బెంగళూరు రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో టాలీవుడ్ నటి హేమకు(Hema) రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.
కాగా.. గతంలో రేవ్ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హేమ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే విధించింది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.
కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.
మా సస్పెన్షన్ ఎత్తివేత..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment