లక్నో: గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్‌లో అక్రమంగా జరుగుతున్న రేవ్ పార్టీని నోయిడా పోలీసులు భగ్నం చేశారు. ఇక, రేవ్ పార్టీలో డ్రగ్స్, మద్యం సేవిస్తున్న కాలేజ్ స్టూడెంట్స్(మైనర్ల)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసి వీరంతా రేవ్ పార్టీకి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. నోయిడాలోని సూపర్‌నోవా రెసిడేన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కొందరు మైనర్లు గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ ప్లాన్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ప్లాట్ నుంచి కేకలు, మద్యం బాటిళ్లు బయటకు విసిరేయడంతో రేవ్ పార్టీ విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు రేవ్ పార్టీపై సమాచారం ఇచ్చారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురు నిర్వాహకులతో సహా 35 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
#WATCH : Exclusive photos and video of rave party organised by college students at a flat of a Supernova society in Noida.
Students threw empty liquor bottles from the balcony, shattering them on the ground floor.
Police have detained 39 individuals, including the main… pic.twitter.com/RXlu8lgRUr— upuknews (@upuknews1) August 10, 2024
అనంతరం, విచారణ సందర్భంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీ కోసం కాలేజ్ స్టూడెంట్స్ ఎంట్రీ ఫీజ్ వసూలు చేసినట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఫీమేల్ సింగిల్స్ రూ. 500లు, జంటలకు రూ.800, పురుషులకు రూ.1000 వసూలు చేసినట్టు చెప్పారు. రేవ్ పార్టీ కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు తెలిపారు. ఇక, ఈ పార్టీలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలం నుంచి హుక్కా, ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇవి హర్యానాకు చెందిన మద్యం బాటిళ్లుగా పోలీసుల నిర్ధారించారు. ఇక, అరెస్ట్ అయిన వారిపై మైనర్లు, బాలికలు ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment