసుల్లో నిందితుడు. ఈ యువకుడు జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేశాడు. ఈనెల 4న పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ మోయిజ్‌ను అరెస్టు చేశారు. 73 గ్రాముల బంగారం, 700 గ్రా ముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ► జూన్ 22న మహారాష్ట్రకు చెందిన ఐదుగురు యువకులు ఆదిలాబాద్ పట్టణంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసై జల్సాల కోసం అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో మూడు నెలలు వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగిలించి పట్టుబడ్డారు. మంచి మార్గంలో వెళ్తే ఉపాధి యువత మంచి మార్గంలో వెళ్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జల్సాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోకూడదు. విద్యార్థులు కూడా చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం నేరాల కు పాల్పడుతున్న యువతపైన నిఘా ఉంచాం. ఆయా కేసుల్లో పట్టుబడిన తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. – ఎం.శ్రీనివాస్, ఎస్పీ ఈ ఏడాది నేరాలు, నిందితులు దొంగతనాలు: 50 నిందితులు: 30 యువకులు: 25 స్వాధీనం చేసుకున్న సొత్తు120 తులాల బంగారం,140 తులాల వెండి, రూ.25.80 లక్షల నగదు 20 ద్విచక్ర వాహనాలు,ఒక స్కార్పియో మట్కా కేసులు: 69 నిందితులు: 156 యువకులు: 67 స్వాధీనం చేసుకున్న నగదు రూ. 98,700 పేకాట కేసులు: 82 నిందితులు: 126 యువకులు: 82 స్వాధీనం చేసుకున్న నగదు రూ. 7.59 లక్షలు -
‘పున్నామ’ నరకం
– వ్యసనాలకు బానిసలుగా పుత్రులు – డబ్బుల కోసం తల్లిదండ్రులకు నరకం ––––––––––––––––––––––––––– తాడిపత్రి మండలం గన్నెవారిపల్లె కాలనీలో పెద్దయ్య(34) తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. తాగుడుకు పూర్తిగా బానిసైన పెద్దయ్య డబ్బుల కోసం తండ్రి చిన్నభూషణ్ను నిత్యం వేధించేవాడు. డబ్బులివ్వకపోతే చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో తండ్రే కుమారున్ని హత్య చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన గత నెల 15న జరిగింది. అనంతపురం రూరల్ మండలం చంద్రబాబు కొట్టాల సమీపంలోని గౌరవ్హోమ్స్లో సత్యేంద్ర(33)ను తండ్రే కొట్టి చంపారు. ఎంబీబీఎస్ చదివిన సత్యేంద్ర విచక్షణ కోల్పోయి వ్యవహరించేవాడు. ఆస్తిలో భాగం పంచివ్వాలని తండ్రిని బెదిరించేవాడు. ఎక్కడ హతమారుస్తాడోనని తండ్రి గిరియప్పే హతమార్చాడని పోలీసుల ప్రాథమిక నిర్ధరణలో వెల్లడైంది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే ఒకే తరహా ఘటనలు వరుసగా జరగడం సంచలనం సష్టించింది. –––––––––––––––––––––––––––––––––––––––––––––– అనంతపురం సెంట్రల్ : పున్నామ నరకం నుంచి కాపాడే వాడు పుత్రుడు అన్నది నానుడి. తండ్రి చనిపోయిన తర్వాత పిండం పెడితే నరకానికి కాకుండా స్వర్గానికి పోతారని నమ్ముతారు. చనిపోయిన తర్వాత స్వర్గం ఉందో లేదో గానీ బతికుండగానే తల్లిదండ్రులకు పున్నామి నరకం చూపిస్తున్నారు కొందరు సుపుత్రులు. మలిసంధ్యలోని అమ్మానాన్నలకు అండగా నిలవాల్సిందిపోయి వారి పాలిట యమకింకరులగా తయారయ్యారు. ‘ఇస్తావా.. చస్తావా’ అంటూ బెదిరిస్తున్నారు. తమ మాటను కాదంటే విచక్షణారహితంగా కొడుతూ, తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. వ్యసనాలకు బానిసలై కొందరు.. ఎక్కువశాతం యువకులు జూదం, తాగుడు, వ్యభిచారానికి బానిసలవుతున్నారు. తాగేందుకు డబ్బులివ్వకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బులిస్తావా? చస్తావా అంటూ హెచ్చరిస్తున్నారు. లేకుంటే నాకొచ్చే ఆస్తి నాకు ఇచ్చేయ్.. అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఉన్న ఆస్తి పాస్తులు వారి చేతిలో పెడితే ఎక్కడ చేయి జార విడస్తారో అని తల్లిదండ్రులు మదనపడుతున్నారు. ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. పోలీస్స్టేషన్లకు వచ్చే కేసుల్లో అధిక శాతం ఇలాంటి కేసులే ఉంటున్నాయి. స్టేషన్లకు రాకనే కొందరు తమ తల్లిదండ్రులను ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు. మరికొందరు దైర్యం చేసి వారిని వారించే ప్రయత్నంలో కుమారుల చేతిలో దెబ్బలు తిని గాయాలపాలవుతున్నారు. జల్సాల కోసం మరికొందరు.. మరికొందరు యువకులు జల్సాలకు అలవాటు పడుతున్నారు. కోరిన బైకు.. అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనని అమ్మానాన్నలపై ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే వారితో గొడవలకు దిగడం, ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇటీవల అనంతపురంలోని సిండికేట్‌నగర్ వద్ద బైక్, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. అందులో ఓ యువకుడు కొత్తగా యమహా ఎఫ్‌జెడ్ బైక్ కొనుగోలు చేశాడు. స్నేహితులకు డిన్నర్ ఇచ్చిన అనంతరం వారిని డ్రాప్ చేసి అతివేగంతో వస్తూ ఆటోను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ఏ పాపం ఎరుగని ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మత్యువుతో రోజంతా పోరాడి చనిపోయాడు. కొద్దిరోజుల క్రితం మరో యువకుడు స్నేహితులతో కలసి ఇతర రాష్ట్రాలకు విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మత్యువాత పడ్డాడు. ఇలా పిల్లలకు డబ్బులిస్తే ఓ ప్రమాదం, ఇవ్వకపోతే మరో ప్రమాదం తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో చావడమా? చంపడామా అనే స్థాయికి కొందరు తల్లిదండ్రులు వెళ్తున్నారు. ––––––––––––––––––––––––––––––––––––––– పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది ఇటీవల ఎక్కువ మంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. పెంపకమే వారిని అలా తీయారు చేస్తోంది. చిన్న వయస్సు నుంచి పిల్లల్లో మంచి లక్షణాలు అలవర్చుకునేలా తయారు చేయాలి. తల్లిదండ్రులు మంచిగా ఉంటే వారి నుంచి కూడా పిల్లలు నేర్చుకుంటారు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు కూడా మంచి లక్షణాలు నేర్పించడం ఒక సబ్జెక్టులా ఎంచుకోవాలి. టెన్షన్ తగ్గించుకోవడానికి యోగా అలవాటు చేయించాలి. దీని వలన యుక్త వయస్సులో చెడుమార్గాలకు వెⶠ్లకుండా ఉంటారు. – డాక్టర్ ఆదిశేషయ్య, ప్రభుత్వ పోలీసు ఆస్పత్రి వైద్యుడు –––––––––––––––––––––––––––––––––––––– -
జల్సాల కోసమే చైన్‌స్నాచింగ్‌లు
అనంతపురం సిటీ: జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షలు ఉండవచ్చుని నిర్థారించారు. అ నంతపురం వన్‌టౌన్ పరిధిలో పట్టుబడి న ఈ నలుగురిని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు కథనం ప్రకా రం.. నగరంలో గిరిప్రసాద్కాలనీకి చెంది న పాముల మోహన్(28), పాములసూరి(24), పాముల సుధాకర్ అలియాస్ ధూళి (25), రాణినగర్‌కు చెందిన షేక్‌నూర్ బాషా అలియాస్ మున్నా (23) నలుగురు బృందంగా ఏర్పడ్డారు. వీరు ఇద్దరు ఇద్దరు చొప్పున ఒంటరిగా వెళ్లే శివా రు ప్రాంతాల మహిళలు, ఇళ్ల ముందు కసువు ఊడ్చేమహిళలను టార్గెట్ చేసి పగలు, రాత్రి తేడా లేకుండా అదను చూసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యేవారు. కొన్ని నేరాల్లో ద్విచక్రవాహనాలను వినియోగించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. అలాగే బస్టాండు, బస్సుల్లో జేబు దొంగతనాలకు పూనుకున్నారు. ఇలా ఏడాది కాలంగా తాడిపత్రి జిల్లా కేంద్రంలోని తాడిపత్రి బస్టాండు, హౌసింగ్ బోర్డు, ఎంఐజీకాలనీ, పాతూరు కూరగాయల మార్కెట్, అశోక్‌నగర్, రాణినగర్, వేణుగోపాల్‌నగర్, భైరవనగర్, సంఘమేష్నగర్, కురబవీధి, గుత్తి రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వీటితో పాటు కదిరి పట్టణంలో ఒక నేరం చేశారు. ఒక దొంగ-ఒక పోలీస్ నినాదంతో నిందితుల ఆటకట్టు.. జిల్లాలో ఇటీవల జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ఎస్పీ ఆదేశాలతో ఒక దొంగ-ఒక పోలీస్ నినాదంతో కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగానే అనంతపురం డీఎస్పీ మల్లికార్జునశర్మ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్, ఎస్ఐలు విశ్వనాధ్చౌదరి, జకీర్‌హుస్సేన్, ఏఎస్ఐ ప్రవీణ్, హెడ్‌కానిస్టేబుళ్లు నాగరాజు, సూర్యనారాయణ, షెక్షావలి, రాజకుళ్లాయప్ప, వెంకటేష్, సుధాకర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రమేష్, ప్రసాద్, ధనుంజయ, రాజేష్, పోతన్న, భీమేష్, నాగార్జున, గిరి, రామస్వామి, బాలాజీనాయక్, హోంగార్డులు పీరా, నాగభూషణం ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. సీఐ గోరంట్ల మాధవ్‌కు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఇద్దరిని స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో, మిగిలిన ఇద్దరిని శివకోటిదేవాలయం సమీపంలో అరెస్ట్ చేశారు. సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు : చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకుని వారి నుంచి రూ.18లక్షలు విలువ చేసే 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ సీఐ, ఎస్ఐల బృందాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. -
జల్సాలకు డబ్బు ఇవ్వలేదని..
తల్లిని చంపిన తనయుడు నిందితుడి అరెస్ట్ బెంగళూరు : బైక్ రిపేర్ చేయించుకోవడానికి, స్నేహితులతో జల్సాలు చేయడానికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని ఓ యువకుడు హతమార్చిన సంఘటన ఇక్కడి వివేక్‌నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీసీ సందీప్ పాటిల్ బుధవారం మీడియాకు తెలిపిన సమాచారం మేరకు.. వివేక్‌నగర సమీపంలోని ఈజీపుర ఆరవ క్రాస్‌లో ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగిని మైలావతి (60) నివాసముంటున్నారు. ఈమె భర్త ఆనందన్ ఇళ్లను అద్దె, లీజ్‌లకు ఇప్పించే బ్రోకర్ పని చేస్తున్నారు. వీరి కుమారుడు గిరీష్ గహన్ (23). ఆనందన్ రోజూ ఉదయం 11 గంటలకు బయటకు వెలితే రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటారు. వీరి కుమార్తె యోగితకు వివాహమై భర్తతో కలిసి వేరుగా ఉంటోంది. గిరీష్ డిప్లోమా పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఇతనికి విలువైన కరిష్మా బైక్ ఉంది. బైక్ మరమత్తులకు రూ. 10 వేలు కావాలని తల్లిని కోరారు. తన దగ్గర డబ్బులు లేవని ఆమె పదేపదే చెప్పింది. ఈ విషయంలో గిరీష్ తల్లిని వేధించేవాడు. గత నెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మైలావతి, ఆమె కుమారుడు గిరీష్ ఇద్దరే ఇంటిలో ఉన్నారు. ఆ సమయంలో మైలావతి మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి గిరీష్ ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన గిరీష్ ఆమెను కాలితో తన్నాడు. గొడకు తల తగలడంతో మైలావతి ృసహ తప్పి పడిపోయారు. అనంతరం చీరతో తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత తల్లి మెడలో ఉన్న మంగళసూత్రం, నక్లెస్, మొబైల్ తీసుకున్నాడు. సంఘటనా స్థలంలో వేలిముద్రలు చిక్కకుండ కుంకమ చల్లి అక్కడి నుంచి పరారైనాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మైలావతి కుమార్తె యోగిత ఇంటికి వచ్చి చూడగా హత్య జరిగిన విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులు గిరీష్‌పై నిఘా వేశారు. అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారణ చేయగా.. నేరాన్ని అంగీకరించాడు. తల్లి మొబైల్లోని రెండు సిమ్‌కార్డులను ఆడుగోడి సమీపంలో పెద్ద డ్రెయినేజ్‌లో పారిసినట్లు చెప్పాడు. -
జల్సాల కోసం చోరీలు
కర్నూలు: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు నేరాల బాట పట్టాడు. తాళం వేసిన ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడు హరిజన బొగ్గు వెంకటేశ్వర్లును కర్నూలు తాలుకా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు తులాల బంగారు, 20 తులాల వెండి పట్టీలు, రూ.5 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాలుకా సీఐ మధుసూధన్‌రావు నేరస్తుడి వివరాలను వెళ్లడించారు. ప్రకాశం జిల్లా వెంకాయపల్లెకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పట్టించుకోకుండా కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ నేరాల బాట పట్టాడు. దీంతో అతని భార్య దూరంగా ఉంటుంది. ఎలాంటి సంతానం కలుగకపోవడంతో జల్సాల కోసం చోరీలనే వృత్తిగా ఎంచుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవాడు. గతంలో కర్నూలు పాతబస్తీతో పాటు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. బెయిల్‌పై విడుదల కాగానే మళ్లీ నేరాలకు పాల్పడేవాడు. మంగళవారం వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా పలు దొంగతనాలు చేసినట్లు నేరం అంగీకరించాడు. గత నెల 27వ తేది వెంకాయపల్లెలో నివాసం ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన అంకమరావు కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు నగరానికి వెళ్లడంతో గమనించిన వెంకటేశ్వర్లు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో భద్రపరిచిన నాలుగు తులాల బంగారం, ఏటీఎం కార్డును ఎత్తుకెళ్లాడు. ఆగస్టు 29న పడిదెంపాడులో నివాసముంటున్న బోయ సంజన్న ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలు, కాళ్ల పట్టీలను చోరీ చేశాడు. దొంగను అరెస్టు చేసి సొమ్ములను రికవరీ చేసిన ఎస్ఐ పెద్దయ్య నాయుడు, హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్, సిబ్బంది శివకుమార్, మద్దిలేటి, షమీర్ తదితరులను సీఐ అభినందించారు. -
బిగ్ బీ జల్సాలోకి దర్జాగా దూరిన అతిథి!
సెలబ్రిటీలు, ప్రముఖుల ఇంటికి వెళ్లాలంటే అభిమానులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకపోతే కనీసం సెక్యూరిటీ గేటు కూడా అభిమానులు దాటలేరు. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఓ అతిథి దర్జాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లోకి వెళ్లిపోయింది. ఎవరి ఇంట్లోకైనా ఏమాత్రం సంకోచం లేకుండా తాను వెళ్లగలనని మరోసారి నిరూపించింది. ఇంతకీ ఆ అతిథి ఎవరని చూస్తున్నారా... అదో పాము!! ముంబైలోని బిగ్ బీ నివాసం 'జల్సా'లోకి బుధవారం నాడు ఓ పాము ప్రవేశించింది. అమితాబ్ సిబ్బంది దాన్ని గమనించి.. పాముల్ని పట్టేవారికి సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడకు చేరుకుని, దాన్ని అడవిలో వదిలినట్టు అమితాబ్ తన బ్లాగ్ లో రాశారు. కాంక్రీట్ జంగల్ గా పేరున్న ముంబై నగరంలో.. అదీ బిగ్ బీ నివాసముండే అత్యంత రద్దీ ప్రదేశంలో పాములు ప్రవేశించడం కొంచెం ఆశ్చర్యకరమే. ప్రస్తుతం అమితాబ్ శుక్రవారం విడుదల కానున్న 'భూత్ నాథ్ రిటర్న్' అనే చిత్ర ప్రమోషన్ లో ఢిల్లీలో బిజీగా ఉన్నారు.