rave party
-
రాజ్ పాకాల నివాసంలో ముగిసిన సోదాలు
-
హైదరాబాద్ మోకిల పీఎస్ కు రాజ్ పాకాల
-
నేడు మోకిలా పీఎస్‌కు రాజ్ పాకాల..
-
జన్వాడ కేసులో కొత్త కీలక మలుపు
-
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జన్వాడలోని ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో, స్పందించిన రాజ్ పాకాల.. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారు.జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాజ్ పాకాల..అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అయితే, రాజ్ పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఆయన నివాసానికి అతికించారు. ఇక, పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన కోరారు. మరోవైపు.. పోలీస్ విచారణకు హాజరు అవ్వడానికి రెండు రోజులు గడువు కావాలని న్యాయవాది ద్వారా మోకిల పోలీసులకు ఆయన లేఖ పంపారు. -
రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు
-
రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తే వెళ్లాను: మద్దూరి విజయ్
-
హీటెక్కిన జన్వాడ రగడ... రాజ్ పాకాల ఎక్కడ ?
-
రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని, తమను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తనను ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా తాము ఉద్యమ బాటలో నడుస్తామని.. చావుకు తెగించి ఉద్యమం చేశామని, ఈ కేసులకు, చిల్లర ప్రయత్నాలకు భయపడబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుస వైఫల్యాలు, ఆరు గ్యారంటీలు, రేవంత్ బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు, సివిల్ సప్లైస్ స్కామ్‌పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధీరోదాత్తంగా పోరాటం చేస్తున్నారు. వాటిపై మాకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభు త్వానికి లేదు. చేతనైతే రాజకీయంగా తలబడండి. శాసనసభ పెట్టండి. రుణమాఫీ కావచ్చు.. మూసీ సుందరీకరణ కావచ్చు.. ఆరు గ్యారంటీల అమలు కావచ్చు.. ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి కేసీఆర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా గొంతునొక్కి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి.. రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి ఏదో సాధిస్తామని అనుకుంటే మీరు సాధించేది ఏమీ ఉండదు. నా బావమరిదికి నెగెటివ్ వచ్చిందిగా.. దీపావళికి ఒక ఇంట్లో దావత్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంట. మా బావమరిది రాజ్ పాకాల జన్వాడ రిజర్వ్ కాలనీలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. అది ఫామ్‌హౌస్ కాదు.. నా బావమరిది నివాసం ఉండే ఇల్లు. రాజ్ పాకాల ఏం తప్పు చేశాడు. తన సొంతింట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని పేరుపెట్టి.. దాన్నో సినిమా చేశారు. ఆ పార్టీలో మా బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పార్టీలో ఉన్నది ఎవరో పురుషులు, మహిళలు కాదు.. భార్యాభర్తలు. పొద్దున నాలుగు మందు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెట్టారు. కానీ సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది.ఎన్‌డీపీఎస్‌లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏమిటి? సప్లయర్, కన్సంప్షన్, కోహోస్ట్ అని పెట్టారు. అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి. లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెబుతున్నారు. ఇంకా కేసు ఎలా పెడతారు? అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే 13 మందికి నెగెటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఒక్కరు కూడా.. ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు? మత్తుపదార్థం దొరికిందా? ఏ రకంగా బద్నాం చేస్తారు? నేను కూడా ఉన్నానని తప్పుడు ప్రచారం కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాజీవితంలో ఉంటే మాపై ఎలాంటి మాటలైనా అడ్డగోలు ప్రచారం చేయవచ్చా? అది రాజ్ పాకాల ఇల్లు, ఫాంహౌజ్ కాదు. కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏమిటి? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే చెప్పారు, అయినా ఎందుకీ దు్రష్పచారం. రాజ్ పాకాలకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అయినా ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకు, ఎఫ్ఐఆర్కు తేడా ఎలా వచ్చింది? బాంబులు అని చెప్పి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. ఎంత ఇబ్బంది పెట్టినా పోరాటం ఆపం.. అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా.. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపబోం. రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. మీరిచ్చిన హమీలు నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం. కేసీఆర్ నేరి్పన ఉద్యమ బాటలో నడుస్తాం.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
TG: ‘విందు’పై రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన విందు రాజకీయ రంగు పులుముకుంది. పోలీసుల దాడులు.. రేవ్ పార్టీ జరిగిందనే ప్రచారం.. అనుమతి లేకుండా మద్యంతో పార్టీ నిర్వహించారంటూ కేసులు.. ఒకరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందనే వార్తలు.. రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల నివాసాల్లో పోలీసుల సోదాలు.. అధికార, విపక్షాల నేతల విమర్శలతో ఆదివారం పొద్దంతా హైడ్రామా చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి రాజ్ పాకాల ఇంటిపై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు చేసిన దాడిలో విదేశీ మద్యం సీసాలు దొరకడం, విందులో పాల్గొన్న ఒకరు డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టు తేలడంతో.. కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో రేవ్ పార్టీ జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయగా.. విందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులతో కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్తగా ఇల్లు కట్టుకుని, దీపావళికి దావత్ చేసుకుంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారని, అక్కడ తన బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. అసలు డ్రగ్స్ ఏమీ దొరకలేదని చెప్తూనే.. కేసులు ఎలా పెట్టారని నిలదీశారు. -
ఇందులో డ్రగ్స్ ఎక్కడున్నాయో చెప్పాలి.. ఇంట్లో దావత్ చేసుకోవద్దా..
-
ఫామ్ హౌస్ పార్టీలో సంచలన విషయాలు
-
జన్వాడ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
-
జన్వాడలో రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్
-
జన్వాడ రేవ్ పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు చుక్కలు?
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ తెలంగాణలో రాజకీయంగా సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో కేటీఆర్ బావ మరిది ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ1గా కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ తతంగంపై ఎక్సైజ్ పోలీసులు కూడా రంగం దిగారు. తాజాగా ఫామ్ హౌస్ మేనేజర్లు కార్తిక్, రాజేంద్ర ప్రసాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈవెంట్‌కి అనుమతి లేదని చెప్పారు. అలాగే, రేవ్ పార్టీ కోసం మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన అనుమతి లేని మద్యం తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఫామ్ హౌస్‌లో డ్యూటీ ఫ్రీ మద్యం లభ్యమైనట్టు చెప్పారు. దీంతో, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద కేసును నమోదు చేశారు. అలాగే, ఈ పార్టీలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక, మహిళలకు టెస్టులు చేసే సమయంలో పోలీసులకు వారికి సహాకరించలేదని సమాచారం. పోలీసులకు చుక్కలు చూపించినట్టు తెలిసింది. విజయ్ మద్దూరి కూడా పోలీసులను బెదిరించినట్టు సమాచారం. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది. రేవ్ పార్టీ, అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
జన్వాడ రేవ్ పార్టీ.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు పార్టీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ సీసీ టీవీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి.సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని’ డిమాండ్ చేశారు. -
రంగారెడ్డి జిల్లా జన్వాడలో వీఐపీల రేవ్ పార్టీ భగ్నం
-
HYD: కేటీఆర్ బావ మరిది ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ భగ్నం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీఆర్ఎస్ నేత బావమరది ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్టు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను ఫామ్ హౌస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో వీఐపీల రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీజే సౌండ్స్‌తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా కొకైన్ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, రైడ్ సందర్భంగా భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీంతో, సెక్షన్-34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌కు పేరు లేకపోవడం గమనార్హం. -
మీ దగ్గరికే వస్తా టెస్టులు చేయించండి.. హేమ కొత్త వీడియో
నటి హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన వైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి సిద్ధమని మీడియాకి రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన అంతా బయటపెట్టింది.హేమ కొత్త వీడియోకొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ దొరికింది. కానీ ఆ టైంలో తాను వేరే చోట ఉన్నానని బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే హేమ అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని పోలీసులు తేల్చారు. కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమని అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఈమెపై ఈ మధ్య మరోసారి డ్రగ్స్ పాజిటివ్ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందిస్తూ హేమ కొత్త వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)హేమ ఏం చెప్పింది?'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ని తీసుకొచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి''ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అని హేమ దాదాపు 6 నిమిషాల వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితీ రావ్ హైదరీ) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్
-
HYD: టెకీల ‘రేవ్’ పార్టీ భగ్నం..!
సాక్షి,హైదరాబాద్: నగరంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఐటీ ఏరియా గచ్చిబౌలిలో ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఐటీ ఉద్యోగులే ఓ గెస్ట్‌హౌజ్‌లో రేవ్‌పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో 8 మంది అమ్మాయిలు,12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి స్వల్పంగా గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్టీలో పాల్గొన్న వారిని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రేవ్ పార్టీలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇదీ చదవండి.. వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు -
వాట్సాప్‌లో రేవ్ పార్టీ ప్లాన్.. గేటెడ్ కమ్యూనిటీలో 35 మంది మైనర్లు..
లక్నో: గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్‌లో అక్రమంగా జరుగుతున్న రేవ్ పార్టీని నోయిడా పోలీసులు భగ్నం చేశారు. ఇక, రేవ్ పార్టీలో డ్రగ్స్, మద్యం సేవిస్తున్న కాలేజ్ స్టూడెంట్స్(మైనర్ల)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసి వీరంతా రేవ్ పార్టీకి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. నోయిడాలోని సూపర్నోవా రెసిడేన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కొందరు మైనర్లు గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ ప్లాన్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ప్లాట్ నుంచి కేకలు, మద్యం బాటిళ్లు బయటకు విసిరేయడంతో రేవ్ పార్టీ విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు రేవ్ పార్టీపై సమాచారం ఇచ్చారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురు నిర్వాహకులతో సహా 35 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. #WATCH : Exclusive photos and video of rave party organised by college students at a flat of a Supernova society in Noida.Students threw empty liquor bottles from the balcony, shattering them on the ground floor.Police have detained 39 individuals, including the main… pic.twitter.com/RXlu8lgRUr— upuknews (@upuknews1) August 10, 2024అనంతరం, విచారణ సందర్భంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీ కోసం కాలేజ్ స్టూడెంట్స్ ఎంట్రీ ఫీజ్ వసూలు చేసినట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఫీమేల్ సింగిల్స్ రూ. 500లు, జంటలకు రూ.800, పురుషులకు రూ.1000 వసూలు చేసినట్టు చెప్పారు. రేవ్ పార్టీ కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు తెలిపారు. ఇక, ఈ పార్టీలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలం నుంచి హుక్కా, ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇవి హర్యానాకు చెందిన మద్యం బాటిళ్లుగా పోలీసుల నిర్ధారించారు. ఇక, అరెస్ట్ అయిన వారిపై మైనర్లు, బాలికలు ఉన్నట్టు సమాచారం. -
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు
-
మరో రేవ్ పార్టీ భగ్నం
-
మాదాపూర్‌లో రేవ్ పార్టీ.. ఐదుగురు అరెస్ట్
హఫీజ్‌పేట్: మాదాపూర్‌లో రేవ్ పారీ్టపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు దాడి చేశారు. ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కె.వై.ఖురేషి, ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు గురువారం శేరిలింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ (31) ఆధ్వర్యంలో మాదాపూర్ సైబర్ టవర్స్ వెనక ఉన్న క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో జన్మదిన వేడుకల్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ నెల 12న నాగరాజు గోవా నుంచి 3 గ్రాముల కొకైన్‌ను తెప్పించి మోకిలకు చెందిన నితిన్ (24)కు అందించాడు. బేగంపేటకు చెందిన సాయికుమార్ యాదవ్ (27) విదేశాల నుంచి మద్యం తీసుకురాగా, బంజారాహిల్స్‌కు చెందిన సీహెచ్ కిషోర్ (28) రేవ్‌పార్టీకి కోసం సరీ్వస్ అపార్ట్మెంట్ బుక్ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి ఎస్ఐలు బాల్‌రాజ్, సంధ్యల బృందం రేవ్‌పార్టీపై దాడి చేసి 14 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులోకి తీసుకుంది.వారి నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే కొకైన్ (1 గ్రాము), ఎండీఎంఏ (2 గ్రాములు), ఓజీ కుష్(1 గ్రాము)తోపాటు 12 విదేశీ మద్యం సీసాలు, 36 బీర్ సీసాలు, ఒక ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహించిన నాగరాజుతోపాటు మత్తుపదార్థాలు సరఫరా చేసిన సాయికుమార్ యాదవ్, ఇమాన్యుల్, సీహెచ్ కిషోర్, నితిన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మిగతా 15 మందిని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. రేవ్‌పారీ్టలో పట్టుబడ్డ ఐదుగురు యువకులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎబాన్ యూరిన్ టెస్ట్ అనే నూతన పరికరంతో పరీక్షలు చేశారు. ఈ పరీక్షతో కేవలం 5 నిమిషాల్లోనే సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుసుకోవచ్చు.