ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి? | Jalsa Actress Parvathi Melton Latest Look And Family Details Goes Viral | Sakshi
Sakshi News home page

Guess The Actress: పొడుగు కాళ్ల బ్యూటీ.. మరీ గుర్తుపట్టలేనంతగా మారిపోయి!

Published Tue, Jun 11 2024 9:19 PM | Last Updated on Wed, Jun 12 2024 1:27 PM

Jalsa Actress Parvathi Melton Latest Look And Family Details

ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసిన హీరోయిన్. పలు చిత్రాలతో హిట్ కొట్టినా సరే ఈమెకు ఎందుకో లక్ కలిసి రాలేదు. లేదంటే మరేదైనా కారణముందో తెలియదు గానీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. అలాంటి ఈమెని ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పార్వతి మెల్టన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తుందా? అవును మీరు ఊహించింది కరెక్టే. 'జల్సా'లో ఓ హీరోయిన్‌గా చేసింది ఈమెనే. అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఈమె తండ్రిది జర్మనీ, తల్లి ఇండియాలోని పంజాబ్. చిన్నప్పుడే భరతనాట్యం లాంటివి నేర్చుకుంది. చదువుతూనే మోడలింగ్ చేసింది. అలా పలు పోటీల్లో విజయం సాధించింది.

(ఇదీ చదవండి: నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?)

ఇక 'వెన్నెల' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. అది హిట్ కావడంతో తెలుగులో పార్వతి మెల్టన్‌కి అవకాశాలు వచ్చాయి. అలా గేమ్, మధుమాసం, అల్లరే అల్లరి తదితర సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు రాలేదు. ఎప్పుడైతే 'జల్సా' చేసిందో ఈమె నలుగురి కంట్లో పడింది. దీంతో ఈమెకి ఛాన్సులు క్యూ కడతాయని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. 'దూకుడు'లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత కూడా తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పెద్దగా పట్టించుకోలేదు.

చివరగా 2012లో 'యమహో యమ' అనే సినిమా చేసి తిరిగి యూఎస్ వెళ్లిపోయింది. అదే ఏడాది సమ్ష లలానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. అప్పటి నుంచి యూఎస్‌లోనే ఉంటున్న అక్కడి వాతావరణానికి తగ్గట్లు మారిపోయింది. రీసెంట్‌గా ఈమె ఫొటోలు చూస్తున్న కొందరు నెటిజన్స్.. సడన్‌గా పార్వతిని గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జల్సా' హీరోయిన్ కదా అని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement