
నటి హేమ సినిమాలు చేసే చాలా కాలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే 10-15 ఏళ్ల క్రితం వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు అస్సలు మూవీస్ లో కనిపించట్లేదు. తాజాగా హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ లో కనిపించిన ఈమెని ఇదే ప్రశ్న అడగ్గా.. యాక్టింగ్ మానేశానని చెప్పింది. శివగామి లాంటి పాత్ర ఇచ్చినా సరే చేయనని క్లారిటీ ఇచ్చింది.
'నేను సినిమాల్లో నటించడం మానేశాను. ఇప్పుడు చిల్ అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. 14 ఏళ్లప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఇక చాలు. ఇంకెంత కాలం కష్టపడాలి? ఎవరికోసం కష్టపడాలి. నేను నా కోసం హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. బోర్ కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు చూస్తా. ఇప్పటికైతే శివగామి లాంటి పాత్ర ఇచ్చినా సరే నటించను. అంత ఇంట్రెస్ట్ లేదు' అని హేమ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)
1993లో టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన హేమ.. ఇప్పటివరకు 350-400 వరకు సినిమాలు చేసుంటుంది. ఇందులో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. కొన్నాళ్ల వరకు కెరీర్ బాగానే ఉండేది కానీ గత నాలుగైదేళ్లుగా మాత్రం హేమ బయట కనిపించలేదు. బిగ్ బాస్ 3వ సీజన్ లో పాల్గొంది కానీ తొలివారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది.
కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని డ్రగ్, రేవ్ పార్టీలో దొరకడంతో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతానికైతే హేమ చేతిలో మూవీ అవకాశాలు ఏం లేనట్లు ఉన్నాయి. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసినట్లు ఉందనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
Comments
Please login to add a commentAdd a comment