మహిళతో సీనియర్‌ ఎస్పీ శృంగార సంభాషణ! | That is video morphed, conspiracy hatched to malign my image, Says SSP | Sakshi
Sakshi News home page

మహిళతో సీనియర్‌ ఎస్పీ శృంగార సంభాషణ!

Published Thu, Jan 2 2020 11:14 AM | Last Updated on Thu, Jan 2 2020 11:17 AM

That is video morphed, conspiracy hatched to malign my image, Says SSP - Sakshi

నోయిడా: ఉత్తరప్రదేశ్‌ గౌతంబుద్ధనగర్‌ ఎస్సెస్పీ వైభవ్‌కుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన శృంగారపరమైన చాటింగ్‌ చేస్తున్న  మూడు వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఈ వీడియోల్లో ఆయన మాట్లాడిన మహిళ ఎవరో చూపించలేదు. కానీ మరో డివైస్‌తో ఆమె ఫోన్‌ స్క్రీన్‌ను రికార్డింగ్‌ చేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో ఈ వివాదంపై సీనియర్‌ సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీసు అయిన వైభవ్‌ కృష్ణ స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా ఈ మార్ఫింగ్‌ వీడియోలును ఆన్‌లైన్‌లో స్ప్రెడ్‌చేస్తున్నారని తెలిపారు.

గత ఏడాది వ్యవస్థీకృత నేరాలపై, ఎక్స్‌టార్షన్‌ రాకెట్‌పై తను కఠినమైన చర్యలు తీసుకున్నానని, అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ శక్తులే ఈ విధంగా కుట్రపన్ని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ వీడియోలపై ఆన్‌లైన్‌లో లీక్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు నోయిడా పోలీసులు ఈ వీడియో లీకేజ్‌ అంశంపై గుర్తు తెలియని వ్యక్తులపై అభియోగాలు మోపుతూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పారదర్శక దర్యాప్తు జరిపేందుకు మీరట్‌ జిల్లాకు కేసును బదిలీ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement